ఉన్నతాధికారులు బలిపశువును చేశారన్న వేదనతో ఓ కానిస్టేబుల్..
కుటుంబ విభేదాలతో కలతచెంది ఓ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం
బూర్గంపాడు/ఏన్కూరు/మహబూబాబాద్ రూరల్: ఓ కేసులో ఉన్నతాధికారులు తనను బలి పశువును చేశారన్న ఆవేదనతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోగా, కుటుంబ కలహాలతో మరో కాని స్టేబుల్ తుపాకీతో కాల్చుకుని తనువు చాలించాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన భూక్యా సాగర్ (34) భద్రాద్రి జిల్లా బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో గతంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించాడు. ఆ సమయంలో, ఆ తర్వాత లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో పని చేసినప్పుడు గంజాయి అక్రమ రవాణా కేసులో సాగర్ ప్రమేయం ఉందంటూ ఉన్నతాధికారులు ఆయనను అరెస్ట్ చేసి, సస్పెండ్ చేశారు.
ఇటీవలే సస్పెన్షన్ ఎత్తివేసి ఏడూళ్ల బయ్యారంలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన తప్పు లేకున్నా ఎస్సైలు సంతోష్, రాజ్‌కుమా ర్, బీఆర్‌ఎస్ నాయకుడు నాని తనను గంజాయి కేసులో ఇరికించారని.. ఆ నింద మోయలేకపోతున్నా.. చచి్చపోతున్నా అంటూ సాగర్ ఏన్కూరులోని ఎన్‌ఎస్‌పీ ప్రధాన కాల్వ వద్ద పురుగు మందు తాగి సెల్ఫీ వీడియో తీసి శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయిని బయట విక్రయించేందుకు ఎస్సైలు త నపై ఒత్తిడి చేశారని, తన సెల్ నుంచే గంజాయి కొనుగోలుదారులకు ఫోన్లు చేయించారని తెలిపాడు. ఇది బయటపడుతుందన్న భయంతోనే తనను అరెస్ట్ చేయించారని ఆరోపించాడు.
కాగా, పురుగు మందు తాగిన సాగర్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సా యంత్రం మృతిచెందాడు. చికిత్స పొందుతున్న సమయంలో కూడా ‘రేవంతన్నా.. నా కుటుంబానికి న్యాయం చేయండి’అని మరో సెల్ఫీ వీడియో తీశాడు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు ఎస్సైలు, ఒక సీఐ, బీఆర్‌ఎస్ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఏన్కూరు ఎస్సై రఫీ తెలిపారు.
కుటుంబ విభేదాలతో..
మరో ఘటనలో తుపాకీతో కాల్చుకుని ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఎన్‌జీఓస్ కాలనీకి చెందిన గుడిబోయిన శ్రీనివాస్ (59)కు భార్య, కుమారుడు ఉన్నారు. అయితే, విబేధాల కారణంగా ఐదేళ్ల నుంచి వారికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ ఐడీఓసీ ఆవరణలోని స్ట్రాంగ్‌రూం వద్ద ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో తన ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీతో కాల్చుకుని చనిపోయారు.
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
నల్లబెల్లి: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన ధరణికి 2020లో కానిస్టేబుల్ ఉద్యోగం రాగా, వరంగల్ జిల్లా నల్లబెల్లి లోని పోలీస్ క్వార్టర్స్‌లో నివనిస్తోంది. నాలుగు నెలల క్రితం తన పెద్దన్నకు వివాహం అయింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు తన పెళ్లి విషయమై తరచుగా ఆలోచిస్తూ మనస్తాపానికి గురైన ధరణి.. పోలీస్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో ఆదివారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన పోలీసులు మంటలార్పి.. చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment