Jogulamba District Latest News
-
పాలమూరు రుణం తీర్చుకుంటా
వనపర్తి: ‘నల్లమల ప్రాంతంలో పుట్టి.. చైతన్యవంతమైన వనపర్తిలో పెరిగి విద్యాభ్యాసం చేశాను. స్వస్థలమైన పాలమూరు ప్రాంత రుణం తీర్చుకుంటాను.’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభిృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు అభివృద్ధిని విస్మరించారని, కృష్ణా జలాల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు, పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల పేరుతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. 50 లక్షల పైచిలుకు కుటుంబాల ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఆడ బిడ్డలను విస్మరించిన బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సరైన గుణపాఠం చెప్పాలంటే సలాకి కాల్చి వాత పెట్టాలన్నారు. రాష్ట్రంలోని 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకే అప్పగించి కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో పాలమూరులోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే ఇప్పటికింకా వలసలు ఎందుకు కొనసాగుతున్నాయో చెప్పాలన్నారు. పాలమూరు వాసులు అమాయకులేం కాదు.. దేశానికి పేరెన్నిక గల నేతలను అందించిన ఉద్యమాల గడ్డ పాలమూరు అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో పాటు పటేల్ సుధాకర్, పండగ సాయన్న, మహేంద్రనాథ్ లాంటి గొప్ప నాయకులను పాలమూరు అందించిందని.. వారి స్ఫూర్తితోనే విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ సీఎం దాకా ఎదిగానని చెప్పారు. ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుపడితే సహించేది లేదని స్పష్టం చేశారు. పాలమూరు వాసులు.. అమాయకులేం కాదని.. డొక్క చీల్చి డోలు కట్టడానికి వెనుకాడబోరని హెచ్చరించారు. తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరిపోసింది వనపర్తి గడ్డ అని.. నాడు ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారని గుర్తు చేశారు. ● ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారత పట్ల సానుకూలంగా ఆలోచిస్తున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. వంటింటికి పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా ప్రజాపాలన ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ పంపులు, ఆర్టీసీకి బస్సులు అద్దెకిచ్చే స్థాయికి మహిళలు ఎదిగారని పేర్కొన్నారు.కార్పొరేషన్ల వ్యవస్థ మళ్లీ బలోపేతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను పదేళ్ల పాలనలో కేసీఆర్ నిర్వీర్యం చేశారని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించుకునేందుకు కార్పొరేషన్ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేసేందుకు రూ.6వేల కోట్లు కేటాయించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. వ్యవసాయ పంపుసెట్లుకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.14,870 కోట్లను రైతుల పక్షాన ప్రభుత్వం చెల్లించిందన్నారు. సన్న రకాలు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున రైతుల ఖాతాల్లో రూ.1804 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి పైసా సంక్షేమ పథకాల కోసం, ప్రజాభివృద్ధి కోసం ఉపయోగిస్తామని వెల్లడించారు. ● మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పదేళ్లలో తాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగానే నిలిచాయన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా 50 రోజుల్లో కులగణన చేపట్టి పూర్తి చేసిందన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని జాబ్‌మేళాలు నిర్వహించి 295 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి ప్రాంతంలో విద్యను అభ్యసించిన సీఎం ఈ ప్రాంతంపై అభిమానంతో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ఇప్పటికే రూ.375 కోట్ల అభివద్ధి పనులను చేపట్టామని, మరో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను చేసేందుకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 133 గ్రామపంచాయతీల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధులు విడుదల చేయాలని కోరారు. కేసీఆర్ వల్లే కృష్ణా జలాల కేటాయింపుల్లో అన్యాయం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు మహిళల పేరుతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడితే సహించను వనపర్తి బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు దశాబ్దాలుగా వనపర్తి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులుగా కొనసాగిన వారు కక్షపూరిత డబ్బుతో కూడిన రాజకీయాలను ఏనాడు చేయలేదని.. ఐదేళ్ల క్రితం వనపర్తిలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగిన వ్యక్తి వల్ల నియోజకవర్గ రాజకీయాలు కలుషితమయ్యాయని సీఎం అన్నారు. గతంలో వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా ఆదర్శవంతమైన పరిపాలన అందించిన వారి పేర్లను ప్రభుత్వ ఆస్పత్రులు, తాగునీటి ఎత్తిపోతల పథకాలకు పెడతామని... వేదికపైనే ఈ విషయం గురించి సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్వర్‌రెడ్డి, శంకర్, వాకిటి శ్రీహరి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు జడ్జికి ఆహ్వానం పలికిన కలెక్టర్
గద్వాల: హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన జడ్జి నందికొండ నర్సింగ్‌రావు ఆదివారం గద్వాలకు వచ్చారు. ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తిని కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాస్‌రావు పుష్ప గుచ్ఛం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. వారితో కాసేపు ముచ్చటించారు. అదేవిధంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ జడ్జి కె.కుష, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి.లక్ష్మీ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పూజిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి డి.ఉదయ్‌నాయక్, జూనియర్ సివిల్ జడ్జీ మిథున్‌తేజలు న్యాయమూర్తికి ఆహ్వానం పలికి సన్మానించా రు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్‌రావు, అదనపు కలెక్ట ర్లు లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాస్‌రావు, బార్ అసో సియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఆస్పత్రి నిర్మించండి అయిజ: మండల కేంద్రంలో నిలిచిపోయిన 30 పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం పీహెచ్సీ వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు గోపాల కృష్ణ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిని నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేయాలని కోరారు. భగత్ రెడ్డి, లక్ష్మణ్ , రాజశేఖర్, వెంకటేష్ పాల్గొన్నారు. -
పరిస్థితి సంక్లిష్టం..
నీటి ఊటతో పెరుగుతున్న బురద.. టన్నెల్లోకి వెళ్లిన రెస్క్యూ బృందం గంటల తరబడి మట్టి, రాళ్ల శిథిలాలను తొలగించింది. అయితే నీటి ఊటతో బురద పెరుగుతుందని చెబుతున్నారు. టన్నెల్లో నలుగురి అవశేషాలను గుర్తించిన ప్రాంతంలో 8 మీటర్ల వరకు మట్టి, రాళ్లను తొలగించారు. మరో మూడు మీటర్లు తొలగిస్తే కాని ఏ విషయం తేలే అవకాశం లేదని తెలుస్తోంది. సింగరేణి కార్మికులు షిఫ్ట్‌ల వారీగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఒక్కో షిఫ్ట్‌కు 40 నుంచి 80 మంది వరకు సొరంగంలోకి ప్రవేశించి.. అక్కడ మట్టి, నీరును వేరు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. సహాయక చర్యలను కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఇతర అధికారులు పర్యవేక్షించారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో అవశేషాల గుర్తింపుపై వీడని సందిగ్ధం అచ్చంపేట రూరల్: దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ లభ్యతపై స్పష్టత కరువైంది. వారి కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వారి ప్రాణాలపై ఆశలు వదులుకున్నప్పటికీ.. అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాల్లో పొంతన లేకుండా పోయింది. నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్పా.. సహాయక చర్యలను వేగిరం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహాయక చర్యల్లో మొత్తం 11 బృందాలు పాల్గొంటున్నప్పటికీ.. ప్రధానంగా సింగరేణి కార్మికులే అధికంగా శ్రమిస్తున్నారని తెలుస్తోంది. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నా.. కార్మికుల ఆచూకీ లభ్యతపై సందిగ్ధం వీడటం లేదు. మరోవైపు జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలు కనుగొన్నామని ఓ వైపు అధికారులు చెబుతున్నా.. నిజ నిర్ధారణ చేయలేకపోతున్నారు. ఆదివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడ చేపడుతున్న సహాయ చర్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో దాదాపు గంటన్నర పాటు సమీక్షించారు. కానీ సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యతపై స్పష్టతనివ్వలేదు. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని, మరో రెండు, మూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్వయంగా సీఎం ప్రకటించడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కార్మికుల ఆచూకీ కోసం తప్పని ఎదురుచూపులు తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు భారీగా ఉబికి వస్తున్న నీరు, బురదతో ఆటంకాలు కొండల నుంచి నీరు వస్తుండటంతోనే.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం కొండల నుంచి నీరు రావడమేనని అధికారులు గుర్తించారు. అమ్రాబాద్ రిజర్వు టైగర్ ఫారెస్ట్‌లో ఉన్న తిర్మలాపూర్ సమీపం నుంచి లేదా మల్లెలతీర్థం నుంచి నీరు వస్తున్నాయనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే జియోలాజికల్ సర్వే అధికారులు అటవీ శాఖ అధికారులతో కలిసి నీటి ధారలు ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయనే కోణంలో సర్వే చేపట్టారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదస్థలంలో సముద్ర మట్టానికి 450 మీటర్ల లోతులో కుర్తిపెంట ప్రదేశంలో నీటి పొరలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నీటి పొరలు అమ్రాబాద్ మండలం వటువర్లపల్లి గ్రామ పరిసర అడవుల్లోని ఉసురు వాగు, మల్లె వాగు, మల్లెల తీర్థం తదితర ప్రాంతాల నుంచి కృష్ణానది వైపు పారుతున్నట్లు చెబుతున్నారు. వాగుల ప్రవాహంతోనే నీరు వస్తుందని అధికారులు నివేదిక తయారు చేస్తున్నట్టు తెలిసింది. -
సోలార్‌ప్లాంట్లపై అనుమానాలెన్నో?
● గ్రామాల్లో ప్లాంట్ల ఏర్పాటు పేరుతో భూముల లీజు ● సాగు సీజన్ కాకపోవడంతో జోష్ పెంచిన రియల్ ఏజెంట్లు ● 25 ఏళ్ల అగ్రిమెంట్.. లీజుకు ఇచ్చాక వచ్చే ఇబ్బందులపై రైతుల్లో ఆందోళన ● పూర్తిస్థాయిలో అవగాహన లేక అయోమయం రైతులు అప్రమత్తంగా ఉండాలి సోలార్ ప్లాంట్ల పేరుతో ఏజెంట్లు గ్రామాల్లో తిరిగి అగ్రిమెంట్లు రాసుకుంటే అధికారులకు తెలియచేయండి. నిజంగానే సోలార్ కంపెనీలకు భూములు కావాల్సి వస్తే వారు నేరుగా ప్రజలను కలిసే అవకాశముంటుంది. లీజులు, రుణాలు ఇలాంటి విషయాలు, ఇంకా మాయమాటలు చెప్పే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారి స్వలాభం కోసం, కమీషన్ల కోసం ప్రజలను, రైతులను మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మా సిబ్బంది ద్వారా కూడా సోలార్కు సంబందించి గ్రామాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకుని చర్యలు చేపడతాం. – పి.రామ్మోహన్, తహసీల్దార్ రాజోళి ●రాజోళి: నియోజకవర్గంలో చాలామటుకు రైతులు ఆర్డీఎస్ కెనాల్ నీటిపై ఆధారపడి పంటలు సాగుచేస్తారు. ఈక్రమంలో సరైన సమయంలో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు గ్రామాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయని, దాని కోసం భూములు లీజుకు కావాలని తిరుగుతున్నారు. కానీ, వీటిపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన లేక ఏజెంట్ల మాటలు వినాలా.. లేక భూమి లీజుకు ఇచ్చాక భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని, నష్టపోతామా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సాగు సీజన్ కాకపోవడం, ఎలాంటి పంటలు సాగు చేయకపోవడం, భూములు ఖాళీగా ఉండటంతో మీ భూములను లీజు కావాలని ఏజెంట్లు రైతుల వెంటపడ్డారు. గత రెండు నెలలుగా.. గత రెండు నెలల ముందు నుండే ఈ సోలార్ ప్రాజెక్టుకు సంబందించి రియల్ఎస్టేట్ ఏజెంట్లు గ్రామాల్లో రైతుల మీద పడ్డారు. ఆర్డీఎస్ కెనాల్ లో సరైన నీరు రావడం లేదని, వర్షాబావ పరిస్థితులు కూడా ప్రతి కూలంగా ఉంటున్నాయని దాని వల్ల సాగు కష్టరంగా మారడమే కాకుండా కౌలుకు తీసుకునే వారు కూడా ముందుకు రావడం లేదని రైతుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. దీంతో రైతులు కూడా వారి మాయలో పడి భూములను లీజుకు ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. అలంపూర్ నియోజకవర్గంలోని పలు మండలాలతోపాటు రాజోళి మండలంలోని మాన్‌దొడ్డి, పచ్చర్ల, చిన్నధన్వాడ, రాజోళి తదిదర గ్రామాలతో పాటు రైతులు వారికి భూములు లీజుకు ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. కాగా.. ఎక్కడైనా సరే కాని విద్యుత్ సబ్‌స్టేషన్‌కు 2 కిలోమీటర్ల పరిదిలో ఆరు ఎకరాల నుంచి భూమి కావాలని హడావుడి సృష్టిస్తున్నారురు. లీజుకు ఇప్పించినందుకు కాను ఏజెంట్లకు రైతుల నుంచి 2 నుంచి 4 శాతం దాకా కమీషన్ ఇవ్వాల్సిందే. వెంటాడుతున్న ఆందోళన సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు, ప్రజలు చైతన్యవంతులు అయ్యి, టెక్నాలజీని వాడుకునే విధానాలను అలవాటు చేసుకుంటారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ సోలార్ కోసం భూములు లీజుకు ఇస్తే అందులో ఉండే నిబంధనలే రైతులను ఆందోళనలో పడేస్తున్నాయని కొందరు అంటున్నారు. భూమి లీజుకు ఇస్తున్నట్లు 25 ఏళ్ల వరకు అగ్రిమెంటు రాసి ఇవ్వాల్సి ఉంటుందని, ఆ అగ్రిమెంటు ద్వారా లీజు తీసుకున్న వారు దానిపై బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉందని, దాన్ని మధ్యలో వదిలేసి వెళ్లిపోతే ఆ రుణాలు రైతుల మీద పడే అవకాశముందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రైతులు మధ్య భూమి విక్రయించాల్సిన అవసరం వస్తే సోలార్ అగ్రిమెంటు ఉండగానే భూమిని భేరం చేసుకుని అగ్రిమెంటు ముగిశాక భూమిని కొన్న వారికి అప్పచెప్పే అవకాశం ఉంటుందని, దీని ద్వారా భూమిని కొనేందుకు ఎవరూ ముందుకు రారని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూమిని లీజుకు ఇస్తున్నట్లు అగ్రిమెంట్ రాశాక ఏడాదిలో ఇవ్వాల్సిన లీజు నగదు కూడా ఆరు నెలలకు ఒక విడతగా, ఎకరాలో సగం మాదిరిగా చెల్లిస్తారని దీని వల్ల తమకు నగదు పరంగా కూడా మిగిలేది ఏమి ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. సాధారణ రైతులకు కౌలుకు ఇస్తే వారు ముందుగానే కౌలు చెల్లించి భూమిని దున్నుకుంటారని, సోలార్ కోసం తీసుకునే వారు రైతులకు ఏ విధంగా లీజు నగదను చెల్లిస్తారనే విషయంలో కూడా స్పష్టత లేదని అంటున్నారు. అవగాహన కల్పించేవారేరి..? సోలార్‌తో కలిగే ప్రయోజనాలను తెలియచేస్తూ, రైతులను గ్రామాల్లో అధికారులు చైతన్యం చేయాల్సి ఉంది. అధికారుల కంటే ఎక్కువగా తమ కమీషన్ల కోసం రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఎక్కువగా గ్రామాల్లో తిరుగుతూ, రైతులను మాయలో పడేస్తూ, వారి కమీషన్లు దండుకునే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగానే సోలార్ కంపెనీలు రైతులకు మేలు చేసే విధంగా నిబంధనలు రూపొందించినప్పటికీ మధ్యలో ఉన్న ఏజెంట్ల ద్వారా అవి పక్కదారి పట్టి, రైతులకు అన్యాయం జరిగే అవకాశముంది. దీన్ని దృష్టిలో పెట్టకుని అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, సోలార్ కంపెనీ వాళ్లతో సమావేశాలు ఏర్పాటు చేయించి పూర్తి వివరాలను తెలియచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటు సోలార్ కంపెనీలు, అటు రైతులు నష్టపోకుండా అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రాజెక్టుల ఏర్పాటుకు తోడ్పాటు చేయాల్సి ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. -
మంత్రులు, సీఎస్ సమీక్ష..
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, ఎమ్మెల్యే వంశీకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో దోమలపెంటకు వచ్చిన మంత్రులు 11.50 గంటలకు టన్నెల్ వద్దకు చేరుకున్నారు. టన్నెల్ లోపల పరిస్థితులను వివిధ శాఖల విపత్తుల అధికారులు వివరించారు. టీబీఎం విడి భాగాలను గ్యాస్ కట్టర్‌తో కట్ చేస్తూనే.. ఊట నీరు, మట్టిని తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. -
అదనపు మోటార్ల ఏర్పాటు..
సొరంగం సెగ్మెంట్ బిగిస్తుండటంతో ఏర్పడిన రంధ్రాల ద్వారా నీటి ఊట టన్నెల్లోకి అధికమైంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఏర్పాటు చేసిన మోటార్లు సరిపోవడం లేదు. టన్నెల్లోకి నీట ఊట అధికమవడంతో ఐదు అదనపు మోటార్లను, ప్రత్యేకంగా పైపులను ఏర్పాటు చేసి.. నీటిని తోడేస్తున్నారు. బురద గట్టి పడటంతో సింగరేణి కార్మికుల వద్ద ఉన్న పారలు సైతం వాడకంలోకి రావడం లేదు. దీంతో అదనంగా గడ్డపారలు తెప్పించారు. పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మిషన్లు వాడుతున్నారు. ఊట నీటిని, మట్టిని తొలగిస్తేనే చిక్కుకున్న వారి అవశేషాలు వెలికితీసేందుకు వీలవుతుంది. -
‘ఎల్ఆర్ఎస్’ రాయితీపై అవగాహన కల్పించండి
గద్వాల: ప్లాట్ల క్రమబద్ధీకణకు సంబందించి మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం 25 శాతం రిబేటు రాయితీ వర్తింపజేస్తుందని కలెక్టర్ సంతోష్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సంబందిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2020 ఆగస్టు 26వ తేదీలోపు దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మాత్రమే ఇది వరకు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించగా దరఖాస్తులు చేసుకునేందుకు వెసలుబాటు కల్పిస్తుందన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో సమాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు. సర్వే నంబర్లు, ప్లాట్ల అప్లికేషన్ సంఖ్య, రోడ్డు విస్తీర్ణం ఇనాం భూమి, ఇరిగేషన్ వంటి అంశాలను పక్కాగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఇన్చార్జ్ డీపీఓ నాగేంద్రం, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జోగుళాంబ డీఐజీ..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా శనివారం జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ముందుగా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ నుంచి జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల వరకు రూట్ బందోబస్తును పరిశీలించారు. సభాస్థలి, సీఎం పర్యటించనున్న ప్రదేశాలు, పైలెట్ వాహనాల ట్రయల్‌రన్ నిర్వహించారు. వీఐపీ కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ ఓపెనింగ్ పార్టీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో రోడ్లపై చిరు వ్యాపారులు, వాహనాలు నిలుపరాదని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. బహిరంగ సభకు వచ్చే వాహనాలకు ఆర్టీసీ బస్‌డిపోలో పార్కింగ్ సౌకర్యం కల్పించామని.. కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే నిలపాలని సూచించారు. బందోబస్తును మొత్తం ఏడు సెక్టార్లుగా విభజించామని.. నలుగురు ఎస్పీలు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 21 మంది సీఐలు, 28 మంది ఎస్ఐలు, 140 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 420 మంది కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్, 250 మంది హోంగార్డులు విధులు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి వెంట సీఐ కృష్ణ, ఇతర పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు. -
చివరి అంకానికి..
సాక్షి, నాగర్‌కర్నూల్/అచ్చంపేట రూరల్: ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను వెలికితీసేందుకు చేపడుతున్న సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. నేడో, రేపో సొరంగం నుంచి కార్మికులను బయటకు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదట గుర్తించిన ఒక స్పాట్ నుంచి నలుగురు, ఆ తర్వాత మరో స్పాట్ నుంచి నలుగురు కార్మికులను వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నీటి ఊట పెరుగుతుండటం, మట్టి తొలగింపునకు కన్వేయర్ బెల్టు అందుబాటులోకి రాకపోవడంతో ఆలస్యం అవుతోంది. శనివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి సంఘటన స్థలానికి చేరుకుని, పనులను పర్యవేక్షించారు. ఆశలు వదులుకున్నా.. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలపై ఆశలు దాదాపు వదులుకున్నట్లేనని ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోంది. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ అధికార యంత్రాంగం నిష్ణాతులైన రెస్క్యూ టీంలతో సహాయక చర్యలను ముమ్మరం చేసినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. టన్నెల్లో పేరుకుపోయిన బురద, నీటి ఊటలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని అధికారులు చెబుతున్నా.. ప్రమాదం జరిగిన సందర్భంలోనే చిక్కుకున్న వారి ప్రాణాలు పోయాయని పలువురు చర్చించుకుంటున్నారు. కుటుంబీకుల ఎదురుచూపులు.. పొట్టకూటి కోసం వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాల కూలీలు, సిబ్బంది ఎస్ఎల్బీసీ సొరంగంలో పనులు చేస్తూ చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎస్ఎల్బీసీలో జేపీ కంపెనీలో పనులు చేస్తున్నారు. కాగా ఏడు రోజుల నుంచి సొరంగంలో తమ వారు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలను చూసి సొరంగంలో చిక్కుకున్న వారి బంధువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. క్షేమంగా బయటపడతారని ఇన్ని రోజులు ఎదురు చూశామని, అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు భిన్నంగా ఉన్నాయని వాపోతున్నారు. జేపీ కంపెనీ సమీజుపంలోకి పెద్దఎత్తున పార్థివ అంబులెన్సులు రావడంతో తమవారి ప్రాణాలపై ఆశలు లేవని అర్థమైందని అక్కడికి వచ్చిన బంధువులు కన్నీరు పెట్టుకుంటున్నారు. నీటి ఊట, మట్టి తొలగింపుతో పనులు ఆలస్యం..మొత్తం 13.85 కి.మీ. సొరంగ మార్గంలో 13.61 పాయింట్ వరకు సహాయక బృందాలు చేరుకున్నాయి. మిగతా చోటును గాలించేందుకు అక్కడ సుమారు 18 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, శిథిలాలు ఆటంకంగా మారాయి. జీపీఆర్ గుర్తించిన చోట తవ్వకాలు జరిపేందుకు సింగరేణి, ర్యాట్ మైనింగ్ టీం రంగంలోకి దిగింది. ఎలాంటి మిషనరీ లేకుండా వారు మ్యానువల్‌గా తవ్వకాలు చేపడుతున్నారు. టీబీఎం సంబంధిన విడిభాగాలు, శిథిలాలను కట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సహాయక బృందాల రాకపోకలకు, మట్టి, శిథిలాల తరలింపునకు దారిని ఏర్పాటు చేస్తున్నారు. కట్టర్ చివరి భాగంలో కార్మికులు ఉన్నట్టుగా భావిస్తున్న చోట తవ్వకాలు చేపడుతుండగా, పెద్ద ఎత్తున వస్తున్న నీటి ఊటతో అవరోధాలు ఏర్పడుతున్నాయి. నీటిని తోడేందుకు డీవాటరింగ్, మట్టిని తొలగించేందుకు చేపడుతున్న చర్యలతో ఆలస్యం అవుతోంది. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 8 మంది కార్మికుల అవశేషాల గుర్తింపు టీబీఎంకు ఇరువైపులా ఉన్నట్లు గుర్తించిన జీపీఆర్ స్కానింగ్ నేడు నలుగురు, 2 రోజుల తర్వాత మరో నలుగురు కార్మికులను వెలికి తీస్తారని అంచనా సహాయక చర్యలను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి,సీఎస్ శాంతికుమారి -
మంత్రులు, సీఎస్ సమీక్ష..
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, ఎమ్మెల్యే వంశీకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో దోమలపెంటకు వచ్చిన మంత్రులు 11.50 గంటలకు టన్నెల్ వద్దకు చేరుకున్నారు. టన్నెల్ లోపల పరిస్థితులను వివిధ శాఖల విపత్తుల అధికారులు వివరించారు. టీబీఎం విడి భాగాలను గ్యాస్ కట్టర్‌తో కట్ చేస్తూనే.. ఊట నీరు, మట్టిని తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. -
‘ఎల్ఆర్ఎస్’ రాయితీపై అవగాహన కల్పించండి
గద్వాల: ప్లాట్ల క్రమబద్ధీకణకు సంబందించి మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం 25 శాతం రిబేటు రాయితీ వర్తింపజేస్తుందని కలెక్టర్ సంతోష్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సంబందిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2020 ఆగస్టు 26వ తేదీలోపు దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మాత్రమే ఇది వరకు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించగా దరఖాస్తులు చేసుకునేందుకు వెసలుబాటు కల్పిస్తుందన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో సమాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు. సర్వే నంబర్లు, ప్లాట్ల అప్లికేషన్ సంఖ్య, రోడ్డు విస్తీర్ణం ఇనాం భూమి, ఇరిగేషన్ వంటి అంశాలను పక్కాగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఇన్చార్జ్ డీపీఓ నాగేంద్రం, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
అదనపు మోటార్ల ఏర్పాటు..
సొరంగం సెగ్మెంట్ బిగిస్తుండటంతో ఏర్పడిన రంధ్రాల ద్వారా నీటి ఊట టన్నెల్లోకి అధికమైంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఏర్పాటు చేసిన మోటార్లు సరిపోవడం లేదు. టన్నెల్లోకి నీట ఊట అధికమవడంతో ఐదు అదనపు మోటార్లను, ప్రత్యేకంగా పైపులను ఏర్పాటు చేసి.. నీటిని తోడేస్తున్నారు. బురద గట్టి పడటంతో సింగరేణి కార్మికుల వద్ద ఉన్న పారలు సైతం వాడకంలోకి రావడం లేదు. దీంతో అదనంగా గడ్డపారలు తెప్పించారు. పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మిషన్లు వాడుతున్నారు. ఊట నీటిని, మట్టిని తొలగిస్తేనే చిక్కుకున్న వారి అవశేషాలు వెలికితీసేందుకు వీలవుతుంది. -
హుండీ ఆదాయం రూ.1.34 లక్షలు
అయిజ: మండల కేంద్రంలోని తిక్కవీరేశ్వరస్వామి జాతర సందర్భంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటు చేసిన హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. గత నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించగా.. ఆలయ కమిటీ సభ్యులు హుండీ డబ్బును లెక్కించారు. మొత్తం రూ.1,34,650 నగదు ఉన్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు అశోక్, ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు. మెరుగైన సేవలు అందించాలి గద్వాల వ్యవసాయం: పశువులకు, పెంపుడు జంతువులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని 1962 పశుసంవర్ధకశాఖ అంబులెన్స్ సిబ్బందికి 1962 అంబులెన్స్ సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ బగీష్ మిశ్రా సూచించారు. శనివారం ఆయన ఆకస్మికంగా అంబులెన్స్‌ను తనిఖీ చేశారు. వైద్య పరికరాలు, వాటి పనితీరు, మందులను పరిశీలించారు. అంబులెన్స్ ద్వారా పశువులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఫోన్‌కాల్ వచ్చిన వెంటనే స్పందించాలని, జిల్లాలో ప్రతి అంబులెన్స్ 10 ట్రిప్పులతో 20కి పైగా పశువులకు సేవలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ రత్నమయ్య, డాక్టర్ అనిత, ప్యారవేట్ దయానంద్, హెల్పర్ మురళీ, కెప్టెన్ తిక్కన్న ఉన్నారు. జోగుళాంబ సన్నిధిలో వరంగల్ ఎమ్మెల్యే అలంపూర్: అలంపూర్ జోగుళాంబ శక్తిపీఠాన్ని వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్ధ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రాలతో సత్కరించారు. అలాగే, హన్మకొండ మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ సతీసమేతంగా జోగుళాంబ ఆలయాన్ని దర్శించుకున్నారు. -
అపరిష్కృత సమస్యలను పరిష్కరించండి
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంతో పాటు అయిజ పట్టణంలో వివిధ శాఖల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణతోపాటు విద్యుత్, బీఎస్ఎన్ఎల్, ఆర్అండ్బీ, ఆర్టీసీ శాఖల అధికారులకు సమస్యలపై బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షురాలు జయశ్రీ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు అయిజ, వివిధ గ్రామాల స్టేజీల దగ్గర బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయాలని, బాలభవన్ పూర్వ వైభవం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, నిరుపయోగంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ స్తంభాలను తొలగించాలని, మెలచెర్వు క్రాస్ రోడ్డు నుంచి కొండపల్లి క్రాస్ రోడ్డు వరకు బీటీని పునరుద్దరించాలని కోరారు. అలాగే అయిజలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఉత్తనూర్ చౌరస్తా వరకు డబుల్ రోడ్డును నిర్మించాలన్నారు. పద్మావతి, కృష్ణవేణి, రవికుమార్, రామంజనేయులు పాల్గొన్నారు. -
నేడు వనపర్తికి సీఎం రాక
వనపర్తి: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకుగాను అధికార, పాలకవర్గం భారీఎత్తున ఏర్పాట్లు చేసింది. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4:35 వరకు వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి 11.30కి జిల్లాకేంద్రంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనానంతరం ఆలయ అభివృద్ధికి రూ.కోటి ప్రొసీడింగ్ పత్రాలను ఆలయ కమిటీ చైర్మన్ అయ్యలూరి రఘునాథశర్మకు అందజేస్తారు. అటు నుంచి తను విద్యనభ్యసించిన జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకొని అక్కడే పాఠశాల, కళాశాల భవన నిర్మాణాలు, జీజీహెచ్ భవనం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, ఐటీ టవర్, శ్రీరంగాపురం ఆలయ అభివృద్ధి పనులు, పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి భవనం, జిల్లాకేంద్రంలోని రాజనగరం శివారు నుంచి పెద్దమందడి వరకు బీటీరోడ్డు నిర్మాణం, ఎస్టీ హాబిటేషన్ వర్కింగ్ బిల్డింగ్, నియోజకవర్గంలోని సీఆర్ఆర్ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని తన పాఠశాల, కళాశాల మిత్రులు, గురువులతో కాసేపు గడిపి వారితో కలిసి భోజనం చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20కి బయలుదేరి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. అక్కడే రేవంతన్న కా భరోసా అనే కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, కుట్టుమిషన్లు, నియామక పత్రాలు అందజేసిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4.35 గంటలకు హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు హాజరుకానున్నారు. రూ.721 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ‘రేవంతన్న కా భరోసా’ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం -
పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: ప్రధాన మంత్రి ఇంటర్న్ షిప్ పథకం రెండో దశ ప్రారంభమైనట్లు పథకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారుడి వయసు 21–24మధ్య ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం ఉండరాదని, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయి ఉండాలని తెలిపారు. అదేవిధంగా కుటుంబ సంవత్సర ఆదాయం రూ.8లక్షల లోపు ఉండాలని, ఎంపికై న విద్యార్థులకు నెలసరి జీతం రూ.5000లు ఇవ్వనున్నట్లు తెలిపారు. 12నెలల ఇంటర్న్‌షిప్ కాల వ్యవధిలో కనీసం 6 నెలల పాటు ఉద్యోగ శిక్షణ ఉంటుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు pmintership.mcf.gov.in పోర్టల్‌లో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. -
బస్సు షెల్టర్లు లేని ప్రాంతాలు
జిల్లా కేంద్రంలోని రథశాల ఎదురుగా, కళాశాలకు వెళ్లే రహదారి వద్ద, గంజి చౌరస్తా వద్ద నిత్యం ప్రయాణికులు వందల సంఖ్యలో ఉంటారు. వీటితోపాటు ఆస్పత్రి ఎదురుగా, డ్యాంకు వెళ్లే దారిలో ఉన్న సబ్‌స్టేషన్ దగ్గర బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షిస్తుంటారు. అంతేకాక రైల్వేస్టేషన్ క్రాస్‌రోడ్ దగ్గర ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రధాన రహదారి పోడువున ఉన్న గ్రామాల స్టేజీల దగ్గర ప్రయాణికులు పడిగాపులు కాస్తుంటారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు, చెట్లు లేకపోవడంతో రోడ్డుపైనే నిల్చుని ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గద్వాల, అయిజ, అలంపూర్, శాంతినగర్‌లలో బస్సు షెల్టర్లు లేకపోవడం వలన సమీపంలో ఉన్న దుకాణాలు, హోటళ్ల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాస్తుంటారు. జిల్లా నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పోలీస్‌శాఖ, ఆయా ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు సంయుక్తంగా బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలి. బహుముఖంగా విస్తరిస్తోన్న జిల్లా కేంద్రంతో పాటు వాణిజ్య పరంగా వృద్ధి సాధిస్తున్న అయిజ, శాంతిగనర్, ఎర్రవల్లి చౌరస్తా ఆయా మండల కేంద్రాలలో ప్రయాణికుల అవస్థలను గుర్తించి అవసరమైన చోట బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
అడ్డంకులు దాటుతూ..
అచ్చంపేట: దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయకచర్యలు ముమ్మరం చేశారు. అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. గ్యాస్ కటింగ్ పరికరంతో టీబీఎం మిషన్ విడి భాగాలను కట్ చేసే పనులు వేగవంతమయ్యాయి. కటింగ్ చేసిన విడి భాగాలను ఎప్పటికప్పుడు బయటకు తీసుకొచ్చారు. శుక్రవారం ఏడోరోజు లోకో ట్రైన్ ద్వారా సింగిరేణి బొగ్గు గనుల నుంచి తెప్పించిన పెద్ద సైజు ట్రేలలో సొరంగం బయటికి బురద, గ్యాస్, ఫాస్మ కటర్ల ద్వారా టీబీఎం విడి భాగాలు, ఇతర ఇనుప రాడ్లు, పైపులను రెస్క్యూ టీం సభ్యులు మోయగలిగిన సైజులో కట్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కన్వేయర్ బెల్ట్‌ను పునరుద్ధరించలేదు. సొరంగం లోపల 14.85 కిలోమీటర్ల వద్ద టీబీఎం మిషన్ ఉండగా పైకప్పు కూలింది. ఇక్కడ పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు లోకో ట్రైన్‌ను 13.500 కిలోమీటరు వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక బద్ధగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గట్టి పడిన మట్టిని తీయడానికి మినీ జేసీబీలను వినియోగిస్తున్నారు. జేసీబీలు, బృందాలు లోపల బురదను పక్కకు తొలగిస్తూ బయటికి పంపిస్తున్నారు. మూడు బోగీలు (ట్రేలు) ద్వారా బురద బయటికి తరలించారు. సొరంగంలోకి చేరిన నీటిని బయటకు పంపింగ్ చేయడానికి అదనపు మోటార్లను తీసుకొచ్చారు. పూర్తిస్థాయిలో మట్టిని తరలించకపోయినా లోపల ఓ పక్కకు వేస్తూ కార్మికుల ఆచూకీ కనుకొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బాధితుల కోసం సొరంగంలో టెషర్స్ అందుబాటులో ఉంచారు. రక్షణ కోసం.. టన్నెల్లోకి వెళ్లే సహాయక బృందాల రక్షణ కోసం కృత్రిమ ఏర్పాట్లు చేస్తున్నారు. లోపల ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐరన్ షీట్లు, పైపులను రౌండ్‌గా బెండ్ చేసి వెల్డింగ్ చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్తున్నారు. దీని ద్వారా లోపలికి ప్రవేశించేలా చర్యలు చేపట్టారు. సొరంగం కూలిన, రాళ్లు, రప్పలు ఊడిపడినా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా వీటిని తయారు చేసున్నారు. దీంతో ఏమైనా ప్రమాదం జరిగినా తప్పించుకునే అవకాశం ఉంటుందని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ టన్నెల్ వద్దకు ఇతరులు వెళ్లకుండా నివారిస్తున్నారు. అదనపు బృందాల రాక ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు శుక్రవారం రామగుండం, కొత్తగూడెం నుంచి అదనంగా సింగరేణి బృందాలు చేరుకున్నాయి. సింగరేణి కార్మికులు ఎక్కువగా కష్టపడుతూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు సింగరేణి కార్మికులు సొరంగంలో బురద మట్టిని తొలగించడానికి శాయశక్తులా పనిచేశారు. సింగరేణి కార్మికులు విడతల వారీగా సొరంగంలోకి వెళ్లి పనులు చేపడుతున్నారు. వీరితో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్, బీఆర్ఓ, రైల్వే శాఖతో పాటు పలు ప్రైవేట్ నిర్మాణ సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ● అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం టన్నెల్లో 11.560 కి.మీ., నుంచి 12.950 కి.మీ., వరకు వాటర్, బురద పేరుకుపోగా.. రెండు రోజులుగా వీటిని తొలగిస్తున్నారు. అలాగే 150 మీటర్ల మేర పేరుకున్న మట్టి, బురద, రాళ్లు, సెగ్మెంట్, టీబీఎం శిథిలాలను తొలగించే చర్యలు ముమ్మరం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏడోరోజు కొనసాగిన సహాయక చర్యలు ముమ్మరంగా బురద, మట్టి, శిథిలాల తరలింపు అత్యాధునిక పరికరాలతో గాలింపు సొంతూళ్లకు కార్మికులు.. టన్నెల్లో జరిగిన ప్రమాదంతో భయాందోళనకు గురైన కార్మికులు ఒక్కొక్కరుగా సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. కుటుంబసభ్యులు ఫోన్ చేసి తిరిగి రావాలని వేడుకుంటున్నారని, గత్యంతరం లేక మూడు నెలల జీతాలు రావాల్సి ఉన్నా వదిలి వెళ్తున్నామని కార్మికులు వాపోయారు. సొరంగం వద్ద పనులు సాగుతాయో లేదో అని.. తమ సొంత రాష్ట్రంలోనే ఏదో ఒక పని చేసుకుంటామని పేర్కొంటున్నారు. జీతాలు లేకున్నా సరే మా ప్రాణాలే ముఖ్యం అంటున్నారు. టన్నెల్ వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, వివిధ శాఖల అధికారులు, విపత్తుల విభాగం ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
కాలుష్య కారకం
కాలం చెల్లిన వాహనం.. ●15 ఏళ్లుపై బడిన వెహికిల్స్‌తో తీవ్రమైన కాలుష్యం ఆదేశాలు ఇచ్చాం.. ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరూ ఎంవీఐలు, ఆర్టీఓలకు 15 ఏళ్లు పైబడిన వాహనాలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేసి అలాంటి వాహనాలు గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో 15, 20 ఏళ్లు పైబడిన వాహనదారులు ప్రతిఒక్కరూ వారి వాహనాల రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువన్ లేని వాహనాలు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలో పట్టుబడితే సీజ్ చేస్తాం. ప్రధానంగా రోడ్లపై వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ సీటు బెల్ట్, హెల్మెట్ తప్పక ధరించాలి. – కిషన్, డీటీసీ ఉమ్మడి జిల్లా ● రోగాల విజృంభణ నేపథ్యంలో కట్టడికి చర్యలు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 32,181 వాహనాలు ● గ్రీన్ ట్యాక్స్ భారీగా పెంచిన ప్రభుత్వాలు పాలమూరు: భారీగా పెరిగిపోతున్న వాహన కాలుష్యంతో వాతావరణంలో సమతుల్యత లోపించి కొత్త రకం జబ్బులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15, 20 ఏళ్లు దాటిన వాహనాలకు గ్రీన్ టాక్స్ భారీగా విధిస్తోంది. 15 ఏళ్లు దాటిన ద్విచక్రవాహనం రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.2 వేలు, 20 ఏళ్లు దాటిన బైక్‌లకు రూ.5 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక 15 ఏళ్లు దాటిన కార్లకు రూ.5 వేలు, 20 ఏళ్లు దాటిన వాటికి రూ.10 వేల పన్నులు వసూలు చేయాలని ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో చాలా వరకు కార్లు, ద్విచక్రవాహనాలు 20 ఏళ్లు పైబడినా అలాగే రోడ్లపై నడుపుతున్నారు. అలా కాలం చెల్లిన వాహనాల నుంచి భారీస్థాయిలో పొగ విడుదల కావడంతో మిగిలిన వాహనదారులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ● ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాహనం కలిగి ఉండటం సర్వసాధారణమైపోయింది. వాహనం ఉండటం సరే.. దాని నుంచి వచ్చే కాలుష్యమే పర్యావరణానికి హాని కలిగిస్తోంది. వాహనాల నుంచి వచ్చే కార్బన్ మోనాకై ్సడ్ వల్ల ఓజోన్ పొర బాగా దెబ్బతింటోంది. వాహనాల నుంచి మోతాదుకు మించి కాలుష్యం విడుదల కాకుండా ఆర్టీఏ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. డీజిల్ వాహనాల నుంచి 60 శాతానికి మించి పొగ రాకూడదు. అలాగే పెట్రోల్ వాహనాల నుంచి ద్విచక్రవాహనమైతే 3.5శాతం, కార్లు ఇతర వాహనాలైతే 4.5 శాతానికి మించరాదు. కానీ, కాలం చెల్లిన వాహనాల నుంచి అధిక మోతాదులో పొగ విడుదలవుతుంది. దేశ రాజధానిలో వాహనాల వినియోగం ఎక్కువ కావడంతో విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోంది. అక్కడి ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్న నేపథ్యంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకరోజు కొన్ని వాహనాలను మాత్రమే రహదారి మీదికి అనుమతిస్తున్నారు. మన పట్టణంలోనూ రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. జిల్లాలోని పలు గుంతల రహదారులతో పాటు వాహనాల పొగతో వెలువడే కాలుష్యంతో ప్రజలు శ్వాసకోశ వాధ్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 15ఏళ్లు పైబడిన అన్ని రకాల వాహనాల వివరాలు జిల్లా వాహనాలు మహబూబ్‌నగర్ 13,965 నాగర్‌కర్నూల్ 5,295 వనపర్తి 4,059 జోగుళాంబ గద్వాల 3,672 నారాయణపేట 5,190 -
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
గద్వాల: పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో కాన్ఫరెన్స్‌హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 21నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 9:30–12:30 పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,717మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా వారికి 40 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల్లో ఎలాంటి మాస్‌కాపీయింగ్ జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం 40మంది చీఫ్ సూపరింటెండెంట్స్, ముగ్గురు ఫ్లైయింగ్ స్వ్కాడ్స్, నాలుగు రూట్ ఆఫీసర్లు, 40 డిపార్ట్మెంటల్ అధికారులు, 14 సెంటర్ కస్టోడియన్స్, 40సిట్టింగ్ స్వ్కాడ్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసుస్టేషన్ నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాల రవాణా, పరీక్షా అనంతరం సమాధాన పత్రాల బండిల్స్‌ను పోస్టాఫీసులకు తరలింపు ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రతా నడుమ చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేయాలన్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పించాలని, నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయ, నర్సింగ్‌రావు, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీఈవో అబ్దుల్గని, డిప్యూటీ జెడ్పీ సీఈవో నాగేంద్రం, డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఫిట్నెస్ లేని బస్సులపై చర్యలు
గద్వాల క్రైం: ఫిట్నెస్ లేని ప్రవేటు స్కూల్ బస్సులలో విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్తే చట్టపరమైన చర్యలు తప్పవని గద్వాల ఎంవీఐ రాములు నాయక్ అన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని జమ్మిచెడ్ రోడ్డుమార్గంలో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో పలు స్కూల్ బస్సులు ఫిట్నెస్, పర్మిట్, సామర్థ్యం తదితర అనుమతులు లేకుండా విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. సామర్థ్యం లేని రెండు ప్రైవేటు స్కూల్ బస్సులను సీజ్ చేశారు. రోడ్డు భద్రతా నిబంధనలు, పలు అనుమతి పత్రాలు లేకుండా నడుస్తున్న బస్సులకు జారిమానాలు విధించారు. గోవర్ధన్, గోవిందు, ఖాద్దర్ పాల్గొన్నారు. ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి అలంపూర్: జాతీయ లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కృషి చేద్దామని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజ అన్నారు. అలంపూర్ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో పోలీస్ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా జూనియర్ సివిల్ కోర్టు జడ్జీ మిధున్ తేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ లోక్‌అదాలత్ లక్ష్యాలు, ఉద్ద్యేశాలను వారికి వివరించారు. పోలీసులు న్యాయవాదులు సమన్వయంతో కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. అధిక కేసుల పరిష్కారానికి సహకరించాలన్నారు. సమావేశంలో సురేష్ కుమార్, సీఐలు రవిబాబు, టాటబాబు పాల్గొన్నారు.సమగ్ర సస్యరక్షణతోనే అధిక దిగుబడులు ఎర్రవల్లి: సమగ్ర సస్యరక్షణతోనే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని సీఐపీఎంసీ ఇన్చార్జ్ సునీత అన్నారు. శుక్రవారం ఇటిక్యాల మండలంలోని సాతర్ల రైతు వేదికలో కేంద్రియ సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్‌శాఖ ఆధ్వర్యంలో పంటల సాగులో సమగ్ర సస్యరక్షణపై డీలర్లు, రైతులకు హెచ్ఆర్డీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఏఓ సక్రియనాయక్, జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్‌తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు ఎన్పిఎస్ఎస్ అనే మొబైల్ యాప్‌ను వినియోగించి వివిధ పంటలపై సులభంగా సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చునని సూచించారు. ప్రతి ఏడాది పంట మార్పిడి చేసుకోవాలని, పొలం చుట్టూ వలయంగా ఎర పంటలను వేసుకోవాలని, విత్తన శుద్ధి చేయాలని, అవసరం మేరకు మాత్రమే పురుగు మందులు పిచికారీ చేయాలన్నారు. అనంతరం మిరప పంట సందర్శించి లింగాకర్షక బుట్టల యొక్క ఆవష్యకతపై అవగాహన కల్పించారు. -
ఎండలో మాడిపోవాల్సిందే
●బస్ షెల్టర్లు నిర్మించండి ప్రయాణికుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని గద్వాలలో బస్ షెల్టర్లు నిర్మించాలి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో బస్ షెల్ట ర్లు కొరత వేధిస్తోంది. ఇవి లేకపోవడం వలన ఆరుబయట ఎండ, వానలో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తోంది. మున్సిపల్, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో ముఖ్య కూడళ్లను గుర్తించి, బస్షెల్టర్లు ఏర్పాటు చేయాలి. – అనిల్‌కుమార్, గద్వాల ప్రయాణికుల ఇబ్బందులు బస్సు షెల్టర్లు లేకపోవడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు బస్సులు ఆలస్యం అయితే చాలాసేపు ఎండలోనే ఉండిపోయే పరిస్థితి ఉంది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అనువైన చోట బస్సు షెల్టర్లను నిర్మించాలి. – వెంకటయ్య, గద్వాల దాతల సహకారం కోరతాం జిల్లా కేంద్రంతో పాటు పలు ముఖ్యమైన ప్రాంతాలలో బస్ షెల్టర్ల ఏర్పాటు ఆవశ్యకత ఉంది. ప్రయాణికుల వినతులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులకు నివేదించాం. వీటి ఏర్పాటుపై గతంలోనే ప్రతిపాదనలు చేశారు. స్థానికంగా ఉన్న దాతల సహకారంతో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – మురళీకృష్ణ, ఆర్టీసీ డీఎం, గద్వాల గద్వాలటౌన్: వేసవి రాకముందే ఎండలు మండుతున్నాయి.. రోడ్డుపైకి వెళ్తే కనీసం నిల్చునేందుకు కూడా నీడ కనిపించని దుస్థితి. ఇక ఆర్టీసీ బస్సుల కోసం వెళ్లే ప్రయానికుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ప్రయాణికుల కోసం కనీస సౌకర్యాల కల్పనలో ఆర్టీసీ అశ్రద్ద వహిస్తుంది. ప్రధానంగా ప్రయాణికులకు అవసరమైన సంఖ్యలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, కూలి నాలి పని చేసుకునే వారు ఇలా ఒకరేంటి ప్రతి ఒక్కరు బస్సుల కోసం రోడ్లపైనే నిరీక్షించాలంటే నరకం కనిపిస్తోంది. నిల్వ నీడ లేక భానుడి ప్రతాపానికి మాడిపోతున్నారు. కొంత నీడ, కొన్ని ఇనుప బెంచీలుంటే ప్రయాణికులకు ఊరట లభిస్తుంది. అయితే ఆ కాస్త భాగ్యం కూడా లేదు. గంటల తరబడి రోడ్ల పక్కన నిల్చోని ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ బస్సుల కోసం నిత్యం ఎదురు చూడాల్సివస్తోంది. ప్రయాణికులు పెరుగుతున్నా.. జిల్లా వ్యాప్తంగా బస్సు ప్రయాణికుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఆమేరకు షెల్టర్ల నిర్మాణం జరగడం లేదు. ప్రయాణికుల కోసం బస్సు షెల్టర్లు నిర్మించడం ఆర్టీసీ విధి. అయితే ఆర్టీసీ చురుకుగా వ్యవహరించకపోవడం వల్ల షెల్టర్లకు కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రంలో చాలాకాలం నుంచి షెల్టర్ల కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కొన్ని ఏళ్ల క్రితం ఎల్ఐసీ నిర్వాహకులు, పీజేపీ క్యాంపు దగ్గర ఆ శాఖ ఉద్యోగులు స్వచ్ఛందంగా బస్సు షెల్టర్‌ను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఊరట కల్పించారు. ఈ రెండు షెల్టర్లే పట్టణ మొత్తానికి దిక్కుగా మారాయి. అయిజ, అలంపూర్ చౌరస్తా, శాంతినగర్ పట్టణాలతో పాటు ఎర్రవల్లి చౌరస్తా, ధరూర్, మల్థకల్, బల్గేర తదితర ప్రాంతాలలో ప్రయాణికుల రద్దీ నిత్యం ఉంటుంది. వందలాది మంది బస్సుల కోసం నిరీక్షిస్తుంటారు. ఇంతటి కీలకమైన ఈ ప్రాంతాలలో బస్సుషెల్టర్లు నిర్మించలేకపోతున్నారు. ఇక్కడ ఎండలోనే ప్రయాణికులు నిరీక్షించక తప్పని పరిస్థితి. ఓవైపు బస్ షెల్టర్ లేక.. బస్సులు రాక.. గంటలకొద్దీ ప్రయాణికులు ఎండలోనే మాడిపోతూ చేసేది లేక ప్రైవేటు వాహనాల్లో వేలాడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆర్టీసీకి వచ్చే ఆదాయం ప్రైవేటు వాహనాల జేబుల్లోకి వెళ్తోంది. అదే బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తే బస్సు కోసం వేచి ఉంటారు. ఫలితంగా ఆర్టీసీ ఆదాయం పెరుగుతోంది. కానరాని బస్ షెల్టర్లు బస్సుల కోసం ప్రయాణికుల పడరాని పాట్లు చెట్లు.. దుకాణాల నీడే దిక్కు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి -
కమనీయం.. పార్వతీ పరమేశ్వరుల కల్యాణం
గద్వాలటౌన్: ఓం నమః శివాయ.. హర హర.. మహాదేవ శంభోశంకర అన్న నినాదాల నడుమ గురువారం పట్టణంలోని శివాలయాలు మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లకుంట శివాలయంలో పార్వతీ, పరమేశ్వరుల కళ్యాణోత్సవాన్ని పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారికి అభిషేకార్చనలు, రుద్రహోమం తదితర కార్యక్రమాలు చేశారు. ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్దకు స్వామివారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయ నిర్వాహకులు తీసుకొచ్చారు. కళ్యాణ వస్త్రాలను సమర్పించిన అనంతరం భక్తుల సందోహం నడుమ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడము శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శివరాత్రి విశిష్టతను, పార్వతీ పరమేశ్వరుల కల్యాణ ఘట్టాన్ని భక్తులకు వివరించారు. అదేవిధంగా స్థానిక తెలుగుపేటలోని శివాలయంలో మహా రుద్రభిషేకం, కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. స్థానిక వీరభద్రస్వామి ఆలయంలో, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో లింగోద్భవ పూజలను జరిపించగా శివనామ కీర్తనలు, భజనలు, భక్తిపాటలతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. సత్యసాయి విద్యామందిరంలో విద్యార్థులు భజనలు, భక్తిగీతాలతో హోరెత్తించారు. స్థానిక భీంనగర్‌లోని భీమలింగేశ్వరస్వామి ఆలయం, పలిగుండ్ల ఆంజేనేయస్వామి ఆలయం, నందీశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. స్థానిక ఓం శాంతి పీస్పార్కులో 89వ త్రిమూర్తి మహా శివరాత్రి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా సంచాలకులు మహాదేవి జెండాను ఆవిష్కరించి, సందేశం ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని పలు శివాలయాలలో జరిగిన పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలలో పలువురు నాయకులు వేరువేరుగా పాల్గొన్నారు. -
‘ఉపాధి’ లక్ష్యాన్ని పూర్తి చేయాలి
గద్వాల: ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల లక్ష్యాలు, లేబర్ టర్న్ ఔట్, మెటీరియల్ కంపోనెంట్ తదితర వివరాలను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. ప్ర తిమండలానికి కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. గ్రామల వారీగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కూలీలకు అధిక ప్రాధాన్యత కల్పించేలా పనులను చేపట్టాలన్నారు. అదేవిధంగా చేసిన పనులకు సంబంధించి సకాలంలో వందశాతం చెల్లింపులు చేయాలని, జరిగిన పనులపై తానే స్వయంగా ప్రతివారం సమీక్షిస్తానని, నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు. -
నేటి నుంచి భూమి పూజ వారోత్సవాలు
గద్వాల: జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు ఈనెల 28వ తేదీ నుంచి భూమిపూజ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రతిమండలానికి ఎంపికై న గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు భూమిపూజ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు నివాసం కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరీ చేస్తుందని, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరీ అయినట్లు వీటిని అర్హులైన లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎంపీడీవోలు, హౌసింగ్‌శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్లకు సంబంధిచిన మార్కౌవుట్ ఫోటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. -
ఉపాధి అవకాశాలు కల్పించాలి
గద్వాల: నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలను పెంపొందించడంతోపాటు.. రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 2వ తేదీన వనపర్తికి సీఎం రానున్న నేపథ్యంలో ఉద్యోగమేళా, రుణమేళా స్టాల్స్ ఏర్పాట్లు చేయాలన్నారు. నిర్ధేశించిన లక్ష్యం మేర అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యాన్ని సాధించాలన్నారు. మార్చి 1వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈమేళాలో యువత అధిక సంఖ్యలో హాజరయ్యేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. అదేవిధంగా రుణ మంజూరు, లక్ష్యాలు, ఇప్పటి వరకు మంజూరీ అయిన రూ.200 కోట్ల రుణాల వివరాలను సమగ్రంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. 2024డిసెంబర్–2025 ఫిబ్రవరి వరకు మంజూరైన రుణాలపై పూర్తి స్థాయి నివేదిక రూపొందించి ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, ఎల్డీఎం అయ్యపురెడ్డి వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
రాలుతున్న ఆశలు
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025వివరాలు 8లో uట్రాన్స్‌కో ఎస్ఈపై సస్పెన్షన్ వేటు..? గద్వాల: ట్రాన్స్‌కో ఎస్ఈ తిరుమల్‌రావును సస్పెండ్ చేస్తూ సీఎండీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ధరూరు మండలం అల్వాలపాడు సబ్‌స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు ఆందోళన చేసిన నేపథ్యంలో విచారణ జరిపిన రాష్ట్ర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఎస్ఈ తిరుమల్‌రావుపై చర్యలకు ఆదేశిస్తూ సీఎండీ కార్యాలయానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. నివేదిక ఆధారంగా ఎస్ఈ తిరుమల్‌రావుపై సస్పెన్షన్ వేటు వేస్తూ సీఎండీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వ రకు వనపర్తి జిల్లా ఎస్ఈ రాజశేఖరమ్కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. మహిళల రక్షణ కోసమే షీటీంలు గద్వాల క్రైం: మహిళల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్న జిల్లా షీటీం.. ఉత్తమ పనితీరు కనబరిచినట్లు ఎస్పీ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆకతాయిల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులు, బాలికలకు షీ టీం సభ్యులు మనోఽదైర్యం అందిస్తున్నారని తెలిపారు. గడచిన 40 రోజుల వ్యవధిలో 13 మందిపై ఈ పెట్టి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, నిత్యం ప్రధాన కూడలి, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాలలో మహిళా చట్టలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళల్లో చైతన్యం తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. మల్టీజోన్ పరిధిలో జిల్లా షీటీం సిబ్బంది ఉత్తమ పనితీరు కనబర్చారని తెలిపారు. అత్యవసర సమయల్లో బాధితులు డయల్ 100 లేదా 8712670312కు సంప్రదించవచ్చని లేదా సామాజిక మాద్యమాల ద్వారా అయినా ఫిర్యాదు చేయవచ్చని తక్షణం చర్యలు తీసుకుంటామని తెలిపారు. జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో గురువారం తగ్గింది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు 2,418 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. గురువారం ఉదయానికి 365 క్యూసెక్కులకు తగ్గిపోయాయి. జూరాలలో నీటి మట్టం తగ్గడంతో రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు కర్ణాటక ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి 3 టీఎంసీల నీరు విడుదల చేయాలని కోరారు. దీంతో 6వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయగా.. ఇక్కడికి కేవలం 2,418 క్యూసెక్కులు 24 గంటల పాటు చేరాయి. అనంతరం పూర్తిగా ఇన్‌ఫ్లో తగ్గింది. తాగు, సాగు నీటికి ఈ సారి తిప్పలు తప్పేలా లేనట్లుగా కనిపిస్తోంది. ఆవిరి రూపంలో 75 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్టుకు 625, భీమా లిఫ్టు–1కు 550, కోయిల్‌సాగర్‌కు 220, ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 375, ప్రాజెక్టు నుంచి మొత్తం 2495 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 4.721 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ●వాతావరణంలో మార్పులతో మామిడి దిగుబడులపై ప్రభావం పూత, పిందెలు రాలుతున్నాయి.. నాకు పది ఎకరాల మామిడి తోట ఉంది. 20 రోజుల నుంచి తోటకు బూడిద తెగుళ్లు, తేనెమంచు పురుగు ఉధృతి ఎక్కువైంది. ఎన్ని మందులు వాడినా పోవడం లేదు. దీనివల్ల పూత, పిందెలు రాలిపోతున్నాయి. ఈ ఏడాది దిగుబడులు తగ్గుతాయి. – కొండయ్య, రైతు, కేటీదొడ్డి దిగుబడులు తగ్గుతాయి. నాకు సొంతంగా 6 ఎకరాల మామడి తోట ఉంది. మరో 10 ఎకరాలు గుత్తకు తీసుకున్నా. తోటకు పూత బాగా వచ్చింది. అయితే కొద్ది రోజుల నుంచి తేనెమంచు పురుగుతో పూత, పిందెలు రాలుతున్నాయి. ఈ ఏడాది దిగుబడులు తగ్గుతాయి. ఆర్థికంగా చాలా నష్టం. – తెలుగు తిమ్మయ్య, రైతు, గట్టు మండలం సలహాలు, సూచనలు తీసుకోవాలి.. ఈఏడాది మామిడి తోటలకు పూత బాగా వచ్చింది. తేనెమంచు పురుగు ఉధృతి విషయం మా దృష్టికి వచ్చింది. మామిడి తోటలకు ఆశిస్తున్న తెగుళ్లు, పురుగుల నివారణకు రైతులు తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఉధ్యానశాఖ సిబ్బంది ద్వార రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తాం. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి గద్వాల వ్యవసాయం: మామిడి రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. గడిచిన పది రోజలుగా వాతావరణంలో వచ్చిన మార్పులు.. బూడిద తెగుళ్లు.. తేనెమంచు పురుగు ఉధృతి.. మామిడితోటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పూత, పిందెలు రాలిపోతున్నాయి. కళ్లెదుటే రాలిపోతున్న పూత, పిందెలను చూస్తూ మామిడి రైతులు నిరాశ చెందుతున్నారు. దిగుబడులు తగ్గి ఆర్థికంగా నష్టాల పాలవుతామని ఆందోళనకు గురవుతున్నారు. 5వేల ఎకరాల్లో మామిడి.. ఉధ్యాన పంటలకు జిల్లాలో అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్ల తోటల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. నడిగడ్డలో ఇలాంటి నేలల శాతమే ఎక్కువగా ఉంది. సాగునీటి విషయానికి వస్తే జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్‌లతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోథల, రిజర్వాయర్లు, నోటిఫైడ్ చెరువులు, చెరువులు ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా బోర్లు, బావుల్లో ఆశించిన స్థాయిలో నీరు ఉంటోంది. సాధారణంగా పండ్ల తోటలను బోర్లు, బావుల కిందే సాగు చేస్తారు. ఈక్రమంలోనే జిల్లాలో మామిడి, బత్తాయి, పొప్పాయి, జామ, సపోట తదితర పండ్లతోటలను సాగు చేస్తున్నారు. అయితే జిల్లాలో మామిడి తోటలు సాగు ఎక్కువగా ఉంది. మిగలిన పండ్ల తోటలతో పోల్చితే మామిడి తోటలకు పెట్టుబడులు కాస్త తక్కువ, నిర్వహణ కూడా తక్కువే. జిల్లాలో 5020 ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా, ఈ ఏడాది 3430 ఎకరాల్లో కాపు దశలో ఉన్నాయి. జిల్లా వివరాలిలా... మండలం మొత్తం మామిడి కాపు దశలో తోటలు (ఎకరాల్లో) ఉన్నవి కేటీదొడ్డి 2,380 1,365 గట్టు 800 680 ధరూరు 550 425 మల్దకల్ 470 355 గద్వాల 300 190 అయిజ 150 110 ఇటిక్యాల 130 110 వడ్డేపల్లి 140 120 రాజోళి 70 60 అలంపూర్ 10 5 ఉండవల్లి 10 5 మానవపాడు 10 5 వాతావరణ మార్పులతో.. జిల్లాలో డిసెంబర్, జనవరి నెల నుంచే మామిడి చెట్లకు పూత పూయడం ఆరంభం అయ్యింది. పూత పూసిన నెల రోజుల తర్వాత పిందెలు కాయడం జరుగుతుంది. ఆ తర్వాత నెల, రెండు నెలలకి కాయ సైజు పెరుగుతూ వస్తుంది. అయితే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మామిడి తోటలకు ఈసారి పూతలు బాగా వచ్చాయి. పూతలను చూసి రైతులు సంతోష పడ్డారు. వీరి సంతోషం ఎక్కువ రోజులు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. వాతావరణంలో వచ్చిన మార్పులు.. బూడిద తెగుళ్లు, తేనెమంచు పురుగు మామిడి తోటలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గడిచిన పదిరోజలుగా రాత్రి వేళల్లో చలి ఉండటం, పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. దీనికితోడు చాలా ప్రాంతాల్లో బూడిద తెగుళ్లు, తేనెమంచు పురుగు విపరీతంగా ఆశిస్తోంది. ఈపురుగు విసర్జించే జిగురు లాంటి ద్రవాల వల్ల, బూడిద తెగుళ్లతో మామిడి పూతలు, పిందెలు రాలిపోతున్నాయి . కళ్లెదుటే రాలిపోతున్న పూతలు, పిందెలను చూస్తు మామిడి రైతు కనీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా జనవరిలో పూత వచ్చి, ఫిబ్రవరిలో పిందెలు వచ్చిన చోట ఈపరిస్థితి ఎక్కువగా ఉంది. పిందెలు రాలి దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు. ఎన్ని మందులు వాడుతున్నా ఈపురుగుల, తెగుళ్లు ఉధృతి తగ్గడం లేదని రైతులు అంటున్నారు. ఏడాదిగా కష్టప డుతూ, అనేక మందులు కొడుతూ తోటను కాపాడుకున్నా అనూహ్యంగా వాతావరణంలో వచ్చిన మార్పులు, తెగుళ్ల వల్ల దిగుబడులు తగ్గి, ఆర్థికంగా నష్టపోయే వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మామిడి తోటలను గుత్తకు తీసుకున్న రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పూతకు రాకముందే తోటలను వీళ్లు గుత్తకు (లీజ్) తీసుకుంటారు. పూత బాగా వచ్చి, ఇప్పుడు పిందెలు రాలడం వల్ల తమకు తీవ్రంగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. రాలిన పిందెలు న్యూస్‌రీల్ తెగుళ్లు.. తేనెమంచు పురుగు ఉధృతి పూత, పిందెలు రాలుతుండడంతో రైతుల ఆందోళన -
శిథిలాల తొలగింపు షురూ
అచ్చంపేట/ అచ్చంపేట రూరల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ఇంకా బయటికి రాలేదు. టన్నెల్ నుంచి వారిని క్షేమంగా బయటికి తెచ్చే ఆపరేషన్ గురువారం మొదలైంది. సహాయక చర్యల్లో అధికారులు వేగం పెంచారు. లోకో ట్రైన్ మూడు డబ్బాల ద్వారా మట్టి శిథిలాలను తీసుకొచ్చారు. టీబీఎం మిషన్ ఉన్న ప్రాంతానికి లోకో ట్రైన్ పూర్తిగా చేరుకోలేకపోతోంది. 13.95 కి.మీ., వద్ద టీబీఎం మిషన్ ఉండగా చివరి వరకు లోకో ట్రైన్ వెళ్లేందుకు పట్టాలు ఉన్నాయి. అయితే భారీగా పేరుకుపోయిన మట్టి, బురద, సెగ్మెంట్లు, టీబీఎం శిథిలాల వల్ల టన్నెల్ చివరి వరకు లోకో ట్రైన్ వెళ్లలేకపోతోంది. ఈ రెండింటి మధ్య 300 మీటర్ల దూరం ఉంది. దీంతో టీబీఎం వరకు చేరుకునేందుకు లోకో ట్రైన్ పట్టాలు, సొరంగంలోని మట్టి, రాళ్లు, బురద తొలగించేందుకు కార్యాచరణను రెస్క్యూ బృందాలు చేపట్టాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే లోకో ట్రైన్ టీబీఎం చివరి వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత టీబీఎం ఉన్న ప్రాంతంలోని శిథిలాలు తీసే పని మొదలవుతుంది. అప్పటివరకు టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల జాడ కనిపించే అవకాశం లేదు. ఈ ఆపరేషన్‌లో సింగరేణి బృందాలు కీలకంగా పని చేస్తున్నాయి. సొరంగం పైకప్పు కూలకుండా ప్రతిష్టమైన పునఃనిర్మాణం చేస్తున్నారు. సింగరేణితో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్, ఇతర బృందాలు కలిపి 20 మంది చొప్పున మూడు షిఫ్ట్‌లుగా పనిచేస్తున్నారు. అయితే దెబ్బతిన్న కన్వేయర్ బెల్టు మరమ్మతు మాత్రం చేపట్టలేకపోతున్నారు. సొరంగం లోపలికి వెళ్లేందుకు లోకో ట్రైన్ ఒక్కటే ఉండటం వల్ల అందులోనే సిబ్బంది వెళ్తూ.. దానిలోనే మట్టి తీసుకురావడం వల్ల కొంత కష్టంగా మారింది. అయితే తెగిపోయిన కన్వేయర్ బెల్ట్, ఆక్సిజన్ పైపులు పునరుద్ధరిస్తే సహాయక చర్యలు మరింత వేగవంతం అవుతాయి. టీబీఎం మిషన్ కటింగ్.. టీబీఎం మిషన్‌ను కట్ చేసేందుకు జేపీ కంపెనీ సంస్థ యజమాని జయప్రకాష్ గౌర్ అనుమతి లభించింది. దీంతో గత అర్ధరాత్రి నుంచి గ్యాస్ కటింగ్ మిషన్‌తో టీబీఎంను కట్ చేసే పనులను వేగవంతం చేసినట్లు సమాచారం. ఇందులో 11 బృందాలతో పాటు ర్యాట్ హోల్ మైనర్స్ ప్రత్యేక నిపుణులు భాగస్వామ్యం అయ్యారు. ప్రమాద స్థలంసమీపానికి చేరుకొని పేరుకుపోయిన బురదను బయటికి పంపే చర్యలు చేపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు సొరంగంలో చేపడుతున్న సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి.. అనే విషయాలను అధికార యంత్రం బయటికి పొక్కనివ్వడం లేదు. కఠిన ఆంక్షలు.. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాంతానికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. కనీసం మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. రాజకీయ నాయకుల సందర్శనను తిరస్కరిస్తున్నారు. కేవలం రెస్క్యూ ఆపరేషన్ బృందాలు, అధికారులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. మరో 72 గంటల్లో సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తాం అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో టన్నెల్ వద్ద సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. టన్నెల్ చుట్టూ ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఆంక్షలు విధించారు. ఎన్జీఆర్ఐ ప్రత్యేక బృందం.. సొరంగంలో శిథిలాల కింద చిక్కుకున్న మానవ శరీరాలు గుర్తించేందుకు ప్రత్యేకంగా ఎన్జీఆర్ఐ ప్రత్యేక బృందం గురువారం ఉదయం సహాయ చర్యలు చేపట్టింది. సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేకంగా గ్రౌండ్ ప్రోబింగ్ రాడార్ ఆంటీనాను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా వారి ఆచూకీ లభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని వివరాలు.. ● మధ్యాహ్నం 12.16 గంటలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎస్ఎల్బీసీ జేపీ కార్యాలయం వద్ద ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ● 12.30 గంటలకు కార్యాలయానికి వచ్చారు. అంతకు ముందే కార్యాలయం ముందున్న మీడియా ప్రతినిధులను అక్కడి నుంచి గేటు బయటకు పోలీసులు పంపించారు. ● 2.16 గంటలకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్‌రావుతో పాటు పలువురు ఎస్ఎల్బీసీ సొరంగ ప్రాంతానికి వెళ్లారు. కొందరికే అనుమతి ఇవ్వడంతో రెండు కార్లలో ఉన్నవారు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. 5 నిమిషాల తర్వాత సొరంగానికి పంపించారు. అక్కడి నుంచి వచ్చి ప్రెస్మీట్లో మాట్లాడారు. ముమ్మరంగా డీవాటరింగ్ టన్నెల్లో ప్రతి నిమిషానికి 5 వేల లీటర్ల నీళ్లు ఊరుతోంది. కూలిన రెండోరోజు నుంచే డీవాటరింగ్ చేస్తున్నా అదుపులోకి రాలేదు. రెండు రోజుల క్రితం నుంచి 100 హెచ్‌పీ మోటార్లతో ముమ్మరంగా డీవాటరింగ్ చేయడంతో పూడిక ఉన్న ప్రాంతం వరకు వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే సొరంగంలో చిక్కుకున్న వారి క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రభుత్వం వారిని ఎలాగైనా రక్షించి బయటికి తేవాలనే కృతనిశ్చయంతో సహాయక చర్యలు చేపడుతోంది. లోకో ట్రైన్ మూడు కోచ్‌ల ద్వారా మట్టి వెలుపలికి.. 20 మంది చొప్పున మూడు షిఫ్ట్‌లో పనిచేస్తున్న రెస్క్యూ బృందాలు ఈ ప్రక్రియ పూర్తయితేనే కార్మికుల జాడ ఆరు రోజులైనా మరమ్మతుకు నోచుకోని కన్వేయర్ బెల్ట్ -
పట్టుబడ్డారిలా..
ఇదిలాఉండగా, జిల్లాలో నకిలీ సర్టిఫికెట్తో ఏఈఓ ఉద్యోగం పొందిన కాట్రావత్ నరేష్‌తోపాటు మరో వ్యక్తిని ఈ నెల 22న అరెస్టు చేశామన్నారు. అనంతరం ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. పట్టుబడిన ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు గద్వాల పోలీసు బృందం రెండు రోజుల క్రితం మిర్యాలగూడకు చేరుకున్నారని తెలిపారు. ఈక్రమంలోనే 25వ తేదీన మిర్యాలగూడ పట్టణ శివారులో గుర్తు తెలియని వ్యక్తులకు నకిలీ సర్టిఫికెట్లు అందిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు రెక్కీ నిర్వహించి బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడి నుంచి మూడు నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నుటు్ల్ వెల్లడించారు. ఈ కేసులో బాలకృష్ణ ఏ3గా ఉన్నాడని తెలిపారు. ఇతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వివరాలు వెల్లడించారని, త్వరలో అతడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. 12 మందికి నకిలీ సర్టిఫికెట్లు అందించాడని అతను నేరం అంగీకరించాడన్నారు. ఇప్పటివరకు ఆరుగురి నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామని, త్వరలో మిగతా వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విషయంలో సీరియస్‌గా ఉందని, పట్టుబడిన నిందితుడిని గద్వాల కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసు విచారణలో సీఐ శ్రీను, ఎస్ఐ కళ్యాణ్‌కుమార్, సిబ్బంది చంద్రయ్య, ఇస్మాయేల్ కీలకంగా వ్యవహరించారన్నారు. -
రాష్ట్రస్థాయి యూత్ బాస్కెట్‌బాల్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో బుధవారం రాష్ట్రస్థాయి యూత్ బాస్కెట్‌బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. మొత్తం 80 మంది బాలికలు, 110 మంది బాలుర హాజరు కాగా.. జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్యాట్రన్, న్యాయవాది మనోహర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ ఎంపికలను ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి.. జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మక్సూద్ బిన్ అహ్మద్ జాకీర్ మాట్లాడుతూ.. పుదుచ్చేరిలో ఏప్రిల్ 9నుంచి 16వ తేదీ వరకు 40వ యూత్ నేషనల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ ఉంటుందని తెలిపారు. తెలంగాణ బాలబాలికల జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నసరుల్లా హైదర్, చైర్మన్ మీర్ అర్షద్అలీ, ఉపాధ్యక్షులు సయ్యద్ షరీఫ్ అలీ, సుబాన్‌జీ, కార్యనిర్వాహక కార్యదర్శి మీర్ ఖాలిద్అలీ, కోశాధికారి ఎండీ ఇలియాజ్, పీడీ ముకర్రం పాల్గొన్నారు. -
ధనార్జనే ధ్యేయంగా దందా
పదేళ్లుగా గుట్టుగా దందా ప్రధాన సూత్రధారి చెరువుపల్లి బాలకృష్ణ మిర్యాలగూడ పట్టణంలో ఓ జూనియర్ కళాశాలకు ప్రిన్సిపల్‌గా వ్యవహరించారని, కొన్నాళ్లకు కళాశాలను నడిపించే ఆర్థిక స్థోమత లేక మూసి వేశాడన్నారు. అప్పటి నుంచి ఎలాగైన డబ్బులు సంపదించాలనే లక్ష్యంతో పలు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో ముఠాగా ఏర్పడి నకిలీ సర్టిఫికెట్ల దందాకు తెరలేపాడన్నారు. దాదాపు పదేళ్లుగా నకిలీ సర్టిఫికెట్ల మాఫియా దందాను గుట్టుగా సాగిస్తున్నాడని వివరించారు. నకిలీ సర్టిఫికెట్ల కేసులో విస్తుపోయే నిజాలు ● ఒక్కో సర్టిఫికెట్ రూ.లక్షకుపైనే విక్రయం ● తాజాగా ప్రధాన సూత్రధారి బాలకృష్ణ అరెస్టు ● మిర్యాలగూడలో చిక్కిన నిందితుడు ● కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ మొగిలయ్య గద్వాల క్రైం: సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వారు నకిలీ సర్టిఫికెట్ల దందాకు తెరలేపారు. అందులోను ప్రధాన సూత్రధారి గతంలో పదేళ్లు కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో.. లేని కళాశాలను ఉన్నట్లుగా సృష్టించారు. నిరుద్యోగుల అవసరాన్ని అవకాశంగా మార్చుకొని ఒక్కో నకిలీ సర్టిఫికెట్‌ను రూ.లక్షకుపైనే విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మరికొన్ని రాష్ట్రాల వారికి సర్టిఫికెట్లు విక్రయించినట్లు సమాచారం. నకిలీ డిప్లొమా సర్టిఫికెట్తో ఏఈఓగా ప్రభుత్వ ఉద్యోగం పొంది.. దాదాపు ఐదేళ్లు వ్యవసాయ శాఖలో పనిచేసిన వ్యక్తి వ్యవహారం ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తాజాగా ఈ నకిలీ సర్టిఫికెట్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చెరువుపల్లి బాలకృష్ణను మంగళవారం రాత్రి గద్వాల పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. -
ఓం నమః శివాయ
వివరాలు 8లో u● జిల్లాలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు ● రుద్ర నామస్మరణతో మార్మోగిన ఆలయాలు గద్వాలటౌన్: ఓం నమః శివాయ.. హరహర మహాదేవ శంభో శంకర.. నామస్మరణతో పల్లె, పట్టణం మార్మోగింది. బుధవారం మహా శివరాత్రి వేళ భోళా శంకరుడిని భక్తులు భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. అభిషేకాలు, దీపారాధన, నైవేధ్యాలు సమర్పించి శివయ్యను కొలిచారు. ఉదయాన్నే పుణ్య స్నానాలు ఆచరించి శివాలయాలకు తరలివెళ్లారు. భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అందులోను బుధవారం మహా శివరాత్రి పర్వదినం రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శైవక్షేత్రాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివుడి దర్శనాలు సాగాయి. రాత్రి శివ కల్యాణాలు కనులపండువగా జరిగాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. జిల్లా కేంద్రంలోని స్థానిక నల్లకుంట కాలనీ, తెలుగుపేట కాలనీలలోని శివశంకర ఆలయాలు, కన్యాకాపరమేశ్వరి, వీరభద్రస్వామి, మార్కెండేయస్వామి, నందీశ్వర, భీమలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. మహా శివరాత్రి సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెల్లవారుజామున నది అగ్రహారానికి వెళ్లి అక్కడ కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అక్కడి స్పటిక శివలింగానికి అలాగే, తెలుగుపేటలోని శివాలయం, నందీశ్వర, భీమలింగేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, హోమాలు చేపట్టారు. గ్రామాలలో ఉన్న ఆలయాల దగ్గర భక్తుల సందడి కనిపించింది. ఆలయ నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి జాగరణ చేశారు. బీచుపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని ఆలయాలు మహాశివరాత్రిని పురస్కరించుకొని బుధవారం భక్తులతో కిక్కిరిశాయి. శివాలయం, అభయాంజనేయస్వామి ఆలయాల్లో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకం వంటి తదితర పూజలు నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాలతో పాటు గద్వాల, పెబ్బేర్, వనపర్తి, కొత్తకోట, మహబూబ్‌నగర్ ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే బీచుపల్లి చేరుకొని కృష్ణానదిలో స్నానాలు ఆచరించారు. అనంతరం శివాలయం, కోదండరామస్వామి, సరస్వతీదేవి అభయాంజనేయస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
ఐదు రోజులైనా దొరకని కార్మికుల జాడ
హెలీప్యాడ్లు లేక.. సొరంగం ఘటన జరిగిన రోజు నుంచి రెండు, మూడు హెలిక్యాప్టర్లు వచ్చి పోతున్నాయి. జేపీ కంపెనీ కార్యాలయం వద్ద ఒకటి నిలిచేందుకు హెలీప్యాడ్ ఉంది. ఒకటి వస్తే మరొకటి గాలిలో చక్కర్లు కొడుతుంది. కొన్ని సందర్భాల్లో సున్నిపెంట, శ్రీశైలం వెళ్లి ల్యాండ్ అవుతున్నాయి. బుధవారం మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి హెలిక్యాప్టర్‌లో రాగా.. జేపీ కంపెనీ అధినేత జయప్రకాశ్గౌర్ మరో హెలిక్యాప్టర్‌లో వచ్చారు. ఒక హెలీపా్య్డ్ మాత్రమే ఉండటంతో దిగడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మరొకటి గాలిలోకి ఎగరాల్సి వచ్చింది. దీంతో హుటాహుటిన మరో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ● ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కోసం భగీరథ యత్నం ● నీటిని, బురద తొలగించడం పెద్ద సవాలే.. ● రెండు రోజుల్లో తీసుకు వస్తామన్న మంత్రులు అచ్చంపేట/అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది కార్మికులను బయటికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రమాదం జరిగి ఐదు రోజులైనా ఇంత వరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం న్యూఢిల్లీలోని బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్, టన్నెల్ వర్క్స్‌లో నిష్టాతులైన వారిని ప్రత్యేకంగా పిలిపించారు. సొరంగంలోకి వెళ్లి వచ్చిన రెస్క్యూ బృందాలు మాత్రం శిథిలాలను తొలగించడం.. అందులో చిక్కుకున్న కార్మికులను కాపాడటం కష్టంగా ఉందని చెబుతున్నారు. సొరంగంలో భారీగా మట్టి, రాళ్లు కూలి పడటంతో.. వాటిని కదిలిస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శిథిలాలు, మట్టిని తొలగించేందుకు రోజులు పట్టవచ్చని చెబుతున్నారు. కాగా, ఉత్తరఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 41 మందిని రక్షించినప్పటికీ అక్కడికి ఇక్కడికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండటంతో ప్రయత్నాలు చేయడం కూడా కష్టంగా మారిందని రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. దేశంలో ఇప్పటివరకు జరిగిన టన్నెల్ ప్రమాదాల్లో ఇదే అత్యంత కఠినమైనదని చెబుతున్నారు. అయితే 12 కి.మీ. వద్ద మరో మార్గం ద్వారా లోపలికి వెళ్లా లని సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. సొరంగంపై నుంచి లేదా పక్క నుంచి రంధ్రం చేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రయత్నాలు చేస్తున్నారు. అంతుచిక్కడం లేదు.. సొరంగంలో చేరిన నీటిని, బురదను తొలగించి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడటం పెద్ద సవాల్‌గా మారింది. ఈ ప్రమాదాన్ని అంచనా వేయడం నిపుణులు, ఇంజినీర్లు, రెస్క్యూ బృందాలను సైతం కలవరపెడుతోంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన వారికి ఈ ప్రమాదం అంతుచిక్కుడం లేదు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలనే దానిపై ఇప్పటి వరకు ఓ నిర్ణయానికి రాలేదు. లోపల ఉన్న బురద, రాళ్లు, నీటిని బయటికి తీసుకురావడం కష్టమన్న భావన వ్యక్తమవుతోంది. తెగిపోయిన కన్వేయర్ బెల్టును కూడా ఇప్పటి వరకు పునరుద్ధరించ లేదు. వాస్తవానికి టన్నెల్ బోరింగ్ మెషీన్ నడిస్తేనే ఈ బెల్టు పని చేస్తుంది. కార్మికుల కుటుంబసభ్యుల్లో ఆందోళన.. సొరంగంలో చిక్కుకున్న వారు ఎక్కుడున్నారో.. ఎలా ఉన్నారో అనే ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని కార్మికుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. టన్నెల్ వద్దకు తమను పంపడం లేదని.. షెడ్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని వాపోతున్నారు. ఎలాంటి సమాచారం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని.. రోజుకు రెండు, మూడు హెలిక్యాప్టర్లు రావడం చూసి ఏమైందోనన్న ఆందోళన చెందుతున్నామని గోడు వెలిబుచ్చారు.ఆకాశంలో చక్కర్లు కొడుతున్న హెలిక్యాప్టర్ మంత్రుల పర్యవేక్షణ.. దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద చేపట్టిన సహాయక చర్యలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌మార్‌రెడ్డి, రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఉన్నతాధికారులు, జేపీ కంపెనీ, వివిధ రెస్క్యూ బృందాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను రెస్క్యూ బృందాలు మంత్రుల దృష్టికి తీసుకువచ్చాయి. గాలి, వెలుతురు లేని సొరంగంలో ఆక్సిజన్ అందకపోవడంతో సహాయక బృందాలు ఎక్కువ సేపు ఉండలేకపోతున్నాయని.. ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చితే లోపల ఎక్కువ సమయం ఉండేందుకు అవకాశం ఉంటుందని.. ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వ్యూహాలు రచించవచ్చని తెలిపారు. మల్లెల తీర్థం జలపాతమే కారణమా? సొరంగం ఘటన జరిగిన ప్రదేశం మల్లెలతీర్థం జలపాతం లోయ ప్రాంతం అయి ఉండవచ్చని వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచితలబైలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ నుంచి 13.93 కి.మీ. వద్ద జరిగిన ప్రమాదాన్ని నేరుగా పరిశీలిస్తే.. ఆ ప్రాంత వరకు వెళ్తోంది. ఇక్కడ 500 అడుగుల ఎత్తు నుంచి నిరంతరం హోరెత్తుతూ దూకే జలధార మూడు సరస్సులను నింపుతూ.. నల్లమల అడవి గుండా కృష్ణానదిలో కలుస్తుంది. మల్లెల తీర్థంలో ఏడు గుండాలు ఉన్నాయి. ఈ గుండాల వద్దనే నీటి నిల్వ ఉంటుంది. ఇందులో ఏదో ఒకటి సొరంగం వద్ద లికేజీ అయి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొరంగంలో కిలోమీటరు వరకు సీపేజీ ఉండే అవకాశం ఉందని.. ముందే తెలిసినా జేపీ కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదు రోజులైనా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటి వరకు నెమ్మదిగా సాగిన సహాయక చర్యలను వేగవంతం చేసి.. రెండు రోజుల్లో ఎనిమిది మంది కార్మికులను బయటికి తెస్తామని మంత్రులు ప్రకటించారు. -
శివజ్యోతి దర్శనం..
● జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర క్షేత్రానికి తరలివచ్చిన భక్తజనం ● ప్రత్యేక పూజల అనంతరం దీక్ష విరమించిన మాలధారులు అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరుడి క్షేత్రంలో బుధవారం అర్ధరాత్రి భక్తులకు శివజ్యోతి దర్శనం కలిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలతోపాటు అర్ధరాత్రి శివజ్యోతి కార్యక్రమం నిర్వహించారు. మాలధారులు పంచాక్షరి నామస్మరణతో శివజ్యోతిని నింగిలోకి వదిలగా హరహర మహాదేవ.. శంభో శంకర.. ఓం నమః శివాయ నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, మాలధారులు లింగోద్భవ సమయంలో నింగికెగిరిన శివజ్యోతిని వీక్షించారు. అంతకుముందు భక్తులు శివజ్యోతిని తలపై ఉంచుకొని నగర సంకీర్తనలు చేస్తూ.. బాణసంచా పేలుస్తూ భారీ ఊరేగింపుగా పట్టణంలో నుంచి ప్రధాన ఆలయమైన బాలబ్రహ్మేశ్వర ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయంపై సిద్ధం చేసిన జ్యోతిని నింగిలోకి వదిలారు. జ్యోతి దర్శనం అనంతరం మాలధారులు లింగోద్భవ కాలంలో దీక్ష విరమణ చేశారు. -
మహా శివరాత్రికి ఆలయాలు ముస్తాబు
● ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు గద్వాలటౌన్: జిల్లాలో అన్ని శైవక్షేత్రాలు బుధవారం రోజు హర హర శంభో శంకర.. ఓం నమః శివాయస్మరణలతో మారుమోగనున్నాయి. ఇప్పటికే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఉపవాసాలకు సిద్ధమయ్యారు. దీంతోపాటు రాత్రంతా జాగరణ చేస్తారు. శివరాత్రి పండగ రోజున ఆలయాలకు వెళ్లి శివలింగాలకు అభిషేకం, తదితర పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శివాలయాలతో పాటు గ్రామాలలో ఉన్న శైవక్షేత్రాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తెలుగుపేట కాలనీలలోని శివాలయాలతో పాటు వీరభద్రస్వామి, కన్యకాపరమేశ్వరి, నందీశ్వర, భీమలింగేశ్వర ఆలయాలలో తెల్లవారుజాము నుంచే శివునికి రుద్రాభిషేకం, బిల్వపత్ర పూజ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నదిఆగ్రహారంలోని స్పటిక లింగం పూజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. నల్లకుంట కాలనీలోని శివాలయంలో రాత్రి పది గంటలకు లింగోద్భవ అభిషేకం నిర్వహించనున్నారు. నేడు పార్వతీ, పరమేశ్వరుల కల్యాణం.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లకుంట శివాలయం, పాండురంగ శివాలయంతో పాటు పలు శివాలయాలల్లో 26వ తేదీ పార్వతీ, పరమేశ్వరుల కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పలుచోట్ల విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. -
ఎల్ఆర్ఎస్ రాయితీని సద్వినియోగం చేసుకోండి
గద్వాలటౌన్ : అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులైజేషన్ (ఎల్ఆర్ఎస్) పథకాన్ని ప్రకటించిందని, తాజాగా దీనిపై ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మున్సిపల్ కమిషనర్ దశరథ్ తెలిపారు. ఎల్ఆర్ఎస్పై 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ పరిఽధిలో 2020 ఆగస్టు 26వ తేదీ వరకు రిజిస్టర్ అయిన అనధికార ప్లాట్లు, లేఅవుట్లను మాత్రమే క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఇప్పటికే ఫీజు వివరాలను ఫోన్‌ద్వారా మెసెజ్ పంపడం జరిగిందన్నారు. ఫోన్‌కు మెస్సెజ్ రాని వారు ఫీజు వివరాలను మున్సిపాలిటీకి వచ్చి తెలుసుకోవాలని సూచించారు. మార్జి 31వ తేదీలోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్రమబద్ధీకరించుకోవాలని, వారికే ఫీజులో 25 శాతం రాయితీ లభిస్తుందని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు అయిజ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలించారు. రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలపై వచ్చిన వినతిపత్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఏఈఓలతో సమావేశం నిర్వహించారు. అనంతరం సింగిల్‌విండో గోదాంను సందర్శించారు. స్టాక్ రిజిస్టర్‌ను, గోదాంలోని నిల్వలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఫర్టిలైజర్స్‌ను నిల్వ చేసుకోవాలని పీఏసీఎస్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జనార్ధన్, ఏఈఓలు పాల్గొన్నారు. ‘చెరుకు’ బకాయిలు చెల్లించండి అమరచింత: చెరుకు రైతులకు వెంటనే బకాయి డబ్బులు చెల్లించాలని చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ గోపి కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ డీజీఎం మురళికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. 2010–11 సంవత్సరం నుంచి రైతులు చెరుగు సాగు చేయడం ప్రారంభించారని తెలిపారు. మొదట్లో డ్రిప్, విత్తనాలు రాయితీపై అందించడమేగాక పెట్టుబడి సాయం ఇచ్చారని.. ఇప్పుడు అన్నీ ఎత్తివేసి మద్దతు ధర కూడా ఇవ్వకుండానే పంట కోతలు చేపడుతున్నారని వివరించారు. పంట కోతలు జరిగి 40 రోజులవుతున్నా నేటికీ డబ్బులు చెల్లించడం లేదని వివరించారు. 15 రోజుల్లో డబ్బులు చెల్లించకుంటే 16 శాతం వడ్డీతో చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బార్, నాయకులు అరుణ్, వెంకట్రాములు, వెంకటేశ్వర్లు, శివలక్ష్మి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సన్నగిల్లుతున్న ఆశలు
నాలుగు రోజులైనా దొరకని ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందికార్మికులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ నెల 22న ఘటన జరగగా ఇప్పటి వరకు వారి ఆచూకీ లభ్యం కాలేదు. దాదాపు 11 రెస్క్యూ బృందాలు నాలుగు రోజులుగా రేయింబవళ్లు శ్రమిస్తున్నా కనీసం ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నారు. మంగళవారం నాలుగో రోజు కూడా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో బాధిత కుటుంబాల్లో నిరాశ, నిస్పృహ అలుముకోగా.. ఆశలు సన్నగిల్లుతున్నాయి. సహాయక చర్యలకు ఆటంకం.. సొరంగంలో సెగ్మెంట్ బిగిస్తుండగా ఏర్పడిన రంద్రం వల్ల నీటి ప్రవాహం రోజురోజుకూ పెరుగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకపోయింది. బురద, నీటి ప్రవాహంతో సహాయక బృందాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ తదితర 11 బృందాలకు చెందిన 750 మంది నిపుణులు కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తుండగా.. బుధవారం మరిన్ని బృందాలు రంగంలోకి రానున్నాయి. చెల్లాచెదురైన మిషన్ వద్దకు చేరుకునేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ కూడా ప్రయత్నిస్తున్నారు. నిమిషానికి 3,600 నుంచి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తుండటంతో రెండు 100 హెచ్‌పీ మోటార్లతో నీటిని బయటికి తోడేస్తున్నా ఊట అదుపులోకి రాలేకపోతోంది. రేపటి వరకు నీటి ప్రవాహం తగ్గుతుందనే ఆశాభావం మంత్రుల బృందం వ్యక్తం చేస్తోంది. సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ఎల్అండ్టీ సంస్థ రెండు క్రేన్లను కూడా తెప్పించింది. వాటిని లోపలికి తీసుకెళ్లి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉంచారు. మరోవైపు పైకప్పు కూలిన ఘటనతో కార్మికుల్లో నెలకొన్న భయం ఇంకా తొలగిపోలేదు. మంగళవారం పనులు చేయడానికి ముందుకు రాకపోవడంతో పలు దఫాలుగా వారితో చర్చలు జరిపి లోపలికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఉదయం 8 గంటల షిఫ్టులో వెళ్లాల్సిన బృందం మధ్యాహ్నం ఒంటిగంటకు లోపలికి వెళ్లింది. పొట్ట కూటి కోసం వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో చిక్కుకున్నారు. వారి ప్రాణాలు ఇప్పుడు దేవుడిపైనే భారంగా మారింది. జార్జండ్, ఉత్తరప్రదేశ్, జమ్ముకాశ్మీర్, మద్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు జేపీ కంపెనీలో పనిచేస్తున్నారు. చాలీచాలనీ వేతనాలు, కూలీలకు ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. తమకు సొంత ప్రాంతంలో పని లేకనే ఇంత దూరం వచ్చి పనిచేస్తున్నామని, తమ వారి ప్రాణాలకు భద్రత లేదని వాపోతున్నారు. కూలీ డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, ఇక్కడ పనిచేస్తున్నారనే పేరు తప్పా తామే తిండికి డబ్బులు పంపిస్తున్నామని ఆరోపించారు. ఈ క్రమంలోనే మంగళవారం జార్జండ్ రాష్ట్రం గుమ్లా జిల్లాకు చెందిన నాలుగు కుటుంబాల సభ్యులు ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేసి తమ కుటుంబ సభ్యులను క్షేమంగా తీసుకువచ్చి అప్పగించాలని అధికారులను కోరుతున్నారు. పొట్ట కూటి కోసం వచ్చి.. ఘటనా స్థలానికి కొద్దిదూరంలోనే ఆగిపోతున్న రెస్క్యూ బృందాలు భారీగా వస్తున్న నీటి ఊటతో తీవ్ర ఆటంకం టన్నెల్ లోపలికి వెళ్లిన ర్యాట్ హోల్ మైనర్స్ దేవుడిపైనే భారమంటున్న కుటుంబ సభ్యులు నీరు, మట్టి తొలగిస్తేనే.. టన్నెల్లో కాంక్రీట్ సెగ్మెంట్లతోపాటు నిర్మాణ సామగ్రి, సెగ్మెంట్ మిషన్, ఇతర సామగ్రి, కన్వేయర్ బెల్ట్, లోకో ట్రైన్ ట్రాక్ వంటివి నీటిలో మునిగి, మట్టిలో కూరుకుపోయాయి. ఈ క్రమంలోనే సెగ్మెంట్ల కింద కానీ, బురదలో కాని బాధితులు చిక్కుకుని ఉంటారని, తొలగింపు ఎంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. శిథిలాలను తొలగించేందుకు వచ్చిన బృందాలు తాళ్లు, పలుగు, పారలతో లోపలికి వెళ్లారు. నీరు, మట్టిని తొలిగిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. శిథిలాలు తొలగిస్తుంటే ఎక్కడి నుంచి ఏ సమస్య వస్తుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. నిత్యం సమీక్షలు సొరంగ ప్రమాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ నాలుగు రోజులుగా సమీక్షలు నిర్వహిస్తూ.. వివిధ దేశాలకు చెందిన నిపుణులను రప్పించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధుల రాకతో వారి భద్రతా ఏర్పాట్లు, అధికారుల హడావుడితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందన్న వాదన వినిపిస్తోంది. -
రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విచారణ చేయాలి
గద్వాల క్రైం: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ఆయా కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని.. సదరు ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కుట్రపూరితంగా హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారనే కోణంలో సమగ్రంగా విచారణ చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చూడాలని, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ, పైవ్రేటు భూములు కబ్జాకు పాల్పడినట్లు వచ్చే ఫిర్యాదులపై శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదాలు, అనుమానాస్పద కేసులపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పని చేయాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి తరలించినా.. అక్రమంగా రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్ధాలు, గంజాయి, పేకాట వంటిని రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పట్టిష్టమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో సిబ్బంది ఎవరైన ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన అనర్హత వేటు తప్పదన్నారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఆయా స్టేషన్లో నమోదైన కేసులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్ఐలు, కళ్యాణ్‌కుమార్, శ్రీకాంత్, వేంకటేష్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
పారదర్శకంగా ఉపాధి హామీ పనులు
ఎర్రవల్లి: ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను నిర్దేశించిన లక్ష్యాల మేరకు పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇటిక్యాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ నర్సింగరావుతో కలిసి కలెక్టర్ సందర్శించి ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వాటిని సమర్ధవంతంగా ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడాలని అన్నారు. గ్రామ పంచాయతీలలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం క్రింద మంజూరైన పనులకు సంబంధించి ఎస్టిమేషన్ విధానం, పనుల అమలు, చెల్లింపు వివరాలను సమీక్షించి అన్ని వివరాలు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. మండలంలో ఇప్పటి వరకు హరితహారం కింద నాటిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల వివరాలు, వాటి నిర్వహణకు జరిగిన ఖర్చులను సమీక్షించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద అవసరమైన మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ నిధుల్లో 60శాతం వ్యవసాయ అనుబంధ పనులకు కేటాయించాలన్నారు. మెజర్మెంట్ బుక్, మస్టర్‌రోల్‌ను పరిశీలించి, అన్ని రిజిస్టర్లు స్నష్టంగా నిబంధనలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ కింద చేపట్టిన అన్ని పనులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పనుల పురోగతికి సంబందించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు ఎంపీడీఓ కార్యాలయంలో పర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపుదల కోసం రూ.30 వేలతో నిర్మిస్తున్న ఇంకుడు గుంత పనులను పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్, ఎపీఓ శివజ్యోతి, టీఏలు కృష్ణయ్య, లావణ్య, హుస్సేన్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు వినియోగించుకోవాలి కలెక్టర్ బీఎం సంతోష్ -
తోడేస్తున్నారు..!
తుంగభద్ర నదిపై ఏపీకి చెందిన ఇసుకాసురుల పంజా మరబోట్లతో తవ్వకాలు తుమ్మిళ్ల దగ్గర ప్రతి రోజూ మరబోట్ల ద్వారా వచ్చి లారీల కొద్ది ఇసుకను తవ్వేస్తున్నారు. దీనిపై ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా చర్యలు లేవు. ఉచితం పేరుతో ఏపీ వారు వారి దగ్గర, జిల్లా సరిహద్దులో ఉన్న ఇసుక మొత్తం ఖాళీ చేస్తుంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది, ప్రజల అవసరాలు ఎలా తీరతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ అఽధికారులతో మాట్లాడి హద్దు నిర్ణయించడం మానేసి,వారి వాహనాలను ఇవతలి హద్దులోకి వచ్చినా వదిలేస్తే దాని వల్ల ప్రభుత్వాదాయానికి గండి మాత్రమే ఉంటుందని అంటున్నారు. ఇకనైనా జిల్లా అవసరాలు, ప్రభుత్వ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఈ ఇసుక దోపిడీపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాజోళి: తుంగభద్ర నదిని అడ్డాగా చేసుకొని ఏపీకి చెందిన ఇసుకాసురులు ఇసుకను లారీలకు లారీలు తోడేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి మరీ.. మరబోట్ల సాయంతో ఇసుక తోడివేత నిర్వహిస్తున్నారు. సరిహద్దు చొచ్చుకొని ఇవతలికి వచ్చి.. రాత్రింబవళ్లు ఇసుక తవ్వుతున్నా.. అడిగే జిల్లా అధికారులే లేకుండా పోయారు. ఇదే అలుసుగా ఏపీకి చెందిన ఇసుక వ్యాపారులు తుంగభద్ర నది ప్రవాహం ఉన్న సరిహద్దు గ్రామాలు అన్నింట్లో ఇసుక తవ్వేస్తున్నారు. ఇలా తవ్వుతూపోతే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో నాయకులు, అధికారులు తెలుసుకుని వాటికి అడ్డుకట్ట వేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. రెండు ప్రాంతాల నడుమ.. తుంగభద్ర నది రెండు ప్రాంతాల నడుమ ప్రవహిస్తుంది. అటు ఏపీలోని కర్నూల్ జిల్లా, ఇటు గద్వాల జిల్లాల నడుమ ప్రవహిస్తుండగా.. ఇరు ఆ ప్రాంతాల వారు ఇవే నీటితో పంటలు పండిస్తున్నారు. కానీ ఇసుక విషయంలో మాత్రం విభేదాలు తలెత్తుతున్నాయి. గతంలో ఇలాంటి సమస్య లేకపోయినా, ప్రస్తుతం తుంగభద్ర నదిలో ఇసుక తీసే విషయంలో తరుచూ సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇదిలాఉండగా, జిల్లాలో ఉన్న నదుల్లో తుంగభద్ర ఒకటి. కాగా ఇసుక తీసుకునేందుకు జిల్లా అవసరాలకు, ప్రభుత్వ ఆదాయానికి కూడా ఇది వనరు. కాగా.. మన ఇసుక వాహనాల ద్వారా జిల్లాలోని ఇసుక అవసరాలకు అనుమతి ఉంది. అయితే దీని ద్వారా ఆన్లైన్లో చలాన్లు చెల్లించి ఇసుక అవసరమున్న వారు బుక్ చేసుకుంటున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయమే. కానీ అనుమతి ఉన్న వాహనాలు నదిలోకి ఇసుక కోసం వెళ్తే ఏపీ అఽధికారులు మా సరిహద్దులోకి వచ్చారంటూ.. జరిమానాలు విధిస్తున్నారు. కానీ ఏపీకి చెందిన వాహనాలు ఇటువైపు వచ్చినా ఇక్కడి అధికారులు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరం. దీనిపై దృష్టి పెట్టాల్సింది పోయి, ఇసుక పక్కదారి పడితే కేసులు తప్పవని, ఉక్కు పాదం మోపాలని సాక్ష్యాత్తు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని జిల్లా వాసులు అంటున్నారు. ఏపీ అధికారులు కేసులు నమోదు చేస్తుంటే జిల్లా అధికారులు కేవలం సరిహద్దు పరిశీలనతో సరిపెట్టారని అంటున్నారు. కదలిక లేని హద్దుల గుర్తింపు జిల్లాలో ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి ఇసుకను అందించే వాహనాలను సైతం నదిలోకి ఏపీ అధికారులు రానివ్వడం లేదని ట్రాక్టర్ల యజమానులు చేసిన విజ్ఞప్తి మేరకు గద్వాల జిల్లా అధికారులు గత డిసెంబర్ నెలలో రాజోళి మండంలోని తూర్పు గార్లపాడు నుండి నది మధ్యలోకి వెళ్లి హద్దులను పరిశీలించారు. సర్వేయర్ మ్యాప్ ద్వారా జిల్లా హద్దు ఎక్కడి వరకు వస్తుందో సాధారణ అంచనా వేశారు. ఏపీ అధికారులతో మాట్లాడి ఉమ్మడి సర్వే చేస్తామని అన్నారు. కానీ నేటి వరకు దానిపై ఎలాంటి కదలిక రాలేదు. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ నుండి అలంపూర్ దాకా తుంగభద్ర నది ప్రవహిస్తుంది. నది ఇటు వైపు జిల్లాలోని గ్రామాలు కాగా..నది అవతలి వైపు కర్నూల్ జిల్లాలోని గ్రామాలు. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న ఉచిత ఇసుక పథకం పేరుతో ఇసుక అక్రమంగా పక్కదారి పడుతందని ఆరోపణలు ఉన్నాయి. కేటాయించిన ఇసుక రీచ్‌లను కాదని నదిలో ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని, ఆ క్రమంలోనే నది ఇటువైపునకు కూడా వస్తున్నారని జిల్లా వాసుల ఆందోళన. రాష్ట్ర సరిహద్దులోకి వచ్చి మరబోట్లతో తోడివేత ఉచితం పేరుతో వందల లారీలు తరలిస్తున్న వైనం అనుమతులున్నా.. జిల్లా వాసులకు దక్కని ఇసుక చర్యలు తీసుకుంటాం ఏపీలోని వాహనాలు జిల్లా సరిహద్దుల వరకు వచ్చి అక్రమంగా ఇసుకను తీస్తున్నారని తెలిసింది. మైనింగ్ అధికారులతో మాట్లాడి ఆ వాహనాలపై ప్రత్యేక నిఘా పెడతాం. హద్దు సమస్య గురించి కూడా పైఅధికారులతో చర్చిస్తాం. అవతలి వాహనాలు ఇటు వైపు రాకుండా చూసేందుకు వెంటనే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్‌రావు, ఆర్డీఓ, గద్వాల -
2న వనపర్తికి ముఖ్యమంత్రి రాక
వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చి 2న వనపర్తి జిల్లాకు రానున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. మంగళవారం ఎంపీ మల్లు రవి, నేతలతో కలిసి హైదరాబాద్‌లో అభివృద్ధి పనుల నివేదికను సీఎంకు ఆయన అందజేశారు. సుమారు రూ.వెయ్యి కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మంగళవారం కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య సమావేశమై సీఎం పర్యటన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం కలెక్టరేట్ సమీపంలోని హెలీప్యాడ్‌ను ఎస్పీ పరిశీలించి బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్ తదితర వాటిపై డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణకు సూచనలు చేశారు. అభివృద్ధి పనులు ఇలా.. జిల్లా జనరల్ ఆస్పత్రిని 500 పడకలకు పెంచడం, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల భవనం, ఇంటర్మీడియట్ కళాశాల, షాపింగ్ కాంప్లెక్స్, ఇందిరమ్మ ఇళ్ల పథకం, పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం జిల్లాకు వచ్చే నాటికి పనుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లా పర్యటనలో తన చిన్ననాటి స్నేహితులతో కొంత సమయం గడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. -
మూడో రోజూ నిరాశే..
అచ్చంపేట: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ సోమవారం మూడోరోజూ చిక్కలేదు. సహాయక బృందాలు షిఫ్ట్‌ల వారీగా టీబీఎం మిషన్ సమీపంలో వంద మీటర్ల దూరం వరకు వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. నీటి ఉధృతికి కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయి అందులో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. సోమవారం నాటికి రాష్ట్ర విపత్తుతోపాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, జేపీ, నవయుగలకు చెందిన బృందాలు ఇప్పటి వరకు ఏడు సార్లు టన్నెల్లోకి వెళ్లి గాలింపు చేపట్టారు. ఇందులో దాదాపు 584 మంది నిపుణులైన సిబ్బంది ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన విపత్తులో ఈ బృందాలతో పాటు 14 మంది ర్యాట్ (ర్యాట్ హూల్ టీం) మైనర్స్, స్నిపర్ డాగ్స్ సైతం చేరుకున్నాయి. పెద్దఎత్తున బురద నీరు ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయాయి. టన్నెల్ లోపలికి పైనుంచి రంద్రం చేసి వెళ్లాలన్న (వర్టికల్ డ్రిల్లింగ్) ప్రతిపాదనలు తోసిపుచ్చారు. ఐదు గ్యాస్ కట్టింగ్ మిషన్లతో పనిచేస్తున్నారు. పై సెగ్మెంట్ బిగిస్తుండగా.. బోరింగ్ మిషన్(టీబీఎం) మీటరు దూరం సొరంగం తొలచిన తర్వాత మరో మిషన్ ద్వారా కాంక్రీట్ సెగ్మెంట్ బిగిస్తారు. 9 మీటర్ల వ్యాసంతో ఉండే ఈ సొరంగంలో మొత్తం 7 సెగ్మెంట్లు బోల్టుల ద్వారా బిగిస్తారు. చుట్టూ అటు ఇటు మూడు చొప్పున ఆరు సెగ్మెంట్లు బిగించి పై సెగ్మెంట్ బోల్టును బిగిస్తుండగా ఒక్కసారి వచ్చిన నీటి ఊటకు సెగ్మెంట్లు ఊడిపోయి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ శిథిలాల కింద కార్మికులు చిక్కుకొని ఉంటారని తోటి కార్మికులు భావిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో నీటి ఊట, రాళ్లు, బురద కూరుకుపోవడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి తలెత్తినట్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పేర్కొంటున్నాయి. సిగ్నల్స్ ఏర్పాటు ద్వారా.. సొరంగంలో విద్యుత్, సమాచార వ్యవస్థ వైర్లు, పరికరాలు దెబ్బతినడంతో సిగ్నల్స్ వ్యవస్థ రావడం లేదు. దట్టమైన అడవితో పాటు సొరంగం ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ అందుబాటులో లేవు. ఈ దశలో ప్రభుత్వం సోమవారం హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రమాదం జరిగిన చోటకు పంపించారు. దీని ద్వారా అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్లో లభించని ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు ఎస్ఎల్బీసీకి చేరుకున్నస్నిపర్ డాగ్స్, ర్యాట్ మైనర్స్ బృందాలు వంద మీటర్ల దూరంలోనే ఆగిపోతున్న వైనం పైనుంచి రంధ్రం చేసి వెళ్లాలన్న ప్రతిపాదన విరమణ మంత్రులు, అధికారుల పర్యవేక్షణ సొరంగం పనుల్లో చోటు చేసుకున్న సంఘటన జరిగిన నాటి నుంచి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రెండురోజుల పాటు ఇక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. సోమవారం రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, జయవీర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, బాలునాయక్ ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకున్నారు. అలాగే ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, హైడ్రా చీఫ్ సెక్రటరీ అర్వింద్, హైడ్రా కమిషనర్ రంగరాథ్, నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షణ, భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. -
మారిన రాజకీయం..
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు పావులు కదిపింది. అందులో భాగంగా రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తనకున్న పాత పరిచయాలతో గద్వాలలో బీఆర్ఎస్కు చెందిన ముఖ్యనాయకులను కాంగ్రెస్ పార్టీవైపు తిప్పుకున్నారు. మొదటగా గద్వాల మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన బీఎస్ కేశవ్, కొంతమంది కౌన్సిలర్లను చేర్చుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో పలు దఫాలుగా చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. దీంతో గద్వాల కాంగ్రెస్ పార్టీలో పాత కథే మొదలైంది. బండ్ల వర్సెస్ సరిత పోటీపడుతూ.. సందర్భం వచ్చినప్పుడల్లా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. అదే విధంగా ఆ పార్టీలో సీనియర్ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సైతం అటు అలంపూర్ నియోజవర్గంతో పాటు గద్వాలలో కూడా చురుకుగా పావులు కదపుతూ జిల్లాపై పట్టు సాధించేందుకు పోటీపడుతున్నాడు. -
వంద మీటర్ల దూరంలోనే..
లోకో ట్రైన్ ద్వారా 13.3 కి.మీ., వరకు చేరుకున్న టీం సభ్యులు బురదలోకి దిగే ప్రయత్నాలు చేస్తున్నా.. వంద మీటర్ల దూరంలో అంత చీకటిగా ఉండటంతో ఏమీ చేయలేక వెనుదిరిగి వస్తున్నారు. ఆదివారం వెళ్లిన బృందాలకు కన్వేయర్ బెల్టు కిందనే నీటి ఊట ఉండటంతో దానిపై నడుచుకుంటూ వెళ్లగా.. సోమవారం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజాగా కన్వెయర్ బెల్టు సైతం మునిగిపోయినట్లు సమాచారం. తెగిపోయిన కన్వేయర్ బెల్టును సరిచేసి ఇప్పుడు దాని ద్వారా సహాయక చర్యలు చేపట్టేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. అలాగే సోమవారం నుంచి నీటిని తోడేందుకు 100 హెచ్‌పీ మోటార్లు ఏర్పాటు చేసినా నీటి ప్రవాహం ఏమాత్రం తగ్గడం లేదని, ఒకవేళ బురద, రాళ్లను తొలగిస్తూ.. ముందుకెళ్తే మరింత ముందుకు వచ్చే అవకాశం ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ● ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఆర్మీ చీఫ్‌తో మాట్లాడి స్పెషల్ ఎక్విప్మెంట్ తెప్పించే ప్రయత్నాలు చేస్తోంది. మూడు రోజులుగా విడతల వారీగా వెళ్తున్న బృందాలు నీళ్లు, బురద ఉండటంతో లోపలికి వెళ్లలేకపోతున్నామనే విషయం తప్ప చిక్కుకుపోయిన వారు కనిపించారనే సమాచారం చెప్పడం లేదు. దీంతో వారు ఇంకా బతికే ఉన్నారా అన్న చర్చ మొదలైంది. మరోవైపు మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారుల హడావుడి తప్ప.. లోపల చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం లేదు. దీంతో సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే.. మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
అన్ని సేవలకు ‘ఆధార్’ కీలకం
గద్వాల: అన్ని రకాల సేవలకు ఆధార్ కార్డు కీలకంగా మారిందని.. ప్రతి ఒక్కరూ ఆధార్‌కు సంబంధించి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ చైతన్యరెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర పథకాలు అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలు, పౌరసేవలు పొందాలంటే ఆధార్ అప్డేట్ తప్పనిసరి అని అన్నారు. ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న సేవలను భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివరాలను పునరుద్ధరించుకోవాలని సూచించారు. పుట్టిన శిశువుతో మొదలుకుని ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా తల్లిదండ్రులు ఆధార్ నమోదు చేయాలన్నారు. 5–15 ఏళ్లలోపు బాలబాలికలకు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని సూచించారు. ఆధార్ కార్డులో చిన్న మార్పులకు నివాస ధ్రువపత్రం సరిపోతుందన్నారు. పుట్టిన తేదీ సవరణకు తప్పనిసరిగా జనన ధ్రువపత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు అపార్ నమోదు చేసుకునేందుకు ఆధార్ వివరాలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. పాఠశాల విద్యార్థులందరి ఆధార్ బయోమెట్రిక్‌ను అప్డేట్ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో భవిష్యత్‌లో జేఈఈ, నీట్ వంటి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తవని సూచించారు. ఆధార్ నమోదు అప్డేట్ కోసం మెగా క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ● బ్యాంకు లావాదేవీలపై మహిళలకు అవగాహన కల్పించేందుకు గాను జిల్లాలో సోమవారం నుంచి 28వ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టరేట్లో ఆవిష్కరించారు. మహిళలకు బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్, రుణాలు పొందడం తదితర 65 అంశాలపై వారం రోజులపాటు బ్యాంకర్లు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ శ్రీనివాసరావు, ప్రాజెక్టు మేనేజర్ నరేష్, ఈడీఎం శివ, డీఎంహెచ్ఓ డా.సిద్దప్ప, లీడ్‌బ్యాంకు మేనేజర్ అయ్యపురెడ్డి, డీడబ్ల్యూఓ సునంద తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ అప్డేట్ చేసుకోవాలి కలెక్టర్ బీఎం సంతోష్ ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి గద్వాల: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 22 మంది అర్జీలు సమర్పించగా.. ఆయా శాఖల అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కార మార్గం చూపాలన్నారు. లేనిపక్షంలో సంబంధిత ఫిర్యాదుదారుడికి తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
వృషభరాజాల బల ప్రదర్శన పోటీలు
అయిజ: మండల కేంద్రంలో తిక్క వీరేశ్వర్వస్వామి జాతర, రైతు సంబరాల్లో భాగంగా సోమవారం అంతర్రాష్ట్రస్థాయి సీనియర్ విభాగం వృషభరాజాల బల ప్రదర్శన (బండలాగుడు) పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 11 జతల వృషభరాజులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తలపడ్డాయి. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా పల్కందొడ్డికి చెందిన ఖాజా హుస్సేన్ ఎద్దులు మొదటి, ఏపీలోని అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన ఎస్బీఆర్ బుల్స్ ద్వితీయ, నంద్యాల జిల్లా మాన్దిన్నెకు చెందిన కుందూరు రాంభూంపాల్రెడ్డి ఎద్దులు తృతీయ, బాపట్ల జిల్లా ఎనమెట్లకు చెందిన కేవీఆర్ బుల్స్ నాల్గవ, నంద్యాల జిల్లా కొత్తూరుకు చెందిన భీరం బుల్స్ ఐదో బహుమతి సాధించాయి. జోగుళాంబ క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రముఖులు అలంపూర్: ఐదో శక్తిపీఠం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను సోమవారం గద్వాల సంస్థానాధీశుడు శ్రీకృష్ణ రాంభూపాల్, బుల్లితెర నటుడు, నిర్మాత శ్రీరామ్ (ఆర్యవర్ధన్) వేర్వేరుగా దర్శించుకున్నారు. ఈఓ పురేందర్ కుమార్ వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామికి ప్రత్యేక పూజల అనంతరం వారికి అర్చక స్వాములు తీర్ధప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. ఆలయ ఈఓ శేషవస్త్రాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. -
రాజకీయ వేఢీ
డీసీసీ పదవి కోసం.. తాజాగా డీసీసీ పదవి కోసం ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత నువ్వా.. నేనా అన్న తరహాలో పోటీపడుతున్నారు. ముఖ్యంగా సంపత్‌కుమార్, సరితలు ఓబీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నల్లారెడ్డి పేరును బలపరుస్తుండగా.. మరోవైపు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పటేల్ ప్రభాకర్‌రెడ్డి పేరును బలపరుస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆది నుంచి మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నారని.. ఈసారి అధ్యక్ష పదవిని తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో అనూహ్యంగా సీనియర్ న్యాయవాది కొండాపురం షఫివుల్లా అధ్యక్ష పీఠం రేసులో తాను కూడా ఉన్నానంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం పార్టీ ముఖ్యనాయకులైన సరిత మద్దతు సైతం కోరారు. అదే విధంగా తనకున్న పాత పరిచయాలతో పార్టీ పెద్దను కలిసి డీసీసీ పదవి ఇవ్వాలని కోరనున్నట్టు తెలిసింది. ● ఎమ్మెల్యే బండ్ల X సంపత్, సరిత ● ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు ● పదవి దక్కించుకునేందుకు పావులు ● మరోవైపు మైనార్టీలకు ఇవ్వాలంటూ పెరుగుతున్న డిమాండ్ గద్వాల: జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సెగ మొదలైంది. డీసీసీ పీఠాన్ని దక్కించుకునేందుకు ఓవైపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత తీవ్ర పోటీపడుతున్నారు. తమ అనుచరులకు ఎలాగైనా పదవిని కట్టబెట్టేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలో ఆదినుంచి మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు పలుకుతూ వస్తున్నారు. ఈసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని మైనార్టీలకు ఇవ్వాలని గట్టిగానే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆశావహులు కూడా తెరమీదకు వచ్చారు. ఎమ్మెల్యే వర్గం నుంచి పటేల్ ప్రభాకర్‌రెడ్డి, సంపత్‌కుమార్ వర్గం నుంచి నల్లారెడ్డి పేర్లు వినిపిస్తుండగా.. మైనార్టీల నుంచి సీనియర్ న్యాయవాది కొండాపురం షఫివుల్లా పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం వీరి పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదే విధంగా పలువురు మైనార్టీ నాయకులు ఇదివరకే తమకు అవకాశం కల్పించాలని కోరుతూ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌కు కంచుకోట నడిగడ్డ.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉండేవి. ఆదినుంచి కాంగ్రెస్ పార్టీకి నడిగడ్డ కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గడిచిన పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడింది. ప్రధానంగా 2018లో డీకే అరుణ కాంగ్రెస్ పార్టీని వీడటంతో పూర్తిగా దెబ్బతింది. బలమైన నాయకులు లేక ఆ పార్టీ వాయిస్ వినిపించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో జిల్లా అధ్యక్ష పదవిని పటేల్ ప్రభాకర్‌రెడ్డికి కట్టబెట్టిన అనంతరం మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సమన్వయంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌గా సరిత కొనసాగినప్పటికీ ఇరువర్గాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగింది. ఈ నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఆరునెలల ముందు గద్వాలలో బీసీ వాదం తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలివిగా పావులు కదిపి.. బీసీ వర్గానికి చెందిన సరితకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో సరిత కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. డీసీసీ పీఠం కోసం తీవ్ర పోటీ అధిష్టానానికి తప్పని తలనొప్పి పార్టీలో వర్గపోరు కారణంగా డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలో అర్థం కాక అధిష్టానం తలపట్టుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి ఇరువర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. పదవిని ఒకరికి ఇస్తే.. మరొకరు ఏవిధంగా స్పందిస్తారోనని.. ఆ పర్యవసానాలు ఏ స్థాయిలో ఉంటాయోనన్న మీమాంసలో ఉన్నట్టు సమాచారం. దీంతో అధిష్టానానికి డీసీసీ అధ్యక్ష పీఠం పీఠముడిగా మారిందిఆది నుంచి వర్గపోరు.. -
ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి
కేటీదొడ్డి: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక సూచించారు. సోమవారం మండలంలోని చింతలకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. బాలబాలికలు పట్టుదలతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించా లని సూచించారు. బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్యవివాహాలతో కలిగే నష్టాలను వివరించారు. ఎవరైనా బాలబాలికలపై వేధింపులకు పాల్పడితే డయల్ 100 లేదా 1098 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీఓ నర్సింహులు, ఐసీపీఎస్ సోషల్ వర్కర్ పద్మ, హెచ్ఎం భాస్కర్ పాల్గొన్నారు. పథకాల అమలులో నిర్లక్ష్యం తగదు అలంపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించడం తగదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంవీ రమణ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వరిధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో రూ. 500 బోనస్ ఎందుకు జమ చేయడం లేదని ప్రశ్నించారు. రైతులు పండించిన మిర్చి, పప్పుశనగ, మిర్చి, పొగాకు పంటలకు మద్ధతు ధర లేక పొలాల్లోనే ఉన్నాయన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినా పట్టడం లేదన్నారు. ఆర్థిక పరిస్థితి పేరుతో సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే ప్రారంభించి.. కూలీలకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, మాట్లాడుతూ.. అలంపూర్ చౌరస్తాలో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిని ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. 20వేల ఎకరాల్లో పప్పుశనగ పండించిన రైతులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన కందులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీల్లో పేదలకు ఇళ్ల స్థలాలు లేక అల్లాడుతుండగా.. అధికారుల అండదండలతో ప్రభుత్వ భూములు, 10 శాతం స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం నాయకులు నర్మద, జి.రాజు, పరంజ్యోతి, జీకే ఈదన్న, ఉప్పేర్ నర్సింహ్మ, రమేష్, మద్దిలేటి ఉన్నారు. ఆర్డీఎస్ రైతులకు సహకారం అందించండి అలంపూర్: ఆర్డీఎస్ ఆయకటు ్ట రైతులకు ఏపీ ప్రభుత్వపరంగా సహకారం అందించాలని కర్నూలు జిల్లా నీటిపారుదలశాఖ ఎస్ఈ ద్వారకనాథ్‌రెడ్డిని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కోరారు. కర్నూలులోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే ఎస్ఈని కలిసి పలు సమస్యలపై చర్చించారు. ప్రధానంగా కేసీ కెనాల్‌కు రెండు రోజులపాటు నీటిని నిలిపివేయాలని.. తద్వారా తుమ్మిళ్ల ద్వారా ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు కొంత మేరకు సాగునీటిని అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. టీబీ డ్యాం నుంచి ప్రస్తుతం 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండగా.. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి కాకుండా నేరుగా కేసీ కెనాల్‌కు నీరు చేరుకుంటున్నట్లు వివరించారు. దీంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరందడం లేదని తెలిపారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఎస్ఈ.. తక్షణమే 250 క్యూసెక్కుల నీటిని కేసీ కెనాల్‌కు తగ్గించినట్లు పేర్కొన్నారు. మంగళ, బుధవారాల్లోనూ కేసీ కెనాల్‌కు నీటిని నిలిపివేస్తామని చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. -
ఉత్సాహంగా వృషభాల బల ప్రదర్శన
అయిజ: మండల కేంద్రంలో తిక్క వీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా నిర్వహిస్తున్న రైతు సంబరాలు అంబరాన్నంటాయి. ఆదివారం నిర్వాహకులు అంతరాష్ట్ర స్థాయి సేద్యపు ఎద్దుల బల ప్రదర్శన పోటీలను నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఎద్దులను తీసుకువచ్చారు. పోటీలు కొనసాగుతున్న క్రమంలో ప్రజల ఈలలు, కేకలతో క్రీడా మైదానం హోరెత్తింది. కర్నూలు జిల్లా వేముల గ్రామం ఊరవాకిటి నడిపి గిడ్డయ్యనాయుడు, గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం శనిగపకి చెందిన చక్రవర్తిగౌడ్ ఎద్దులు (కంబైండ్) ప్రథమ స్థానంలో నిలిచి రూ.40వేలు కై వసం చేసుకున్నాయి. అలాగే, కర్నూలు జిల్లా వేములచెందిన చిన్న గిడ్డయ్య నాయుడు ఎద్దులు ద్వితీయ స్థానంలో నిలిచి రూ. 35వేలు, నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్కి చెందిన శ్రవణ్‌కుమార్ ఎద్దులు తృతీయస్థానంలో నిలిచి రూ.30వేలు, రాజోళి మండలం పచ్చర్లకి చెందిన సంపత్ కుమార్ ఎద్దులు నాల్గో స్థానంలో నిలిచి రూ.15వేలు గెలుచుకున్నాయి. రైతు సంబరాల్లో భాగంగా అంతర్రాష్ట్ర స్థాయి పోటీలు -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
గద్వాలటౌన్/ఎర్రవల్లి/ఇటిక్యాల: జిల్లాలో గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం జిల్లాలో ఏర్పాటు చేసిన 12 ప్రవేశ పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 4,743 మంది విద్యార్థులకు గాను 4,660 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 83 మంది గైర్హాజరయ్యారు. 98.25 శాతం హాజరు నమోదైంది.అడిషనల్ కలెక్టర్ తనిఖీప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పరీక్షలు సజావుగా జరపాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులకు సూచించారు. ఆదివారం ఎర్రవల్లి, ఇటిక్యాల మండల కేంద్రాల్లోని ప్రవేశ ప్రరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును సమీక్షిస్తూ.. కేంద్రంలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో నిబందనలను ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. బీచుపల్లి గురుకుల పాఠశాల మరియు కళాశాలలో 188 మంది విద్యార్థులకు గాను 185మంది హాజరయ్యారు. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల మరియు కళాశాలలో 391 మందికి 378 మంది హాజరయ్యారు. ఇటిక్యాలలో మొత్తం 829 మంది విద్యార్ధులకు గాను 812 మంది హాజరు కాగా.. 17 మంది విద్యార్దులు మాత్రమే పరీక్షకు గైర్హాజరయ్యారు. -
ఆదిశిలా క్షేత్రంలో ప్రముఖుల పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం దేవాదాయ శాఖ అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ తులసి, ఈఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజనారెడ్డి దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు వారికి సాదర స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ సెక్షన్ అధికారులు మాధవి, సుదర్శన్‌రెడ్డి, అలంపూర్ ఆలయ ఈఓ పురందర్, అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, దీరేంద్రదాసు, శశాంక్, చంద్రశేఖర్ రావు, బాబురావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాలకుల నిర్లక్ష్యంతోనే నత్తనడకన పనులు సాక్షి, నాగర్‌కర్నూల్/ అచ్చంపేట: గత పాలకులు ఎస్ఎల్బీసీకి సరిపడా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడంతోనే టన్నెల్ పనులు నిర్దేశిత సమయంలో పూర్తి చేయలేకపోయారని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే (సీపీఐఎం) జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో ఇద్దరు ఇంజినీర్లతోపాటు ఇద్దరు మిషన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఇరుక్కపోవడం దురదృష్టకరమన్నారు. ఆదివారం ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పరిశీలించిన ఆయన అక్కడే ఉన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి.. సొరంగంలో ఇరుక్కుపోయిన వారిని రక్షించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గ్రావిటీ ద్వారా నీరందించడానికి తలపెట్టిన టన్నెల్ పనులను సకాలంలో పూర్తిచేయకపోవడంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సుమారు రూ.2 వేల కోట్లతో చేపట్టిన పనులను నాలుగేళ్లలో పూర్తిచేయాల్సి ఉండగా.. 20 ఏళ్లు అయినా పూర్తి చేయలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో పదేళ్లపాటు పనులు నిలిచిపోయాయని విమర్శించారు. ఫలితంగా వ్యయం పెరిగి.. అంచనా బడ్జెట్ రూ.4,600 కోట్లకు చేరిందని దుయ్యబట్టారు. టన్నెల్లో ఇరుక్కపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి అన్నివిధాలా ఆదుకోవాలని, ఈ ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు పనిచేయలేదనే ఆధారాలు చూపిస్తావా? వనపర్తిటౌన్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ గెలుపునకు పనిచేయలేదని ఎమ్మెల్యే మేఘారెడ్డి పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆధారాలుంటే బయట పెట్టాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం రాత్రి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన్నె జీవన్‌రెడ్డితో రూ.90 కోట్లు ఖర్చు చేయించి ఆ డబ్బుతో వనపర్తి పుర పీఠం దక్కించుకొని గొప్పపని చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అసంపూర్తి పనుల విషయమై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితో మాట్లాడానని.. నియోజకవర్గ అభివృద్ధికి ఎవరి కాళ్లు మొక్కేందుకై నా తాను వెనుకాడనని స్పష్టం చేశారు. అభివృద్ధి ముసుగులో అవినీతి జరగొద్దని.. ఓ వ్యక్తి కోసం మండల కేంద్రం కాకుండా వేరే ప్రాంతంలో శంకుస్థాపన చేస్తున్నందుకే అడ్డుకున్నట్లు చెప్పారు. 46 ఏళ్ల రాజకీయ జీవితంలో కన్నతల్లిలాంటి పార్టీకి ఏనాడు తప్పు, చెడు చేయలేదని.. మేఘారెడ్డి నాలుగేళ్లయితే మరో పార్టీలోకి వెళ్లరనే నమ్మకం ఏమిటని ప్రశ్నించారు. దేశస్థాయిలో తనకు నిజాయితీపరుడనే పేరుందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనను తెలంగాణ ఏకే అంటోనీగా పిలుస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల అధికారిక వాహనంలో రాకుండా సాధారణ కారులో ఎమ్మెల్యే ఎందుకు తీసుకొచ్చారో, మంత్రి ఎలా వచ్చారో అర్థం కాలేదన్నారు. విద్యార్థి దశ నుంచి ఏఐసీసీ స్థాయికి వరకు ఎదిగిన మేం టిష్యూ పేపర్లా కనబడుతున్నామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత, కొత్త 80, 20 శాతంలో ఉంటేనే పార్టీ బలపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రొయ్యల సీడ్‌ను వదలలేదు
గద్వాల వ్యవసాయం: జిల్లాలోని జలాశయాలు, వాతావరణ పరిస్థితులు రొయ్యల సాగుకు అనుకూలంగా ఉండడంతో ఏటా రొయ్యల ఉత్పత్తి, సాగు ఆశాజనకంగా ఉండేది. ఇక్కడి మత్స్యకారులు సైతం మెరుగైన ఉపాధి పొందేవారు. కానీ, ఈ ఏడాది వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జలాశయాల్లో రొయ్యల సీడ్‌ను వదలలేదు. రొయ్యల సీడ్‌కు అవసరమయ్యే బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించలేదు. ఫలితంగా ఈసారి జిల్లాలో రొయ్యల సాగు లేకుండా పోయింది. రొయ్యల విక్రయాలతో ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్న మత్స్యకారులను ఆర్థికంగా దెబ్బ కొట్టినట్లయ్యింది.పైలెట్ ప్రాజెక్ట్‌గా..చాలా ఏళ్ల నుంచి మత్స్యశాఖ చేపల పెంపకంపై మాత్రమే దృష్టి పెడుతూ వస్తోంది. ఇందులో భాగంగా నీటి వనరుల్లో చేపల సీడ్‌ను వదిలేవారు. ఈ చేపలను మాత్రమే మత్స్యకారులు మార్కెట్లో విక్రయించేవారు. అయితే మార్కెట్లో రొయ్యలకు డిమాండ్ వచ్చింది. ఈక్రమంలో రొయ్యల పెంపకంపై ఆరేళ్ల క్రితం మత్స్యశాఖ దృష్టి సారించింది. ఇక్కడి వాతావరణం, జలాశయాల్లోని నీటి సాంద్రత, అందులో ఉండే లవణాలు తదితర అంశాలపై కొంత సమాచారం తీసుకున్నారు. ఖచ్చితంగా రొయ్యల ఉత్పత్తి బాగా జరుగుతుందని నిర్ధారించుకున్నారు. అనంతరం పైలెట్ ప్రాజెక్ట్‌గా 2019–20లో జూరాల జలాశయంలో 6 లక్షల రొయ్యల సీడ్‌ను వదిలింది. అధికారులు, మత్స్యకారులు భావించినట్లుగానే రొయ్యల ఉత్పత్తి బాగా జరిగింది. దీనికి ప్రధాన కారణం రొయ్య బాగా పెరగడానికి జలాశయ అడుగుబాగంలో ఇసుక నేలలు ఉండటంతో పాటు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీంతో రొయ్యలు బాగా పెరిగాయి. అలా.. మత్యశాఖ అధికారులు ఏటా రొయ్యల సీడ్‌ను వదిలే సంఖ్యను పెంచుతూ వచ్చారు. 2020–21 లలో రెండు రిజర్వాయర్లలో, 2021–22లో మూడు, 2022–23లో ఐదు, 23–24లో ఆరు రిజర్వాయర్లలో నవంబర్, డిసెంబర్ నెలల్లో వదిలారు. ఇలా ఐదేళ్లు రొయ్యలను వదిలారు. చేతికి వచ్చిన రొయ్యలను ఆయా రిజర్వాయర్ల సహకార సంఘాల పరిధిలోని మత్స్యకారులు పట్టుకొని విక్రయించి ఆర్థికంగా ప్రయోజనం పొందారు.2024–25 బడ్జెట్ కెటాయింపు ఏది?రొయ్యలసాగు, ఉత్పత్తిలో భాగంగా రొయ్య సీడ్ కోసం ప్రభుత్వం రాష్ట్ర మత్స్యశాఖకు బడ్జెట్ కేటాయిస్తుంది. కేటాయించిన ఈ బడ్జెట్‌తో రొయ్యల సీడ్‌కు సంబంధించి మత్స్యశాఖ రాష్ట్ర స్థాయిలో టెండర్లు ఆహ్వానిస్తుంది. టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్ ఆయా జిల్లాలకు నిర్ధేశించిన సీడ్ సంఖ్య ప్రకారం పంపిణీ చేస్తాడు. ఒక రొయ్య సీడ్ రూ.2 నుంచి రూ. 2.50పైసల వరకు గడిచిన ఏడాది వరకు ఉండింది. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రొయ్యల సీడ్‌కు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేదు. దీనివల్ల టెండర్ల ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆయా జిల్లాలకు రొయ్య సీడ్ సప్లై కాలేదు.ఏడాది వదిలిన రొయ్యల సీడ్ సంఖ్య2019–20 6,00,0002020–21 9,00,0002021–22 22,00,0002022–23 23,00,0002023–24 32,00,0002024–25 బడ్జెట్ కేటాయింపు జరగలేదుజిల్లాలో నీటి వనరులు..జిల్లాలో 92 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా.. 8102 మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ కుటుంబాలకు చేపల పెంపకం, విక్రయించడమే జీవనాధారం. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు, జూరాల ప్రాజెక్టుతో పాటు ఏడు రిజర్వాయర్లు, 38 నోటిఫైడ్ చెరువులు, చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో ఏటా మత్స్యశాఖ అందించే చేపల, రొయ్యల సీడ్‌ను వదిలి పెంచుతున్నారు.మత్స్యకారుల ఉపాధిపై దెబ్బఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా మాంసప్రియులు ఎక్కువగా చేపలు తింటున్నారు. మార్కెట్లో చేపల రకాన్ని బట్టి వీటికి డిమాండ్, ధరలు ఉంటాయి. అయితే రొయ్యలు బోన్‌లెస్‌గా ఉంటాయి. దీంతో వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. గద్వాల ప్రాంతంలో కేజీ రూ.200 నుంచి రూ.300 వరకు ధరలున్నాయి. అయితే రొయ్యల సీడ్ వదిలిన ఆరు, ఏడు నెలల తర్వాత ఆ రిజర్వాయర్ పరిధిలోని మత్స్యపారిశ్రామిక సంఘాల్లోని మత్స్యకారాలు వలల ద్వారా రొయ్యలు పట్టుకొని విక్రయిస్తారు. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తారు. కాగా ఈఏడాది జలాశయాల్లోకి రొయ్య సీడ్‌ను వదలకపోవడం వల్ల మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోనున్నారు. గడిచిన ఐదేళ్ల రొయ్యల ఉత్పత్తిని బట్టి ఈఏడాది 286 టన్నుల రొయ్యల ఉత్పత్తి జరగాలి. -
క్షణక్షణం ఉత్కంఠ
రెండు రోజులుగా టన్నెల్‌లోనే ఎనిమిది మంది కార్మికులు వివరాలు 8లో uక్షణ క్షణం ఉత్కంఠ రేపుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 13 కిలోమీటర్ల తర్వాత సొరంగంలో బురద మట్టి, నీటితో పేరుకుపోవడంతో ముందుకు వెళ్లేందుకు సాధ్యపడటంలేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణిలోని నిపుణులతో కూడిన రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. సహాయక చర్యలు రాత్రంతా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు మూడు విడతలుగా సహాయక బృందాలు టన్నెల్లోకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నాలుగో బృందం లోపలికి వెళ్లగా.. అర్ధరాత్రి తర్వాత ఐదో బృందం టన్నెల్ లోపలికి వెళ్లింది. టన్నెల్లోకి వెళ్లేందుకు జంకుతున్న కార్మికులు.. టన్నెల్లో ప్రమాద స్థలానికి చేరుకుని రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా, వారితో పాటు లోపలికి వెళ్లి మట్టి, శిథిలాలను తొలగించేందుకు కార్మికులు జంకుతున్నారు. కళ్ల ముందే ప్రమాదం చోటుచేసుకోవడంతో వారు భయబ్రాంతులకు లోనయ్యారు. ఈ క్రమంలో లోపల శిథిలాల తొలగింపు, మట్టి తొలగింపునకు కార్మికులు వెనకాడుతుండటంతో సహాయక చర్యల్లో మందగమనం నెలకొంది. దీంతో లోపలికి వెళ్లి విధులు నిర్వర్తించే కార్మికులకు దినసరి వేతనం రూ.2 వేల చొప్పున ఇవ్వాలని ఓ ఉన్నతాధికారి సంబంధిత కంపెనీ ప్రతినిధికి సూచించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) ఇన్లెట్ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల రెస్క్యూ ఆపరేషన్‌పై రెండు రోజులుగా ఉత్కంఠ నెలకొంది. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను చేరుకోలేకపోవడంతో ఇంకా ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. వారిని సమీపించేందుకే సహాయక బృందాలకు సాధ్యపడటంలేదు. 9.8 మీటర్ల వ్యాసార్థం ఉన్న సొరంగం నిండా మట్టి, బురద నిండిపోవడంతో కార్మికుల వద్దకు చేరడం కష్టంగా మారింది. టన్నుల కొద్దీ పేరుకున్న మట్టిని తొలగించడం సైతం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో కార్మికుల జాడ గుర్తింపుపై సందిగ్ధం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకాలే.. సొరంగంలో కార్మికులను కాపాడేందుకు రంగంలోకి ఆర్మీ (24), ఎఫ్‌డీఆర్‌ఎఫ్(120), ఎస్డీఆర్ఎఫ్(24), సింగరేణి(24), హైడ్రా(24) రెస్క్యూ సిబ్బందితో కూడిన బృందాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఆయా శాఖల సమన్వయంతో విడతల వారీగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సుమారు 6–8 గంటలకు ఒక బృందం చొప్పున షిఫ్ట్‌ల వారీగా సహాయక చర్యలను నిరంతరం కొనసాగిస్తున్నాయి. ప్రమాదం జరిగిన 13వ కి.మీ. వద్దకు లోకో ట్రైన్ వెళ్లడానికి గంట, రావడానికి గంట సమయం పడుతోంది. అక్కడ పెద్ద ఎత్తున మట్టి, రాళ్లతో కూడిన శిథిలాలు పేరుకుని ఉండటంతో రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే వారిని రక్షించడం కష్టంగా మారుతోంది. సంఘటన స్థలంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కడు వంశీకృష్ణ, కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథ్ పర్యవేక్షిస్తున్నారు. పంథా మార్చితేనే సాధ్యం.. కార్మికులను కాపాడేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలు ఫలించలేదు. కొత్త పంథా(టెక్నిక్)లో వెళ్లితే తప్ప వారిని బయటికి తీసుకురావడం సాధ్యపడే పరిస్థితి కనిపించడం లేదు. సొరంగంలో ఒకే మార్గం గుండా రాకపోకలు చేయాల్సి రావడం, ఎలాంటి ఆడిట్, ఎస్కేప్ టన్నెళ్లు లేకపోవడంతో రెస్క్యూ వీలు కావడం లేదు. రాకపోకలకు, మట్టిని తరలించేందుకు ఒకే ఒక కన్వేయర్ బెల్టు ఉండగా, ఆ మట్టి తరలించేందుకు దాదాపు మూడు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. సొరంగంలో నుంచి మట్టిని, రాళ్లను తొలగించడం అంతా సాధ్యమైన పని కాదని అంటున్నారు. దీంతో కొత్త పంథాలో సహాయక చర్యలు చేపడితేనే ప్రయోజనం ఉండనుంది. ఉత్తరాఖండ్ తరహాలో రెస్క్యూకు సన్నద్ధం.. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించిన తరహాలోనే ఇక్కడ కూడా ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా పై నుంచి రంధ్రం చేసి కార్మికులను బయటకు తీసు కొచ్చేలా ప్రయత్నించే అవకాశం ఉంది. ఇందుకు గల సాధ్యాసాధ్యాలను సైతం పరిశీలించనున్నారు. సోమవారం ఉదయానికి ఈ తరహా రెస్క్యూ బృందాలు ప్రమాదస్థలికి చేరుకునే అవకాశం ఉంది. – సాక్షి, నాగర్‌కర్నూల్ /అచ్చంపేట జిల్లాలో ఐదేళ్లుగా రొయ్యల సీడ్ సాగు ఇలా... భద్రతా ప్రమాణాలపై అనుమానాలు.. ఎస్ఎల్బీసీ సొరంగం తొలుస్తున్న టీబీఎం కొన్ని రోజులుగా మరమ్మతుకు గురై పెద్ద శబ్ధంతో పనిచేస్తోందని కొందరు కార్మికులు చెబుతున్నారు. అలాగే అసంపూర్తిగా కాంక్రీట్ సెగ్మెంట్ ఉండటం, భద్రతా ప్రమాణాలు పాటించకనే ప్రమాదం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిపై అధికారులు స్పందించడం లేదు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నెల 18న పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ముందస్తుగా పనుల వద్ద సేఫ్టీ ప్రమాణాలు పాటించలేదని తెలుస్తోంది. పని మొదలుపెట్టిన నాలుగు రోజులకే ప్రమాదం చోటుచేసుకోవడంతో భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాత్రంతా కొనసాగుతున్న సహాయక చర్యలు అర్ధరాత్రి తర్వాత టన్నెల్లోకి ప్రవేశించిన ఐదో బృందం రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఫైర్, సింగరేణి, హైడ్రా బృందాలు టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి -
పీయూలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: పాలమూరు యూనివర్సిటీలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ మైనార్టీ ఎంప్లాయిస్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం వీసీ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఉర్దూ భాష సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు, స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు పీయూలో ఎంఏ ఉర్దూ కోర్సును ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువ అని, పీయూలో ఉర్దూ విభాగం లేకపోవడంతో ఏటా వందలాది మంది విద్యార్థులు హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. స్థానిక ఎన్టీఆర్ డిగ్రీ మహిళా కళాశాల, ఎంవీఎస్ కళాశాలల్లో ప్రతి ఏడాది 400 మందికిపైగా ఉర్దూ గ్రాడ్యుయేట్లు ఉత్తీర్ణులవుతున్నారని, దీంతో ఎంఏ, పీహెచ్డీ అందుబాటులో లేకపోవడంతో చాలామంది పై చదువు చదవలేకపోతున్నారన్నారు. కార్యక్రమంలో సయ్యద్ అబ్దుల్ వహీద్‌షా, మహ్మద్ అబ్దుల్ రషీద్, మహ్మద్ అబ్దుల్ ఖలీల్, యూసుఫ్ బిన్ నాసర్ పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
గట్టు: పెరుగుతున్న సాంకేతికను అందిపుచ్చుకుంటూ ఏఐ(ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్) ద్వారా వ్యవసాయ రంగాన్ని సులభంగా, సమర్థవంతంగా, లాభం చేకూర్చేలా చేపట్టిన జాతీయ స్థాయి పోటీల్లో తప్పెట్లమొర్సు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. గట్టు మండలం తప్పెట్లమొర్సు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బెంగళూరులో శనివారం నిర్వహించిన జాతీయ స్థాయి ప్రదర్శనలో తమ ప్రతిభను చాటుకుని ద్వితీయ బహుమతిని అందుకున్నారు. ఈ–విద్యాలోక ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో బ్రెయినాక్ ఛాలెంజ్ పోటీల్లో భాగంగా తప్పెట్లమొర్సు విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఆధునిక సాంకేతికత ఏఐని ఉపయోగించి వ్యవసాయ రంగాన్ని మరింత సమర్థవంతంగా, లాభాయదాయకంగా మార్చే విధానాలను విద్యార్థులు బి.షర్మిల, బి.ఇందులు బెంగళూరు పట్టణంలో నిర్వహించిన ప్రదర్శనలో ప్రదర్శించి, జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతిని అందుకున్నట్లు హెడ్మాస్టర్ ఆగస్టిన్ తెలిపారు. ఈమేరకు విద్యార్థులను ఉపాధ్యాయులు ఆశోక్, నర్సింహులు, రాఘవేంద్ర, రియాజ్, మోసెస్, మండల కోఆర్డినేటర్ రంగస్వామి, మంజులలు విద్యార్థులకు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఇందిర గద్వాల క్రైం: జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఇందిర అన్నారు. శనివారం ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల ఆసుపత్రి మెడికల్ కాలేజ్ పరిధిలోకి వెళ్లిందన్నారు. వైద్యులు, సిబ్బంది, మౌలిక వసతులు కొరత లేకుండా విధుల నిర్వహణ ఉంటుందన్నారు. అనంతరం పలు వార్డులలో సేవలు పొందుతున్న రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ, ఫిరోజ్రెహమన్ కలిసి పలు సమస్యలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆమె అన్నారు. ఇక్కడ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వినోద్‌కుమార్ అలంపూర్ ఏరియా ఆసుపత్రికి బదిలీపై వెళ్లారు. నిర్దేశిత రుసుం వసూలు చేయాలిగద్వాల: మీ–సేవ కేంద్రాలు అంకితభావంతో పని చేయాలని ఈడీఎం శివ కోరారు. శనివారం గద్వాల పట్టనంలోని మీసేవ కేంద్రాలను ఈడీఎం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మీసేవ కేంద్రాలలో సిటిజన్ చార్ట్ నోటిస్ బోర్డ్, సర్టిఫికేట్, రిజిష్టర్, టోల్‌ఫ్రీ కాల్ నంబర్స్ ను ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ప్రజల నుంచి ఆరా తీవారు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు సిటిజన్ చార్ట్ సర్టిఫికేట్స్ రిజిష్టర్ గురించి వినియోగదారులకు వివరించారు. ఈ సందర్భంగా ఈడీఎం శివ మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యాలు కలిగించకుండా మీసేవలపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా నిర్ధేశించిన రుసుము మాత్రమే తీసుకోవాలని, అదనంగా తీసుకున్న యెడల మీసేవ కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నూతన రేషన్‌కార్డుల సర్వీసులకు రూ.45 మాత్రమే చెల్లించాలని వినియోగదారులకు సూచించారు. అలాగే ప్రజలకు మెరుగైన సేవలందించడమే మీసేవ కేంద్రాల లక్ష్యం అని ఆయన తెలిపారు. ధరల పట్టిక కూడా క్షుణంగా కేంద్రాలలో ఉండాలని సూచించారు. వారి వెంట డీఎం సుదాకర్ రెడ్డి, మీసేవ నిర్వహకులు సురేష్, హమ్జాద్, తదితరులు ఉన్నారు. -
పీయూలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: పాలమూరు యూనివర్సిటీలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ మైనార్టీ ఎంప్లాయిస్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం వీసీ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఉర్దూ భాష సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు, స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు పీయూలో ఎంఏ ఉర్దూ కోర్సును ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువ అని, పీయూలో ఉర్దూ విభాగం లేకపోవడంతో ఏటా వందలాది మంది విద్యార్థులు హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. స్థానిక ఎన్టీఆర్ డిగ్రీ మహిళా కళాశాల, ఎంవీఎస్ కళాశాలల్లో ప్రతి ఏడాది 400 మందికిపైగా ఉర్దూ గ్రాడ్యుయేట్లు ఉత్తీర్ణులవుతున్నారని, దీంతో ఎంఏ, పీహెచ్డీ అందుబాటులో లేకపోవడంతో చాలామంది పై చదువు చదవలేకపోతున్నారన్నారు. కార్యక్రమంలో సయ్యద్ అబ్దుల్ వహీద్‌షా, మహ్మద్ అబ్దుల్ రషీద్, మహ్మద్ అబ్దుల్ ఖలీల్, యూసుఫ్ బిన్ నాసర్ పాల్గొన్నారు. -
వెల్లువెత్తిన దరఖాస్తులు
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో గద్వాల, అయిజ పాత మున్సిపాలిటీలు కాగా, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు నూతనంగా ఏర్పడ్డాయి. జిల్లాలోనే పెద్ద పట్టణమైన గద్వాల, అయిజలలో అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. వడ్డేపల్లిలో సైతం ప్రజల నుంచి స్పందన లభించింది. ఖాళీ స్థలాలు ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవడంతో వీటి సంఖ్య పెరిగింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిఽధిలో 28,663 దరఖాస్తులు వచ్చాయి. ప్లాట్ల యజమానులు క్రమబద్దీకరణకు రూ.ఒక వేయి రిజిస్ట్రేషన్ ఫీజు ప్రభుత్వానికి చెల్లించగా. లేఅవుట్ స్థలానికి రూ.10వేలు చెల్లించారు. ఆరు నెలల కిందట మూడు దశలో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించడానికి ఏర్పాట్లు చేశారు. వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా పరిశీలన చేసేందుకు రెవెన్యూ, జలవనరులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ బృందాల్లో సభ్యులుగా నియమించారు. మూడు శాఖల మధ్య సమన్వయ లోపం, సిబ్బంది కోరత కారణంగా ఇప్పటి వరకు దరఖాస్తులు పరిశీలనకు చోచుకోవడం లేదు. క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తికాకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు. -
తాగునీటి సమస్య తలెత్తనీయొద్దు
గద్వాల: రాబోయే వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు కలగకుండా జిల్లా వ్యాప్తంగా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో మండలాల వారీగా తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో, మున్సిపల్ పరిదిలో నీటి సరఫరాను మెరుగుపరిచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైన నీటి కొరత ఏర్పడినట్లయితే తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నిరంతరం నీరు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. జిల్లాలో నీటి సరఫరా ప్రభావితంగా కొనసాగేలా బల్క్ వాటర్ సప్లయ్ ఓహెచ్ఎస్ఆర్ సింగిల్ ఫేజ్ చేతి పంపులు, ప్రైవేట్ బోర్‌వెల్స్, ట్యాంకర్లు వంటి అన్ని మార్గాలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని ఆదేశించారు. అదనంగా వ్యవసాయ బోర్ వెల్స్‌ను కూడా బ్యాకప్ ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. పీడబ్ల్యూఎస్ మోటార్లు, పైపులైన్లు పూర్తిగా పరిశీలించి 15 రోజుల్లో అన్ని మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి మొత్తం డిమాండ్, సరఫరా సమతుల్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సరఫరాపై ఎంపీడీఓలకు, పంచాయతీ కార్యదర్శులకు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, మిషన్ భగీరధ ఎస్ ఈ వెంటకరమణ, ఈఈ గ్రిడ్ పరమేశ్వరి, ఈఈ ఇంట్రా శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, స్పెషల్ ఆఫీసర్లు, మిషన్ భగీరధ డీఈ, ఏఈలు పాల్గొన్నారు. వేసవి దృష్ట్యా ప్రణాళికలు సిద్ధం చేయండి కలెక్టర్ సంతోష్ -
వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి
అలంపూర్: వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలను త్వరగా అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే విజయుడు సూచించారు. అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రికి ప్రధాన రోడ్డుకు సీసీ నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆస్పత్రి ఇన్చార్జ్ డాక్టర్ సయ్యద్ బాషతో పరికరాలు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతోపాటుగా టీఎస్ఎంఎస్ఐడీసీ డీఈ శ్రీనివాసులు, ఏఈ బాలక్రిష్ణ గౌడ్‌తో కలిసి ఆస్పత్రి ఆవరణ, పోస్టుమార్టం గదిని పరిశీలించారు. ప్రస్తుతం డిస్ట్రిక్ మినరల్ ఫండ్ ట్రస్టు(డీఎంఎఫ్టీ) నుంచి సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 28 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. 200 మీటర్ల సీసీ రోడ్డుతోపాటు పోస్టు మార్టం గది ఆవరణలో సీసీతో బెడ్ నిర్మాణం చేపడుతున్నట్లు డీఈ తెలిపారు. ఆస్పత్రిలో ఆవరణలో ముళ్ల పొదలు పెరిగాయని వాటిని తొలగించడానికి ప్రతిపాదనలు చేయాలని ఎమ్మెల్యే డీఈకి సూచించారు. వీలైనంత త్వరగా ఆస్పత్రిలో సౌకర్యాలు సమకూర్చి ఆస్పత్రిలో పేదలకు వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గజేందర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, సత్యనారయణ, బాషుమియ్య, మద్దిలేటి, తిరుమలేష్ నాయుడు, ధన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
స్టేషన్ మహబూబ్‌నగర్: మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. రీజియన్‌లోని 9 డిపోల నుంచి శ్రీశైలం వరకు 357 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రతి ఏడాది రీజియన్‌లోని డిపోల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతారు. శివరాత్రి అనంతరం తిరుగు ప్రయాణం రోజుల్లో కూడా ప్రత్యేక బస్సులు నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో అచ్చంపేట డిపో నుంచి 58, గద్వాల నుంచి 15, కల్వకుర్తి 34, కొల్లాపూర్ 37, మహబూబ్‌నగర్ 85, నాగర్‌కర్నూల్ 56, నారాయణపేట 23, షాద్‌నగర్ 6, వనపర్తి డిపో నుంచి 43 ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు రీజియన్ నుంచి 151 బస్సులు నడపనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రీజియన్‌లోని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ తెలిపారు. శ్రీశైలంతోపాటు ఆయా బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం చలువ పందిర్లు, తాగునీరు, వలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డిపో 24న 25న 26న 27న 28న అచ్చంపేట 4 8 12 24 10 గద్వాల – – 10 5 – కల్వకుర్తి 2 4 18 6 4 కొల్లాపూర్ 2 4 15 14 2 మహబూబ్‌నగర్ 5 15 35 15 15 నాగర్‌కర్నూల్ 5 11 20 15 5 నారాయణపేట 3 3 15 2 – షాద్‌నగర్ – – 6 – – వనపర్తి 5 6 20 10 2 శివరాత్రి నేపథ్యంలో రీజియన్ నుంచి 357 సర్వీసులు -
ఎనిమిది మంది
సొరంగంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో చేపడుతున్న ఎస్ఎల్బీసీ నిర్మాణ పనుల్లో ఇన్లెట్ టన్నెల్లో 14 కి.మీ., వద్ద సొరంగం పైకప్పు కూలి ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో ప్రమాదం సంభవించగా, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సొరంగంలో నీటి ఊట ఉధృతి పెరిగి, మట్టి వదులు కావడం, అకస్మాత్తుగా కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపడటంతో ప్రమాదం సంభవించింది. టన్నెల్ బోరింగ్ మిషన్‌కు ఇవతల వైపు ఉన్న సుమారు 50 మంది బయటకు పరుగులు తీసి ప్రాణాలను దక్కించుకోగా.. అవతల వైపు ఉన్న 8 మంది సొరంగంలోనే చిక్కుకునిపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సుమారు 150 మంది ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక, సింగరేణి కాలరీస్‌కు చెందిన రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది. సీపేజీనే ప్రమాదానికి కారణం.. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని నల్లగొండ జిల్లాకు తరలించేందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. నల్లమల కొండలను సుమారు 40 కి.మీ., మేర టన్నెల్‌ను తవ్వాల్సి ఉండగా.. కృష్ణాతీరం నుంచి 13 కి.మీ., మరోవైపు అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి నుంచి 23 కి.మీ., టన్నెల్ తవ్వకం పూర్తయ్యింది. దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ ఇన్లెట్ నుంచి 14 కి.మీ., వద్ద సొరంగం తవ్వకాలను గత నాలుగు రోజుల కిందటే మొదలుపెట్టారు. ఈ సొరంగంలో గత నాలుగేళ్లుగా నీటి సీపేజీ కొనసాగుతోంది. శనివారం ఈ నీటి ఉధృతి ఎక్కువై అప్పటికే బలహీనంగా మారిన పైకప్పు, రాక్ బోల్టింగ్, కాంక్రీట్ సెగ్మెంట్‌తోపాటు ఒక్కసారిగా కుప్పకూలింది. సీపేజీ నిర్వహణ, డీవాటరింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించడంతోపాటు భద్రతా ప్రమాణాలు పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే మార్గం గుండా.. టన్నెల్ శిథిలాల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలకు పెద్దఎత్తున నీటి ప్రవాహ, బురద ఆటంకంగా మారాయి. ఇలాంటి సొరంగ పనుల నిర్వహణకు ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు కీలకంగా పనిచేస్తాయి. వీటి ద్వారా సొరంగంలో తొలగించిన మట్టి, రాళ్లు, శిథిలాల తొలగింపుతోపాటు సొరంగంలో ఎయిర్ ప్రెజర్‌ను సమన్వయం చేసేందుకు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు ఉపయోగపడతాయి. ఇలాంటివి ఏమీ ఆడిట్, ఎస్కేప్ టన్నెళ్లు ఈ ప్రాజెక్ట్‌లో లేవు. ప్రధాన సొరంగంతోపాటు అదనంగా ఆడిట్ టన్నెళ్ల నిర్మాణం చేపట్టేందుకు అటవీశాఖ అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. ఆడిట్ టన్నెళ్లు లేకపోవడం, ఒకే మార్గం గుండా సహాయక చర్యలు చేపట్టడం రెస్య్యూ బృందాలకు సవాలుగా మారింది. ఘటనా స్థలానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి, కలెక్టర్, ఎస్పీ కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, సింగరేణి రెస్క్యూ బృందాలు భారీగా నీటి ఊట, బురద, శిథిలాలతో సహాయక చర్యలకు ఆటంకం -
ఎట్టకేలకు..!
●మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు ఎల్ఆర్ఎస్ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అయితే క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు. తాజాగా క్రమబద్ధీకరణపై ప్రభుత్వం 25 శాతం రాయితీ ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి క్రమబద్దీకరిస్తాం. నిబంధనల మేరకు దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరిస్తాం. – దశరథ్, కమిషనర్, గద్వాల 25 శాతం రాయితీపై ఆశలు ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. ఫీజులో రాయితీతో పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి వన్‌టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) విధానం అమలు చేసి 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ప్లాట్‌కు విస్తీర్ణం బట్టి సుమారు రూ.10 వేల నుంచి రూ.30 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సుమారు రూ. 30–40 కోట్ల వరకు ఆదాయం సమకూరనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఎల్ఆర్ఎస్పై రాయితీ ప్రకటన నేపథ్యంలో చాలామంది ముందుకొచ్చి క్రమబద్దీకరించుకునే అవకాశం ఉంది. గద్వాల టౌన్: పెండింగ్‌లోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, మార్చి 31వ తేదీలోపు క్రమబద్దీకరణ చేయించుకున్న వారికి ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొనడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇదిలాఉండగా, అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు గత ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులైజేషన్ (ఎల్ఆర్ఎస్) పథకాన్ని ప్రకటించింది. మున్సిపాలిటీ పరిఽధిలో 2020 ఆగస్టు 26వ తేదీ వరకు రిజిస్టర్ అయిన అనధికార ప్లాట్లు, లేఅవుట్లను మాత్రమే క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు స్వీకరించగా జిల్లాలో భారీ స్పందన లభించింది. అనంతరం దరఖాస్తుల పరిశీలనను వెంటనే ప్రారంభించాలని సూచించిన సర్కార్ తర్వాత నిలిపివేసింది. ఆన్లైన్లో లాగిన్ లేకపోవడంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ అప్పట్లో ముందుకు సాగలేదు. దీంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు. గత మూడేళ్ల కాలంగా పెండింగ్‌లో ఉండడంతో దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత డిసెంబర్లో ప్లాట్ల క్రమబద్ధీకరణకు అడుగులు పడ్డాయి. అయితే శాఖల మధ్య సమన్వయం లోపం కారణంగా ఈ ప్రక్రియ నత్తనడకన సాగింది. ఇంతలోనే కులగణన, ఇందిరమ్మ ఇళ్లు తదితర వాటిపై సర్వే జరగడంతో సిబ్బంది అంతా అందులోనే నిమగ్నమయ్యారు. ఎల్ఆర్ఎస్ నిలిచిపోయింది. ఇన్నాళ్లకు ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తామని సీఎం పేర్కొనడంతో కదలిక వచ్చినట్లయ్యింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలిలా.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరిస్తామని సీఎం ప్రకటన ఆశావహుల్లో ఆనందం నాలుగు మున్సిపాలిటీల్లో వచ్చిన దరఖాస్తులు 28,663 25 శాతం రాయితీపై చిగురిస్తున్న ఆశలు -
బ్యాంకు పనిదినాలు ఐదు రోజులుగా మార్చాలి
గద్వాల న్యూటౌన్: వారంలో బ్యాంకు పనిదినాలు ఐదు రోజులుగా మార్చాలని యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, కిష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక యూనియన్ బ్యాంక్ మేయిన్బ్రాంచ్ వద్ద యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ, కెనరా, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర ఇండియన్ బ్యాంక్‌లకు చెందిన బ్యాంక్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడారు. బ్యాంకులకు ప్రతి వారంలో శని, ఆదివారాలను సెలవు దినాలుగా ప్రకటించి, ఐదు రోజులు మాత్రమే పనిదినాలుగా చేయాలన్నారు. ఈ డిమాండ్‌ను ఏడాది క్రితమే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా, ఇంతవరకు స్పందించడం లేదన్నారు. ఐదు రోజులు పనిదినాలుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ మార్చి 24, 25వ తేదీల్లో జాతీయ స్థాయి సమ్మెను నిర్వహించన్నుట్లు తెలిపారు. బ్యాంకులలో వివిధ విభాగాల్లో ఖాళీ అవుతున్న ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని, వెంటనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాత్కాలికంగా పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఈకార్యక్రమంలో యూనియన్ నాయకులు రవికుమార్, ప్రభాకర్‌రెడ్డి, గిరీష్, సందీప్దినకరన్తో పాటు, వివిధ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయికి ముష్టిపల్లి విద్యార్థుల ప్రాజెక్టు
పెద్దకొత్తపల్లి: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లిటరసి వారు ఆన్లైన్లో నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌లో పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. విపత్తుల నిర్వహణ అంశంపై విద్యార్థులు గాధరి ప్రవీణ్, సాయిచరణ్ రూపొందించిన నోకాస్ట్ లైఫ్ సేవింగ్ బోటు అనే ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపికై ందని హెచ్ఎం సురేఖ తెలిపారు. వరద బాధితుల ప్రాణాలను రక్షించేందుకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం గురుకాసి యూనివర్సిటీ వారు అవసరమైన నిధులను అందజేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయస్థాయికి ఎంపికై న విద్యార్థులతో పాటు గైడ్ టీచర్ శైలజ, విద్యార్థుల తల్లిదండ్రులకు డీఈఓ రమేష్ కుమార్ అభినందనలు తెలిపారు. ముష్టిపల్లి విద్యార్థులు తయారుచేసిన నీటి పడవ -
చేనేత వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి
రాజోళి: చేనేత వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడంతోపాటు చేనేత కార్మికులు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ సిల్క్ బోర్డు ధర్మవరం సభ్యులు అవగాహన కల్పించారు. శుక్రవారం మండల కేంద్రం రాజోళిలోని చేనేత కార్మికులకు పలు అంశాలపై అవగాహన, శిక్షణ అందించారు. రంగులు అద్దకం, వాటిని వినియోగించే తీరు, రంగులు అద్దక ముందు, అద్దిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై కార్మికులకు స్పష్టత ఇచ్చారు. చేనేత కార్మికుల ఎదుట చేసిన ప్రత్యక్ష పరీక్షలు కార్మికులు ఆసక్తిగా తిలకించారు. చీర నాణ్యతను, మన్నికను నిర్ణయించే రంగుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. 75 శాతం రాయితీతో మగ్గం సామగ్రి, కలర్ ఫ్యాక్టరీ యూనిట్లు అందిస్తారని, చేనేత కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పలు రకాల చీరలు తయారు చేసే వారు ప్రత్యేకంగా కొన్ని జాగ్త్రలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ దీపక్ సూచించారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు అశోక్ దేశాయ్,లోకేష్ పాల్గొన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి గట్టు: తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలను పిల్లలు తప్పక నెరవేర్చాలని ఇంటర్మీడియట్ విద్యార్థులను ఉద్దేశించి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి హృదయరాజు కోరారు. శుక్రవారం గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు విడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదువుకుని వార్షిక పరీక్షలు మంచిగా రాయాలన్నారు. విద్యార్థుల జీవితంలో ఇంటర్ మీడియట్ కీలకమన్నారు. ఉన్నత శిఖరాలకు చేరుకోవడం ద్వారా చదువుకున్న కళాశాలకు, పుట్టి పెరిగిన ఊరికి, కన్న తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ, ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ వీరన్న, అధ్యాపకులు కేఎస్డీ రాజు, రాజగోపాల్, రాఘవేంద్ర, రంగస్వామి విద్యార్థులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు
అయిజ: మండల కేంద్రంలోని తిక్కవీరేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ వారు శుక్రవారం అంతర్రాష్ట్ర స్థాయి పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 20 పొటేళ్లు హోరా హోరీగా తలపడ్డాయి. అయిజ మండలానికి చెందిన సుల్తాన్ పొట్టేలు ప్రథమ స్థానంలో నిలిచి రూ.50వేలు, హైదరాబాద్‌కు చెందిన రాజావలి, ఎంజీ గ్రూప్, క్రైమ్ మేకర్ పొట్టేళ్లు ద్వితీయ, తృతీయ, నాల్గో స్థానాల్లో నిలిచి రూ.35వేలు, 20వేలు, రూ.10వేలు గెలుచుకున్నాయి. అనంతరం విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులను అందజేశారు. -
చదువుతోపాటు ఆరోగ్యం ముఖ్యం
గట్టు: విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలని, ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇక నుంచి రాగి చిక్కిని కలెక్టర్ ఆదేశాల మేరకు అందిస్తున్నట్లు డీఈఓ అబ్దుల్ గని తెలిపారు. ఇన్స్పైర్, అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థల సహకారంతో శుక్రవారం గట్టు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రాగి చిక్కి పంపిణీ కార్యక్రమాన్ని డీఈఓ, ఎంఈఓ నల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు ఈ రాగి చిక్కిని అందించనున్నట్లు డీఈఓ తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 100 శాతం ఫలితాలను తీసుకువచ్చేలా ఉపాధ్యాయులు ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలని, విద్యార్థులు కూడా క్రమం తప్పక పాఠశాలకు హాజరు కావాలని సూచించారు. మరో నెలరోజుల్లో వార్షిక పరీక్షలున్నాయని, నెల రోజులు ప్రత్యేక తరగతుల ద్వారా విద్యార్థులను సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్స్పైర్ కోఆర్డినేటర్ ఇనాయిస్, అన్నపూర్ణ కోఆర్డీనేటర్సందీప్, ఎంపీడీఓ చెన్నయ్య, అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీ చైర్మన్ సత్యకళ, తప్పెట్లమొర్సు హెడ్మాస్టర్ ఆగస్టిన్ తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,019 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు శుక్రవారం 366 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.7019, కనిష్టం రూ.3500, సరాసరి రూ.5729 ధరలు పలికాయి. అలాగే, 125 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.7089, కనిష్టం రూ. 2689, సరాసరి రూ.5689 ధరలు వచ్చాయి. మంత్రుల పర్యటనకుపటిష్ట ఏర్పాట్లు కొత్తకోట రూరల్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం జిల్లాకు రానున్నారని.. పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్‌పాం ఫ్యాక్టరీకి మంత్రులు భూమిపూజ చేయనున్నందున శుక్రవారం ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించి మాట్లాడారు. కార్యక్రమ స్థలంలో జిల్లా ఉద్యాన, వ్యవసాయశాఖకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ఆయిల్‌పాం సాగుచేస్తున్న ముగ్గురు ఆదర్శ రైతులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు. వచ్చిన వారికి ఆహారం అందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసుశాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి వచ్చే ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యాన అధికారి అక్బర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సభాస్థలిని పరిశీలించిన ఎస్పీ.. మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ శంకుస్థాపనకు శనివారం రాష్ట్ర మంత్రులు రానున్న సందర్భంగా శుక్రవారం భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రావుల గిరిధర్ పర్యవేక్షించారు. సభాస్థలి, వాహనాల పార్కింగ్ స్థలాలు, బందోబస్తు ఏర్పాట్ల తీరును పరిశీలించారు. బందోబస్తులో పాల్గొనే పోలీసు అధికారులకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన భద్రతపై పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి వచ్చే ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని, విధులను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, కొత్తకోట ఎస్ఐ ఆనంద్ తదితరులు ఉన్నారు. -
పాలమూరుపై పగ ఎందుకు?
నారాయణపేట: ‘పాలమూరు జిల్లాలో కృష్ణానది 811 టీఎంసీల నీరు పారుతుంది.. ఈ నీరు దశాబ్దాలుగా పారుతున్న ఈ ప్రాంత ప్రజల కష్టాలు ఎందుకు తీరలేదు.. సాగునీరు, తాగునీరు ఎందుకు అందలేదు.. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో పాలమూరులో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు.. జిల్లాను ఎందుకు నిర్లక్ష్యం చేశారంటూ’ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా దాదాపు రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం అప్పక్‌పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పదేళ్లు నిర్లక్ష్యం చేశారు.. పైగా పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయేందుకు అవకాశం కల్పించారని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. పాలమూరులో చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కేసీఆర్‌కు పగ ఎందుకు అని ప్రశ్నించారు. కేవలం 12 నెలల్లో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఈ విషయంలో ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. 70 ఏళ్లకు సీఎం పదవి హైదరారాబాద్ రాష్ట్రానికి పాలమూరు జిల్లావాసి బూర్గుల రామకృష్ణారావు తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తే దాదాపు 7 దశాబ్దాల తర్వాత తిరిగి పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు. పాలమూరు బిడ్డ మీ ముందు నిటారుగా నిలబడ్డాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు. పాలమూరు ప్రజల పేదరికాన్ని ప్రపంచ దేశాలకు చూపించి విదేశాల్లో మార్కెటింగ్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెనకబడిన ఈ పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని, ఇందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘పేట–కొడంగల్’ను పూర్తి చేసుకుందాం పదేళ్లలో సంగం‘బండ’ పగలకొట్టలేదు. దీంతో ఆ ప్రాంతంలోని 10 వేల వ్యవసాయ భూములకు సాగునీరు అందక ఏడారిగా మారాయని సీఎం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.15 కోట్లు మంజూరు చేసి బండను పగలకొట్టించామన్నారు. ఇప్పుడు 10 వేల ఎకరాలు పారుతున్నాయన్నారు. మక్తల్, కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టు 2014లో కొట్లాడి మంజూరు చేయిస్తే తనపైన ఉన్న కోపంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ ఆపేశారన్నారు. ఇప్పుడు తన హయాంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉదండాపూర్, పాలమూరు రంగారెడ్డి, ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పేట– కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని, రైతులకు ఎకరాకు రూ.10 లక్షలు సరిపోకపోతే రూ.20 లక్షలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. లగచర్లలో పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తే అడ్డుకున్నారని, పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుంటే ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని ప్రశ్నించారు. జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని, నన్ను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిదేశంలోనే తొలి మహిళా పెట్రోల్ బంక్ ఆడబిడ్డలకు ఆర్థిక స్వావలంభన ఇవ్వాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్ మంజూ రు చేశామని సీఎం అన్నారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే ఆతర్వాత వచ్చిన ప్రభుత్వం పదేళ్లలో బడుగు బలహీన వర్గాల ప్రజలను డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట మోసం చేసి గద్దెనెక్కిందని విమర్శించారు. తిరిగి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసుకొని.. ఈ రోజు నారాయణపేట మండలం అప్పక్‌పల్లి నుంచి భూమిపూజ చేయడం జరిగిందన్నారు. అవసరమైతే నియోజకవర్గానికి 5 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేకపోయారు కృష్ణానదిలో 811 టీఎంసీలు పారుతున్నా సాగు, తాగునీరు లేదు ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం పేట ‘ప్రజా పాలన– ప్రగతి బాట’ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజం రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
గద్వాల: ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గత అనుభావాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 8341 విద్యార్థులు పరీక్ష రాసేందుకు 14పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ముందస్తుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా 144సెక్షన్ అమలు చేయనున్నందున అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సెల్ఫోన్లు, వాచ్‌లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకురావటానికి అనుమతి లేదన్నారు. విద్యార్థులకు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో వైద్యశిభిరం, నిరంతరం విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యం, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీఎస్పీ మొగులయ్య, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి హృదయరాజు, డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప, ఆర్టీసీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బడి మానేసిన విద్యార్థులను తిరిగి చేర్పించాలి పదో తరగతి మధ్యలో బడి మానేసిన విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాయంలో అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం బాలకార్మికుల పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుని సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఆపరేషన్ స్మైల్‌ను మరింత పకడ్బందీగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 18సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని వెట్టిచేయించుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, డీఎస్పీ మొగులయ్య, డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్ధప్ప, ఆర్డీవో శ్రీనివాస్‌రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వేసవిలో విద్యుత్ సమస్యలు రానివ్వొద్దు రబీ సీజన్లో సాగుచేసిన వివిధ రకాల పంటలకు, రానున్న వేసవిలో విద్యుత్తు అంతరాయం తలెత్తకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా కొనసాగించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. శుక్రవారం జూరాల జనరేషన్ ప్లాంట్, 220/132 కేవీ జూరాల సబ్‌స్టేషన్, 132/33 కేవి, 33/11 కేవీ గద్వాల సబ్‌స్టేషన్, మానిటరింగ్ సెల్‌లను అకస్మికంగా తనఖీ చేసి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈసందర్భంగా విద్యుత్తు సరఫరా, నిర్వహణ, డిమాండ్ అంశాలపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో వ్యవసాయం, గృహాలు, ఆసుపత్రులు, పరిశ్రమలకు డిమాండ్ మేర నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలన్నారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్ఈ తిరుపతిరావు, ఏడీ రమేష్‌బాబు, గోవిందు తదితరులు పాల్గొన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలోసీసీ కెమెరాలు తప్పనిసరి కలెక్టర్ బీఎం సంతోష్ -
పప్పుశనగ అమ్మేదెట్లా?
నేటికీ ఏర్పాటుచేయని కొనుగోలు కేంద్రాలు ●మద్దతు ధరతో కొనుగోలు చేయాలి ఈ ఏడాది 6 ఎకరాల్లో పప్పుశనగ పంట సాగు చేశాను. ప్రస్తుతం కోతలు జరుగుతున్నా యి. మరో మూడు రోజుల్లో నూర్పిళ్లు చేసి ధాన్యం సిద్ధం చేసుకుంటాం. ఇప్పటికే కోత కోసిన వారు పంట విక్రయించడానికి మద్దతు కేంద్రాలు లేకపోవడంతో బహిరంగ మార్కెట్లకు తరలిస్తున్నారు. కానీ అక్కడ ఆశించిన మేరకు మద్దతు ధర లభించడం లేదు. ధాన్యం వచ్చిన తర్వాత మా పరిస్థితి అదేవిధంగా ఉంటుందని భయంగా ఉంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలి. – బాబురెడ్డి, సాసనూలు గ్రామం, ఎర్రవల్లి మండలం ప్రోత్సాహకం అందిస్తున్నాం పప్పుశనగ పంట సాగుకు రైతులకు ప్రొత్సాహకం అందిస్తున్నాం. ఈ ఏడాది అలంపూర్ మండలంలో 125 మంది రైతులకు వంద శాతం సబ్సిడీపై విత్తనాలు అందించాం. ప్రస్తుతం పంట కోత దశకు చేరింది. త్వరలో ధాన్యం చేతికి అందుతుంది. – నాగార్జున్ రెడ్డి, ఏఓ, అలంపూర్ త్వరలో అనుమతులు.. పప్పుశనగ కొనుగోలు కేంద్రాలు త్వరలో అందబాటులోకి వస్తాయి. పంట సాగు ఆధారంగా కొనుగోలు కేంద్రాల కోసం ప్రతిపాదనలు చేశాం. వారం రోజుల్లో కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పప్పుశనగ కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5650గా ఉంది. అనుమతులు వస్తే ఆ మేరకు కొనుగోలు చేస్తాం. – గౌరినాగేశ్వర్, మార్క్‌ఫెడ్ డీఎం అలంపూర్: ఓ వైపు దిగుబడి తగ్గడం.. మరో వైపు మ ద్దతు ధర దక్కకపోవడంతో పప్పుశనగ సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ప్రభు త్వ కొనుగోలు కేంద్రాలు కనిపించకపోవడంతో బహిరంగ మార్కెట్లోనే దళారులకు విక్రయించి నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈ ఏడాది ప ప్పుశనగ పంట 20442 ఎకరాల్లో సాగు చేశారు. గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం కొంత పెరిగింది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో అధిక మంది రైతులు పప్పుశనగ సాగుపై దృష్టిసారించారు. అత్యధికంగా అలంపూర్ మండలంలో 6,668 ఎకరాలు, ఉండవెల్లిలో 5273, ఇటిక్యాలలో 2419, మానవపాడులో 1609, వడ్డేపల్లిలో 1,598, రాజోలిలో 813, అయిజలో 775, మల్దకల్లో 693, గద్వాలలో 581 ఎకరాల్లో పంట సాగు చేశారు. దిగుబడి తగ్గడంతో దిగాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పప్పుదినుసుల పంట సాగును ప్రొత్సహించడానికి జాతీయ ఆహార భద్రత పథకం కింద కొత్త రకం విత్తనాలు వంద శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. అందులో పప్పుశనగ పంట సైతం ఒకటిగా ఉంది. కానీ దిగుబడి తగ్గుతుండటంతో రైతులు పప్పుశనగ సాగుపై ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఏటికేడు పప్పుశనగ సాగు తగ్గుతుంది. గతంలో పప్పుశనగ సాగు చేసిన రైతులకు ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. కానీ ప్రస్తుతం 3 నుంచి 5 క్వింటాళ్లకి మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. కేంద్రాలు లేక బహిరంగ మార్కెట్‌కు.. ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో పప్పుశనగ పంటను రైతులు బహిరంగ మార్కెట్లో దళారులకు విక్రయించి నష్టాలు చవిచూస్తున్నారు. పప్పుశనగ కొనుగోలు చేయడానికి మార్క్‌ఫెడ్ సంస్థ ప్రతిపాదనలు చేసింది. కానీ ఇప్పటివరకు ఉన్నతాధికారుల నుంచి కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు అందలేదు. దీంతో ఇప్పటికే కోత కోసిన రైతులు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5650 ఉంది. కానీ బహిరంగ మార్కెట్లో క్వింటాల్ రూ.5వేలు పలుకుతోంది. దీంతో ఎకరాకు దాదాపు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేసి పంట సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర లభించక నష్టపోతున్నారు. విధిలేక ఏపీ, కర్ణాటకకుతరలిస్తున్న రైతులు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్న వైనం ఇటు దిగుబడి రాక, మద్దతు ధర అందక వెంటాడుతున్న కష్టాలు జిల్లాలో 20,442 ఎకరాల్లో పప్పుశనగ సాగు -
నేడుపేటకు సీఎం రేవంత్
నారాయణపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారిగా శుక్రవారం నారాయణపేట జిల్లాకేంద్రానికి రానున్నారు. ఈ సందర్భంగా రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లను సిద్ధం చేసింది. ● సీఎం శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్లో నారాయణపేట మండలంలోని సింగారం చౌరస్తా సమీపంలోని గురుకుల పాఠశాల దగ్గర ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూ.1.23 కోట్లతో నిర్మించిన నూతన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు అప్పక్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌కు భూమి పూజ చేస్తారు. 1.35 గంటల నుంచి 2 గంటల వరకు రూ.130 కోట్లతో నారాయణపేట ప్రభుత్వ వైద్యకళాశాల, హాస్టల్ నిర్మాణానికి, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి, రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, రూ.40 కోట్లతో 100 పడకల యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు రూ.56 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల ఫస్టియర్ అకాడమిక్ బ్లాక్‌ల ప్రారంభించనున్నారు. వీటితో పాటు ధన్వాడ, నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్లు, వివిధ గ్రామాల్లో రూ.500కోట్లకుపైగా నిధులతో నిర్మించనున్న రోడ్లు, హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 2.10గంటలకు బహిరంగసభలో పాల్గొని, మాట్లాడుతారు. పర్యవేక్షించిన అధికారుల బృందం సీఎం పర్యటన నేపథ్యంలో గురువారం రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ క్రిస్టియానా, ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ హరీశ్, ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సింగారం చౌరస్తాలోని హెలీప్యాడ్ స్థలాన్ని, సమీపంలోని నూతన పెట్రోల్ బంక్, వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని, అప్పక్‌పల్లి వద్ద సీఎం భూమి పూజ చేసే ఇందిరమ్మ ఇంటి స్థలాన్ని అధికారుల బృందం పరిశీలించింది. అనంతరం మెడికల్ కళాశాలలో ఏర్పాట్ల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బహిరంగసభ వేదిక పక్కన గ్రీన్ రూమ్, వేదికపై సీటింగ్ కెపాసిటీ, వీఐపీ గ్యాలరీ తదితర వాటిపై చర్చించారు. అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణలు సైతం ఏర్పాట్లను పరిశీలించారు. ● ీసీఎం పర్యటనకు 1000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి ఎస్పీలు, ఇద్దరు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 81మంది ఎస్ఐలు, 133 మంది ఏఎస్ఐలు, 750 కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం పర్యటన ముందస్తు బందోబస్తు ఏర్పాట్లను మల్టీజోన్–2 ఐజీపీ సత్యనారాయణ, జోగుళాంబ జోన్ –7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పరిశీలించారు. రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
హోరాహోరీగా జాతీయ స్థాయి కుస్తీ పోటీలు
అయిజ: తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన జాతీయ స్థాయి కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. వివిధ రాష్ట్రాలనుంచి మొత్తం 25 మంది మల్లయోధులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సాగిన కుస్తీపోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. అనంతరం కర్ణాటక రాష్ట్రం విజయపురం జిల్లా చడ్చల్ గ్రామానికి చెందిన రామచంద్ర ప్రథమ బహుమతి, రంగారెడ్డికి జిల్లాకు చెందిన పీఎస్ సింగ్ ద్వితీయ, కర్ణాటక రాష్ట్రం విజయపూర్ జిల్లా చడ్చల్కు చెందిన కామన్న తృతీయ, హైదరాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్ నాల్గో స్థానాల్లో నిలిచారు. వరుసగా రూ.50వేలు, రూ.25వేలు, రూ.15వేలు, రూ.7వేలు గెలుపొందారు. రాత్రి ఆలయ కమిటి సభ్యులు విజేతలకు బహుమతులు అందజేశారు. అంతరాష్ట్ర భజన పోటీలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఆలయంలో అంతరాష్ట్ర భజన పోటీలు నిర్వహించారు. అనంతపురం జిల్లా నారపాలకు చెందిన మూల పెద్దమ్మ భజన మండలి ప్రథమ బహుమతి రూ.20,016ను కై వసం చేసుకుంది. నంద్యాల జిల్లా మండవాని పల్లికి చెందిన సాయి వీరాంజనేయస్వామి భజన మండలి ద్వితీయ బహుమతి రూ.15,016, గద్వాల జిల్లా పర్దిపురంకు చెందిన మల్లికార్జున భజన మండలి మూడవ బహుమతి రూ.10,016 నగదు బహుమతిని గెలుచుకున్నాయి. -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
గట్టు: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా హెచ్ఎంలు కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. గురువారం గట్టులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నియోజకవర్గ ఎంఈఓలు, హెచ్ఎంలతో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, డీఈఓ అబ్దుల్ఘనీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణను సాధించే విధంగా ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలన్నారు. గత ఏడాది ఫలితాల్లో జిల్లా 32వ స్థానంలో ఉందని, ఈసారి మెరుగైన స్థానం సంపాదించుకుందామని తెలిపారు. గట్టు, కేటిదొడ్డి మండలాలు వెనుకబాటుతనపు బావాన్ని తొలగించుకుని, పదిలో మంచి ర్యాంకులను సాధించాలని, అక్షరాస్యత శాతం పెంచాలని, విద్యా ప్రమాణాలను మెరుగు పరచాలని ఆదేశించారు. నెలరోజుల సమయం ఉందని, విధిగా పాఠశాలకు హాజరు అయ్యేలా చూడాలని, ప్రత్యేక ప్రిపరేషన్ తరగతులు నిర్వహించాలని, గతేడాది ప్రశ్నాపత్రాలను అధ్యయనం చేయించాలని, 10కి 10 జీపీఏ సాధించేలా తర్ఫీదు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గోవిందయ్య, షకీలాభాను, సంగీతలక్ష్మీ,వెంకటేశ్వర్లు,ప్రియాంక, అక్బర్బా ష, ఎంపీడీఓ చెన్నయ్య పాల్గొన్నారు. విద్యార్థులకు పోషకాహారాన్ని అందించాలి విద్యార్థులకు పోషకాలు కల్గిన సముతల ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ గురుకుల సిబ్బందిని ఆదేశించారు. గురువారం గట్టులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలోని గదులు, వంట గది, పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. మెనూ పాటించాలని, వంట పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, తాజా కూరగాయాలు వాడాలని వంట ఏజెన్సీ సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంతకు ముందు గట్టులోని జాతీయ గ్రామీణ ఉపాధి కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కూలీలు అందరికి పని కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రతి గ్రామంలో ఉపాధి పనులు ప్రారంభించాలని, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి జాబ్ కార్డును అందించాలని, పనుల్లో అవకతవకలకు అవకాశం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి కలెక్టర్ బీఎం సంతోష్ -
సేవాలాల్ మార్గం అనుసరణీయం
గద్వాలటౌన్ : సంత్ సేవాలాల్ సమాజానికి చేసిన సేవలు మరిచిపోలేనివని, ఆయన మార్గం అనుసరణీయమని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు సేవాలాల్ చిత్రపటంతో పట్టణంలో గిరిజన సంఘం నాయకులు, విద్యార్థులు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన గొప్ప విప్లవ చైతన్య మూర్తి సంత్ సేవాలాల్ అని కొనియాడారు. దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్తలలో ఒకరని పేర్కొన్నారు. సేవాలాల్ మహరాజ్ తన బోధనల వల్ల బంజారా జాతి పురోగమించడానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. బంజారా సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరుపున మరింత కృషి చేస్తానన్నారు. గిరిజన కమిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ బంజారాల జీవనం ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. విద్యలో మరింత వృద్ధి సాధించాలని సూచించారు. సేవాలాల్ చూపిన మార్గంలో పయణించి సన్మార్గంలో ఉండాలని సూచించారు. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను అందిపుచ్చుకొని మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సేవాలాల్ సేనా నాయకులు రవినాయక్, కృష్ణనాయక్, సురేష్ నాయక్, శ్రీనునాయక్, రూప్లానాయక్, నర్సింహులు నాయక్, ఉద్యోగ సంఘం నాయకులు మునెప్పనాయక్, జయరాం నాయక్, సరోజమ్మ, శంకర్ నాయక్, హనుమంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రక్తదానం ప్రాణదానంతో సమానం
శాంతినగర్: రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణం పోసినట్లేనని స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ రామా ఓబులేష్ అన్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్–1, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది సహకారంతో డిగ్రీ కళాశాలలో గురువారం రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ రక్తదానం ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. రక్తదానం ప్రాణదానంగా బావించి ఎంతో మంది విద్యార్థులు, అధ్యాపకులు ముందుకువచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. పీఎఫ్ బకాయిలు విడుదల చేయాలి గద్వాలటౌన్: మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు పది నెలలుగా పీఎఫ్, ఈఎస్ఐ బకాయి ఉన్నాయని, తక్షణమే వాటిని విడుదల చేసి కార్మికుల ఖాతాలో జమ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్మికులకు చెందిన పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలను చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పారు. కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు సైతం నెలనెల చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఉప్పేర్ నర్సింహా, శివ, రవి, మహేష్, రఘు, హనుమంతు పాల్గొన్నారు. సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణం. తేరుమైదానం నుంచి పెద్ద ఆగ్రహారంకు వెళ్లే మార్గంలో నిబంధనలు ఉల్లంఘించి ఓ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు కాలనీ వాసులతో కలిసి కమిషనర్ పిర్యాదు చేశారు. సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణ పనులు చేపట్టారన్నారు. రోడ్డు, డ్రైనేజీలు సైతం ఆక్రమణకు గురువుతున్నాయిన చెప్పా రు. ఈ నిర్మాణం వలన ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. మీ ఎమ్మెల్యేలు జారకుండా చూసుకోండి ● ఎంపీ బండి సంజయ్కుఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సూచన జడ్చర్ల: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన ఆరోపణలు అర్ధరహితమని, ముందుగా మీ పార్టీ ఎమ్మెల్యేలు జారకుండా చూసుకోండి అని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఉదండాపూర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు అధ్యక్ష పదవిని కోల్పోయిన బండి సంజయ్ సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి మాట్లాడేందుకు ఆయన ఎవరు అని ఎదురు ప్రశ్నించారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించేందుకు పోరాడాలని హితవు పలికారు. పక్క రాష్ట్రం ఏపీలో బీజేపీ ఎంపీల సంఖ్య తక్కువగా ఉన్నా నిధులు తెచ్చుకుంటుంటే 8 మంది ఎంపీలు ఉండి ఇక్కడేమో చోద్యం చూస్తున్నారని, కేంద్రంతో నిధుల కోసం కొట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు బీటీంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని, సీఎం రేవంత్‌రెడ్డి మరో పదేళ్లు అధికారంలో ఉండటం ఖాయమన్నారు. సీఎంగా రేవంత్‌రెడ్డి ఉంటే మీకేం ఇబ్బంది అన్నారు. బీజేపీ ధ్యాసంతా ప్రభుత్వాలు కూల్చడంపైనే ఉందని మండిపడ్డారు. రాజధాని నడిబొడ్డున ఓ హోటల్లో తాము నియోజకవర్గాలకు సంబంధించిన నిధుల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని స్పష్టం చేశారు. -
మేధో సంపత్తి హక్కులతో ప్రయోజనం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మేధో సంపత్తి హక్కులతో పరిశోధనలు చేసే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో మేధో సంపత్తి హక్కులపై ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పూర్తి స్థాయి హక్కులు పొందిన తర్వాతనే వాటిని ప్రకటించాలని, అప్పుడు ప్రచురణలు, ప్రయోగాలకు పూర్తిస్థాయిలో విలువ ఉంటుందన్నారు. ఆవిష్కరణలకు పరిరక్షణ, హక్కులు కలిగి ఉండాలంటే తప్పకుండా మేధో సంపత్తి హక్కులు ఉండాలని, రీసెర్చ్ విద్యార్థులు అధ్యాపకులు వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇప్పుడు చేసిన ప్రయోగాలు భవిష్యత్ అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, వక్త శంకర్రావు ముంజం, ఐక్యూఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కంట్రోలర్ రాజ్‌కుమార్, మధు, అర్జున్‌కుమార్, కుమారస్వామి, శాంతిప్రియ, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
అలంపూర్ రూరల్: జిల్లాలో పండిన ఎండుమిర్చి పంటను రాష్ట్ర ప్రభుత్వం మిర్చి బోర్డు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జి.కే ఈదన్న డిమాండ్ చేశారు. అలంపూర్ మండలంలోని క్యాతూర్‌లో రైతులతో కలిసి ఆయన మిర్చి పంటను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎండు మిర్చి పంట నిల్వ చేసుకోవడానికి గోదాములు, స్థానికంగా విక్రయించేందుకు మార్కెట్ సదుపాయం లేక సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తోందని, అయినా కూడా సరైన ధర రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. పసుపు బోర్డు మాదిరిగా.. ఎండుమిర్చికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి నేరుగా ఎండు మిర్చిని క్వింటాల్‌కు రూ.25 వేలు ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు. నాయకులు బంగారు రఫీ, గణేష్, రాఘవరెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని..గద్వాల పట్టణంలో ‘ప్రత్యేక’ పాలన మార్కు చూపించి, ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. విభాగాల వారీగా సమీక్షించి, వారి నుంచి సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలో ప్రగతి పనుల నిమిత్తం ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలన్నారు. పన్ను బకాయిలపై ప్రత్యేక శ్రద్ద కనబర్చి, రెగ్యులర్ పన్నులను వసూళ్లు చేయాలని ఆదేశించారు. సిబ్బందికి లక్ష్యలను నిర్ధేశించి పన్ను, అద్దెలను వసూలు చేయాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమస్య జఠిలంగా ఉన్న వార్డులలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. తక్షణమే వార్డు అధికారులకు వార్డులను కేటాయించి, వారికి బాధ్యతలను అప్పగించాలన్నారు. ఇక నుంచి వార్డు అధికారులు ఆయా వార్డులలో ప్రజలకు అందుబాటులో ఉండి వారితో మమేకం కావాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఆస్తిపన్ను వసూళ్లు, తాగునీటి సరఫరా, లే అవుట్లు, విద్యుత్తు తదితర విభాగాలను సమర్ధవంతంగా పర్యవేక్షించాలన్నారు. ప్రతి వార్డు అధికారికి ఆయా వార్డులపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి పట్టు సాధించాలన్నారు. 15 రోజుల తరువాత మరోసారి సమీక్ష నిర్వహించి, పురోగతిపై అంచనా వేస్తామన్నారు. రాబోవు వేసవికాలం తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాంచారు. ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ప్రణాళికలు రూపొందించాలన్నారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం మున్సిపాలిటీలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలపై ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయని ఆయా విభాగాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తిపన్ను మదింపులో అక్రమాలపై ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు. అక్రమ కట్టడాలు, మున్సిపల్ స్థలాల ఆక్రమణలపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఊదాసీనంగా ఉన్నారని, ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు, కమిషనర్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు. పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలి వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు చర్యలు కలెక్టర్ బీఎ సంతోష్ -
మారని పోలీసు తీరు..!
●శాఖాపరమైన చర్యలు తప్పవు పోలీసుశాఖలో ఏ స్థాయి అధికారి తప్పు చేసిన శాఖ పరమైన చర్యలు ఉంటాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం సమూల మార్పులు తీసుకువస్తున్నాం. పేకాట విషయంలో సిబ్బందిపై వచ్చిన ఆరోపణాలపై ఇప్పటికే అనర్హత వేటు వేశాం. సీఐ స్థాయి అధికారులు మొదలుకుని ఎస్ఐ, కానిస్టేబుళ్ల వరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నాం. అన్ని పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ప్రత్యేక విభాగం నిఘా ఉంచింది. వివిధ స్థాయిలో చేసిన తప్పిదాలపై మెమోలు జారీ చేశాం. నాయకులు, ప్రజలు అనే భేదం లేకుండా పోలీసులు సేవలు అందిస్తారు. దళారీ వ్యవస్థలో ఎవరిని సహించేది లేదు. చట్ట పరిధిలో అందరూ సమానమే. – శ్రీనివాసరావు, ఎస్పీ● పేకాటరాయుళ్లతో డబ్బులు వసూలు ● క్షేత్రస్థాయిలో ఇష్టారాజ్యం ● ఆరోపణల నేపథ్యంలో పలువురు సిబ్బందిపై వేటు గద్వాల క్రైం: శాంతిభద్రతలను కాపాడుతూ.. ప్రజలకు మేమున్నామనే భరోసానిచ్చేది పోలీసులు. అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన పోలీసు శాఖకు కొందరు సిబ్బంది మాయని మచ్చ తెస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారితో చేతులు కలుపుతున్నారు. ఓవైపు ఇసుక, బియ్యం, మట్టి, పేకాట తదితర అసాంఘిక దందాలను కట్టడి చేస్తున్నా.. మరో వైపు అవీనితికి పాల్పడిన వారికి అండగా నిలుస్తూ.. స్థాన చలనం.. అనర్హత వేటుకు గురవుతున్నారు. జిల్లా పోలీసుశాఖలో గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమయ్యాయి. జిల్లాలోని కొన్ని సంఘటనలు.. ● 21.08.2024వ తేదీన అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి పోలీసుస్టేషన్ సమీపంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంత మంది పేకాటరాయుళ్లు నిత్యం పేకాట దందాను నిర్వహిస్తుండగా పోలీసులు మెరుపు దాడులు చేపట్టి పలువురిని అరెస్టు చేశారు. అయితే పోలీసు సిబ్బందితోపాటు ప్రైవేట్ వ్యక్తులు ఈ దాడుల్లో పాల్గొని పేకాటరాయుళ్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి.. పట్టుబడిన నగదును తక్కువగా చూయించారు. ఈ ఘటనపై విచారించి ఆరోపణలు వాస్తవమని పోలీసు పైఅధికారులు నిగ్గు తేల్చారు. దీంతో మల్టీ జోన్ –2 ఐజీ పీవి.సత్యనారాయణ గద్వాల స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ జములప్ప, ఎస్ఐలు విక్రం, శ్రీనివాసులును విధుల నుంచి తొలగించి వీఆర్‌కు ఆటాచ్ చేశారు. అవినీతి, అక్రమాల్లో కొందరు.. -
గద్వాల విద్యార్థికి ప్రధాని ప్రశంస
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఆదికేశవ్ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందిస్తూ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో గుజరాత్‌లోని వాద్నగర్లో నిర్వహించిన జాతీయస్థాయి ప్రేరణ సదస్సుకు విద్యార్థి ఆదికేశవ్ ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కాగా, అందులో గద్వాల విద్యార్థి ఉండటం విశేషం. దేశ చరిత్ర, సాంస్కృక, స్వాభిమాన్, ధైర్య సహసాలు, పరిశ్రములు, కరుణ, సత్యనిష్ట, నాయకత్వం, విశ్వసనీయత, కర్తవ్యం, సత్యం, అహింసా తదితర అంశాలపై శిక్షణ పొందారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ విద్యార్థిని అభినందిస్తూ లేఖ రాశారు. ‘జాతీయస్థాయి ప్రేరణ సదస్సుకు ఎంపికై , అక్కడ నిర్వహించిన శిక్షణలో చక్కటి అంశాలను నేర్చుకోవడం శుభపరిణామం. వాటిని జీవితంలో అవలంభిస్తూ ఆదర్శవంతంగా ఎదగాలి’ అని లేఖలో ప్రస్తావించారు. హెచ్ఎం ఇమ్మానియేల్, ఉపాధ్యాయులు.. విద్యార్థిని సన్మానించారు.మిరపకు మద్దతు ధర కల్పించాలి అలంపూర్: ప్రభుత్వం మిరప రైతులకు మద్దతు ధర కల్పించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న డిమాండ్ చేశారు. అలంపూర్ మండలంలోని సింగవరంలో బుధవారం మిరప రైతులను కలిసి పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుత.. ఎకర మిరప పంట సాగుకు రూ.లక్షకుపైగా ఖర్చు చేశారని, కానీ మిరపను విక్రయించేందుకు వెళితే సాగు వ్యయం ఖర్చులు రావడం లేదన్నారు. బహిరం మార్కెట్లో విక్రయించేందుకు వెళ్తే క్వింటాల్ ధర రూ.10 వేల నుంచి రూ. 12 వేల వరకు మాత్రమే పలుకుతుందన్నారు. పంట మొత్తం విక్రయించిన కనీసం పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితులు లేవని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిరప బోర్డును ఏర్పాటు చేయా లన్నారు. క్వింటాల్‌కు రూ. 25 వేల ప్రకటించి కొ నుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నరసింహ్మా, రజాక్, గోపాల్, చిన్న ఈరన్న, బాబు సాబ్, మహమ్మద్, నరసింహులు ఉన్నారు. నెలాఖరు వరకు ఆర్డీఎస్కు నీరు శాంతినగర్: ఫిబ్రవరి 28 వరకు ఆర్డీఎస్కు సాగు నీరు పుష్కలంగా అందుంతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. వడ్డేపల్లి మండలంలో ప్రవహించే ఆర్డీఎస్ కెనాల్లో బుధవారం నీటి ప్రవాహం కొనసాగింది. మరో తొమ్మిది రోజుల పాటు ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీబీ డ్యాంలో నాల్గో ఇండెంట్‌గా పెట్టిన 1.16 టీఎంసీల నీరు బుధవారం ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ రాజోళిబండకు చేరాయని పేర్కొన్నారు. సాయంత్రం ఆనకట్టపై ఇంచు మేర ఓవర్ ఫ్లో కొనసాగుతోందని, గురువారం ఉదయం వరకు ఓవర్ ఫ్లో మరింత పెరిగే అవకాశం వుందన్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్ సంప్ వద్ద నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఇండెంట్ నీరు గురువారం సాయంత్రం వరకు తుమ్ళిళ్లకు చేరుతుందని, తుమ్మిళ్ల లిఫ్ట్‌కు ఇండెంట్ నీరు నెలాఖరు వరకు అందుతుందని, ఆర్డీఎస్ కెనాల్‌కు పూర్తిస్థాయిలో సాగునీరందిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఐదో చివరి ఇండెంట్ 0.8 టీఎంసీలు మిగిలి వుందని, కేసీ కెనాల్‌కు ఇండెంట్ పెట్టిన సమయంలో పెడతామని ఏఈ పేర్కొన్నారు. అంతేగాక ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ రాజోళి బండ షెట్టర్ల నుంచి ప్రధాన కాల్వ ద్వారా విడుదలైన నీరు బుధవారం అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చేరాయని, గురువారం ఉప్పల వరకు చేరుతాయన్నారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత అయిజ: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు బోదమయానందాజీ మహారాజ్ అన్నారు. బుధవారం మండలంలోని సంకాపురంలో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రామకృష్ణ ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. మనిషి దైనందిన జీవితంలో ఆధ్యాత్మికత చాలా వసరమని అన్నారు. చిన్ననాటినుంచి ఆధ్యాత్మికత కలిగి ఉండాలని, దానివలన సమాజం భక్తి మార్గం వైపు నడుస్తుందని అన్నారు. అహింసా మార్గాన్ని విడనాడాలని, ప్రతి రోజు ప్రతి ఒక్కరు గంటసేపు ధ్యానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం శర్మ, సూర్య ప్రకాష్, ఉమాదేవి, రాముడు, రాజీవ్, వెకంట్రాములు, కృష్ణ, సత్యనారాయణ, ఈశ్వర్, దామోదర్, ఈశ్వరన్న పాల్గొన్నారు.