
ఆదిశిలా క్షేత్రంలో అమావాస్య ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అదే విధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావుల చెర్వు గట్టు తిమ్మ ప్పస్వామి, చర్లగార్లపాడు వెంకటేశ్వరస్వామి ,శేషంపల్లి శివసీతారామస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అమావాస్యను పురస్కరించుకుని గద్వాల పట్టణంలోని కాకతీయటెక్నో స్కూల్ యజమాన్యం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు అరవిందరావు, ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, నాయకులు మధు, నారాయణ, అరగిద్ద రాముడు, వాల్మీకి పూజరులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో సీనియర్ సివిల్ జడ్జి పూజలు
గద్వాల ిసీనియర్ ిసివిల్‌జడ్జి వి శ్రీనివాస్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ నిర్వహకుడు అరవిందరావు, అర్చకులు జడ్జి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి జడ్జి దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చకులు ఆలయ విశిష్టతలను వివరించి జడ్జి దంపతులను శాలువాతో సత్కరించి మెమోంటోను అందజేశారు.

ఆదిశిలా క్షేత్రంలో అమావాస్య ప్రత్యేక పూజలు