గద్వాల, సాక్షి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఓ స్కార్పియో వాహనం ఢీ కొట్టుకోవడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది.
శుక్రవారం రాత్రి హైదరాబాద్-బెంగు జాతీయ రహదారి 44 పై ఎర్రవల్లి చౌరస్తా ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు స్పాట్‌లోనే చనిపోగా.. గాయపడిన ముగ్గురిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాల్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. అతివేగం ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ప్రమాదానికి గురైన స్కార్పియో వాహనం నెంబర్ ఏపీ 29 జి 5553. కర్నూలు ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహనంలోని వాళ్ల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాద ధాటికి వాహన ముందు భాగం పూర్తిగా నుజ్జైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment