ఆత్మకూరు (కర్నూలు జిల్లా) : ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామ శివారులోని భవనాపి వంతెన వద్ద ఆదివారం ఓ లారీ బోల్తాపడి 30 ఆవులు మృతిచెందాయి. మరో 15 ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు లారీల్లో గోవులను తరలిస్తుండగా వంతెన వద్ద మలుపులో ఒక లారీ బోల్తాపడింది. దాంతో 30 ఆవులు అక్కడికక్కడే మృతిచెందాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.