Malkajigiri Police Station
-
బాధతో పార్టీని వీడుతున్నా..
సాక్షి, మేడ్చల్ జిల్లా:/అల్వాల్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు తెలిపారు. అల్వాల్‌లోని ఆయన నివాసం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాననీ, మల్కాజిగిరిలో పార్టీ కోసం పని చేస్తూ ప్రత్యర్థిగా ఉన్న మైనంపల్లి హన్మంతరావుతో విభేదించిన సందర్భంగా పలు కేసులు నమోదు అయ్యాయన్నారు. బీఆర్ఎస్లో తన కొడుకుకు టికెట్ రాకపోవడంతో మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరారని ఈ క్రమంలో తనకు మల్కాజిగిరిలో పార్టీ టికెట్ ఇవ్వలేమన్న సంకేతాలు రావడం బాధించాయన్నారు. బీసీలకు అన్ని పార్టీలకన్నా అధిక సీట్లు ఇస్తామని ప్రకటించిన నాయకులు తన మాదిరిగా వెనుకబడిన తరగతి నుండి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడం చూస్తుంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సందేశం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి దెబ్బే.. శ్రీధర్ రాజీనామాతో టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డికి గట్టి షాక్ తగిలినట్లయింది. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లా పరిధిలో ఉండటం గమనార్హం. సొంత నియోజకవర్గానికి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షుడ్ని కాపాడుకోలేని రేవంత్ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా అధికారంలోకి తీసుకు రాగలరన్న ప్రశ్నలు స్థానికంగా పార్టీ శ్రేణుల నుంచి తలెత్తుతున్నాయి. కాగా శ్రీధర్ బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. -
అనారోగ్యం తట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మహత్య
రంగారెడ్డి: అనారోగ్యం తట్టుకోలేక ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలివీ.. మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడకు చెందిన ఆర్ల బుచ్చయ్య, మణెమ్మ దంపతుల కుమా రుడు వినోద్‌కుమార్(25) మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తు న్నాడు. గత కొన్ని నెలలుగా సోరియాసిస్ వ్యాధి బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన వినోద్‌కుమార్ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గడ్డమల్లయ్యగూడలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికందివచ్చిన కొడుకు ఆసరా అయ్యే సమయానికే ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారని.. యువతి ఆత్మహత్య
గౌతంనగర్: పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారని యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై నాగేశ్వర్రావు తెలిపిన వివరాలు.. మౌలాలికి చెందిన నర్సింహాచారి స్వర్ణ భార్యాభర్తలు. వీరి కూతురు ఎస్.తేజస్విని (22) ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం విద్యార్థిని. ఆమెకు ఆరునెలల క్రితం పెళ్లి సంబంధం కుదిరింది. కుటుంబసభ్యులు పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేసి పత్రికలు కూడా ముద్రించారు. అయితే వారి బంధువులు ఆమెపై దుష్ర్పచారం చేసి సంబంధం చెడగొట్టారు. ఇటీవల మరో సంబంధాన్ని కూడా వారే చెడగొట్టారని మనస్తాపం చెంది సూసైడ్ నోట్ రాసి శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తేజస్విని తండ్రి నర్సింహాచారి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తేజస్విని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.