freak accident
-
'కెరీర్‌ను తలకిందులు చేసింది.. మళ్లీ నడుస్తాననుకోలేదు'
ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో గతేడాది ఆగస్టులో ప్రమాదవశాత్తూ గాయపడిన సంగతి తెలిసిందే. గోల్ఫ్ ఆడే క్రమంలో స్టిక్ కాలికి బలంగా తగలడంతో బెయిర్ స్టోకు తీవ్ర గాయాలయ్యాయి. కాలికి సర్జరీ అనంతరం ఎనిమిది నెలల పాటు విశ్రాంతి తీసుకొని కోలుకున్నాడు. ఈ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్ మినీ వేలంలో బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు దక్కించుకుంది. తాజాగా గాయం నుంచి కోలుకున్న బెయిర్ స్టోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) వచ్చే నెలలో ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ఎంపికచేసింది. నిజానికి బెయిర్ స్టో గాయపడే సమయానికి కెరీర్లో పీక్ ఫామ్‌లో ఉన్నాడు. తనను మళ్లీ జట్టులోకి ఎంపిక చేయడంపై బెయిర్ స్టో స్పందించాడు. ఏదో కాలక్షేపం కోసం ఆడిన గోల్ఫ్ తన కెరీర్‌ను తలకిందులు చేసిందని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు. '' నిజానికి మళ్లీ నడుస్తాననుకోలేదు.. ఎందుకంటే కాలికి గోల్ఫ్ స్టిక్ బలంగా తగిలింది. ఇక జీవితంలో జాగ్ చేయడం, నడవడం, పరిగెత్తడం చేయలేకపోవచ్చనుకున్నా. ఈ దెబ్బతో క్రికెట్‌కు దూరమైనట్లేనని భావించా. గాయం నుంచి కోలుకునే సమయంలో నా మైండ్‌లో అన్ని ఇవే ఆలోచనలు. కానీ మన ఆలోచనలే సగం భయాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్‌గా ఆలోచిస్తావో నీలోని ఆందోళన మొత్తం తొలిగిపోతుంది అని డాక్టర్లు నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. వారి సూచనలను సీరియస్‌గా తీసుకొని వర్కౌట్స్ చేశా. వంద శాతం ఫలితం వచ్చింది. కానీ ఇంతకముందులా మైదానంలో పరుగులు తీయగలనా.. ఫీల్డింగ్ చేయగలనా అనే సందేహం ఉండేది. కానీ ఫిట్నెస్ పరంగా తీసుకున్న జాగ్రత్త చర్యలు నాలోని భయాన్ని మొత్తం పోగొట్టాయి.'' అంటూ తెలిపాడు. చదవండి: #RileeRossouw: అచ్చొచ్చిన స్థానం.. మించినోడు లేడు -
కూలిన కల్వర్ట్ : లారీ బోల్తా
శావల్యాపురం (గుంటూరు) : రోడ్డుపైన ఉన్న కల్వర్ట్(చిన్న వంతెన) ఒక్కసారిగా కూలిపోవడంతో వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. ధాన్యం లోడుతో వేల్పూరు నుంచి శావల్యాపురం వెళ్తున్న లారీ గ్రామ శివారులోకి చేరుకోగానే రోడ్డుపైన ఉన్న కల్వర్టు కూలిపోయింది. దీంతో లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతిచెందాడు. లారీలో ఉన్న 350 బస్తాల ధాన్యం నీళ్ల పాలయ్యాయి. దీంతో సుమారు రూ. 4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని స్థానికులు అంటున్నారు. -
గేదెను ఢీకొని యువకుడి మృతి
పులివెందుల (వైఎస్సార్ జిల్లా) : ఓ యువకుడు బైక్‌పై వేగంగా వెళ్తూ రోడ్డుపై అడ్డు వచ్చిన గేదెను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణం కేంద్రంలో వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. వేముల మండలానికి చెందిన గౌస్ ఫీరా(23) పులివెందుల నుంచి బైక్‌పై శనివారం అర్ధరాత్రి వేముల వెళ్తున్నాడు. కాగా పట్టణంలోని విజయ హోమ్స్ రింగ్ రోడ్డు వద్ద గౌస్ బైక్‌తో గేదేను ఢీ కొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ గౌస్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అయితే బైక్ వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన గేదె కూడా అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. -
ట్రాక్టర్ బావిలో పడి వ్యక్తి మృతి
రంగారెడ్డి (దోమ) : పొలం దున్నుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బావిలో పడడంతో ఓ రైతు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా దోమ మండల పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దాదాపూర్ గ్రామానికి చెందిన కంపిళ్ల వెంకటయ్య(30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే ట్రాక్టర్ కొని పొలంలో సొంతగా పనులు చేసుకుంటున్నాడు. కాగా గురువారం ఉదయం అదే గ్రామానికి చెందిన గడ్డమీది భీమయ్య అనే వ్యక్తి పొలంలో మొక్కజొన్న పంట సాగుకై ట్రాక్టర్‌తో పొలం దున్నేందుకు వెళ్లాడు. పొలం మధ్య భాగమంతా దున్నడం పూర్తయ్యాక అంచుల వెంబడి దున్నడానికై ట్రాక్టర్‌ను రివర్స్ తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే దురదృష్టవశాత్తు ట్రాక్టర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పొలం వెనకాలే ఉన్న బావిలోకి ట్రాక్టర్ దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్ వెంకటయ్యపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య లక్ష్మితో పాటు పదేళ్ల లోపు వయసున్న ముగ్గురు కుమారులు ఉన్నారు. -
దుకాణం పైకప్పు కూలి వ్యక్తి మృతి
హైదరాబాద్ : ఇనుపు వస్తువులను అమ్ముకోవడానికి స్క్రాప్ దుకాణానికి వచ్చిన వ్యక్తి దుకాణం పైకప్పు కూలి మృతిచెందిన సంఘటన హైదరాబాద్ తార్నాకలోని లాలాపేటలో ఉన్న ఓ దుకాణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన అభిలాష్(20) సెంట్రింగ్ పనులు చేసుకుంటూ ప్రకాశ్ నగర్లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో సెంట్రింగ్ సమయంలో మిగిలిన ఇనుప వస్తువులను అమ్ముకోవడానికి స్క్రాప్ దుకాణానికి వచ్చాడు. అదే సమయంలో దుకాణం పైకప్పు కూలడంతో అభిలాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
రెండు బండరాళ్ల మధ్య చితికిపోయిన చిన్నారి
రాజుపాలెం : వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం తొండలదిన్నెలో శనివారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఇంటి ముందున్న స్థలంలో రెండు బండరాళ్ల మధ్య ఊయల ఊగుతున్న హనీఫా అనే నాలుగేళ్ల చిన్నారిపై ప్రమాదవశాత్తూ బండరాళ్లు పడటంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదంలో ఊయల ఊపుతున్న చిన్నారి అన్నలు షఫీ(6), మహబూబ్‌బాషా(12)లు ఇద్దరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి గాయపడిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సమయంలో చిన్నారుల తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేరు.