రాయితీపై అనాసక్తి | - | Sakshi
Sakshi News home page

రాయితీపై అనాసక్తి

Apr 26 2025 12:22 AM | Updated on Apr 26 2025 12:22 AM

రాయిత

రాయితీపై అనాసక్తి

ప్రచారం చేసినా ఫలితం లేదు

జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి మున్సిపాలిటిల పరిధిలో ఉన్న నివాసగృహాలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తదితర వాటి నుంచి ప్రతి ఏడాది ఆస్తిపన్ను వసూలు చేస్తారు. ఆరు నెలలకు ఒకసారి రెండు విడతలుగా వీటిని చేపడతారు. అయితే చివరి రెండు నెలల పాటు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, బిల్‌ కలెక్టర్లు బృందాలుగా ఏర్పడి వీటి వసూలును చేపట్టారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు గత ఆర్థిక సంవత్సరం పన్నుల వసూళ్లలో లక్ష్యాన్ని చేరుకోవడానికి తడబడ్డాయి. తాజాగా మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ.. ఏప్రిల్‌ మాసంలో పన్ను చెల్లించేవారికి రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది మొత్తం చెల్లించాల్సిన పన్నులో ఐదుశాతం మినహాయిస్తామని ప్రకటించింది. ఇందుకు పట్టణాలలో ప్రచారం కోసం ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు పెట్టారు. బిల్‌ కలెక్టర్లు కాలనీల వారిగా అవగాహన కల్పిస్తున్నారు. కానీ జనం నుంచి మాత్రం స్పందన అంతగా రాలేదని చెప్పవచ్చు. గతేడాది సంబంధించిన పూర్తి పన్ను చెల్లించిన వారికే ఇది వర్తించింది.

గద్వాలటౌన్‌: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ముందస్తు ఆస్తిపన్ను చెల్లిస్తే ఐదుశాతం లభించే రాయితీకి ఆదరణ కరువైంది. ఇందుకు ఈ నెల రోజులు సమయం ఇచ్చినా.. చాలా తక్కువ మంది మాత్రమే చెల్లించేందుకు ఆసక్తి చూపించారు. దీంతో అధికారులు అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. 2025–26 ఏడాదికి సంబంధించి ఈ నెలలో ఏడాది మొత్తం పన్ను చెల్లించిన వారికి అందులో ఐదుశాతం రాయితీ లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు సైతం దీనిపై ప్రచారం నిర్వహించినా.. ఆశించిన స్పందన రాలేదు. నెల రోజుల గడువు దగ్గర పడుతున్నా.. ప్రజలు నామమాత్రంగానే ఆసక్తి చూపించారు. నాలుగు మున్సిపాలిటీలలో ఓ మోస్తారుగా పన్ను చెల్లించారని చెప్పవచ్చు.

జిల్లాలో ఇదీ పరిస్థితి

ఒకేసారి ఆస్తిపన్ను చెల్లిస్తే 5శాతం రాయితీ

జిల్లాలో మున్సిపాలిటీల వివరాలిలా..

కరువైన ఆదరణ.. లక్ష్యం ఆమడదూరం

గడువు నాలుగు రోజులే..

వినియోగించుకోవాలి

కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించిన వారికి ఐదుశాతం రాయితీ వర్తింపజేస్తున్నాం. ఏడాది చెల్లించే పన్నులో ఐదుశాతం మినహాయించి తీసుకుంటున్నాం. ఇందుకోసం పట్టణంలో ప్రచారం కోసం ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశాం. ఈనెల 30వ తేదీ వరకే అవకాశముంది. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. – దశరథ్‌, కమిషనర్‌, గద్వాల

గద్వాలలో 15,677 అసెస్‌మెంట్లతో ఐదు శాతం రాయితీకి అర్హులుగాా ఉన్నారు. వీరిలో కేవలం 2,136 మంది పన్ను చెల్లించి రాయితీ పొందారు. అయిజలో 8,116 అసెస్‌మెంట్లుకు గాను 1,474 మంది రాయితీ మీద పన్ను చెల్లించారు. అదేవిధంగా అలంపూర్‌లో 3,502 మందికిగాను 375 మంది పన్ను చెల్లించారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో 4,046 మందికి గాను కేవలం 669 మంది మాత్రమే ఆస్తిపన్ను చెల్లించి రాయితీ అవకాశాన్ని పొందారు.

రాయితీపై అనాసక్తి 1
1/3

రాయితీపై అనాసక్తి

రాయితీపై అనాసక్తి 2
2/3

రాయితీపై అనాసక్తి

రాయితీపై అనాసక్తి 3
3/3

రాయితీపై అనాసక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement