కాలువై పారిన ముడి పామాయిల్
గుంటూరు : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి వద్ద పామాయిల్ వరదై ప్రవహించింది. స్థానికులు బిందెలు, బకెట్లతో పట్టుకెళ్లారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు ముడి పామాయిల్‌తో వెళ్తున్న ట్యాంకర్ మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్యాంకులోని ఆయిల్ కిందికి లీకై పక్కనే ఉన్న పంట కాల్వ నిండింది. గమనించిన గ్రామస్తులు వెంటనే బిందెలు, బకెట్లతో అక్కడికి చేరుకుని పామాయిల్‌ను పట్టుకెళ్లిపోయారు. అది వంటకు పనికి రాదని ట్యాంకర్ డ్రైవర్ వారించినా పట్టించుకోలేదు.