
దంపతులు సురేష్, షీలా(ఫైల్)
సాక్షి, యశవంతపుర : ప్రేమ వివాహం చేసుకున్న పోలీసు దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. సంపిగేహళ్లి ఉప విభాగంలో ఏసీపీ కార్యాలయంలో రైటర్‌గా పనిచేస్తున్న సురేశ్ (37), బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిటీ ఎస్‌బీలో విధులు నిర్వహిస్తున్న షీలా(36)లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు కొత్తనూరులో నివాసం ఉంటున్నారు.
గురువారం రాత్రి వరకు సురేశ్ సాధారణంగా ఉన్నట్లు సమాచారం. అనంతరం ఇంటికి వెళ్లాడు. శుక్రవారం విధులకు రాకపోవడంతో సిబ్బంది మొబైల్‌కు సందేశం పంపారు. స్పందించలేదు. సమీపంలో ఉంటున్న మరో ఉద్యోగికి సమాచారం ఇచ్చారు. దీంతో అతను అక్కడికి వెళ్లి చూడగా దంపతులు ఇద్దరు చెరో గదిలో ఉరి వేసుకున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. చదవండి: (సీఐడీ డీఎస్పీ లక్ష్మి అనుమానాస్పద మృతి)
Comments
Please login to add a commentAdd a comment