నడిరోడ్డుపై కారు దగ్ధం
Published Fri, May 19 2017 4:20 PM | Last Updated on Tue, Aug 14 2018 3:24 PM
నందవరం: కర్నూలు జిల్లా నందవరం మండలం ఆలహర్వి దగ్గర ఓ కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి దర్శనం చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ఎండధాటికే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు.
Advertisement
Advertisement