రెండు బండరాళ్ల మధ్య చితికిపోయిన చిన్నారి | four years old girl dies in freak accident | Sakshi
Sakshi News home page

రెండు బండరాళ్ల మధ్య చితికిపోయిన చిన్నారి

Published Sat, May 30 2015 2:28 PM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

four years old girl dies in freak accident

రాజుపాలెం : వైఎస్సార్‌ జిల్లా రాజుపాలెం మండలం తొండలదిన్నెలో శనివారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఇంటి ముందున్న స్థలంలో రెండు బండరాళ్ల మధ్య ఊయల ఊగుతున్న హనీఫా అనే నాలుగేళ్ల చిన్నారిపై ప్రమాదవశాత్తూ బండరాళ్లు  పడటంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదంలో ఊయల ఊపుతున్న చిన్నారి అన్నలు షఫీ(6), మహబూబ్‌బాషా(12)లు ఇద్దరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి గాయపడిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద  సమయంలో చిన్నారుల తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement