
పశు సంపదను కాపాడేందుకే టీకాలు
ఎర్రవల్లి/ఇటిక్యాల: పశు సంపదను కాపాడేందుకే పశువైద్య, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాల్లో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాలికుంటు వైరస్ వల్ల పశువులలో నోరు, కాలి గెట్టెల మధ్య పుండ్లు ఏర్పడి అనతి కాలంలోనే గాలి ద్వార ఇతర పశువులకు వ్యాపిస్తుందని, దీనిని గాలి కుంటు రోగం అంటారన్నారు. జ్వరం అధికంగా ఉండి నోరు, నాలుక భాగములో పుళ్ళు ఏర్పడి మేత తీసుకోవడంలో ఇబ్బందులు, నోటి నుండి నురుగు వస్తూ దగ్గుతుంటాయన్నారు. గిట్టల మధ్య ఎర్రబడి, మెత్తబడి వ్యాధి సోకిన దూడలు 30–40 శాతం వరకు చనిపోతాయన్నారు. అందుకే పాడి రైతులు తప్పకుండా తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకొని పశు సంపదను కాపాడుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మండల పశు వైధ్యాధికారి డాక్టర్ భువనేశ్వరి, వినయ్‌కుమార్, పశువైద్య సిబ్బంది మాసూమన్న, సబీనా, రామకృష్ణ, విజయ్‌భాస్కర్, రాజేంద్ర సింహా, భారతీష్, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
● కొండేరులో 80 తెల్ల పశువులు (గోవుజాతి), 186 గేదెలకు టీకాలు వేశామని మూడు నెలలు పైబడిన అన్ని పశువులకు టీకాలను ఖచ్చితంగా వేయించాలని అన్నారు. ఈ వ్యాది సోకిన పశువులు ముడుచుకొని పడుకుంటాయని, జ్వరం 105 డిగ్రీల పైబడి ఉంటుందని, ముందుజాగ్రత్తగా టీకాలు వేయించాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాదికారి డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ వినయ్‌కుమార్, సిబ్బంది మాసూమన్న, సబీనా, రామకృష్ణ, విజయ్ బాస్కర్, రాజేంద్ర సింహా, భారతీషా, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.