స్వచ్ఛతపై అవగాహన ర్యాలీలు, సమావేశాలు
మున్సిపల్ గత పాలకవర్గంతో పాటు ప్రత్యేక అధికారి నర్సింగరావు, కమిషనర్ దశరథ్ పర్యవేక్షణలో మెప్మా అధికారులు, ఆర్పీల సహకారంతో మహిళ సంఘం సభ్యులతో ఆయా పట్టణాలలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని కాలనీల్లో సమావేశాలు జరిపి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచించారు. పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి మున్పిపల్ అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రజలు అన్ని విధాలా సహకారం అందించారు. మున్సిపాలిటీలకు మంచి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు వస్తుందని భావిస్తున్నారు.
ఉత్తమ ర్యాంకే లక్ష్యం
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రజా భాగస్వామ్యం తప్పనిసరి. ఆ దిశగా మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మహిళా సంఘాల సభ్యులతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మున్సిపాలిటీ ఉత్తమ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా కృషి చేశాం.
– దశరథ్, కమిషనర్, గద్వాల
గద్వాలటౌన్: మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛత తీరు తెన్నులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ఇటీవల ముగిసింది. పట్టణాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అంశాలు, వాస్తవ పరిస్థితిపై వివిధ కోణాలలో నిర్వహించిన సర్వే ఆధారంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు ఏ ర్యాంకు వస్తుందోనని సర్వత్రా ఆసిక్తి నెలకొంది.
అన్ని అంశాలను పరిగణలోకి..
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జనవరి నెలలో సర్వే నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించేందుకు రహస్య తనిఖీలు నిర్వహించాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ బృందాలు జిల్లాలోని నాలుగు మున్సిపల్ పట్టణాలకు వచ్చి పరిస్థితిని పరిశీలించాయి. స్థానికంగా ఎవరికి తెలియకుండా పట్టణాలలో పర్యటించి ఫోటోలు, వీడియోలు తీసుకున్నాయని సమాచారం. ఆయా మున్సిపల్ పరిధిలలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, వినియోగం తీరు తెన్నులను, ఫ్లాస్టిక్ కవర్ల వినియోగం, చెత్త సేకరణ తదితర అంశాలను కేంద్ర బృందాలు పరిశీలించినట్లు తెలిసింది. మున్సిపల్ పనితీరుపై ఫోన్ ద్వారా (టోల్ ఫ్రీ నెంబరు)కు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. స్మార్ట్ ఫోన్ స్వచ్ఛ సర్వేక్షన్ యాప్ ద్వారా పట్టణాలలో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై ప్రజలకు ప్రశ్నలు వేసి సమాధానాలను సేకరించి రికార్డు చేశారు. గద్వాలలో చాలా మంది ప్రజలు ఆన్‌లైన్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించడం విశేషం. ఆన్‌లైన్‌లో అభిప్రాయాలు వెల్లడించిన ప్రజల సంఖ్యను బట్టి రాష్ట్రంలో గద్వాలకు మెరుగైన ర్యాంకు వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ముగిసిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే
పట్టణాలలో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు తీరుపై కేంద్ర బృందాల రహస్య తనిఖీలు
ఏ మున్సిపాలిటీకి ఏ ర్యాంకు వస్తుందోనని సర్వత్రా ఆసక్తి
స్వచ్ఛ ర్యాంకు దక్కేనా?