
జోగుళాంబ గద్వాల
సమస్యల పరిష్కారానికి డెడ్‌లైన్
శనివారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వివరాలు 10లో u
పోలీసుల అదుపులో యువకులు
గద్వాల క్రైం: గుట్టుగా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా పోలీసులు.. కొందరు యువకులను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే పట్టుబడిన యువకులు గంజాయి, మత్తు కలిగించే పదార్థాలను మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి జిల్లాలో కొందరు వ్యక్తులకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా హైదరాబాద్, గద్వాల కేంద్రంగా విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే పట్టుబడిన వారు గద్వాల జిల్లాకు చెందినవారేనని తెలిసింది. గంజాయి సరఫరా, విక్రయాల నివారణకు ప్ర భుత్వం ప్రత్యేక దృష్టి సారించిన క్రమంలో నడిగడ్డకు చెందిన యువకులు మత్తు పదార్థాల సరఫరా చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.
కూపీలాగుతున్న ప్రత్యేక బృందం
జిల్లాలో ఎవరెవరు గంజాయి తదితర మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు, వాటికి బానిసలయ్యారు అనే దానిపై అనుమానాస్పద స్థితిలో పట్టుబడిన యువకుల నుంచి పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం. ఇందులో అధికంగా యువకులకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రంలోని శివారుకాలనీలో కొందరు యువకులు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రాత్రి సమయంలో మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉండగా.. ఎకై ్సజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడి చేసి పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టుబడిన యువకులు ఓ మాజీ ప్రజాప్రతినిధి బంధువులు కావడం, ఓ ముఖ్యనేత ఒత్తిళ్లతో పట్టుబడిన యువకులకు కౌన్సెలింగ్ అందించి విషయాన్ని బయటకు రాకుండా చేశారు. ప్రస్తుతం అనుమానాస్పదంగా తిరుగుతూ పట్టుబడిన యువకులు సైతం ఎవరికి మత్తు పదార్థాలు విక్రయించారు అనే విషయం తెలియాలిఉంది. ఈ ఘటనపై ఓ ఉన్నతాధికారిని వివరణ కోరగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరు యువకులను పట్టుకున్నామని, మత్తు పదార్థాల విక్రయ అంశంపై ఆరా తీస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
‘ప్రధానిని విమర్శించే స్థాయి కాదు’
గద్వాల: ప్రపంచ దేశాలన్నీ దేశప్రధానిని గొప్పదార్శనికత ఉన్న నాయకుడని కొనియాడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తమ స్థాయిని మరిచి దేశ ప్రధానినే విమర్శిస్తుండడం వారి దివాళాకోరు తనానికి నిదర్శమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాలకు పెట్టింది పేరని, వారి కుంభకోణాలు వెలుగు చూసి చట్టం తన పనితాను చేసుకుంటూ పోతుంటే ప్రజలను తప్పుదారి పట్టించేలా కాంగ్రెస్ పార్టీ నేతలు, అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించడం సరైన విధానం కాదని హితవు పలికారు. కార్యక్రమంలో నాయకులు బండల వెంకట్రాములు, రవి, ఇసాక్, దేవదాస్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, నాగర్‌కర్నూల్: భూ సమస్యలపై తీసుకువచ్చిన భూభారతి చట్టం–2025పై ప్రజలకు క్షేత్రస్థాయిలో విస్త్రృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ధరణికి బదులుగా తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. గత రెవెన్యూ చట్టాలకు భిన్నంగా ఈసారి కొత్త చట్టంలో భూసమస్యల పరిష్కారానికి నిర్దేశిత గడువును విధించింది. భూరికార్డుల్లో తప్పుల సవరణ పరిష్కారం 60 రోజుల్లో పూర్తి కావాలని నిర్దేశించింది. వారసత్వ భూముల్లో హక్కుదారులను 30 రోజుల్లోగా నిర్ణయించాలని, లేకపోతే దరఖాస్తు ఆమోదించాల్సి ఉంటుందని పేర్కొంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు సైతం చర్యలు తీసుకోగా, ఇందుకోసం గరిష్టంగా 90 రోజుల గడువు విధించింది.
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు..
పూర్వంలో గ్రామాల్లో రికార్డుల నిర్వహణ పక్కాగా నిర్వహించినట్టుగా ఇకనుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులను నిర్వహించనున్నారు. మ్యుటేషన్, రికార్డుల మార్పులు జరిగినప్పుడు వాటిని గ్రామ పహాణి, ప్రభుత్వ భూముల రిజిస్టర్‌లను మారుస్తారు. భూభారతి పోర్టల్‌లో దరఖాస్తుల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. తహసీల్దార్ నిర్ణయంపై ఆర్డీఓకు, ఆర్డీఓ నిర్ణయంపై కలెక్టర్‌కు, కలెక్టర్ నిర్ణయంపై ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీళ్లను 60 రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ రైతులకు ఉచిత న్యాయసాయాన్ని అందించనున్నారు. మండలస్థాయి, జిల్లా లీగల్ అథారిటీల ఆధ్వర్యంలో పేద రైతులకు ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించనున్నారు.
ధరూరు: రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో నూతనంగా అమలులోకి తెచ్చిన భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకుగాను శనివారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధరూరుకు రానున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు ధరూరు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో సభ ఏర్పాటు చేయగా.. ఉదయం 9.15 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి ఉదయం 8.05 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా గద్వాలకు, అక్కడి నుంచి రోడ్డు మార్గంగుండా ధరూరుకు చేరుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు సభా స్థలాన్ని శుక్రవారం సాయంత్రం కలెక్టర్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో పాటు ఆయా శాఖల అధికారులు పరిశీలించారు. సభ ముగిసిన అనంతరం 11 గంటలకు నాగర్‌కర్నూలుకు బయలుదేరి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
న్యూస్‌రీల్
మోసపూరితంగా పట్టాలు పొందితే చర్యలు..
ఇష్టారీతిగా భూ రికార్డుల్లో మార్పులు చేయడం, మోసపూరితంగా భూమి హక్కులు, పట్టాలను పొందితే వాటిని వెంటనే రద్దు చేయనున్నారు. ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టాలుగా పొందితే ఆ భూములన్నీ రద్దు కానున్నాయి. ఈ భూములు అన్యాక్రాంతం అయినట్టుగా అనుమానాలున్నా ప్రజలు నేరుగా సీసీఎల్‌ఏకు ఫిర్యాదు చేయవచ్చని భూభారతి చట్టం పేర్కొంది.
గ్రామాల్లో ఎక్కువగా ఆబాదీ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. గ్రామకంఠం, ఆబాదీ భూముల్లో ఇళ్లు ఉన్నవారికి సరైన చట్టబద్ధమైన భూ హక్కులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్లస్థలాలు, ఆబాదీ, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులను పక్కాగా నిర్వహిస్తారు. ప్రతి భూ యజమానికి ఆధార్ తరహాలో భూధార్ కార్డులను జారీ చేస్తారు. భూభారతి పోర్టల్‌లో ఉన్న హక్కుల రికార్డు ఆధారంగా తహసీల్దార్లు భూధార్ కార్డులను జారీ చేయనున్నారు.
కొత్త రెవెన్యూచట్టంలో సాదా బైనామా దరఖాస్తులను సైతం పరిష్కరించాలని నిర్ణయించడంతో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో కదలిక రానుంది. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం విచారణకు రావాలని సంబంధిత ఆర్డీఓ నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత దరఖాస్తుదారుడు అఫిడవిట్ సమర్పించాలి. ఆర్డీఓ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సాదాబైనామా దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటారు. వీటిలో అసైన్డ్, సీలింగ్, షెడ్యూల్ ఏరియా భూములు ఉంటే వాటిపై భూ హక్కులు ఉండవు. దరఖాస్తు సక్రమంగా తేలితే ఆర్డీఓ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 90 రోజుల్లోగా పూర్తికావాలని చట్టంలో నిర్దేశించారు.
ఉమ్మడి జిల్లాలో నేడుమంత్రి పొంగులేటి పర్యటన..
భూభారతి చట్టంపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు నిర్వహించే అవగాహన సదస్సునకు హాజరయ్యేందుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. జోగుళాంబ గద్వాలతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని సదస్సుల్లో పాల్గొంటారు. శనివారం ఉదయం 8.50 గంటలకు జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. ధరూర్ మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే భూ భారతి చట్టం –2025 అవగాహన సదస్సుల్లో పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రం సమీపంలోని గగ్గలపల్లిలో ఉన్న తేజ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించే అవగాహన సదస్సుకు హాజరవుతారు. అనంతరం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు.
మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
భూభారతిపై విస్త్రృత అవగాహనకల్పించేందుకు సిద్ధమైన ప్రభుత్వం
60 రోజుల్లో సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త రెవెన్యూ చట్టం
సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
నేడు గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి పొంగులేటి

జోగుళాంబ గద్వాల

జోగుళాంబ గద్వాల