
కేంద్ర పథకాలను సద్వినియోగించుకోవాలి
ఎర్రవల్లి: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. శుక్రవారం మండలంలోని కోదండాపురంలో మండలాద్యక్షుడు జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో గావ్ చలో గర్ చలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల గురించి ప్రజలకు వివరించారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసి ఎంతో కృషి చేస్తుందన్నారు. దీనిలో భాగంగానే పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణం వీధిలైట్లను ఏర్పాటు చేసిందని, కరోనా కాలం నుంచి ఉచితంగా రేషన్ బియ్యం, ఉపాధిహామీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పిస్తుందన్నారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్, ప్రదానమంత్రి ఆవాస్‌యోజన, ఫసల్ బీమా యోజన, గ్రామ సడక్ యోజన, జన్‌ధన్ యోజన, కౌశల్ వికాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ముద్ర యోజన, ఉజ్వల యోజన వంటి అనేక పథకాలను ప్రవేశ పెట్టి పేద, మధ్యతరగతి ప్రజలకు చేయూతను అందిస్తుందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు కే.కే రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విజయ్, నరేష్, పరుశరామ్, రాముడు, రామకృష్ణ, మహేష్, నారాయణ పాల్గొన్నారు.