దోపిడీ దొంగల బీభత్సం | Thieves Attacked | Sakshi
Sakshi News home page

దోపిడీ దొంగల బీభత్సం

Published Sat, Aug 18 2018 9:05 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

Thieves Attacked  - Sakshi

మృతుడు రాజేంద్రకుమార్‌ అగర్వాల్‌తో ఆయన భార్య తారమణి (ఫైల్‌)  

అత్తాపూర్‌ : రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్‌గూడలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వృద్ధ దంపతులు ఉంటున్న ఇంట్లోకి చొరబడి వృద్ధుడిని హ్యతచేసి రూ.50 లక్షల నగదు, 40 తులాల బంగారంతో ఉడాయించారు. హైదర్‌గూడ సిరిమల్లె కాలనీలో రాజేంద్రకుమార్‌ అగర్వాల్‌(72), తారమణి వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్ళు. కుమారులు దీపక్, రోహిత్, కూతురు పూజ హైదర్‌గూడలోని ఆంబియన్స్‌పోర్టు కాలనీలో ఉంటుండగా, మరో కూతురు రేఖ నగరంలోని బంజారాహిల్స్‌లో ఉంటోంది.

రాజేంద్రకుమార్‌ నగరంలోని బేగంబజారులో ప్లాస్టిక్‌ వ్యాపారం చేసేవారు. కొద్ది నెలల క్రితం ఆరోగ్యం సరిగాలేకపోవడంతో వ్యాపారం కొడుకులకు అప్పగించి ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయనకు ఆస్తామా వ్యాధి ఉంది. కాగా,  గురువారం రాత్రి 3 గంటల సమయంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. దంపతులపై దాడిచేసి రాజేంద్రకుమార్‌ చేతులను కట్టేసి నోటికి ప్లాస్టర్‌ వేశారు. తారమణి చేతులు కట్టేసి అరవకుండా భయపెట్టి ఇంట్లో దాచిన రూ.50లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

దొంగలు వెళ్లిపోయిన అనంతరం తారమణి వంటగదిలోకి వెళ్ళి చాకుతో తాళ్ళను కోసి భర్త రాజేంద్రకుమార్‌ వద్దకు వెళ్లింది. ఉలుకు పలుకు లేకపోవడంతో వెంటనే ఆమె అదే కాలనీలో ఉన్న డాక్టర్‌ వద్దకు వెళ్లి నిద్రలేపింది. ఆయన వచ్చి చూసి ఆస్పత్రికి తీసుకెళ్లాలని తెలిపి ఆయన కుమారులు దీపక్, రోహిత్‌కు జరిగిన ఘటనపై సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన కుమారులు కంట్రోల్‌రూంకు సమాచారం అందించి రాజేంద్రకుమార్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.

విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని మృతదేహాన్ని  ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్‌ సీసీ సజ్జనార్‌ సిరిమల్లె కాలనీకి చేరుకొని ఘటనపై  ఆరాతీశారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్వా్కడ్‌ సహాయంతో ఆధారాలు సేకరించారు.  

ఘటనపై అనుమానాలు  

ఘటన జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజేంద్రకుమార్‌ అగర్వాల్‌ భా ర్య చెబుతున్న మాటలకు.. జరిగిన తీరుకు పొం తన లేకపోవడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తమపై దాడి చేసినప్పుడు తాను కిందపడి పోయినట్లు నటించానని, అనం తరందొంగలు వెళ్లిపోయాక వంటగదిలోకి దొర్లు తూ వెళ్లి చేతి కట్లను చాకుతో తెంపుకొని ఇంటి పక్కనే ఉన్న డాక్టర్‌ వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పానని మృతుడి భార్య పోలీసులకు తెలిపింది.

కానీ, ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగలు ఎందుకు ఎత్తుకు వెళ్లలేదన్న అనుమానం పోలీసులకు కలుగుతుంది. ఇంటి తలుపులు పెట్టి ఉండ గా ఇంట్లోకి దొంగలు ఎలా ప్రవేశించారో తెలియడం లేదని, ఎక్కడ కూడా తలుపులు విరగ్గొట్టిన దాఖలాలు లేవని చెబుతున్నారు. తెలిసిన వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

పనివారిపై ఆరా...

గతంలో రాజేంద్రకుమార్‌ వద్ద పనిచేసిన వారిపై, ప్రస్తుతం పనిచేస్తున్నవారిపై పోలీసులు నిఘాపెట్టారు. గతంలో రాజేంద్రకుమార్‌ వద పనిచేసిన ఓ వ్యక్తి నాలుగు నెలలుగా కనిపించడం లేదని తెలుస్తోంది. ఆయన వెళ్లిపోయేటప్పుడు మరో డ్రైవర్‌ని రాజేంద్రకుమార్‌ వద్ద పనికి పెట్టిట్లు పోలీసులు గుర్తించారు.   

తెలిసిన వారి పనే..

వృద్ధ దంపతులపై దాడి చేసిన దోపిడీకి పాల్పడిన ఘటన పరిశీలిస్తే  తెలిసిన వారే ఈ పనిచేసినట్టు అవగమవుతుందని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. రాజేంద్రకుమార్‌ ఒంటిపై గాయాలు ఏమీ లేవన్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. మృతుడి నోటికి ప్లాస్టర్‌ వేయడంతో ఊపిరి ఆడక చనిపోయాడని, మృతుడి పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టి, త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement