చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం తుమ్మలగుంట పంచాయతీ మర్రిచెట్టుపల్లి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు.
పెద్దతిప్పసముద్రం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం తుమ్మలగుంట పంచాయతీ మర్రిచెట్టుపల్లి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. తుమ్మరగుంటవారిపల్లికి చెందిన శ్రీరాములు రెడ్డి(54) ద్విచక్రవాహనంపై వెళుతుండగా అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న శ్రీరాములు రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు.