ప్రమాదవశాత్తు బావిలోపడి ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు
కామేపల్లి: ప్రమాదవశాత్తు బావిలోపడి ఓ కానిస్టేబుల్ మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లిలో జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో గుగులోతు రామకృష్ణ (39) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గ్రామ శివారులోని వ్యవసాయ బావి వైపు మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. ఈయన స్వగ్రామం తల్లాడ. రెండున్నరేళ్లుగా కామేపల్లిలో పనిచేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.