విశాఖ జిల్లా దేవరపల్లి మండలం సీతంపేట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది.
విశాఖపట్నం (మాడుగుల) : విశాఖ జిల్లా దేవరపల్లి మండలం సీతంపేట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ పక్కనే ఉన్న కాలువలో పడటంతో డ్రైవర్ కురందాసు తాతాలు(36) అక్కడికక్కడే మృతిచెందాడు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.