
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో పండగ పూట విషాదం నెలకొంది. ఆదివారం హుస్నాబాద్- కరీంనగర్ రహదారిపై అతివేగంతో అదుపు తప్పిన కారు మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో యశ్వంత్ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు.
అజయ్, అఖిల్, వెంకటేష్ అనే ముగ్గురు మైనర్లకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. కారు బోల్తా పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.