
రాంగోపాల్‌పేట్: అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి లోనైన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిటీ పోలీస్ ఐటీసెల్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రంగనాథ్‌రావు (36) కళాసీగూడ కామాక్షి దేవాలయం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య గాజుల దాక్షాయణి, కుమార్తె ఉన్నారు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను అందు కు సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అ యినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో డిప్రెషన్‌కు లోనయ్యాడు. ఆదివారం కుమార్తెతో కలిసి బోయిన్‌పల్లిలోని పుట్టింటికి వెళ్లిన అతడి భార్య దాక్షాయణి అక్కడి నుంచి భర్తకు వీడియో కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు.
దీంతో రాత్రి ఇంటికి వచ్చి చూడగా రంగనాథ్ వెంటిలేటర్ గ్రిల్‌కు ఉరివేసుకుని కనిపించాడు. స్థానికుల సహాయంతో అతడిని కిందకు దించి చూడ గా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీనిపై సమాచారం అందడంతో మహంకాళి ఇన్‌స్పెక్టర్ పరశురాం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment