వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. | Husband kills wife | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..

Published Thu, Aug 20 2015 3:35 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..

- భార్యను హతమార్చిన భర్త
- భర్తపై కేసు నమోదు
- పోలీసుల అదుపులో నిందితుడు
కామేపల్లి :
వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉందని కట్టుకున్న భార్యను గొడ్డలితో కొట్టి చంపిన సంఘటన మండల పరిధిలోని పాతలింగాల గ్రామంలో బుధవారం జరిగింది. కామేపల్లి ఎస్సై ఇ.శ్రీనివాస్ కథనం ప్రకారం... ములకలపల్లి మండలం రాజుపేటకు చెందిన జగన్నాథ కృష్ణవేణి(33)కి పాతలింగాల గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ జగన్నాథ వెంకన్నతో గత 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే  కొంతకాలంగా వెంకన్న తాగుడుకు బానిసై, మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అయితే భార్య కృష్ణవేణి భర్త వెంకన్నను తమ పద్ధతులను మార్చుకోవాలని ప్రాధేయపడింది. అయినా వెంకన్న తీరు మాత్రం మారలేదు.

ఎలాగైనా భార్యను అడ్డుతొలగించుకోవాలని పథకం పన్నాడు. దీంతో ఉదయమే మద్యం మత్తులో ఉన్న వెంకన్న భార్య కృష్ణవేణిని ఇంట్లో ఉన్న గొడ్డలితో తలపై బలంగా కొట్టాడు. దీంతో కృష్ణవేణి అక్కడికక్కడే మృతిచెందింది. పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కల గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై నిందితుడిని అదుపుతోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా సీఐ డి.రమేష్ కూడా కృష్ణవేణి హత్యకు గల కారణాలను గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement