
రంగారెడ్డి: అనారోగ్యం తట్టుకోలేక ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలివీ.. మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడకు చెందిన ఆర్ల బుచ్చయ్య, మణెమ్మ దంపతుల కుమా రుడు వినోద్‌కుమార్(25) మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తు న్నాడు. గత కొన్ని నెలలుగా సోరియాసిస్ వ్యాధి బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన వినోద్‌కుమార్ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గడ్డమల్లయ్యగూడలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికందివచ్చిన కొడుకు ఆసరా అయ్యే సమయానికే ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.