
ప్రతి రైతుకు భద్రత
జోగుళాంబ గద్వాల
భూ భారతితో
ప్రాణాలు తీసిన అతివేగం
ఎన్‌హెచ్–44పై వేముల స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు.
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వివరాలు IIలో u
గద్వాల/ధరూరు: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూభారతి– 2025 చట్టం రైతులకు పూర్తి భద్రత కల్పిస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం భూభారతి చట్టం గురించి ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు ధరూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో ధరణి వలన రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. ఆ ఇబ్బందులను విముక్తి కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం–2025ను తీసుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామని, ఈచట్టం గురించి ప్రజలకు, రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. 26వేల సాదాబైనామా దరఖాస్తులు, పరిష్కరించనున్నట్లు వివరించారు. అలాగే, ఆధార్ తరహాలో భూధార్ నంబర్ త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలు చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికి అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతులు వినియోగించుకోవాలి
ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని రైతులు భూభారతి చట్టాన్ని వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరీ చేసినట్లు వాటిని అర్హులైన పేదలకు అందిస్తామన్నారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ గతంలో భూసమస్యలకు అడ్డంకులు ఉండేవని తాజా చట్టం ద్వారా నేరుగా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలోనే పరిష్కారం లభిస్తున్నట్లు తెలిపారు. సెక్షన్ 45678 ద్వారా ఆర్‌ఓఆర్ దరఖాస్తు చేసుకున్న వారికి పరిశీలించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. వారసత్వం సక్షెన్ సెక్షన్8లో కోర్టు, లోక్ అదాలత్ సమస్యల నుంచి ఈచట్టం ద్వారా పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. ప్రతిగ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి భూసమస్యలు పరిష్కరిస్తారన్నారు. కార్యక్రమంలో టీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ నీలిశ్రీనివాసులు, మార్కెట్‌యార్డు చైర్మన్ హనుమంతు, ఎస్పీ శ్రీనివాస్‌రావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
ఆధార్‌లాగే త్వరలోనే భూధార్ నంబర్
రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ప్రతి రైతుకు భద్రత

ప్రతి రైతుకు భద్రత