గుర్తు తెలియని వాహనం ఢీకొని డ్రైవర్ మృతి
Published Fri, Sep 16 2016 11:51 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
అక్కిరెడ్డిగూడెం(ముసునూరు) :
తెలంగాణ ప్రాంతం నుంచి లోడింగ్‌కు వచ్చిన డ్రైవర్ గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ పి.విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్కిరెడ్డిగూడెం గ్రామంలోని మందుల ఫ్యాక్టరీకి లోడింగ్ నిమిత్తం రెండు లారీలు హైదరాబాద్ నుంచి వచ్చాయి. ఫ్యాక్టరీకి సమీపంలోని వలసపల్లి–రమణక్కపేట ప్రధాన రహదారి పక్కనే లారీ డ్రైవర్లు ఇద్దరు నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో బాలిన దేవేందర్(26) మూత్ర విసర్జనకు వెళ్లి తిరిగి వస్తుండగా తన లారీ సమీపంలోనే గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. తలకు, కాళ్లకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మహదేవపూర్ మండలానికి చెందిన బొమ్మపూడి గ్రామ వాసిగా పోలీసులు పేర్కొన్నారు. మృతదేహానికి నూజివీడు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమర్టం నిర్వహించి తన బంధువులకు అప్పగించి స్వగ్రామానికి పంపినట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement