
రాజీవ్ యువవికాసానికి దరఖాస్తు చేసుకోండి
ఇటిక్యాల: ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన హెల్ప్ డెస్క్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రాజీవ్ యువవికాసం పథకానికి అర్హులైన యువత దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్ ఉన్నారు.
కేటగిరీల వారీగా కేటాయింపులు
గద్వాల: రాజీవ్ యువవికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు. ఈ పథకంలో దివ్యాంగులకు 5 శాతం, ఒంటరి మహిళలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి సునంద ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్, ఆదాయం, కుల ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ (ట్రాన్స్‌పోర్ట్ పథకం కోసం), పట్టాదారు పుస్తకం (వ్యవసాయ సంబంధిత పథకానికి), సదరం ధ్రువపత్రం, వితంతు, ఒంటరి మహిళల ధ్రువపత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను జతపరిచి మండల పరిషత్, మున్సిపాలిటీ కార్యాలయాల్లో అందించాలని సూచించారు.