చింతపల్లి (నల్లగొండ) : అధిక లోడుతో వెళ్తున్న పత్తి లారీ అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల శివారులో ఆదివారం చోటుచేసుకుంది.
హోమంతాలపల్లి గ్రామం నుంచి చింతపల్లికి పత్తి లోడుతో వెళ్తున్న లారీ చింతపల్లి శివారులోని మూలమలుపు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా కొట్టి బ్రిడ్జి నుంచి కింద పడింది. దీంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.