నందవరం(కర్నూలు) : ఇంట్లో నిద్రిస్తున్న బాలిక పాముకాటుకు గురై మృతిచెందింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందవరం మండలం హెచ్.బాపురం గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం.. హెచ్.బాపురం గ్రామానికి చెందిన శిరీష(8) స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి పడుకున్న బాలిక ఆదివారం ఉదయం నురుగులు కక్కుతుండటం గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందింది. పాము కాటు వేయడంతోనే బాలిక మృతిచెందిందని వైద్యులు తెలిపారు.