
కేంద్రం సహకారంతోనే సన్న బియ్యం పంపిణీ
ఎర్రవల్లి: రేషన్ బియ్యం పంపిణీలో సొమ్ము కేంద్ర ప్రభుత్వానిది అయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని..ప్రతి వ్యక్తికి అందిస్తున్న 6 కిలోల సన్నబియ్యంలో కేంద్రం ప్రభుత్వం ఐదు కిలోలు అందిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కిలో మాత్రమే ఇచ్చి ప్రగల్బాలు పలుకుతోందని బిజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మండిపడ్డారు. సోమవారం మండల పరిదిలోని వల్లూరు గ్రామంలో ఆ పార్టీ మండలాద్యక్షుడు జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చుచేసి ప్రజలకు ఉచితంగా రేషన్‌బియ్యం అందిస్తుందన్నారు. దీనిలో భాగంగానే ఇటీవలె సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటోను పెట్టకుండా కేవలం సిఎం పోటోను పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులుల కే.కే రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాజు, గ్రామ పెద్దలు, తదితరులు ఉన్నారు.
అసంక్రమిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మానవపాడు: అసంక్రమిత వ్యాధులు మానవ జీవితాలను నాశనం చేస్తాయని, అసంక్రమిత వ్యాధులుపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు సూచించారు. సోమవారం మండల కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏఎన్‌ఎంలు, ఆశలకు అవగాహన కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం మరణాల్లో సుమారు 74శాతం అసంక్రమిత వ్యాధుల వల్లనే జరుగుతున్నాయని, చాలా ఎన్‌సీడీలు జీవనశైలి సంబంధిత కారణాలతో కలుగుతున్నాయని తెలిపారు. వ్యక్తిగత స్థాయిలో బాధ్యత, సామాజిక, ఆరోగ్య సేవలపై ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హేమమానస, హెలెన్, చంద్రన్న, అక్కమ్మ, సూపర్‌వూజర్లు, ఏఎన్‌ఎమ్‌లు, ఆశలు తదితరులు పాల్గోన్నారు.
గడువు పొడిగింపు
గద్వాల: జిల్లాలో నిరుద్యోగ క్రిస్టియన్ యువతకు వివిధ కోర్సులలో శిక్షణ ఇచ్చుటకు గుర్తింపు పొందిన శిక్షణ సంస్థల నుంచి దరఖాస్తుల స్వీకరణ తేదీని ఈనెల 12వ తేదీ వరకు పొడగించినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రమేష్‌బాబు ప్రకటనలో తెలిపారు.
సాగునీటి కోసం
రైతుల ఆందోళన
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలను నిలిపివేయడంతో సోమవారం ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఆత్మకూర్ మండలంలోని ఆరెపల్లి, కత్తేపల్లి, తూంపల్లి గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ వద్దకు చేరుకొని గద్వాల– అమరచింత రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. చేతికొచ్చే దశలో ఉన్న యాసంగి పంటలకు సాగునీరు అందించక పోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. యాసంగి సాగుకు వారబందీ ద్వారా సాగునీటిని క్రమం తప్పకుండా అందిస్తామన్న అధికారులు.. సమాంతర కాల్వ ద్వారా ప్రాజెక్టులో ఉన్న నీటిని తీసుకెళ్తున్నా పట్టించుకోక పోవడంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. వారబందీ విధానంలో మరో రెండు పర్యాయాలు సాగునీరు వదలాలని డిమాండ్ చేశారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో రెండు రోజులపాటు సాగునీటిని కాల్వలకు వదులుతామని ప్రాజెక్టు అధికారులు ప్రకటించడంతో రైతులు ధర్నాను విరమించారు. పంటలు చేతికొచ్చే వరకు సాగునీరు అందించాలని ఏఈ ఆంజనేయులుకు వినతిపత్రం అందించారు.

కేంద్రం సహకారంతోనే సన్న బియ్యం పంపిణీ

కేంద్రం సహకారంతోనే సన్న బియ్యం పంపిణీ