వైభవం..జ్యోతి ఉత్సవం
వైభవం..జ్యోతి ఉత్సవం
Published Fri, Sep 16 2016 11:11 PM | Last Updated on Fri, Oct 5 2018 6:24 PM
ఎమ్మిగనూరురూరల్: గుడేకల్ గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. మహాలయ పౌర్ణమి సందర్భంగా దేవాలయంలో తొగటవీర క్షత్రియులు జ్యోతి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శుక్రవారం ఉదయం 5.30 నుంచే ఉత్సవాలు ప్రారంభమై 9.30 వరకు జరిగాయి. గ్రామ చావిడి నుంచి ఉరేగింపు ప్రారంభం కాగా.మహిళలు, చిన్నారులు కలశాలతో వెళ్తుంటే భక్తులు జ్యోతులను నెత్తిన పెట్టుకొని ‘ శాంభవి మమ్ముల్ని కాపాడు’ అంటూ నాట్యం చేస్తు, పాటలు పాడారు. వీరితో మరి కొందరు యువకులు, బాలికలు.. నాలుక, పెదవులు, దవడలు, చేతులు, స్వరం మీద కడ్డీలతో గుచ్చుకొని భక్తిని చాటుకున్నారు. అలాగే మరి కొందరు భక్తులు ‘ అమ్మా శాంభవి’ అంటూ కత్తులతో కడుపు, నడుముకు కోసుకుంటూ రక్త తర్పణం చేశారు.
Advertisement
Advertisement