
ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలి
కేటీదొడ్డి: మండలంలోని మీ సేవ కేంద్రాలను మీసేవ ఈ మేనేజర్ శివ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం ఆయన మండల పరిదిలోని కుచినెర్ల గ్రామంలో మీ సేవ కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. సిటిజన్ చాటర్ట్, నోటీస్ బోర్డు, సర్టిఫికేట్, రిజిష్టర్ టోల్ ప్రీ నంబర్లు, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సేవలందించాలని సూచించారు. మీ సేవలపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా నిర్ధేశించిన రుసుము మాత్రమే తీసుకోవాలని, అదనంగా తీసుకుంటే కేంద్రాలపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మీ సేవ లక్ష్యమన్నారు. ధరల పట్టి కూడా కేంద్రాల్లో విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సురేష్, వెంకటేష్ నాయుడు తదితరులు ఉన్నారు.