
సర్వ మానవాళికి ఏసుక్రీస్తు రక్ష
గద్వాలటౌన్: జిల్లా వ్యాప్తంగా గుడ్‌ఫ్రైడేను క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సర్వమానవాళికి రక్షణ లభిస్తుందని, పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని పాస్టర్లు సందేశమిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎంబీ మిస్పాచర్చి, ఒలీవ చర్చి, కర్మెలు చర్చి, ఎంబీ జియాన్ చర్చి, హోసన్నా మందిరం, హోలీ మినిస్ట్రీస్, ఎల్‌ఈఎఫ్ తదితర చర్చిలలో గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. క్రీస్తును ఆరాధించారు. వాక్యోపదేశాలు, బైబుల్ సూక్తులు విన్నారు.
క్రీస్తు ప్రవచనాలు ఆచరించాలి
మానవాళి శాంతి కోసం ఏసుక్రీస్తు శిలువకు బలయ్యారని, ఆయన ప్రవచనాలు అందరూ ఆచరించాలని పాస్టర్లు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎంబీ మిస్పా చర్చిలలో జరిగిన గుడ్‌ఫ్రైడే వేడుకల్లో పాస్టర్ చార్లస్ శాంతిరాజ్ వాక్యోపదేశం చేశారు. ఏసుక్రీస్తు శిలువ వేయబడిన సమయంలో చెప్పిన ఏడు మాటలను పాస్టర్లు రోస్, ప్రకాశం, శిభాప్రభుదాస్, సాల్మన్‌ప్రకాష్, అశోక్, వీడీ సోలమాన్, సైమన్ సుధాకర్‌లు వివరించారు. శాంతికి ప్రతిరూపం ఏసు అని, శత్రువులను సైతం ప్రేమించాలని సూచించారన్నారు. తెలియక చేస్తున్న తప్పును క్షమించాలన్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా క్వయిర్ సభ్యులు, మహిళా సమాజం వారు ప్రత్యేక గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆయా చర్చిల సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

సర్వ మానవాళికి ఏసుక్రీస్తు రక్ష