జిల్లాలో వరుస బలవన్మరణాలు
వీడని మిస్టరీ..
పై నాలుగు కేసుల్లోనూ కుటుంబసభ్యులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి కేసు విషయానికి వస్తే.. మల్దకల్‌కు చెందిన యువకుడు ఇంట్లో ఒక్కడే ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న గద్వాలకు చెందిన ట్రాన్స్‌జెండర్, మరికొంత మంది అతని ఇంట్లోకి వెళ్లారు. నిమిషాల వ్యవధిలోనే యువకుడు బలవన్మరణానికి పాల్పడినట్లు చెబుతూ.. ట్రాన్స్‌జెండర్‌తోపాటు వెళ్లిన వ్యక్తులు అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించి, ఆ తర్వాత అక్కడి నుంచి జారుకోవడం గమనార్హం. రెండో ట్రాన్స్‌జెండర్ కేసు విషయానికి వస్తే.. గద్వాలకు చెందిన యువకుడు, ట్రాన్స్‌జెండర్ రహస్యంగా ప్రేమించుకుంటుండగా.. ట్రాన్స్‌జెండర్ సోదరుడు, మరొకరు యువకుడి ఇంటి వద్దకు వచ్చి బైక్‌పై అతడిని ఎక్కించుకొని వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. గంటల వ్యవధిలోనే యువకుడు అతని తండ్రి సమాధి వద్ద పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. చికిత్స నిమిత్తం తరలించినా లాభం లేకుండా పోయింది. పోలీసులు ట్రాన్స్‌జెండర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పడం గమనార్హం. మృతుడి ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయని పోలీసులు విచారించగా.. అవి ఎప్పటినుంచో ఉన్నాయని తెలిపినట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు ఫారెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. మరో రెండు మృతి కేసుల్లోనూ కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయగా.. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గద్వాల క్రైం: నడిగడ్డలో ఇటీవల చోటుచేసుకున్న వరుస అనుమానాస్పద మృతి కేసులు పోలీసులకు సవాళ్లు విసురుతున్నాయి. నిజంగా వారిది ఆత్మహత్యనా.. లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేది అంతుచిక్కట్లేదు. అనుమానం.. అవమాన భారం.. వ్యక్తిగత సమస్యలు.. వివాహేతర సంబంధాల కారణంగా సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ క్షణికావేశంలో తనువు చాలిస్తున్న వారే అధికం. దీనికితోడు మల్దకల్ మండలంలో ఓ యువకుడు ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతూ ఇటీవల అనుమానాస్పదంగా మృతిచెందడం.. అంతకుముందు జిల్లా కేంద్రంలో మరో యువకుడు సైతం ట్రాన్స్‌జెండర్‌తో స్నేహంగా ఉన్న క్రమంలోనే అనుమానాస్పదంగా మృతిచెందడం జిల్లాలో కలకలం రేపింది. ఈ మరణాలపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. మృతికి గల కారణాలు, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా ఎదురుచూస్తున్నారు.
●
● 2025 మార్చి 27న...హన్మకొండ, సిద్దిపేట జిల్లాలకు చెందిన యువతీ యువకుడు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకొని జీవనోపాధి నిమిత్తం గద్వాలకు వచ్చారు. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే దంపతుల మధ్య డబ్బు విషయమై తరచూ విభేదాలు వచ్చేవి. ఈక్రమంలో మార్చి 27న భర్త పని నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాకు వెళ్లగా.. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య (35) ఫ్యాన్‌కు ఉరేసుకుని అత్మహత్య యత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ నెల 6వ తేదీన మృతి చెందింది. ఈ సంఘటనపై మృతురాలి సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
జిల్లాలో చోటుచేసుకున్న
సంఘటనలు..
● 2025 ఏప్రిల్ 11న.. మల్దకల్ మండలానికి చెందిన ఓ యువకుడు (35) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే సదరు యువకుడు గతకొంత కాలంగా గద్వాలకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్‌తో చనువుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న మనస్పర్థల నేపథ్యంలో యువకుడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనపై మల్దకల్ పోలీసు స్టేషన్‌లో అనుమానాస్పద కేసు నమోదైంది.
త్వరలో కేసులు
ఛేదిస్తాం
ఎంతటి విపత్కర కేసులైన పోలీసుశాఖ పూర్తి ఆధారాలతో నిందితులను గుర్తిస్తాం. సాంకేతిక పరమైన అంశాలే కీలకంగా ఉంటాయి. ఏ చిన్న తప్పిదం జరిగినా పోలీసుశాఖపై విమర్శలు ఉంటాయి. బలవన్మరణాలు లేక హత్య చేయబడ్డారనే విషయాలపై ప్రత్యేక బృందంచే విచారణ జరిపిస్తున్నాం. కేసుల మిస్టరీలను త్వరలో ఛేదిస్తాం. అన్ని నివేదికలు, సాక్షుల వాంగ్మూలం మేరకు దోషులకు చట్టపరమైన చర్యలు ఉంటాయి.
– శ్రీనివాసరావు, ఎస్పీ
● 2024 డిసెంబర్ 11న.. మల్దకల్ మండలానికి చెందిన యువతీ యువకుడు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో భర్త గద్వాలలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటుండగా, భార్య హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండేది. కొన్నాళ్లకు భార్య.. గద్వాలలో భర్త ఉంటున్న ఇంటికి వచ్చింది. రెండు రోజులు ఇద్దరు కలిసే ఉన్నారు. అయితే డిసెంబర్ 11న ఉదయం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లగా భార్య ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతిచెందింది. ఈ సంఘటనపై యువతి తండ్రి అనుమానం వ్యక్తం చేస్తు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
● 2025 ఫిబ్రవరి 4న.. గద్వాలకు చెందిన ఓ యువకుడు (25) అదే కాలనీకి చెందిన ఓ ట్రాన్స్‌జెండర్‌తో కొంతకాలంగా స్నేహంగా ఉన్నాడు. ఈక్రమంలోనే స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అంతలోనే.. ఫిబ్రవరి 4న సదరు యువకుడు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్నేహితులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక మూడురోజుల అనంతరం మృతి చెందాడు. అయితే యువకుడి శరీరంపై కాలిన గాయాలు ఉండడంతో తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
హత్యనా.. ఆత్మహత్యనా తేలని మిస్టరీ
ట్రాన్స్‌జెండర్లతో చనువు.. ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి
కేసుల్లో పోలీసులు
పురోగతి సాధించేనా ?
అంతుచిక్కట్లేదు..!
అంతుచిక్కట్లేదు..!
అంతుచిక్కట్లేదు..!