ట్రాక్టర్ బావిలో పడి వ్యక్తి మృతి | Man dies in freak accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బావిలో పడి వ్యక్తి మృతి

Published Thu, Jun 11 2015 6:28 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

Man dies in freak accident

రంగారెడ్డి (దోమ) : పొలం దున్నుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బావిలో పడడంతో ఓ రైతు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా దోమ మండల పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దాదాపూర్ గ్రామానికి చెందిన కంపిళ్ల  వెంకటయ్య(30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే ట్రాక్టర్ కొని పొలంలో సొంతగా పనులు చేసుకుంటున్నాడు. కాగా గురువారం ఉదయం అదే గ్రామానికి చెందిన గడ్డమీది భీమయ్య అనే వ్యక్తి పొలంలో మొక్కజొన్న పంట  సాగుకై ట్రాక్టర్‌తో పొలం దున్నేందుకు వెళ్లాడు. పొలం మధ్య భాగమంతా దున్నడం పూర్తయ్యాక అంచుల వెంబడి దున్నడానికై ట్రాక్టర్‌ను రివర్స్ తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే దురదృష్టవశాత్తు ట్రాక్టర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పొలం వెనకాలే ఉన్న బావిలోకి ట్రాక్టర్ దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్ వెంకటయ్యపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య లక్ష్మితో పాటు పదేళ్ల లోపు వయసున్న ముగ్గురు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement