కూలిన కల్వర్ట్ : లారీ బోల్తా | One dies as Lorry overturns | Sakshi
Sakshi News home page

కూలిన కల్వర్ట్ : లారీ బోల్తా

Published Fri, Oct 30 2015 3:14 PM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

One dies as Lorry overturns

శావల్యాపురం (గుంటూరు) : రోడ్డుపైన ఉన్న కల్వర్ట్(చిన్న వంతెన) ఒక్కసారిగా కూలిపోవడంతో వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది.

ధాన్యం లోడుతో వేల్పూరు నుంచి శావల్యాపురం వెళ్తున్న లారీ గ్రామ శివారులోకి చేరుకోగానే రోడ్డుపైన ఉన్న కల్వర్టు కూలిపోయింది. దీంతో లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతిచెందాడు. లారీలో ఉన్న 350 బస్తాల ధాన్యం నీళ్ల పాలయ్యాయి. దీంతో సుమారు రూ. 4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని స్థానికులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement