ఎందుకీ వెనుకంజ..? | - | Sakshi
Sakshi News home page

ఎందుకీ వెనుకంజ..?

Published Thu, Apr 24 2025 12:46 AM | Last Updated on Thu, Apr 24 2025 12:46 AM

ఎందుకీ వెనుకంజ..?

ఎందుకీ వెనుకంజ..?

ఫలితాలపై పునశ్చరణ

జరిగేనా..?

ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు, ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరించారు. వీటితో పాటు ప్రధానంగా జిల్లాలో సుమారు 200 –250 మంది విద్యార్థుల వరకు పరీక్షలకు గైర్హాజరయ్యారు. వీటి వలన ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగా, డీఐఈఓ పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగా ఉండటం, కళాశాల ప్రిన్సిపల్‌కే అదనపు బాధ్యతలు అప్పగించి విద్యా సంవత్సరాలు నెట్టుకొస్తున్నారు. కళాశాలల తనిఖీకి వెళ్లి అక్కడ లోటుపాట్లు కన్పించినా అక్కడ సహచర ప్రిన్సిపల్‌ ఉండటంతో వారిపై చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తుండటంతో ఆ ప్రభావమూ విద్యార్థుల భవిష్యత్తుపై చూపుతోంది. నాణ్యమైన విద్య అందించినప్పుడే ఫలితాలు సైతం మరింత మెరుగ్గా ఉంటాయి. ఆ దిశగా ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి, ఫలితాలపై పునశ్చరణ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో జిల్లా 20,

21వ స్థానం

కొరవడుతున్న కార్యాచరణ,

పర్యవేక్షణ

ఫలితాల మెరుగుపై దృష్టి సారించని అధికారులు

గద్వాలటౌన్‌: విద్యార్థుల ఉజ్వల భవితకు పునాదిగా భావించే ఇంటర్‌ ఫలితాలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రెండింటా విద్యార్థులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. గతేడాది కన్నా ఈ సారి ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగినా రాష్ట్రంలో 20, 21వ స్థానాలలో జిల్లా ఉండటం ఆందోళనకు గురిచేస్తుంది. ప్రత్యేక కార్యచరణ లోపించడం, పర్యవేక్షణ కొరవడటం పిల్లల చదువులపై దుష్ప్రభావం చూపుతుందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. జిల్లాలో మొత్తం 8 ప్రభుత్వ కళాశాలలు, 14 ప్రభుత్వ గురుకుల కళాశాలలు, ఆరు కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, 13 ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్‌ విద్య కొనసాగుతుంది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో మొత్తం 3,260 మంది విద్యార్థులకుగాను 1,864 మంది విద్యార్థులు మాత్రమే (57.18శాతం) ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 2,963 మంది విద్యార్థులకుగాను 2,017 మంది విద్యార్థులు మాత్రమే (68.07 శాతం) ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలోనే 20వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ కళాశాలల్లో ఇలా..

జిల్లాలోని 8 ప్రభుత్వ కళాశాలల్లో సైతం ఫలితాలు నిరుత్సాహ పర్చాయి. మొదటి సంవత్సరంలో 1,360 మంది విద్యార్థులకు గాను 706 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే 41.91 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 1,208 మంది విద్యార్థులకుగాను 872 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అంటే 72.18 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడా దితో పోల్చితే ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగింది..

● ముఖ్యంగా కొన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం ఫలితాలు తీవ్ర నిరాశపర్చాయి. ఒక్క కళాశాలలో మినహా మిగిలిన ఏడు కళాశాలలో 60 శాతం ఉత్తీర్ణత దాటలేదు. మల్దకల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఫలితాలు మరి అధ్వానంగా వచ్చాయి. ఫస్టియర్‌లో కేవలం 20 శాతం మాత్రమే ఫలితాలు వచ్చాయి. అలంపూర్‌లో 31 శాతం, మానవపాడులో 37 శాతం మాత్రమే ఉత్తీర్ణత రావడం ఆందోళన కలిగిస్తుంది. గట్టు, ధరూర్‌ ప్రభుత్వ కళాశాల ఫలితాలు సైతం నిరాశజనకంగా ఉన్నాయి. సెకండియర్‌లో అలంపూర్‌ మినహా మిగిలిన అన్ని కళాశాలలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. ద్వితీయ సంవత్సరంలో గట్టు, అయిజ, అలంపూర్‌ కళాశాలల ఫలితాలు ఫర్వాలేదనిపిచ్చాయి.

సీఈసీలో మరి దారుణం..

ప్రభుత్వ కళాశాలల సీఈసీ విభాగంలో దారుణమైన ఫలితాలు వచ్చాయి. గట్టు ప్రభుత్వ కళాశాల సీఈసీ ప్రథమ సంవత్సరం తెలుగు మీడియంలో జీరో ఫలితాలు వచ్చాయి. 11 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే అందరూ ఫెయిల్‌ అయ్యారు. సెకండియర్‌లో 19 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే కేవలం ఒక్కరే ఉత్తీర్ణులయ్యారు. మల్దకల్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 24 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే కేవలం ఇద్దరూ మాత్రమే పాస్‌ అయ్యారు. మానవపాడు కళాశాలలో తెలుగు మీడియంలో పది మందికి ఇద్దరూ, ఇంగ్లీష్‌ మీడియంలో 14 మందికి నలుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అలంపూర్‌లో ఇంగ్లీష్‌ మీడియంలో ఎనిమిది మందికి గాను కేవలం ఒక్కరే పాస్‌ అయ్యారు. గట్టు, ధరూర్‌లలో హెచ్‌ఈసీ ప్రథమ సంవత్సరం ఫలితాలు సైతం నిరాశపర్చాయి.

● ధరూర్‌ కళాశాల రెండో సంవత్సరం బైపీసీలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. 22 మంది విద్యార్థులకు గాను 22 మంది ఉత్తీర్ణత సాధించారు. గద్వాల ప్రభుత్వ కో–ఎడ్యుకేషన్‌ కళాశాల ద్వితీయ సంవత్సరం సీఈసీ విభఈగంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. 31 మంది విద్యార్థులకు 31 మంది పాస్‌ అయ్యారు.

కళాశాల ప్రథమ ద్వితీయ

సం. సం.

గద్వాల ప్రభుత్వ కళాశాల 59 74.8

గద్వాల బాలికల కళాశాల 57 70

ధరూరు కళాశాల 54 77

అలంపూర్‌ కళాశాల 31 56

గట్టు కళాశాల 46 64

మానవపాడు కళాశాల 37 70

మల్దకల్‌ కళాశాల 20 86

అయిజ కళాశాల 62.16 73.3

ఇంటర్‌లో నిరాశపరిచిన ఉత్తీర్ణత శాతం

కారణాలెన్నో..

ఇంటర్‌ ఫలితాల్లో ఆశించిన ఉత్తీర్ణత రాకపోవడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. జిల్లాలో ఇంటర్‌ విద్యపై పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కళాశాలలకు సరైన దిశానిర్దేశం చేయకపోవడం, తరచూ బోధన తీరును సమీక్షించకపోవడం వంటి కారణాల వల్ల ఫలితాలపై ప్రభావం పడిందన్న భావన విద్యావేత్తల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక తరగతులు నిర్వహించినా విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలపై దృష్టి సారించకపోవడం ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడికి వచ్చే వారంతా పేద కుటుంబాలకు చెందిన వారే. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు పూర్తిగా తరగతులకు హాజరు కాకుండా మధ్యాహ్నం తర్వాత ఇంటికి వెళ్లిపోయే వారు. దీంతో వారికి అన్ని సబ్జెక్టులపై పట్టు లేకుండా పోయింది. విద్యార్థులు గైర్హాజరవుతున్నా అధ్యాపకులు చూసీ చూడనట్లు వ్యవహరించ డం మౌళిక వసతులేమి వంటివి ఫలితాలను దెబ్బతీశాయనే భావన వ్యక్తమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement