
దేశాభివృద్ధిలో ఆర్థికశాస్త్రం కీలకం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఆర్థికశాస్త్రం దేశాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తుందని ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలోఎకానామిక్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ ఎకానామిక్స్ డేను నిర్వహించారు. ఈ సందర్బంగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎకానామిక్స్ పూర్తిస్థాయిలో ఎగుమతులు, దిగుమతులు వ్యాపార, వాణిజ్య విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఓడీ రాఘవేందర్‌రావు, జిమ్మికార్టన్, శివలింగం, రాజునాయక్ తదితరుల పాల్గొన్నారు.