lorry overturns
-
ఆయిల్ కోసం ఉరుకులు పరుగులు
పిడుగురాళ్లరూరల్ : ఆయిల్ ట్యాంకర్‌కు గేదె అడ్డుగా రావడంతో ట్యాంకర్ బోల్తాపడి ఒకరు గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ కామేపల్లి గ్రామ బైపాస్ మీద గేదె అడ్డుగా రావడంతో వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ సుభాని గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతనిని స్థానిక ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. బోల్తాపడిన ట్యాంకర్ నుంచి లీకవుతున్న ఆయిల్ కోసం చుట్టుపక్కల గ్రావూల నుంచి ప్రజలు బిందెలు, బకెట్లు పట్టుకుని ఆ ప్రాంతానికి పరుగులుదీశారు. బిస్కెట్ల తయూరీకి దీనిని వాడతారని, ఇళ్లల్లో వినియోగించవచ్చా లేదో తెలియదని లారీ క్లీనర్ చెప్పాడు. -
కాలువై పారిన ముడి పామాయిల్
గుంటూరు : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి వద్ద పామాయిల్ వరదై ప్రవహించింది. స్థానికులు బిందెలు, బకెట్లతో పట్టుకెళ్లారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు ముడి పామాయిల్‌తో వెళ్తున్న ట్యాంకర్ మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్యాంకులోని ఆయిల్ కిందికి లీకై పక్కనే ఉన్న పంట కాల్వ నిండింది. గమనించిన గ్రామస్తులు వెంటనే బిందెలు, బకెట్లతో అక్కడికి చేరుకుని పామాయిల్‌ను పట్టుకెళ్లిపోయారు. అది వంటకు పనికి రాదని ట్యాంకర్ డ్రైవర్ వారించినా పట్టించుకోలేదు. -
లారీ బోల్తా పడి 30 గోవులు మృతి
ఆత్మకూరు (కర్నూలు జిల్లా) : ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామ శివారులోని భవనాపి వంతెన వద్ద ఆదివారం ఓ లారీ బోల్తాపడి 30 ఆవులు మృతిచెందాయి. మరో 15 ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు లారీల్లో గోవులను తరలిస్తుండగా వంతెన వద్ద మలుపులో ఒక లారీ బోల్తాపడింది. దాంతో 30 ఆవులు అక్కడికక్కడే మృతిచెందాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
పత్తి లారీ బోల్తా: డ్రైవర్ కు గాయాలు
చింతపల్లి (నల్లగొండ) : అధిక లోడుతో వెళ్తున్న పత్తి లారీ అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల శివారులో ఆదివారం చోటుచేసుకుంది. హోమంతాలపల్లి గ్రామం నుంచి చింతపల్లికి పత్తి లోడుతో వెళ్తున్న లారీ చింతపల్లి శివారులోని మూలమలుపు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా కొట్టి బ్రిడ్జి నుంచి కింద పడింది. దీంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. -
చెరకు లారీ బోల్తా..
నారాయణఖేడ్ (మెదక్) : వేగంగా వెళ్తున్న చెరకు లారీ లోడు ఎక్కువవడంతో అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా కొట్టింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని మంగల్‌పేట్ గ్రామ హనుమాన్ మందిరం వద్ద 50వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మానూరు నుంచి నిజామాబాద్ వెళ్తున్న చెరకు లారీ మందిరం సమీపంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. లారీ కింద ఎవరైనా ఇరుక్కున్నారేమో అనే విషయం తెలియాల్సి ఉంది. -
లారీ బోల్తా : డ్రైవర్ మృతి
గండేపల్లి (తూర్పు గోదావరి) : అతి వేగంగా వెళ్తున్న లారీ.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి అనంతరం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండల కేంద్ర శివారులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల నుంచి ఐరన్ ముడి సరుకుతో విశాఖ వెళ్తున్న లారీ గండేపల్లికి చేరుకోగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో.. డ్రైవర్ కటారి పిచ్చియ్య(35) క్యాబిన్లో ఇరుక్కొని మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కూలిన కల్వర్ట్ : లారీ బోల్తా
శావల్యాపురం (గుంటూరు) : రోడ్డుపైన ఉన్న కల్వర్ట్(చిన్న వంతెన) ఒక్కసారిగా కూలిపోవడంతో వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. ధాన్యం లోడుతో వేల్పూరు నుంచి శావల్యాపురం వెళ్తున్న లారీ గ్రామ శివారులోకి చేరుకోగానే రోడ్డుపైన ఉన్న కల్వర్టు కూలిపోయింది. దీంతో లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతిచెందాడు. లారీలో ఉన్న 350 బస్తాల ధాన్యం నీళ్ల పాలయ్యాయి. దీంతో సుమారు రూ. 4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని స్థానికులు అంటున్నారు. -
టైరు పేలి లారీ బోల్తా
ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) : గ్రానైట్ లోడ్‌తో వెళుతున్న లారీ బోల్తా కొట్టింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ఆదివారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం... ఒడిశాలోని బరంపుర నుంచి గ్రానైట్ లోడ్‌తో వెళుతున్న వాహనం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద జాతీయ రహదారిపై టైరు పేలడంతో అదపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డుకు ఎడమవైపు పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి.