kamepalli
-
గ్యాస్ సిలిండర్ లీకేజీతో ఐదుగురికి తీవ్రగాయాలు
ఆనందంగా పండుగ జరుపుకునేందుకు కుటుంబ సభ్యులందరూ సిద్ధమయ్యారు. రోజూలాగే రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. ఆ భయానికి చుట్టు పక్కలవారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్పటికే ఆ ఇంటి నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరు శబ్దం వచ్చిన ప్రదేశానికి చేరుకునేసరికి ఇల్లు కూలిపోయి ఉంది. ఇంట్లోని ఐదుగురు మంటల్లో కాలి, తీవ్ర గాయాలపాలై హాహాకారాలు చేస్తున్నారు. ఈ సంఘటన కామేపల్లి మండల పరిధిలోని కొమ్మినేపల్లి పంచాయతీ పండితాపురంలో ఆదివారం తెల్లవారుజామున 3:30 నుంచి 4 గంటల మధ్య చోటుచేసుకుంది. సాక్షి, కామేపల్లి: గ్యాస్ సిలిండర్ లీకై ఐదుగురు తీవ్రంగా గాయపడడంతోపాటు ఇల్లు కూలిపోయింది. గ్రామస్తుల కథనం మేరకు.. బోయినపల్లి ఉపేంద్రమ్మ తన కూతురు వంగా నాగమణి, మనుమళ్లు పల్లె నగేష్‌బాబు, మందా శ్రీనాథ్, మందా వినయ్‌కుమార్ ఇంట్లో నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున ఉపేంద్రమ్మ మనుమడు లేచి కరెంట్ స్విచ్ ఆన్‌చేశాడు. అప్పటికే గ్యాస్ సిలిండర్ లీకవుతుండడంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని భారీ శబ్దాలు వచ్చాయి. ఈ ఘటనలో ఇల్లు కూలిపోయింది. శబ్దానికి ఇరుగుపొరుగు వారు కూడా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భయాందోళనకు గురయ్యారు. తేరుకునేసరికి ఉపేంద్రమ్మ ఇంటి నుంచి కేకలు వినిపిస్తున్నాయి. అక్కడకు వెళ్లి చూడగా ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. శరీరం కాలిపోయి ఆర్తనాదాలు చేస్తున్నారు. వెంటనే వారిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బోయినపల్లి ఉపేంద్రమ్మ 65 శాతం, వంగా నాగమణి 43 శాతం, పల్లె నగేష్‌బాబు 90 శాతం, మందా వినయ్‌కుమార్ 65 శాతం, మందా శ్రీనాథ్ 70 శాతం వరకు శరీరం కాలిపోయింది. ఉపేంద్రమ్మ కుమార్తె వంగా నాగమణి ప్రస్తుతం 6 నెలల గర్భవతి. ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం పొందుతున్న క్షతగాత్రులను ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, భద్రాది జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మేకల మల్లిబాబుయాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంతోటి అచ్చయ్య పరామర్శించారు. ఎమ్మెల్యే హరిప్రియ వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దీంతో వెంటనే హైదరాబాద్ నిమ్స్‌కు రిఫర్ చేయమని చెప్పడంతో క్షతగాత్రులను వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. క్షతగాత్రులను ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నను కాపాడబోయి తమ్ముడు..అది విని మరొకరు
కామేపల్లి : అన్నను కాపాడబోయి విద్యుత్ షాక్‌కు గురై తమ్ముడు మృతి చెందిన ఘటన కామేపల్లి మండలం నెమలిపురి తండాలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై జి.రంజిత్‌కుమార్ కథనం ప్రకారం.. తండాలో రాంజీ అనే రైతు చేలో వ్యవసాయ కూలీ పనులకు అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు భూక్య హనుమాన్(30), భూక్య మాన్సింగ్ వెళ్లారు. కాసేపటికే గాలి వీచడంతో 11కేవీ విద్యుత్ వైరు తెగి మాన్సింగ్ కాలు పై పడింది. దీంతో షాక్ రావడంతో అతడి కాలు కాలింది. గమనించిన అతడి తమ్ముడు హనుమా న్ అన్నను కాపాడాలని కేకలు వేస్తూ మాన్సింగ్ ను పట్టుకోగా, అతడికీ షాక్ వచ్చింది. సమీపం లో ఉన్న గ్రామస్తులు వచ్చి చూసేసరికి మాన్సింగ్ కాలుకాలడంతో వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు. ఈలోగానే హనుమాన్ కుప్పకూలి పడిపోయి అక్కడే మృతిచెందాడు. మాన్సింగ్ పరిస్థి తి ఆందోళనకరంగా ఉండటంతో ఖమ్మంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో ఏడీ నాగార్జున, ఏఈ భీంసింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శాఖాపరంగా హనుమాన్ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఆగిన సమీప బంధువు గుండె.. మృతుడు హనుమాన్ చిన్నమ్మ భర్త వాంకుడోత్ జగ్గు(65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విద్యుత్ షాక్‌తో హనుమాన్ మృతి చెందాడని, మాన్‌సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయ ని తెలియగానే బిగ్గరగా రోదించాడు. ఒక్కసారిగా గుండెఆగి మృతిచెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మృతితో తండాలో విషాదం నెలకొంది. -
జాస్తిపల్లిలో దారుణ హత్య
కామేపల్లి : భూవివాదాలు.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఓ వ్యక్తిని, అతడి సమీప బంధువే హత్య చేశాడు. కామేపల్లి సీఐ యు.సాంబరాజు తెలిపిన వివరాలు... జాస్తిపల్లి గ్రామస్తుడు చల్లా వెంకన్న(50) దం పతులు ఆదివారం రాత్రి తన ఇంటి ఆరుబయట పడుకున్నడు. తెల్లవారుజామున, వెంకన్నపై సమీప బంధువులు కోట కత్తితో దాడికి దిగారు. వెంకన్న భార్య గమనించి గట్టిగా కేకలు వేయడంతో వారు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వెంకన్న, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. భూతగాదాల కారణంగానే తన భర్తను సమీప బంధువులు చంపారని వెంకన్న భార్య వెంటకమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వవైద్యశాలకు తరలించారు. కేసును సీఐ సాంబరాజు దర్యాప్తు చేస్తున్నారు. కఠినంగా శిక్షిస్తాం వెంకన్న హంతకులను కఠినంగా శిక్షిస్తామని ఖమ్మంరూరల్ ఏసీపీ నరేష్‌రెడ్డి చెప్పారు. జాస్తిపల్లి గ్రామాన్ని సందర్శించారు. వెంకన్న భార్య వెంకటమ్మ నుంచి హత్య కారణాలను తెలుసుకున్నారు. ఆధారాలు సేకరించారు. -
బావిలో పడి కానిస్టేబుల్ మృతి
కామేపల్లి: ప్రమాదవశాత్తు బావిలోపడి ఓ కానిస్టేబుల్ మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లిలో జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్లో గుగులోతు రామకృష్ణ (39) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గ్రామ శివారులోని వ్యవసాయ బావి వైపు మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. ఈయన స్వగ్రామం తల్లాడ. రెండున్నరేళ్లుగా కామేపల్లిలో పనిచేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఆయిల్ కోసం ఉరుకులు పరుగులు
పిడుగురాళ్లరూరల్ : ఆయిల్ ట్యాంకర్‌కు గేదె అడ్డుగా రావడంతో ట్యాంకర్ బోల్తాపడి ఒకరు గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ కామేపల్లి గ్రామ బైపాస్ మీద గేదె అడ్డుగా రావడంతో వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ సుభాని గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతనిని స్థానిక ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. బోల్తాపడిన ట్యాంకర్ నుంచి లీకవుతున్న ఆయిల్ కోసం చుట్టుపక్కల గ్రావూల నుంచి ప్రజలు బిందెలు, బకెట్లు పట్టుకుని ఆ ప్రాంతానికి పరుగులుదీశారు. బిస్కెట్ల తయూరీకి దీనిని వాడతారని, ఇళ్లల్లో వినియోగించవచ్చా లేదో తెలియదని లారీ క్లీనర్ చెప్పాడు. -
కాలువై పారిన ముడి పామాయిల్
గుంటూరు : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి వద్ద పామాయిల్ వరదై ప్రవహించింది. స్థానికులు బిందెలు, బకెట్లతో పట్టుకెళ్లారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు ముడి పామాయిల్‌తో వెళ్తున్న ట్యాంకర్ మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్యాంకులోని ఆయిల్ కిందికి లీకై పక్కనే ఉన్న పంట కాల్వ నిండింది. గమనించిన గ్రామస్తులు వెంటనే బిందెలు, బకెట్లతో అక్కడికి చేరుకుని పామాయిల్‌ను పట్టుకెళ్లిపోయారు. అది వంటకు పనికి రాదని ట్యాంకర్ డ్రైవర్ వారించినా పట్టించుకోలేదు. -
కట్నం వేధింపులతో బాలింత హత్య
కామేపల్లి (ఖమ్మం) : కట్నం వేధింపులతో బాలింతను హత్య చేసిన వ్యక్తి ఇంటి ముందు మృతదేహంతో బంధువులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవిందరాల గ్రామానికి చెందిన నెహ్రూ(26), పద్మ(22) లు నాలుగేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా నెహ్రూ కట్నం తీసుకు రావల్సిందిగా పద్మను వేధిస్తున్నాడు. మూడు రోజుల క్రితం పద్మ గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పద్మ బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి నెహ్రూ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. కాగా.. మృతురాలికి రెండు నెలల పాప ఉంది. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..
- భార్యను హతమార్చిన భర్త - భర్తపై కేసు నమోదు - పోలీసుల అదుపులో నిందితుడు కామేపల్లి : వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉందని కట్టుకున్న భార్యను గొడ్డలితో కొట్టి చంపిన సంఘటన మండల పరిధిలోని పాతలింగాల గ్రామంలో బుధవారం జరిగింది. కామేపల్లి ఎస్సై ఇ.శ్రీనివాస్ కథనం ప్రకారం... ములకలపల్లి మండలం రాజుపేటకు చెందిన జగన్నాథ కృష్ణవేణి(33)కి పాతలింగాల గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ జగన్నాథ వెంకన్నతో గత 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొంతకాలంగా వెంకన్న తాగుడుకు బానిసై, మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అయితే భార్య కృష్ణవేణి భర్త వెంకన్నను తమ పద్ధతులను మార్చుకోవాలని ప్రాధేయపడింది. అయినా వెంకన్న తీరు మాత్రం మారలేదు. ఎలాగైనా భార్యను అడ్డుతొలగించుకోవాలని పథకం పన్నాడు. దీంతో ఉదయమే మద్యం మత్తులో ఉన్న వెంకన్న భార్య కృష్ణవేణిని ఇంట్లో ఉన్న గొడ్డలితో తలపై బలంగా కొట్టాడు. దీంతో కృష్ణవేణి అక్కడికక్కడే మృతిచెందింది. పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కల గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై నిందితుడిని అదుపుతోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా సీఐ డి.రమేష్ కూడా కృష్ణవేణి హత్యకు గల కారణాలను గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
అట్రాసిటీ కేసులో ఆరుగురి అరెస్టు
కామేపల్లి, న్యూస్‌లైన్ : మండల పరిధిలోని బండిపాడు గ్రామానికి చెందిన ఆరుగురిని అట్రాసిటీ కేసులో అరెస్టు చేసినట్లు కామేపల్లి ఎస్సై బి.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... బండిపాడుకు చెందిన జాటోత్ మంగ్తు, అదే గ్రామానికి చెందిన వేగినాటి రామారావు పొలం వద్ద గత నెల 9న గొవడపడ్డారు. దీంతో మంగ్తుపై వేగినాటి రామారావు, కానబోయిన బిక్షం, కొల్లి శ్రీకాంత్‌తో పాటు మరో ముగ్గురు దాడి చేసి కులం పేరుతో దూషించారు. మంగ్తు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. వేర్వేరు కేసుల్లో ముగ్గురు... ఎర్రుపాలెం: వేర్వేరు కేసుల్లో ముగ్గురిని సోమవారం అరెస్టుచేసి మధిర కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై టి.సురేష్ తెలిపారు. మండలంలోని మామునూరు గ్రామంలో ఇటీవల చోరీకి గురైన రెండు విద్యుత్ మోటార్లున కొనుగోలు చేసిన కేసులో కృష్ణా జిల్లా తిరువూరు పట్టణానికి చెందిన గంధసిరి వెంకన్న(45) అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మండలంలోని కాచారంగ్రామానికి చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన అదే గ్రామానికి చెంది న మస్తాన్(40)ను, మండలంలోని రాజులదేవరపాడులో మోటారుసైకిల్‌ను ఢీకొట్టిన ఘటనలో అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన ఏడూరి అప్పిరెడ్డి(20)ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు. బ్యాటరీలు అపహరించిన కేసులో... ముదిగొండ : వాహనాల బ్యాటరీలను అపహరించి కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో విక్రయించేందుకు తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై జంగం నాగేశ్వరరావు తెలిపారు. ముదిగొండ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరా ల ప్రకారం... వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం చిలక కోయలపాడుకు చెందిన ఊడుగుల మహేష్, షేక్ చాంద్‌పాషా, జోగి ప్రశాంత్, ఊడుగుల పాపయ్య ముఠా గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముది గొండ, ఖమ్మం రూరల్ మండలంలోని క్వారీలు, గ్రానైట్ ప్యాక్టరీల్లోని టిప్పర్లు, పొక్లైయిన్లు, ట్రాక్టర్లు, లారీల నుం చి బ్యాటరీలను దొంగిలించారు. 28 బ్యాటరీలను ఆటో లో వల్లబికి తరలించారు. అక్కడినుంచి జగ్గయ్యపేటకు వెళ్లడానికి బస్టాండ్‌సెంటర్‌లో ఉన్నారనే సమాచారం మే రకు పోలీసులు అక్కడిని చేరుకుని నలుగురిని అరెస్టు చేశారు. వారినుంచి బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు.