గండేపల్లి (తూర్పు గోదావరి) : అతి వేగంగా వెళ్తున్న లారీ.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి అనంతరం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండల కేంద్ర శివారులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల నుంచి ఐరన్ ముడి సరుకుతో విశాఖ వెళ్తున్న లారీ గండేపల్లికి చేరుకోగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో.. డ్రైవర్ కటారి పిచ్చియ్య(35) క్యాబిన్లో ఇరుక్కొని మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.