
కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి వారి క ల్యాణోత్సవం శనివారం వేదపండితు ల మంత్రోచ్ఛరణల మధ్య కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు రమేషాచారి, రవిచారి, మధుసూదనాచారి స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా మహాహోమం నిర్వహించి స్వామి వారి ఉ త్సవమూర్తులకు కల్యాణం జరిపించా రు. ఈ వేడుకను తిలకించేందుకు భ క్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఈఓ సత్యచంద్రారెడ్డి, ఆలయచైర్మన్ ప్రహ్లదరావు, చంద్రశేఖర్‌రావు, దీరేంద్రదాసు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.6,270
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు శనివారం 459 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6270, కనిష్టం రూ.3500, సరాసరి రూ.5400 ధరలు పలికాయి. అలాగే, 12 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.6409, కనిష్టం రూ.6206, సరాసరి రూ.6409 ధరలు వచ్చాయి. 129 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.6030, కనిష్టం రూ.4670, సరాసరి రూ.6030 ధరలు పలికాయి. 1117 క్వింటాళ్ల వ రి (సోన) రాగా గరిష్టం రూ.2067, కనిష్టం రూ. 1740, సరాసరి రూ.1986 ధరలు లభించాయి.
పీయూలో
ప్రాంగణ ఎంపికలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లోని సెమినార్ హాల్‌లో శనివారం ఎంఎస్‌ఎన్ లేబరేటరీ నిర్వాహకులు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. కాగా క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ పోస్టుల కోసం యూజీ, పీజీ రసాయన శాస్త్రం విద్యార్థులు 60 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డా.ఎస్‌ఎన్ అర్జున్‌కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో రాత పరీక్ష ఉంటుందన్నారు. ఇందులో అర్హత సాధించిన ఉద్యోగార్థ్లుకు తర్వాత ముఖాముఖి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. త్వరలోనే తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. పయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మధుసూదన్‌రెడ్డి, హెచ్‌ఆర్ సుబ్బారావు పాల్గొన్నారు.
రామన్‌పాడులో
తగ్గుతున్న నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం వరకు పూర్తిస్థాయి నీటిమట్టం 1,015 అడుగులకు చేరిందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారన్నారు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 24 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వల ద్వారా 63 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని వివరించారు.

కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం