Husband kills wife
-
అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త
చినగంజాం: భార్యను అనుమానించిన ఓ భర్త.. ఆమెను కత్తితో మెడపై నరికి చంపిన సం«ఘటన బాపట్ల జిల్లా చినగంజాం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చినగంజాం పంచాయతీ మహాలక్ష్మీకాలనీకి చెందిన కత్తి దుర్గ (30)ను భర్త కత్తి శ్రీను దారుణంగా కత్తితో దాడి చేసి మెడపై నరికి చంపాడు. వీరికి 15 సంవత్సరాల కిందట వివాహమైంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొంత కాలంగా మహాలక్ష్మీకాలనీలో కాపురం ఉంటున్నారు. భార్య దుర్గ కొద్ది రోజులుగా తరచూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుందనే అనుమానంతో గొడవలు జరుగుతున్నాయి. భర్త వేధింపులు తట్టుకోలేని భార్య దుర్గ.. అదే కాలనీలో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు నెల రోజుల కిందట తన తొమ్మిదేళ్ల రెండో కుమార్తెను వెంట తీసుకుని వెళ్లిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం భర్త కత్తి శ్రీను తన అత్తమామలు ఇంట్లో లేనివేళ వెళ్లి భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరూ వాదులాడుకుంటుండగా, ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం కత్తితో ఆమె మెడపై నరికి దారుణంగా హత్య చేశాడు. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కుమార్తె పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లి స్థానికులకు సమాచారం అందించింది. సంఘటన స్థలానికి వెళ్లిన స్థానికులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు చేరుకునే సరికే దుర్గ మృతి చెంది ఉంది. ఆమె భర్త శ్రీను పరారీలో ఉన్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ, ఎస్ఐ... సంఘటన స్థలాన్ని ఇంకొల్లు సీఐ బీ శ్రీనివాసరావు, చినగంజాం ఎస్ఐ ఎం.శ్రీనివాసరావు పరిశీలించి శవ పంచనామా నిర్వహించారు. దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు కత్తి శ్రీనును పట్టుకుంటామని చెప్పారు.మేం ఇంట్లో లేని సమయంలో మా కుమార్తెను చంపాడు... తాము ఇంట్లో లేకుండా వేటకు వెళ్లిన సమయంలో వచ్చిన తమ అల్లుడు శ్రీను తమ కుమార్డె దుర్గను కత్తితో దారుణంగా నరికి చంపాడని దుర్గ తల్లిదండ్రులు ఎం.అంజయ్య, రాగమ్మ పోలీసులకు తెలిపారు. పెళ్లయిన దగ్గర నుంచి తమ కుమార్తెను తరచూ వేధింపులకు గురిచేసేవాడని చెప్పారు. ఆమెకు ముగ్గురు బిడ్డలున్నారని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను వారు కోరారు. -
భర్త ఘాతుకం.. 6 నెలల క్రితమే ప్రేమ పెళ్లి.. హెల్మెట్ ధరించి మరీ
చెన్నై: తమిళనాడులోని మధురైలో పట్టపగలు నడురోడ్డుపై యువతి హత్యకు గురైంది. ప్రేమ వివాహం చేసుకున్న భర్తే హెల్మెట్ ధరించి ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. వివరాలు.. మధురైలోని సౌత్‌గేట్ సప్పాని కోవిల్ వీధికి చెందిన మీనాక్షి సుందరం చిన్న కుమార్తె వర్ష (19) కీరైత్తురైకు చెందిన పళని(25)ని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. నెలన్నర క్రితం వర్ష పుట్టింటికి వచ్చింది. పళని రావాలని కోరినా నిరాకరించింది. శుక్రవారం మధ్యాహ్నం వర్ష సప్పాని కోవిల్ వీధిలో ఓ దుకాణానికి వెళ్లి ఇంటికి వెళుతోంది. హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చిన పళని ఆమెతో మాట్లాడేందుకు యతి్నంచాడు. ఆమె వినకపోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. అనంతరం బైక్‌పై పరారయ్యాడు. వర్షను చికిత్స నిమిత్తం మధురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సౌత్ గేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పళనిగా గుర్తించారు. ఈ క్రమంలో పళని కీరైత్తురై పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. చదవండి: అమ్మా, పెళ్లికి వెళ్లొస్తాం.. శుభకార్యం కోసం వెళ్లి మృత్యుఒడిలోకి! -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని.. అన్నావదినల సాయంతో
సాక్షి, నిజామాబాద్/సంగారెడ్డి: వివాహేతన సంబంధానికి భార్య అడ్డుగా ఉందన్న నెపంతో అన్నావదినల సహకారంతో భార్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు ఓ భర్త. మంగళవారం పటాన్చెరు పీఎస్‌లో సీఐ వేణు గోపాల్ రెడ్డి వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కారే గాం గ్రామానికి చెందిన బేగరి లక్ష్మణ్‌కు మేనమామ కూతురు యశోద(34)తో వివాహం జరిగింది. కాగా ఐదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం లక్ష్మణ్ భార్యతో కలసి పటాన్చెరు మండల ఇస్నాపూర్ వచ్చాడు. భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. లక్ష్మణ్ అన్న సాయిలు, వదిన నాగమణి కూడా ఇస్నాపూర్‌లోనే ఉంటారు. లక్ష్మణ్‌కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో భార్యతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 3వ తేదీ అర్ధరాత్రి భార్య యశోద గొంతు నులిమి హత్యచేశాడు. అన్న సాయిలు, వదిన నాగమణి సహకారంతో ఆత్మహత్యగా చిత్రీకరించి పటాన్చెరు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే స్వగ్రామానికి యశోద మృతదేహాన్ని తరలించాడు. కాగా మృతురాలి తండ్రి యమన్, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పరిశీలించగా, గొంతుపై గాట్లు ఉండటంతో అనుమానంతో పిట్లం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పిట్లం పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. నవంబర్ 5వ తేదీన పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌కు కేసు బదలాయించారు. రెండు రోజుల క్రితం వచ్చిన పోస్టుమార్టం నివేదికలో యశోద మృతి హత్య అని తేలడంతో పోలీసులు సోమవారం మధ్యాహ్నం కారేగాంలో ఉన్న భర్త లక్ష్మణ్, అతడి సోదరుడు సాయిలు, వదిన నాగమణిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య చేసినట్లుగా నిందితులు తెలిపారు. హత్య చేసి ఆధారాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినందుకు పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో క్రైం సీఐ బీసన్న, ఎస్సైలు రామానాయుడు, ప్రసాద్ రావు, ఏఎస్ఐ సురేందర్ రెడ్డి తదితరులున్నారు. చదవండి: పెళ్లయి రెండేళ్లయినా సంతానం కలగలేదని.. భార్యపై.. -
మంచిగా చూసుకుంటాడని నమ్మి వస్తే..
తుమకూరు: పని లేక, తాగుడుకు బానిసైన భర్త ఉన్మాదిగా మారాడు. మంచిగా మారానని మాటిస్తే.. తిరిగి వచ్చిన భార్యాబిడ్డలపై దాష్టికానికి పాల్పడ్డాడు. అత్యంత కిరాతకంగా ఇద్దరినీ కడతేర్చాడు. ఈ దారుణం జిల్లాలోని గుబ్బి తాలూకా నిట్టూరు హోబళి మావినహళ్లి గ్రామంలో జరిగింది. మావినహళ్లి గ్రామానికి చెందిన స్వామి (33)కి భార్య కావ్య (25), కుమారుడు జీవన్ (4) ఉన్నారు. భార్యతో గొడవపడి గునపంతో భార్య, కుమారుని తలపై కొట్టి ప్రాణాలు తీశాడు. రక్తసిక్తమైన ఇంట్లో పడి ఉన్న భార్య, కుమారుని మృతదేహాలను చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురి అయ్యారు. పారిపోయేందుకు యత్నించిన కిరాతకున్ని గ్రామస్తులు పట్టుకుని స్తంభానికి కట్టి చేళూరు పోలీసులకు అప్పగించారు. నాలుగు రోజుల కిందటే భార్య రాక గ్రామంలో అర్చక వృత్తి చేసుకునే స్వామిని ఇటీవల ఆ పని నుంచి తొలగించారు. ఊళ్లో అటూ ఇటూ తిరుగుతూ కుటుంబ సభ్యులతో నిత్యం గొడవ పడుతూ ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు. గత ఆరేళ్ల క్రితం స్వామి, కావ్యకు వివాహం జరిగింది. తరచూ కొట్లాటలు అవుతుండడంతో కావ్య నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. బంధువులు రాజీ పంచాయతీ చేసి నాలుగు రోజుల క్రితమే ఒక్కటి చేశారు. మంచిగా చూసుకుంటాడని చెప్పడంతో దీంతో కావ్య తిరిగి భర్త స్వామి ఇంటికి వచ్చింది. కానీ అతనిలోని ఉన్మాది ఊరుకోలేదు. మంగళవారం రాత్రి మరోసారి భార్యతో గొడవకు దిగాడు. కోపోద్రిక్తుడైన స్వామి తన చేతికి అందిన గునపం తీసుకుని కావ్య, నాలుగేళ్ల జీవన్ తలలపై బాది చంపాడు. ఘటనాస్థలి అంతా రక్తం ధార కట్టి భీతావహంగా మారింది. చేళూరు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి స్వామిని అరెస్టు చేశారు. ఇదీ చదవండి: రాజీకి పిలిచి ఘోర అవమానం -
భార్య గొంతుకోసి హత్య
మహబూబాబాద్ రూరల్: మద్యానికి బానిసై విచక్షణ కోల్పోయిన ఓ భర్త మాంసం కోసే కత్తి తో భార్య గొంతుకోసి దారుణంగా చంపాడు. మహబూబాబాద్ అడ్వొకేట్స్ కాలనీ కట్టెలమండి సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ ఎడ్లపల్లి సతీష్, మృతురాలి బంధువులు తెలిపిన ప్రకారం.. మహబూబాబాద్‌లోని భవానినగర్ తండాకు చెందిన జాటోతు భాస్కర్, కల్పన (27).. 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి స్వరూప, రిషిత, వర్షిత సంతానం. జిల్లా కేంద్రంలోని ఓ మాంసం దుకాణంలో భాస్కర్ గుమాస్తాగా పనిచేస్తుండగా, కల్పన పలువురి ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. భాస్కర్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఐదు రోజులుగా కల్పన తల్లిగారి ఇంటి వద్దే ఉంటోంది. గురువారం ఉదయం కల్పన అడ్వొకేట్స్ కాలనీలోని ఇళ్లలో పనికి వెళ్తుండగా.. రోడ్డుపై ఆమెతో భాస్కర్ ఘర్షణకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న భాస్కర్.. భార్య మెడలోని పుస్తెల తాడును తెంపి.. కత్తితో గొంతుకోసి పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కల్పన అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి తమ్ముడు మాలోతు చందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. పిల్లలు పుట్టక ముందు వరకు మంచిగా ఉన్నారని, ఆ తర్వాత తరచూ కల్పనతో భాస్కర్ గొడవ పడుతుండేవాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాగడానికి డబ్బులు ఇవ్వమని అడుగుతూ, మద్యం తాగొచ్చి అసభ్యకరంగా దూషిస్తూ కొట్టేవాడని వెల్లడించాడు. కాగా, భార్యాభర్తల గొడవతో కొద్దిరోజులుగా కల్పన తల్లి వద్దే పిల్లలు ఉంటున్నారు. స్వరూప 8వ తరగతి, రిషిత ఆరో తరగతి, వర్షిత రెండో తరగతి చదువుతున్నారు. తల్లి చనిపోవడం.. తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయనుండటంతో పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
ఖమ్మంలో మరో ‘సూదిమందు’ హత్య
ఖమ్మం క్రైం: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి వద్ద ఇంజక్షన్ ఇచ్చి వ్యక్తిని హత్య చేసిన ఘటన మరవకముందే జిల్లాలో ఇదే తరహాలో మరో ఘటన వెలుగుచూసింది. 50 రోజుల క్రితం జరిగిన ఈ హత్య వివరాలను పోలీసులు తాజాగా బయటపెట్టారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి తండాకు చెందిన తేజావత్ బిక్షం(42) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఈయన మొదటి భార్య విజయకు సంతానం లేకపోవడంతో బయ్యారం మండలం జగ్గుతండాకు చెందిన నవీన(21) అలియాస్ సునీతను రెండోపెళ్లి చేసుకున్నాడు. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలో నవీన, భిక్షం దంపతులు నివసిస్తున్నారు. నవీనకు తొలికాన్పులో కూతురు జన్మించింది. జూలై 30న ఖమ్మంలోని శశిబాల ఆస్పత్రిలో జరిగిన రెండో ప్రసవంలోనూ నవీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వారసుడు కాకుండా ఇద్దరూ కూతుళ్లే జన్మించారనే కోపంతో నవీనను అదే ఆసుపత్రిలో హత్యచేయాలని భిక్షం ప్లాన్ వేశాడు. తాను పనిచేసే ఆరాధ్య ఆస్పత్రి నుంచి మత్తుమందు, ఇంజక్షన్ సేకరించాడు. నవీనకు సహాయకురాలిగా ఉన్న తల్లి మంగి నిద్రలోకి జారుకున్నాక భార్య చేతికి ఉన్న క్యాన్‌లాలోకి మత్తుమందును అధిక మోతాదులో ఎక్కించాడు. భార్యను హత్యచేసిన భిక్షం నిద్రలోనే పరలోకాలకు.. అత్యధిక మోతాదు మత్తుమందు కారణంగా నవీన నిద్రలోనే మృతిచెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే నవీన మృతి చెందిందంటూ భిక్షం తన బంధువులతో కలిసి ఆందోళనకు దిగాడు. దీంతో వైద్యులు రూ.5 లక్షల పరిహారం ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. నవీన మృతదేహానికి పోస్టుమార్టం లేకుండానే తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం నవీన మృతిపై ఆస్పత్రి యాజమాన్యం, ఆమె కుటుంబీకులు అనుమానించి సీసీ పుటేజ్ పరిశీలించగా ఆమె చేతి క్యాన్‌లాలోకి భిక్షం ఇంజక్షన్ ఎక్కిస్తున్న దృశ్యం బయటపడింది. దీంతో ఖమ్మం టూటౌన్ పోలీసులకు తెలపగా తొలుత పట్టించుకోలేదు. ఐఎంఏ బాధ్యులు సీపీ విష్ణు ఎస్.వారియర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాలతో భిక్షంను విచారించగా విషయం బయటపడింది. దీంతో బిక్షంను నెలన్నర క్రితమే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, తాజాగా జమాల్‌ను హత్య చేసిన ఘటనలో నిందితులకు ఖమ్మంలోని ఆరాధ్య ఆస్పత్రిలో పనిచేస్తున్న యశ్వంత్ మత్తు మందు సమకూర్చగా, ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్న భిక్షం అక్కడి నుంచే మందు తీసుకొచ్చి భార్యను హత్య చేయడం గమనార్హం. -
పక్కా ప్లాన్! జెండా వందనం చేశాక మాట్లాడాలని పక్కకు పిలిచి..
చిగురుమామిడి(హుస్నాబాద్): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానమే పెనుభూతమై స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండా ఎగరవేశాక కత్తితో భార్య గొంతు కోసి, కడతేర్చాడు ఓ భర్త.. ఈ ఘటన చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. కేవపట్నం మండల కేంద్రానికి చెందిన అరెపల్లి రవి–యాదమ్మ దంపతుల పెద్ద కూతురు శిరీష. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఇందుర్తికి చెందిన కనకం ప్రవీణ్ డిగ్రీ, శిరీష(27) ఇంటర్ చదివారు. చదువుకునే రోజుల్లోనే వీరికి పరిచయం ఏర్పడింది. ప్రవీణ్ ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి, పెద్దల సమక్షంలో 2012లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు శరణ్య, కుమారుడు శశివర్దన్ ఉన్నారు. 2018లో శిరీష అంగన్వాడీ ఆయా ఉద్యోగానికి ఎంపికైంది. కొంతకాలం తన విధులను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిర్వహించింది. ఈ క్రమంలో గత 6 నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రవీణ్ నిత్యం శిరీషను అనుమానించేవాడు. విచక్షణారహితంగా కొట్టేవాడు. భరించలేని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. (చదవండి: వ్యభిచారం అంటూ హిజ్రాకు బెదిరింపులు.. ఎంతకూ మాట వినకపోవడంతో తోటి హిజ్రాలతో కలిసి..) పెద్ద మనుషులు ఒక్కటి చేసినాగొడవలు ఆగలేదు.. నిత్యం గొడవలు పడుతున్న వీరిని పెద్ద మనుషులు ఒప్పించి, ఒక్కటి చేశారు. దీంతో కొన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ గొడవలు మొదలయ్యాయి. దీంతో శిరీష 2 నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. కోర్టును ఆశ్రయించి, భర్త ప్రవీణ్‌కు విడాకుల నోటీసు పంపించింది. కేశవపట్నం పోలీస్స్టేషన్లోనూ అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో 45 రోజులు అంగన్వాడీ విధులకు హాజరు కాలేదు. అధికారుల మందలింపుతో ఈ నెల 3 నుంచి తన తండ్రి రవిని వెంట తీసుకొని, కేశవపట్నం నుంచి బైక్‌పై అంగన్వాడీ సెంటర్‌కు వస్తోంది. అంగన్వాడీ సెంటర్ పక్కనే ఇల్లు అద్దెకు.. శిరీషను చంపాలని ప్రవీణ్ పథకం వేశాడు. ఇందుర్తిలో అతనికి ఇల్లు ఉన్నా అంగన్వాడీ సెంటర్ పక్కన మరో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అవకాశం కోసం చూసిన ప్రవీణ్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు తన పథకాన్ని అమలు చేశాడు. వివరాలు తెలుసుకుంటున్న సీఐ, ఎస్సైలు చంపవద్దని బతిమిలాడినా వినలేదు సోమవారం స్వాతంత్య్ర వేడుకలకు వచ్చిన శిరీషను ప్రవీణ్ జెండా వందనం పూర్తయ్యాక మాట్లాడాలని పక్కకు తీసుకెళ్లాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఓ యువకుడిపైనా అదే ఆయుధంతో దాడి చేసి, గాయపరిచాడు. తననేమీ చేయొద్దని శిరీష ఎంత బతిమిలాడినా వినకుండా ప్రాణాలు తీశాడు. ఆమె అరుపులు విన్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్‌ను పట్టుకునేలోపే పారిపోయి, చిగురుమామిడి పోలీసులకు లొంగిపోయాడు. ఘటనాస్థలిని తిమ్మాపూర్ సీఐ శశిధర్‌రెడ్డి, చిగురుమామిడి ఎస్సై దాస సుధాకర్‌లు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్‌రావు ఆస్పత్రికి వెళ్లి, శిరీష మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె బంధువులతో మాట్లాడారు. మృతురాలి తండ్రి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. (చదవండి: తమ్మినేని కృష్ణయ్య హత్య.. సంచలన నిజాలు వెల్లడించిన ప్రత్యక్ష సాక్షి) -
వివాహమైన మూడు నెలలకే భార్యపై అనుమానం.. లాడ్జీకి పిలిపించి..
సాక్షి, నల్లగొండ: అనుమానంతో భార్యను కట్టుకున్న భర్తే దారుణంగా హత్య చేశాడు. సిద్దిపేట జిల్లా నిజాంపేటకు చెందిన ముడావత్ శంకర్‌కు మెదక్ జిల్లా శంకరంపేటకు చెందిన శిరీషతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. శంకర్ నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్‌లో జరుగుతున్న రోడ్డు నిర్మాణంలో పనిచేస్తున్నాడు. అయితేశీ రీషపై శంకర్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆ జంట మధ్య గొడవలు జరగడంతో కొన్ని రోజులుగా తన పుట్టింటిలోనే ఉంటుందది కాగా శంకర్ తన భార్య శిరీష(21)ను శుక్రవారం రాత్రి నల్లగొండ పట్టణానికి పిలిపించుకున్నాడు. ఇద్దరు కలిసి పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న పున్నమి లాడ్జీలో రూం తీసుకున్నారు. లాడ్జీలో శంకర్ తన భార్య శిరీష హత్య చేశాడు. పెళ్లయిన మూడు నెలలకే శంకర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. నల్లగొండ టుటౌన్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమ వివాహం.. అర్ధరాత్రి నిద్ర లేచి.. -
భార్యపై అనుమానం, నిత్యం గొడవ.. విడాకులు కావాలని అడగడంతో..
కర్ణాటక (శివాజీనగర) : భార్య శీలాన్ని శంకించి హత్య చేసిన భర్త ఉదంతం హెచ్ఏఎల్ కాళప్ప లేఔట్లో చోటు చేసుకుంది. వివరాలు.. రాయచూరుకు చెందిన నీలకంఠ, నాగమ్మ దంపతులకు ఇద్దరు బాలికలు ఉన్నారు. నీలకంఠ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. భార్య కూడా ఇంటి పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేది. భార్య శీలాన్ని శంకించిన నీలకంఠ తరచూ గొడవపడేవాడు. సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో విడాకులు తీసుకోవాలని భార్య సూచించింది. ఆవేశానికి గురైన నీలకంఠ బెల్ట్‌తో గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
అక్కపై ప్రేమ.. భార్యను చంపిన భర్త
శ్రీకాకుళం రూరల్: జీవితాంతం కలిసి ఉంటానని పెళ్లినాడు చేసిన బాసలను అతను మరిచిపోయాడు. క్షణికావేశంలో కట్టుకున్న ఆలినే కడతేర్చాడు. ఈ విషాద ఘటన సానివాడ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పొన్నాడ కల్యాణి (30) భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. భార్యభర్తల మధ్య మాటామాట పెరగడంతో క్షణికావేశంలో తలగడతో కల్యాణి ముఖంపై అదిమి చంపేశాడు. వివరాల్లోకి వెళితే..శివరాత్రి సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామస్తులంతా స్థానికంగా ఉన్న ఆలయంలో నిర్వహించే పూజల్లో నిమగ్నమై ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన పొన్నాడ నవీన్‌కుమార్, అతని భార్య కల్యాణి రాత్రి ఎనిమిది గంటల నుంచి గొడవపడుతున్నారు. ఉపవాస దీక్ష చేయమని ఆడపడుచు అలేఖ్య సూచించగా.. దానికి కల్యాణి ససేమిరా అనేసింది. ఈ విషయం నవీన్‌కుమార్‌కు తెలియడంతో దంపతుల మధ్య మాటామాట పెరిగింది. సహనం కోల్పోయిన అతను క్షణికావేశంలో మంచంపై ఉన్న కల్యాణిపై దాడి చేసి తలగడతో ముఖంపై అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్యకు పాల్పడ్డాడు. అనంతరం శ్రీకాకుళం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. అక్కపై ప్రేమాభిమానాలే హత్యకు దారితీసిందా? అక్కపై ఉన్న ప్రేమాభిమానాలే హత్యకు దారితీశాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవీన్‌కుమార్‌కు ఇద్దరు అన్నదమ్ములు, అక్క ఉన్నారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ్ముడు మృతిచెందగా చిన్నతనంలోనే తల్లిదండ్రులను కూడా కోల్పోయారు. అక్క అలేఖ్య బాగోగులన్నీ నవీన్‌కుమార్ చూసుకుంటున్నాడు. కోటబొమ్మాళి మండలం మంచాలపేట గ్రామానికి చెందిన పంచిరెడ్డి ఎర్రన్నాయుడుతో 2021లో వైభవంగా అక్క వివాహం జరిపించారు. అలేఖ్య గర్భం దాల్చడంతో ఏడో నెల సీమాంతం అనంతరం పుట్టినిల్లు సానివాడ గ్రామానికి తీసుకొచ్చారు. నవీన్‌కుమార్‌కు రెండు అంతస్తుల భవనం ఉంది. ఇందులో అక్కను కింద పోర్షన్లో ఉంచగా, పై పోర్షన్లో నవీన్‌కుమార్ దంపతులు ఉంటున్నారు. అయితే కల్యాణి, ఆడపడుచు అలేఖ్య మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని గ్రామస్తులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం అందరూ బాగానే ఉన్నప్పటికీ రాత్రి మాత్రం కల్యాణి, అలేఖ్య మధ్య ఉపవాస దీక్ష విషయమై తగాదా తలెత్తింది. విషయాన్ని కల్యాణి తన భర్త నవీన్‌కుమార్‌కు చెప్పగా ఇద్దరికీ సర్ది చెప్పేశాడు. అయినప్పటికీ ఆ తరువాత భార్యభర్తలిద్దరి మధ్య ఇదే విషయమై మాటామాట పెరగడంతో మంచంపై పడుకున్న కల్యాణిని నవీన్‌కుమార్ తలగడతో ముఖంపై గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర, సీఐ అంబేడ్కర్, ఎస్సై రాజేష్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కల్యాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆమె ఇంట అతడు.. భర్తకు విషయం తెలిసి..
సాక్షి, బొమ్మనహళ్లి(కర్ణాటక): గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షునితో పాటు మరో మహిళ హత్యకు గురయ్యారు. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని అనేకల్ తాలూకా చందాపురలోని రామయ్య లేఔట్లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. హతులను నారాయణస్వామి (42), కావ్య (32)గా గుర్తించారు. వీరిద్దరూ సమీపంలోని చిక్కహాగడె గ్రామానికి చెందినవారు. భర్తకు విషయం తెలిసి.. నారాయణ స్వామి కావ్య ఇంటికి వచ్చి ఉండగా, కావ్య భర్తకు ఈ విషయం తెలిసింది. ఆవేశం పట్టలేక ఇంటికి చేరుకొని ఇంటి ముందు నారాయణ స్వామిని, ఇంటిలో ఉన్న కావ్యను కత్తితో నరికి చంపి పరారయ్యాడు. అతనితో పాటు ఆటోలో వచ్చిన మరో ముగ్గురు కూడా ఈ హత్యాకాండలో పాల్గొన్నట్లు సూర్యనగర పోలీసులు తెలిపారు. కావ్య తల్లి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా చేరుకుని పరిశీలించారు. పాత కక్షలా, లేక ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందా? అని ఆరా తీశారు. కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న భర్త, ఇతరుల కోసం గాలిస్తున్నారు. చదవండి: మందు కొట్టి.. ఫ్యామిలీని బలిపెట్టాడు -
కాపురం చేయనంటూ తెగేసి చెప్పిన భార్య.. రాయితో పదే పదే బాది..
సాక్షి, మంథని(కరీంనగర్): మండలంలోని ఉప్పట్ల గ్రామంలో కాసిపేట రేణుకను చంపిన కేసులో ఆమె భర్త కాసిపేట బానయ్యను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సతీశ్ తెలిపారు. ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో సమావేశం నిర్వహించి నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించారు. బానయ్యకు ఇద్దరు భార్యలని, గ్రామానికి చెందిన రేణుకను 16ఏళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడని సీఐ తెలిపారు. వీరిమధ్య చాలా ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయని, దీంతో రేణుక జూలైలో ఇంటి నుంచి వెళ్లిపోగా స్థానిక పోలీస్‌స్టేషన్ మిస్సింగ్ కేసు నమోదైందన్నారు. ఈక్రమంలో రేణుకను వెతికి తీసుకురాగా భర్తతో ఉంటానని వెళ్లిపోయిందన్నారు. కొంతకాలం తర్వాత భార్యపై మళ్లీ అనుమానం పెంచుకోవడంతో ఇళ్లు వదిలి హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అక్కడ ఓ హోటల్లో పనిచేస్తున్న విషయం తెలుసుకుని తన భర్త బానయ్య వారం క్రితం వెళ్లి తీసుకుచ్చాడు. శనివారం గ్రామంలోని పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. రేణుక తన భర్తతో కాపురం చేయనంటూ వెళ్లిపోతుండగా భార్యను వెంబడించి తలపై పెద్దరాయితో నాలుగుసార్లు కొట్టడంతో రేణుక అక్కడికక్కడే మృతిచెందినట్లు సీఐ తెలిపారు. హత్యకు ఉపయోగించిన రాయితో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. ఎస్సై చంద్రశేఖర్ వెంట ఉన్నారు. -
స్నానం పూర్తి చేసుకున్న భర్త.. టవల్ త్వరగా ఇవ్వలేదని భార్య తలపై...
భోపాల్: స్నానం చేసిన తరువాత అడిగిన వెంటనే టవల్ ఇవ్వలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ దారుణం బాలాఘాట్ జిల్లా కిర్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపుర్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అటవీ శాఖకు చెందిన ఉద్యోగి రాజ్‌కుమార్ బాహే శనివారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత. భార్య పుష్పా బాయ్ (45)ను టవల్ అడిగాడు. చదవండి: స్నేహితుడి భార్యపై కన్నేసిన దుర్మార్గుడు.. అత్యాచారం, వీడియోలు తీసి! అయితే ప్రస్తుతం తాను పనిలో ఉన్నానని తువ్వాలు కోసం కాసేపు ఆగాలని భార్య చెప్పింది. ఆ సమయంలో ఆమె వంట పాత్రలు శుభ్రం చేస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ తన భార్య తలపై అక్కడే ఉన్న పారతో పదే పదే కొట్టాడని కిర్ణాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర కుమార్ బారియా తెలిపారు. భర్త దాడిలో తలకు తీవ్ర గాయాలు కావడంతో పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది. చదవండి: రెండేళ్లుగా సహజీవనం.. కూతురుపై తల్లి ప్రియుడు లైంగిక దాడి.. కాగా తండ్రి ఘాతుకాన్ని 23 ఏళ్ల కుమార్తె అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెను కూడా అడ్డొస్తే చంపేస్తాడని ఆమెను కూడా ఆ రాక్షసుడు బెదిరించాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. నిందితుడిని అరెస్టు చేసి, అతనిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాజేంద్ర కుమార్ బారియా తెలిపారు. -
పెళ్లై ఏడాది కాకముందే.. అబార్షన్ చేయించుకుందని!
సాక్షి, సనత్‌నగర్: నవవధువు హత్యకు గురైంది.. కట్టుకున్న భర్తే కాలయముడై కడతేర్చాడు.. తరచూ భార్యాభర్తల మధ్య తలెత్తే మనస్పర్థలకు తోడు భర్తకు తెలియకుండా అబార్షన్ చేయించుకోవడంతో కోపోద్రిక్తుడైన భర్త.. భార్య గొంతు నులిమి హత్య చేశాడు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. నిజామాబాద్ దర్పల్లికి చెందిన మానస(24)కు హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన గంగాధర్(34)తో గతేడాది నవంబర్ 20న వివాహం జరిగింది. 3నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో పలుమార్లు ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మానస, ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో గంగాధర్‌పై 498 సెక్షన్ కింద కేసు కూడా నమోదైంది. ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్దలు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆ దంపతులు కలిసి జీవించేందుకు సమ్మతించారు. అయినా గొడవలు కొనసాగుతుండటంతో మానస పుట్టింటికి వెళ్లిపోయింది. గంగాధర్ ఒక్కడే మూసాపేట జయప్రకాష్‌పగర్‌లో గదిని అద్దెకు తీసుకుని రియల్ ఎస్టేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. చదవండి: సైబర్ కేఫ్‌లో ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్ మరింత ఆవేశానికి లోనై.. ఇదిలా ఉండగా, 10 రోజుల క్రితం గంగాధర్ తండ్రి హనుమంతు చనిపోయాడు. విషయం తెలుసుకున్న మానస జగద్గిరిగుట్టలోని అత్తింటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే భార్యను గంగాధర్ మూసాపేటలోని తాను ఉండే ఇంటికి తీసుకువెళ్లాడు. అయితే మానస గర్భవతి అయ్యిందని ఆమె తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్నాడు. ఆ విషయం తనకు ఎందుకు చెప్పలేదని భార్యను ఆదివారం రాత్రి నిలదీశాడు. తనకు ప్రెగెన్నీ వచ్చిందని, తీయించేసుకున్నానని చెప్పడంతో మరింత ఆవేశానికి లోనైన గంగాధర్ గొంతు నులిమి ఆమెను హతమార్చాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని విషయాన్ని అతడి సోదరుడికి తెలియజేసి పరారయ్యాడు. మానస కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంగాధర్‌ను పట్టుకునేందుకు టీమ్‌లు రంగంలోకి దిగాయని ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపారు. చదవండి: ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని.. -
Banjarahills: భార్యను చంపి.. గడ్డిలో చుట్టేశాడు
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్న వ్యక్తి తన భార్యను హత్య చేసి పరారైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లోని దుర్గా భవానీనగర్‌ను ఆనుకొని ఉమెన్ కో–ఆపరేటివ్ సొసైటీలో ఓ బిల్డర్ వద్ద చత్తీస్‌ఘడ్‌కు చెందిన అటల్ పార్థి, రేఖా పార్థి(32) గతేడాది కాలంగా పని చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం వారిద్దరి మధ్య గొడవ తీవ్రమవడంతో అటల్ తన భార్య రేఖను హత్య చేసి అదే ప్లాట్ ప్రహరీ వెంబడి గడ్డిలో చుట్టి పడేశాడు. ఇది గమనించి చుట్టుపక్కల వారు జూబ్లీహిల్స్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న భర్త అటల్‌పార్థీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నల్లగొండ: పట్టపగలే దారుణం.. మధ్యవయస్కురాలిపై హత్యాచారం -
భార్యకు మద్యం తాగించి, కారుతో తొక్కించి..
సాక్షి బెంగళూరు: కారులో షికారుకు వెళ్లొద్దామని చెప్పి తన భార్య తీసుకెళ్లి కారుతో తొక్కించి హత్య చేశాడో కిరాతకుడు. ఈ ఘటన నవంబర్ 16న జరిగితే ఆలస్యంగా వెలుగు చూసింది. 27 ఏళ్ల తేజ్‌సింగ్, భార్య దీపల్ కంవార్ (27)లు రాజస్థాన్‌కు చెందిన దంపతులు. వీరికి బెంగళూరులో చిన్న బంగారం దుకాణం ఉంది. హొణిసేమారనహళ్లి వద్ద జనతా కాలనీలో వీరు నివాసం ఉంటున్నారు. తరచూ గొడవ పడుతోందని భార్యను హత్య చేయాలని తేజ్‌సింగ్ నిర్ణయించుకున్నాడు. నవంబర్ 16న తన స్నేహితుడు గురుప్రీత్ సింగ్ పేరిట అద్దెకు కారు తీసుకున్నాడు. అనంతరం భార్య, స్నేహితుడు శంకర్ సింగ్, భరత్ సింగ్‌తో కలిసి అమృతహళ్లి సమీపంలోని హోటల్‌కు వెళ్లి రాత్రి భోజనం చేశారు. స్నేహితులతో కలసి మద్యం సేవించిన తేజ్‌సింగ్, తన భార్యకు కూడా బలవంతంగా మద్యం తాగించాడు. ఆ తర్వాత స్నేహితులను వారి ఇంటి వద్ద విడిచి రాత్రి 12.20 గంటలకు భార్యను దేవనహళ్లి రోడ్డుకు తీసుకొచ్చాడు. మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న భార్యను బచ్చళ్లి గేట్ సమీపంలో నడుస్తున్న కారులో నుంచి బయటకు తోసి, కారుతో తొక్కించి హత్య చేశాడు. పోలీసులు విచారణ జరిపి తేజ్‌సింగ్‌ను, అతనికి సహకరించిన దుండగులను అరెస్టు చేశారు. -
సుత్తితో తలపై మోది భార్యను హతమార్చాడు
సాక్షి, దుండిగల్: ఓ వ్యక్తి సుత్తితో తలపై మోది భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా, మన్నెపల్లి గ్రామానికి చెందిన బస్వరాజు రాజ్‌కుమార్, శిల్ప(38) దంపతులు. 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి జగద్గిరిగుట్ట శ్రీనివాస్‌నగర్‌లో నివాసముంటున్నారు. రాజ్‌కుమార్ ఆర్ఎంపీ డాక్టర్‌గా పని చేస్తుండగా శిల్ప గృహిణి. వారికి శివానీ, పవన్ సంతానం. శివానీకి డీపోచంపల్లికి చెందిన హరీష్‌తో వివాహం కాగా, పవన్ సూరారంలోని ఓ ప్రైవేట్ పాఠశాలో 10వ తరగతి చదువుతున్నాడు. కుమారుడికి స్కూల్ దూరంగా ఉండడంతో నెల రోజుల క్రితం రాజ్‌కుమార్ భవానీ నగర్‌కు మకాం మార్చాడు. సోమవారం రాత్రి పవన్ రోడా మేస్త్రీనగర్‌లోని తన బావ దుకాణానికి వెళ్లి అక్కడే పడుకున్నాడు. అదే రోజు రాత్రి శిల్ప, రాజ్‌కుమార్ మధ్య గొడవ జరగడంతో ఆగ్రహానికి లోనైన రాజ్‌కుమార్ సుత్తితో శిల్ప తలపై మోదడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లి పోయిన రాజ్‌కుమార్ మంగళవారం ఉదయం హరీష్‌కు ఫోన్ చేసి ‘ మీ అత్తకు నాకు చిన్న గొడవ జరిగింది.. ఆమెను కొట్టాను, బతికి ఉందో.. చనిపోయిందో.. వెళ్లి చూడని’ చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో హరీష్ తన భార్య శివానీతో కలిసి అక్కడికి వెళ్లి చూడగా శిల్ప అప్పటికే మృతి చెందింది. హరీష్ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ వివాహం: అనుమానంతో భార్య, పిల్లల హత్య!
సాక్షి, వికారాబాద్: మతాలు వేరైనా కలిసి జీవించాలనుకున్నారు.. పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఆ తెగింపు వారిని ఎక్కువ రోజులు కలిసి ఉండనివ్వలేదు. అనుమానం పెనుభూతమై వారి కాపురాన్ని కూల్చేసింది. కట్టుకున్న భర్త.. తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్యచేశాడు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. తన అర్ధాంగితో పాటు ఇద్దరు పిల్లలను హత్య చేసిన దుర్ఘటన ఆదివారం అర్ధరాత్రి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మోతీబాగ్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక మోతీబాగ్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ప్రవీణ్, చాందిని(30) దంపతులు.. కుమారుడు అయాన్(10), కూతురు (5) ఏంజిల్‌తో కలిసి ఉంటున్నారు. ప్రవీణ్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేట్‌లో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. చాందిని ధన్నారం సమీపంలోని స్వామి వివేకానంద గురుకుల పాఠశాలలో ప్రైవేటులో టీచర్‌గా పనిచేస్తుండేది. పిల్లలు ఇదే పాఠశాలలో చదువుతున్నారు. భార్యపై అనుమానం... ప్రవీణ్ దళిత సామాజిక వర్గానికి చెందినవాడు. చాందిని ముస్లిం సామాజిక వర్గం. ప్రవీణ్ స్వస్థలం తాండూరు.. కాగా చాలా రోజుల క్రితం వారి కుటుంబం హైదరాబాద్‌లోని లింగంపల్లిల్లో స్థిరపడింది. చాందినిది లింగంపల్లి. వీరిద్దరికి అక్కడే చాలా కాలంగా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. చాందిని కుటుంబీకులు ఆమెను బలవంతంగా మరోవ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇష్టం లేకపోయినా కొన్నాళ్లు అతడితో కాపురం చేసిన చాందినికి ఓ బాబు పుట్టాడు. అనంతరం కొన్నాళ్లకు భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఆరేళ్ల క్రితం విడిపోయారు. అనంతరం ప్రియుడు ప్రవీణ్‌ను పెళ్లి చేసుకొని వికారాబాద్‌లో కాపురం పెట్టారు. చాందిని తనతోపాటు కుమారుడు అయాన్‌ను వెంట తెచ్చుకుంది. కొన్నాళ్లకు వీరికి కూతురు ఏంజిల్ పుట్టింది. ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగాలే చేస్తున్నా సంతోషంగా ఉండేవారు. ఇటీవల చాందినిపై అనుమానం పెంచుకున్న ప్రవీణ్ పలుమార్లు గొడవపడినట్లు సన్నిహితులు తెలిపారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందని ప్రవీణ్ తరచూ మద్యం తాగుతూ ఆమెపై దాడి చేస్తుండేవాడు. ఈక్రమంలో ఆదివారం రాత్రి కూడా మద్యం మత్తులో ప్రవీణ్ భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. మూడు రోజులుగా మత్తులోనే.. పది రోజుల క్రితం కూతురు ఏంజిల్ ఒంటిపై వేడినీళ్లు పడ్డాయి. దీంతో చిన్నారి అనారోగ్యానికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్ తల్లి హేమలత, తమ్ముడు ప్రదీప్ పాపను చూసేందుకు ఈనెల 2న వికారాబాద్‌కు వచ్చారు. అదే రోజు తమ్ముడు ప్రదీప్‌తో కలిసి ప్రవీణ్ మద్యం తాగాడు. మరుసటి రోజు ప్రదీప్ పుట్టినరోజు ఉండడంతో వారు ఇక్కడే ఉండిపోయారు. పుట్టిన రోజు వేడుకలు చేసుకొని ఆ రాత్రి కూడా అన్నదముళ్లు మద్యం తీసుకున్నారు. 4వ తేదీన ఆదివారం సెలవు దినం కావడంతో ప్రవీణ్ ఇంటి దగ్గరే ఉన్నాడు. దీంతో అన్నదమ్ముళ్లు ఇద్దరూ రోజంతా మద్యం తాగారు. మూడు రోజులుగా మద్యం తాగుతుండడంతో చాందిని భర్తను వారించింది. రాత్రి 10 గంటల సమయంలో ప్రవీణ్ తల్లి, తమ్ముడి ముందే భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో తాము ఇంటికి వెళ్తామంటూ హేమలత, ప్రదీప్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అనంతరం దంపతుల గొడవ తీవ్రమైంది. ఇంట్లో ఉన్న ఇనుపరాడ్డును తీసుకొని ప్రవీణ్ భార్య తలపై బలంగా మోదడంతో అక్కడిక్కడే మృతిచెందింది. అప్పటికే నిద్రలో ఉన్న కుమారుడు అయాన్ లేచి తండ్రి దాడిని గమనించి ఏడ్చే ప్రయత్నం చేశాడు. ఏడుపు విని ఎవరైనా వస్తారనే భయంతో ప్రవీణ్ అతడి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం నిద్రపోతున్న చిన్నారి తలపై రాడ్డుతో బలంగా కొట్టి హత్య చేశాడు. తర్వాత ప్రవీణ్ పిల్లలను తల్లి దగ్గర పడుకోబెట్టి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి నేరుగా రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. అక్కడే ఉన్న తన తల్లి, తమ్ముడికి హత్య విషయం తెలిపాడు. దీంతో కంగారుపడిన వారు అతడిని తిట్టి పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకున్నాడు. దీంతో కంగారుపడిన తల్లి, తమ్ముడు నేరుగా వికారాబాద్ ఠాణాకు వెళ్లి ప్రవీణ్ తన భార్యతో గొడవపడుతున్నట్లు తెలిపారు. అంతలోనే అక్కడికి వచ్చిన నిందితుడు హత్య విషయం పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. దుబాయిలో ఉన్నాం.. తన కూతురు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిన చాందిని తల్లి మున్నాబేగం బోరున విలపించింది. కూతురు హత్య విషయాన్ని లింగంపల్లిలోని ఆమె ఇంటికి వెళ్లి పోలీసులు చెప్పగా నమ్మలేదు. తమ కూతురు దుబాయ్‌లో క్షేమంగా ఉందన్నారు. పోలీసులు చాందిని, అయాన్ ఫోటో చూపించడంతో చివరకు నమ్మారు. ఐదేళ్ల క్రితం తనకు దుబాయ్ వెళ్లేందుకు వీసా వచ్చిందని తన కుమారుడితో అక్కడికి వెళ్తున్నట్లు చెప్పి చాందిని ఇంటి నుంచి వచ్చిందన్నారు. ఎప్పుడూ సెల్ఫోన్లో వీడియో కాల్ మాట్లాడేదని, దుబాయ్‌లోనే ఉన్నట్లు చెప్పిందని కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర కలకలం.. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు దారుణంగా హత్యకు గురవడం పట్టణవాసులను తీవ్రంగా కలచివేసింది. తల్లి పక్కనే నిద్రలో ఉన్నట్లుగా మృతదేహాలు పడిఉన్న దృశ్యం చూపరులకు కంటతడి పెట్టించింది. మృతురాలితల్లి మున్నాబేగం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. హంతకుడు ప్రవీణ్‌తో పాటు తల్లి హేమలత, తమ్ముడు ప్రదీప్‌ను పోలీసులు అదపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. -
నిండు గర్భిణిని హతమార్చిన భర్త!
సాక్షి, ఇబ్రహీంపట్నం: కట్టుకున్న భార్య.. నిండు గర్భిణి.. భార్యనేను కనికరం లేకుండా కడతేర్చాడో ఓ భర్త. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతపల్లిగూడ గేట్ సమీపంలోని చోటుచేసుకుంది. ఎస్ఐ మోహన్ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అజీలపురం గ్రామానికి చెందిన సరిత (22)కు రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం పోచమ్మగడ్డతండాకు చెందిన ఆటో డ్రైవర్ రాజు (25)తో 2018 మే నెలలో వివాహమైంది. కట్నకానుకల కింద రూ.పది లక్షలు ఇచ్చారు. అయితే కొన్నాళ్లు బాగానే ఉన్నా వీరి కాపురంలో అదనపు కట్నం చిచ్చుపెట్టింది. అదనంగా కట్నం తేవాలని తరచూ సరితను భర్త వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈ విషయమై అప్పట్లో మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో కౌన్సిలింగ్ ఇప్పించారు. అయితే పెద్దల సమక్షంలో రాజీకి వచ్చినా ఆ తర్వాత యథావిధిగానే పరిస్థితి ఉంది. అయితే రెండు రోజుల కిందట ఏడు నెలల గర్భవతిగా ఉన్న భార్యను ఆస్పత్రిలో చూపిస్తానని చెప్పి రాజు ఇంటి నుంచి ఆమెను తీసుకెళ్లాడు. క్యాబ్‌లో కందుకూర్ నుంచి మంగళ్‌పల్లికి భార్యతో పాటు వచ్చాడు. చింతపల్లిగూడ గేట్ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి ఆమె చున్నీని మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చేశాడు. ఆ తర్వాత బావమరిది నర్సింహకు ఫోన్ చేసి మీ సోదరి ఇంట్లో కనిపించడం లేదని చెప్పాడు. దీంతో నర్సింహా శనివారం కందుకూర్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. అయితే ఆదివారం చింతపల్లిగూడ గేట్ పొదల్లో సరిత శవమై తేలిందని కబురు అందింది. డాగ్‌స్క్వాడ్‌తో చుట్టుముట్టు పరిసరాలను పరిశీలించారు. ఈలోపే కందుకూర్ పోలీస్‌స్టేషన్‌లో రాజు లొంగిపోయాడు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యుల ఆందోళన అదనపు కట్నం కోసం వేధిస్తూ సరితను హతమార్చడంతో కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని అజిలాపూర్ గ్రామస్తులు ఆదివారం రాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. తన సోదరి మృతిచెందడంతో మనస్తాపం చెందిన సోదరుడు నర్సింహ ఒంటిపై పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రధాన రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రయాణికులు, వాహనదా రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఎంతచెప్పినా ఆందోళనకారులు వినిపించుకో లేదు. చివరికి పోలీసులు కల్పించుకుని ఆందోళ నకారులతో మాట్లాడి శాంతింపజేశారు. -
అంత్యక్రియల అనంతరం నిలదీస్తే.. ఒప్పుకొన్న భర్త
సాక్షి, యద్దనపూడి: అనారోగ్యంతో చనిపోయిందని భావించిన వివాహత మృతి వ్యవహారం ఆ తర్వాత హత్యగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మండల కేంద్రం యద్దనపూడిలో జరిగింది. స్థానికులు, సీఐ రాంబాబు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నూతలపాటి లక్ష్మీరాజ్యం (50) అనారోగ్యంతో ఈ నెల 11వ తేదీ గురువారం వేకువ జామున మృతి చెందినట్లు భావించి కుటుంబ సభ్యులు శుక్రవారం అంత్యక్రియలు చేశారు. మృతురాలి కుమార్తె లావణ్య తన తల్లి మరణం సహజంగా జరిగింది కాదని అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో బంధువులు, గ్రామ పెద్దలు మృతురాలి భర్త నూతలపాటి వేణుగోపాలరావును నిలదీశారు. తన భార్యను తానే హత్య చేసినట్లు అతడు నేరం అంగీకరించాడు. మృతురాలి కుమార్తె లావణ్య స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఇంకొల్లు సీఐ రాంబాబు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. వికలాంగుడైన వేణుగోపాలరావు ఒక్కడే హత్యకు పాల్పపడి ఉండడని, ఇంకా ఎవరైనా సహకరించి ఉంటారనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. -
పెళ్లయిన రెండు నెలలకే కాటికి
సాక్షి, గిద్దలూరు: పెళ్లి బాజాలు చప్పుడు ఇంకా చెవుల్లో రింగుమంటూ ఉండగానే.. ఆ ఇళ్లలో చావు డప్పు మోగింది.. కనీసం రెండు నెలలైనా కలిసి కాపురం చేయక ముందే నవ దంపతులు కాటికి పయనమయ్యారు.. ఆనందం నిండాల్సిన లోగిళ్ళలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. కళకళలాడుతూ తిరగాల్సిన కొత్త జంట విగత జీవులుగా మారారు. ముళ్ల పొదల్లో నిర్జీవంగా పడి ఉన్న మృతదేహాలను చూసి, వారి కన్నపేగులు తల్లడిల్లిపోయాయి. ఆషాడ మాసమని దూరంగా ఉన్న కొత్త జంట ఒకే చోట శవాలుగా దర్శమివ్వడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. వారి రోధనలు తీరు చూసి అక్కడి వారికి కంటనీరు ఆగలేదు. కట్టుకున్న భార్యను బండరాయితో మోది చంపిన భర్త ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం గిద్దలూరు మండలంలో కలకలం రేపింది. పెళ్లయి రెండు నెలలు కాకముందే నూతన జంట పరలోకాలకు పయనం కావడం రెండు గ్రామాల్లో తీవ్ర విషాదం నింపింది. సేకరించిన వివరాల ప్రకారం.. గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన పిక్కిలి కాశయ్య అంకాలమ్మ దంపతుల కుమారుడు రామయ్య (22) ప్రొక్లెయిన్ డ్రైవరుగా పని చేస్తుంటాడు. అతడికి ఈ ఏడాది మే 19న అదే మండలం ఆదిమూర్తిపల్లెకు చెందిన మండ్ల శ్రీనివాసులు, రమాదేవి దంపతుల కుమార్తె చంద్రకళ (19)తో వివాహమైంది. ఆషాఢం ప్రారంభం కావడంతో చంద్రకళ వారం రోజుల కిందట పుట్టింటికి వెళ్లింది. ఈనెల 9వ తేదీ ఉదయం రామయ్య అత్తింటికి వెళ్లాడు. కంభంలో తన సోదరి ఇంటికి వెళ్లి ఫొటోలు దిగాలని చెప్పి చంద్రకలను బైక్‌పై తీసుకువచ్చాడు. కానీ, కంభం వైపు వెళ్లకుండా బోదివాగు సమీపంలోని తమ పొలం వద్దకు తీసుకెళ్లాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు వారు రామయ్య, చంద్రకళలు పక్కపక్కనే విగత జీవులుగా పడి ఉండటం చూసి, పోలీసులకు సమాచారం అందించారు. చంద్రకళ మృతదేహంపై ఉన్న గాయాలు, ఘటనా స్థలంలో గుర్తించిన రక్తపు మరకలు ఉన్న బండరాయి, పురుగుల మందు డబ్బాను పోలీసులు పరిశీలించారు. రామయ్యే బండరాయితో తలపై మోది చంద్రకళను హతమార్చాడని, ఆపై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే నిర్ధారణకు వచ్చారు. ఎస్సై సమందర్‌వలి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. యర్రగొండపాలెం సీఐ మారుతికృష్ణ గిద్దలూరు పోలీసుస్టేషన్‌కు వచ్చి ఘటనకు గల కారణాల పై విచారణ చేపట్టారు. ఆస్తి తగాదాలే కారణమా..? ఆస్తి తగాదాల వల్ల నా బిడ్డను చంపి ఉంటారని చంద్రకళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ అల్లుడు రామయ్యకు అతడి తండ్రి కాశయ్యతో ఆస్తి పంపకాల విషయంలో ఘర్షణలు జరిగాయని, ఆ విషయంలో మానసికంగా ఒత్తిడికి గురైన రామయ్య తన కుమార్తెను చంపి ఉంటారని వారు పేర్కొంటున్నారు. తమ కుమార్తె జీవితంపై ఎన్నో కలలు కన్న మండ్ల శ్రీను, రమాదేవి దంపతులు తమ కూతురు సుఖంగా ఉంటుందని నమ్మి పక్కనే ఉన్న గ్రామంలో వ్యక్తికిచ్చి వివాహం చేశారు. ఊరికి దగ్గరే కుమార్తె ఉంటే కళ్ల ముందే ఉంటుందని భావించారు. అయితే తమ కుమార్తె ఇలా కట్టుకున్న భర్త చేతిలోనే హత్యకు గురికావడాన్ని జీర్ణించుకోలేక హత్య జరిగిన ప్రదేశంలో కుమార్తె మృతదేహం వద్ద కన్నీరు మున్నీరు అయ్యేలా విలపించారు. వారి ఆర్తనాదాలను చూసిన బందుమిత్రులతో పాటుగా, గ్రామస్తుల హృదయాలు చలించిపోయాయి. చుట్టు పక్క గ్రామాలల్లోని ప్రజలు సంఘటనా స్థలం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి మృతుల తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు. -
భార్యను లారీ కింద తోసిన భర్త
సాక్షి, ఝరాసంగం(జహీరాబాద్): భార్యపై అక్రమ సంబంధం ఉందనే అనుమానం పెంచుకున్న భర్త ఆమెను లారీ కిందకు తోసేసి హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మొగుడంపల్లి మండలం మన్నాపూర్ గ్రామానికి చెందిన శంకర్‌కు నాగమణి(38)తో 10 సంవత్సరాల క్రితం పెళ్లయింది. అయితే ఇటీవలి కాలంలో గ్రామంలోనే ఇతర వ్యక్తితో భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యను వదిలించుకుందామని అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్, ఆటో డ్రైవర్‌తో కలిసి పథకం వేశాడు. పథకం ప్రకారం భార్యను వదిలించుకునేందుకు సోమవారం రాత్రి ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయానికి దర్శనానికి ఆటోలో డ్రైవర్ హకీంతో కలిసి వచ్చారు. అనుకున్న ప్రకారం తిరుగు ప్రయాణంలో కుప్పానగర్ గ్రామ శివారులోకి రాగానే ఆటో పంక్చర్ అయ్యిందని పక్కకు తోయాలని చెప్పడంతో నాగమణి ఆటో దిగింది. ఆటోను తోస్తున్న క్రమంలో లారీ డ్రైవర్ ఝరాసంగం నుండి జహీరాబాద్ వైపు లారీని తీసుకువస్తున్నాడు. పథకం ప్రకారం వస్తున్న లారీ కిందికి శంకర్ నాగమణిని తోసేశాడు. లారీ చక్రాలు ఆమె తలపై నుండి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని వివరాలు సేకరించారు. ముందు రోడ్డు ప్రమాదంలో మరణించిందని నమ్మించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అసలు విషయాన్ని వెలికి తీశారు. నిందితులు పరారీలో ఉన్నట్లు వివరించారు. మృతురాలి తండ్రి శరణప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పాలవెల్లి, ఎస్ఐ ఏడుకొండలు వివరించారు. -
మాట వినలేదని తల్లీ పిల్లల దారుణ హత్య..!
మానవ సంబంధాలు ‘మంట’గలుస్తున్నాయి. అనుబంధాలకు అర్థం లేకుండా పోతోంది. స్వార్థం, వికృత స్వభావం కోరలు చాస్తున్నాయి. దుర్మార్గాలకు ఊతమిస్తున్నాయి. నిండు ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్నాయి. సంబంధ బాంధవ్యాలను ‘బూడిద’ చేస్తున్నాయి. ‘ఆమె’ మాట వినలేదన్న కోపంతో భర్త, అత్తామామ దారుణానికి ఒడిగట్టారు. ఆమెతో పాటు అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలనూ డీజిల్ పోసి తగులబెట్టారు. ఆ ఇల్లాలితో పాటు పసిబిడ్డలు మంటల్లో కాలి బూడిదయ్యారు. ఈ ఘోరం బనగానపల్లె మండలం పండ్లాపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటలక్ష్మమ్మ(35), ఆమె కుమారుడు పవన్ కుమార్ (12), కుమార్తె పావని(9)లను భర్త శివరామయ్య, అత్తామామ పుట్టా లక్ష్మమ్మ, లక్ష్మన్న కలిసి సజీవ దహనం చేశారు. సాక్షి, బనగానపల్లె: గర్భవతి అయిన భార్యను, బిడ్డలను తల్లిదండ్రులతో కలసి కిరాతకంగా చంపేశాడో దుర్మార్గుడు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పండ్లాపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల పట్టణం సంజీవనగర్ కాలనీకి చెందిన కొట్టాల బాలసుబ్బమ్మ, గోవిందరాజుల చిన్న కుమార్తె వెంకటలక్ష్మమ్మ (35)ను 15 ఏళ్ల క్రితం బనగానపల్లె మండలం పండ్లాపురానికి చెందిన పుట్టా లక్ష్మమ్మ, లక్ష్మన్నల కుమారుడు శివరామయ్యకు ఇచ్చి వివాహం చేశారు. కట్నకానుకల కింద నాలుగు తులాల బంగారం, 40 వేల నగదు ఇచ్చారు. వీరికి కుమారుడు పవన్‌కుమార్ (12), కుమార్తె పావని (9) ఉన్నారు. వేధించి చంపారు! పెళ్లయిన కొంత కాలానికే వెంకటలక్ష్మమ్మను ఏదో ఒక కారణాన్ని ఎత్తిచూపి భర్త, అత్త, మామ వేధించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వెంకటలక్ష్మమ్మ 4 నెలల గర్భిణి కాగా, గర్భం తీయించుకోవాలంటూ భర్త తరచూ వేధించేవాడు. ఆమె అంగీకరించకపోవడంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని పథకం పన్నారు. గురువారం తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉండగా.. వెంకటలక్ష్మమ్మ, కుమారుడు పవన్‌కుమార్, కుమార్తె పావనిపై భర్త శివరామయ్య, అత్తమామలు లక్ష్మమ్మ, లక్ష్మన్న డీజిల్ పోసి నిప్పంటించారు. వారి శరీరాలు పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే చనిపోయారు. వెంకటలక్ష్మమ్మ తండ్రి గోవిందరాజులు, సోదరుడు వెంకటాద్రి ఫిర్యాదు మేరకు నందివర్గం ఎస్ఐ కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ, పాణ్యం ఇన్చార్జ్ సీఐ రవికృష్ణారెడ్డి పరిశీలించారు. -
ప్రియుడితో ఉల్లాసంగా గడుపుతున్న భార్యను ..
టీ.నగర్: ప్రియుడితో ఉల్లాసంగా గడుపుతున్న భార్యను కత్తితో నరికి చంపిన భర్త అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కోవిల్పట్టిలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి నటరాజ పురం అయిదో వీధికి చెందిన మారిముత్తు (29) ఆటో డ్రైవర్. ఇతని భార్య విమల (25). వీరికి కావ్య శ్రీవిద్య (4) అనే కుమార్తె ఉంది. అదే ప్రాంతంలో వెల్డింగ్ వర్క్‌షాప్‌లో పని చేస్తున్న కుమార్ (20)తో విమలకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరువురు తరచుగా ఏకాంతంగా కలుసుకునేవారు. భార్య ప్రవర్తనను మారిముత్తు ఖండించాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ స్థితిలో వారం రోజుల కిందట నటరాజపురం అయిదో వీధి నుంచి పక్క వీధికి తన కాపురాన్ని మారిముత్తు మార్చాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మారిముత్తు కుటుంబంతో కలిసి నిద్రిస్తుండగా, మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో బిడ్డ రోదించింది. ఆ సమయంలో మారిముత్తు లేచి భార్య కోసం చూడగా కనిపించలేదు. అదే సమయంలో అత్త ఇంటికి వెళ్లి విచారణ జరుపగా అక్కడికీ రాలేదని తెలిపారు. దీంతో అనుమానించిన మారిముత్తు వెంటనే తన పాత ఇంటికి వెళ్లాడు. అక్కడ విమల, కుమార్‌తో ఉల్లాసంగా గడుపుతూ కనిపించింది. దీంతో ఆగ్రహించిన మారిముత్తు అక్కడున్న ఇనుప పైప్‌ను తీసుకుని కుమార్‌పై దాడి చేశాడు. గాయపడిన కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడి సమీపంలో లభించిన కత్తిని తీసుకుని విమలపై తీవ్రంగా దాడి చేశాడు. దీంతో విమల సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. తర్వాత చేతిలో కత్తితో పాటు మారిముత్తు కోవిల్ పట్టి వెస్ట్ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సహ కార్మికుడితో నవ్వుతూ మాట్లాడిందని హత్య: టీ.నగర్: సహ కార్మికుడితో నవ్వుతూ మాట్లాడినందున ఆగ్రహంతో 19వ అంతస్తు నుంచి కిందకు తోసి భార్యను హతమార్చినట్టు అరెస్టయిన భర్త పోలీసులకు సోమవారం వాగ్మూలం ఇచ్చాడు. చెన్నై సమీపంలో గల తాలంబూర్‌లో 30 అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన సంతోష్‌కుమార్ (28). అతని భార్య బీలాదేవి (22)తో సహా పలువురు పని చేస్తున్నారు. గత నెల 27వ తేదిన 19వ అంతస్తులో నేలను శుభ్రం చేస్తుండగా అక్కడినుంచి కిందపడి బీలాదేవి మృతి చెందింది. దీనిపై విచారణ జరిపిన తాలంబూరు పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె భర్త వద్ద విచారణ జరిపారు. బీలాదేవి సహ కార్మికుడితో నవ్వుతూ మాట్లాడడంతో అనుమానించి ఆమెను కిందకు తోసి, హత్య చేసినట్లు ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో తెలిపాడు. దీంతో సంతోష్‌కుమార్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచి మంగళవారం జైల్లో నిర్బంధించారు. -
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
కర్నూలు జిల్లా / గడివేముల: కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. మండల పరిధిలోని పెసరవాయిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘటన వివరాలను ఎస్ఐ వెంకటేశ్వరరావు వెల్లడించారు. గ్రామానికి చెందిన స్వాములుకు 12ఏళ్ల క్రితం సుజాత(30)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా సుజాత ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో కలతలు వచ్చి, రోజూ గొడవ పడేవారు. తాగుడుకు బానిసై వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు భరించలేక ఇటీవల ఆమె తిరుపాడులో ఉన్న తన సోదరి రాజ్యలక్ష్మి వద్దకు వెళ్లింది. ఇక నుంచి గొడవ పడకుండా ఉందామని చెప్పి శుక్రవారం భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. అదే రోజు రాత్రి మరోసారి గొడవ పడ్డారు. ఈ క్రమంలో గొడ్డలితో తలపై నరికి పరారయ్యాడు. రక్తపు మరకల్లో విగత జీవిగా పడివున్న సుజాతను చూసి చుట్టుపక్కల వారు సోదరికి సమాచారం ఇచ్చారు. పాణ్యం సీఐ వాసుకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి అక్క రాజ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
భార్యను రోకలితో మోది హతమార్చిన భర్త
-
భార్యను కడతేర్చిన భర్త
చినగంజాం: భార్యను కొట్టి చంపి అనారోగ్యంతో చనిపోయిందని బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడో భర్త. పోలీసులందించిన సమాచారం ప్రకారం.. మండలంలోని కొత్తపాలెం పంచాయతీ రాంచంద్రనగర్ గ్రామానికి చెందిన కొక్కిలగడ్డ శ్రావణి అలియాస్ లక్ష్మి అలియాస్ భారతి (25)ని ఆమె భర్త శివకృష్ణ దారుణంగా కొట్టి చంపి అనారోగ్యంతో చనిపోయిందని బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడు. రాంచంద్రనగర్కు చెందిన కొక్కిలగడ్డ ఏసురత్నం కుమారుడు శివకృష్ణకు ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన రాసాని శ్రీను, మస్తానమ్మల మొదటి సంతానం శ్రావణితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల పాప కూడా ఉంది. శివకృష్ణ వృత్తిరీత్యా బేల్దారీ కాగా హైదరాబాద్‌లోని సిద్ధిపేట ఎర్రచెరువు ఎల్లమ్మ గుడి వద్ద తన తండ్రి ఏసురత్నం, లక్ష్మిలతో కలిసి అక్కడే బేల్దారి పనులు చేసుకుంటూ ఏడాదిగా నివాసముంటున్నాడు. శనివారం అకస్మాత్తుగా భార్య శవాన్ని తీసుకొని రాంచంద్రనగర్ వచ్చాడు. తన భార్య అనారోగ్యం కారణంగా చనిపోయిందని బంధువులకు సమాచారం ఇచ్చాడు. మృతురాలి శరీరంపై అనుమానాస్పదంగా గాయాలు ఉండటంతో ఆమె తరపు బంధువులు శివకృష్ణను నిలదీసి నాలుగు తగిలించారు. నిజం ఒప్పుకున్న శివకృష్ణ తానే చంపినట్లు అంగీకరించాడు. అతడి కథనం ప్రకారం.. శుక్రవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య కణతపై గట్టిగా కొట్టడం, ఆ సమయంలో ఆమె స్పృహ తప్పి పడిపోవడం, అనంతరం చీరతో ఉరేసి చంపాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చినట్లు వివరించాడు. అనంతరం మృతురాలి బంధువులు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పరిశీలించిన సీఐ మృతురాలి తల్లిదండ్రులిచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని ఇంకొల్లు సీఐ ఎం. శేషగిరిరావు పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదికను సిద్ధిపేట పరిధిలోని పోలీసుస్టేషన్‌కు బదిలీ చేయనున్నట్లు తెలిపారు. -
విసిగిపోయే ప్రాణాలు తీశాడు..
చీపురుపల్లి: భార్య ప్రవర్తనతో విసిగి వేసారిన భర్త ఆలోచన మారిపోయింది. తాను డబ్బులు ఇస్తానని చెప్పినా రాకుండా ప్రియుడితో కలిసి వాహనంపై తిరుగుతోందన్న సమాచారంతో మరింత రగిలిపోయాడు. చివరకు ప్రియుడితో కలిసి ద్విచక్ర వాహనంపై దర్జాగా వస్తున్న భార్యను చూసి తట్టుకోలేకపోయాడు. అంతే కోపం కట్టలు తెంచుకుని ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో లారీతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఆ ఇద్దరినీ హతమార్చాలని భావించాడు. ఈ నెల 7వ తేదీన జరిగిన లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో పోలీసుల విచారణలో తేలిన అంశమిది. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్యామలరావు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గరివిడి మండలంలోని కాపుశంభాం గ్రామానికి చెందిన రేగాన తవిటయ్య, రమణమ్మలు భార్యాభర్తలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న తవిటయ్య భార్య రమణమ్మకు అదే గ్రామానికి చెందిన రేగాన రామకృష్ణతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై భార్యను పలుమార్లు తవిటయ్య హెచ్చరించాడు. అయినా రమణమ్మ భర్త మాట పెడచెవిన పెట్టింది. ఈ నెల 6వ తేదీన హుజూరాబాద్ నుంచి పర్లాకిమిడికి సిమెంట్ లోడు తీసుకువస్తున్న తవిటయ్య తన భార్య రమణమ్మకు ఫోన్ చేసి 7వ తేదీ ఉదయం 10 గంటలకు సుభద్రాపురం వస్తే డబ్బులు ఇస్తానని తెలిపాడు. అలాగే అని చెప్పిన రమణమ్మ మధ్యాహ్నం ఒంటి గంట అయినా సుభద్రాపురం చేరుకోలేదు. ఇంతలో తవిటయ్య ఇంటికి ఫోన్ చేస్తే కుమార్తె ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ ఎప్పుడో బయిలుదేరిపోయిందని తెలిపింది. వెంటనే తవిటయ్య చీపురుపల్లిలో ఉండే తన సహచరులకు ఫోన్ చేస్తే రామకృష్ణతో కలిసి బండిపై వెళ్లడం చూశామని చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన తవిటయ్య సుభద్రాపురం నుంచి చీపురుపల్లి వైపు లారీలో వస్తుండగా, ఎదురుగా ద్విచక్ర వాహనంపై తన భార్య రమణమ్మ ప్రియుడు రామకృష్ణతో రావడం చూశాడు. వెంటనే వారిని హతమార్చాలని నిర్ణయించుకుని ద్విచక్ర వాహనాన్ని లారీతో బలంగా ఢీకొట్టాడు. ఈ సంఘటనలో రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, రామకృష్ణ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించిన తవిటయ్యపై 302,304 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కార్యక్రమంలో చీపురుపల్లి, గరివిడి ఎస్సైలు టి.కాంతికుమార్, శ్రీనివాస్ ఉన్నారు. -
కళ్ల ముందు తగలబెడుతున్నా కాపాడలేదు
సాక్షి, తిరువనంతపురం: కేరళలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మహిళను ఆమె భర్త తగలబెడుతుంటే.. జనాలు చూస్తూ ఉండిపోయారు. ఘటన తర్వాత కూడా ఆమెకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తీవ్ర గాయాలతో ఆ మహిళ రెండు రోజుల తర్వాత కన్నుమూసింది. హేయనీయమైన ఈ ఘటన త్రిస్సూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జీతూ(29) తన భర్త విరాజ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది పెండింగ్‌లో ఉండగా విరాజ్ తన భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఇదిలా ఉంటే ఓ లోన్ పని నిమిత్తం ఆమె తన తండ్రితో కలిసి చెంగళూరులోని కుదుంబశ్రీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అధికారులతో మాట్లాడుతున్న సమయంలో భర్త విరాజ్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. పెట్రోల్ పోయటంతో ప్రాణాల కోసం ఆమె పరుగెత్తారు. జీతూ తండ్రి తన కూతురిని కాపాడాలంటూ అక్కడున్న వారందరి కాళ్ల వేళ్ల పడ్డారు. కానీ, ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. చివరకు ఆమె మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. కనికరం చూపలేదు... ఘటన తర్వాత విరాజ్ అక్కడి నుంచి పారిపోగా.. తీవ్ర గాయాలపాలైన జీతూను ఆస్పత్రికి తరలించేందుకు తండ్రి అక్కడున్న వారి సాయం కోరారు. కాళ్లా వేళ్లా పడ్డ ఎవరూ కనికరం చూపలేదు. చివరకు ఓ ఆటోడ్రైవర్ సాయంతో జీతూ తండ్రి ఆమె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జీతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఈ ఘటనలో స్థానిక వార్డు మెంబర్ హస్తం కూడా ఉందని జీతూ తండ్రి వ్యాఖ్యలు చేశారు. ప్రణాళిక వేసి తన కూతురిని అక్కడికి రప్పించి మరీ హత్య చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. ‘ఉగ్రవాదులకు కూడా మన దేశంలో మంచి ఆతిథ్యం ఇస్తారు. అలాంటిది నా కూతురు తగలబడి పోతున్నా సాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు విరాజ్‌ను బుధవారం రాత్రి ముంబైలో అరెస్ట్ చేశారు. -
భార్య,ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపేశాడు
-
‘ప్రేమజ్యోతి’ని ఆర్పేశాడు
వాకతిప్ప (కపిలేశ్వరపురం): ప్రేమగా అందరినీ పలకరించే ‘జ్యోతి’ ఆరిపోయింది. కట్టుకున్న భర్తే గొంతు నులిమి చంపేశాడు. ఏమీ తెలియనట్టు పరారయ్యాడు. అందరినీ కలచి వేసిన ఈ ఘటన కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో ఆదివారం జరిగింది. అంగర పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. వాకతిప్ప గ్రామానికి చెందిన దోమల ప్రేమజ్యోతి (25)ని ఎనిమిదేళ్ల క్రితం మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన దోమల మనోహర్‌కు ఇచ్చి వివాహం చేశారు. తరచూ గొడవలు పడుతుండడంతో దగ్గరుంటే జాగ్రత్తగా ఉంటారనుకుని భావించి ప్రేమ జ్యోతి కుటుంబ సభ్యులు వాకతిప్పలోని ఇంటికి తీసుకొచ్చారు. మనోహర్ కూడా ప్రేమజ్యోతితోపాటే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం ఎంత సేపటికీ నిద్ర లేవకపోవడంతో మధ్యాహ్న సమయంలో కదిపి చూడగా ప్రేమ జ్యోతి చనిపోయి ఉంది. ఆమె సోదరుడు గురజ శ్రీను ఫిర్యాదు మేరకు ఆదివారం రాత్రి రామచంద్రపురం డీఎస్పీ జేవీ సంతోష్, మండపేట రూరల్ సీఐ లక్షణరెడ్డి, అంగర ఎస్సై రాజేష్‌కుమార్‌లు ఘటనా స్థలాన్ని సందర్శించి శవపంచనామా చేశారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్టు భర్త మనోహరే గొంతు నులిమి చంపేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మారకపోగా మనిషినే చంపేశాడు.. తరచూ వివాదపడడాన్ని చూసి మనిషి మారతాడన్న భావనతో ప్రేమజ్యోతిని కుటుంబ సభ్యులు అమ్మగారి ఊరులోనే ఉంచుకున్నారు. మారకపోగా మనిషినే చంపేశాడంటూ కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. అమ్మ ప్రేమకు దూరమైన ప్రేమజ్యోతి ఆరేళ్ల కుమార్తె అమూల్య స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. నాన్నే అమ్మ చావుకు కారణం కావడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. -
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం
-
పాము విషం ఇంజెక్షన్ చేసి.. భార్యను కడతేర్చాడు!
తరచు గొడవ పడుతూ, వివాహేతర సంబంధం ఉందంటూ వేధిస్తున్న భార్యకు ఇంజెక్షన్ ద్వారా పాము విషం ఎక్కించి చంపేశాడో భర్త. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో జరిగింది. ఈ వివరాలను రామచంద్రపురం డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ పుల్లారావు విలేకరులకు వెల్లడించారు. అక్టోబరు 22న ఏడిద గ్రామానికి చెందిన షేక్ షహీదా బేగం (36) అనుమానాస్పదంగా మరణించింది. ఆమెను చంపింది తానేనంటూ భర్త మొఘలా సాహెబ్ 30వ తేదీన పోలీసుల వద్ద లొంగిపోయాడు. అతడిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది. మొఘలా సాహెబ్‌కు షహీదా బేగంతో 16 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆమె తరచు భర్తతో గొడవపడుతూ, పుట్టింటికి వెళ్లి, నెలల తరబడి ఉండిపోయేది. భర్తకు భోజనం కూడా సరిగా పెట్టేది కాదు. వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందంటూ భర్తను వేధించేది. దీంతో ఆమెను అంతమొందించాలని మొఘలా సాహెబ్ నిర్ణయించుకున్నాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు, పాము కరిచి చనిపోయిందని నమ్మించేలా ప్రణాళిక వేశాడు. ఏడిద రోడ్డులో పాములు పట్టేవారి వద్దకు వెళ్లి.. ఆయుర్వేదం మందులోకి కావాలంటూ విషం సేకరించాడు. 22న ఉదయం షహీదాబేగంకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆర్ఎంపీతో వైద్యం చేయించాడు. అతడు వెళ్లిపోయాక పాము విషాన్ని ఇంజెక్షన్ ద్వారా ఆమె కుడిచేతిలోకి ఎక్కించాడు. ఆమె కేకలు వేయగా, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి వెళ్లేలోపే ఆమె మరణించింది. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..
- భార్యను హతమార్చిన భర్త - భర్తపై కేసు నమోదు - పోలీసుల అదుపులో నిందితుడు కామేపల్లి : వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉందని కట్టుకున్న భార్యను గొడ్డలితో కొట్టి చంపిన సంఘటన మండల పరిధిలోని పాతలింగాల గ్రామంలో బుధవారం జరిగింది. కామేపల్లి ఎస్సై ఇ.శ్రీనివాస్ కథనం ప్రకారం... ములకలపల్లి మండలం రాజుపేటకు చెందిన జగన్నాథ కృష్ణవేణి(33)కి పాతలింగాల గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ జగన్నాథ వెంకన్నతో గత 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొంతకాలంగా వెంకన్న తాగుడుకు బానిసై, మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అయితే భార్య కృష్ణవేణి భర్త వెంకన్నను తమ పద్ధతులను మార్చుకోవాలని ప్రాధేయపడింది. అయినా వెంకన్న తీరు మాత్రం మారలేదు. ఎలాగైనా భార్యను అడ్డుతొలగించుకోవాలని పథకం పన్నాడు. దీంతో ఉదయమే మద్యం మత్తులో ఉన్న వెంకన్న భార్య కృష్ణవేణిని ఇంట్లో ఉన్న గొడ్డలితో తలపై బలంగా కొట్టాడు. దీంతో కృష్ణవేణి అక్కడికక్కడే మృతిచెందింది. పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కల గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై నిందితుడిని అదుపుతోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా సీఐ డి.రమేష్ కూడా కృష్ణవేణి హత్యకు గల కారణాలను గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
వాట్సాప్‌లో చాట్ చేస్తోందని.. చంపేశాడు!
భార్య తరచు వేరేవాళ్లతో ఫోన్లో మాట్లాడుతోందని.. వాట్సప్‌లో కూడా చాట్ చేస్తోందని అనుమానం పెంచుకున్న ఓ భర్త.. కట్టుకున్న భార్యను తలపై ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సీతారాంపేట్ ప్రాంతంలో నివసించే రాజేశ్‌శర్మ చార్మినార్ పటేల్ మార్కెట్లోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి 14 ఏళ్ల క్రితం సరిత(34)తో పెళ్లయింది. వీళ్లకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంత కాలంగా సరిత తరచూ ఫోన్లో ఇతరులతో మాట్లాడుతూ ఉండడం, వాట్సప్‌లో చాటింగ్ చేయడం గమనించిన రాజేశ్‌శర్మ పలు మార్లు భార్యను హెచ్చరించాడు. అయినా, ఆమె తన తీరు మార్చుకోలేదు. బుధవారం నాడు పనికి వెళ్లకుండా ఇంటివద్దనే ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో సరిత ఎవరితోతో ఫోన్లో మాట్లాడడం గమనించిన రాజేశ్‌శర్మ ఫోన్ ఇవ్వాలని కోరాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. బాగా కోపం వచ్చిన రాజేశ్‌శర్మ పక్కనే ఉన్న ఇనుపరాడుతో సరిత తలపై బాదాడు. దీంతో సరిత రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అతడు మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యను తానే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
కట్టుకున్నోడే కాలయముడు
కట్టుకున్నోడే కాలయముడయ్యాడు.. జీవితాంతం తోడుంటానని పెళ్లినాడు చేసిన ప్రమాణాలు మరిచాడు.. మద్యం తాగడానికి డబ్బులివ్వలేదనే కోపంతో భార్యను భర్త గొడ్డలితో నరికి చంపేశాడు.. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. - తలకొండపల్లి మండలంలోని అంతారానికి చెందిన గొర్రె అంజమ్మ (50), అంజయ్య దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యకు చిన్నప్పటి నుంచి పోలియో కారణంగా ఓ కాలు పనిచేయదు. భర్త మద్యానికి బానిైసై ఏ పనిచేయకుండా ఊర్లో జులాయిగా తిరగసాగాడు. దీంతో భార్యపైనే కుటుంబ భారం పడటంతో కూలిపని చేస్తోంది. ఇటీవల ఉపాధికోసం కుమారుడు ఇస్తారి హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. పెద్దకూతురు గతంలోనే చనిపోగా చిన్న కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది. ఈ క్రమంలోనే భర్త మద్యం తాగడానికి డబ్బులివ్వాలని తరచూ వేధించసాగాడు. ఎప్పటిలాగే శనివారం రాత్రి అంజమ్మ ఆరుబయట నిద్రకు ఉపక్రమించింది. అర్ధరాత్రి పీకలదాకా తాగి ఇంటికి భర్త వచ్చి భోజనం పెట్టాలని భార్యను లేపి గద్దించాడు. ఉదయం వండిన చల్ల అన్నం తినమనగా కోపంతో గొడ్డలితో మోది చంపేసి పారిపోయాడు. ఆదివారం ఉదయం చుట్టుపక్కలవారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని సీఐ వెంకట్, ఎస్ఐ మహేందర్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అక్కడే ఉన్న పదునైన ఆయుధం, అగ్గిపెట్టె, రబ్బరుచెప్పుల జత స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. -
భార్యను చంపిన భర్త
అదనపు కట్నం కోసం దారుణం నేరేడ్మెట్: అదనపు కట్నం కోసం గొంతు నలిమి భార్యను హత్య చేశాడో కిరాతకుడు. నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ ఎన్. చంద్రబాబు, స్థానికుల కథనం ప్రకారం....గౌతంనగర్‌లో నివాసముండే శ్రీకళ (26), శ్రీకాంత్ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో 2007లో పెళ్లి చేసుకున్నారు. వివాహ సమయంలో శ్రీకళ తల్లిదండ్రులు 10 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2.5 లక్షల నగదు, ఇతర సామగ్రి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. నాలుగు నెలలు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాత కారు కొనుగోలు చేసి ట్రావెల్స్‌లో నడుపుతానని, రూ.2 లక్షలు అదనపు కట్నం కింద తేవాలని శ్రీకాంత్, తన తల్లి విజయ, సోదరుడు మధుతో కలిసి శ్రీకళను వేధించడం ప్రారంభించాడు. దీంతో నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. దానిని వారు అమ్ముకుని జల్సాలు చేసి తిరిగి డబ్బులు కావాలని శ్రీకళను మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నారు. ఎంతగా వేధించినా ఆమె డబ్బులు తీసుకొని రాకపోవడంతో శ్రీకాంత్ తన తల్లి, సోదరుడితో కలిసి సోమవారం తెల్లవారుజామున శ్రీకళ గొంతు నులిమిహతమార్చాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి నీలం యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మందులు వేసుకోలేదని.. భార్యను చంపేశాడు!
భార్య మీద అతి ప్రేమతో ఆమెను చంపేశాడో భర్త!! ఓవైపు జబ్బుతో బాధపడుతున్నా.. డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకోలేదన్న కోపంతో ఆమెను చంపేశాడు. ఈ ఘటన బీహార్‌లోని బక్సర్ జిల్లాలో జరిగింది. సల్మా ఖాతూన్ (26) అనే మహిళను ఆమె భర్త మహ్మద్ ముస్తఫా అబ్బాసీ పదునైన ఆయుధంతో కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆమె మరణించింది. సల్మా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోందని, డాక్టర్లు ఆమెకు మందులు ఇచ్చినా, వాటిని ఆమె సరిగా వేసుకోవట్లేదని బ్రహంపూర్ పోలీసు స్టేషన్ అధికారి గోరఖ్ రాం చెప్పారు. ఎన్ని సార్లు చెప్పినా ఆమె మాట వినిపించుకోకపోవడం, మందులు వేసుకోకపోవడంతో కోపం వచ్చిన ఆమె భర్త.. ఏదో పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేసినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. ఆమె ఆరోగ్యం బాగుపడాలని, త్వరగా కోలుకోవాలని సమీపంలో ఉన్న ఓ దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశాడు. వెంటనే వైద్యం అందకపోవడంతో ఆమె మరణించింది. అబ్బాసీని పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపారు. -
మద్యం తాగొద్దన్నందుకు..
ధరూరు : నిత్యం మద్యం సేవించి అనారోగ్యానికి గురవుతున్నావని.. ఇలాగైతే సంసారం ఎలాగని ప్రశ్నించిన భార్యను ఓ భర్త దారుణంగా హతమార్చాడు. స్థానికంగా తీవ్రసంచలనం రేకెత్తించిన ఈ ఘటన సోమవారం మండలంలోని మార్లబీడు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాల మల్లేష్ మతిస్థితిమితం సరిగాలేని తన మేనమామ కూతురును వివాహం చేసుకున్నాడు. వారికి ఓ కూతురు జన్మించింది. అల్లుడు తన కూతురును వేధింపులకు గురిచేస్తుండటంతో తండ్రి రెండేళ్లక్రితం తమ ఇంటికి తీసుకెళ్లాడు. ఇదిలాఉండగా, ఏడునెలల క్రితం మరో వివాహం చేసుకునేందుకు మల్లేష్ పూనుకున్నాడు. గ్రామస్తుల సమక్షంలో మొదటి భార్యకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒప్పందపత్రాన్ని రాయించుకుని రాయిచూర్ పట్టణంలోని జలాల్నగర్కు చెందిన లక్ష్మి(20)ని ఏడునెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో ఆమెకు కట్నకానుకల కింద రెండు తులాల బంగారం, కొంతనగదు ఇచ్చారు. మల్లేష్ తాగుడుకు బానిసకావడంతో పలుమార్లు లక్ష్మి భర్తను మందలించినా అతడి ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మద్యంమత్తులో ఉన్న మల్లేష్‌ను భార్య తాగొస్తే సంసారం ఎలా సాగుతుందని నిలదీసింది. తనకు ఇష్టమొచ్చినట్లు ఉంటానని లక్ష్మిపై దాడిచేశాడు. ఇంతలో కర్రతో తలపై బలంగా బాదడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృత్యువాతపడింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భార్య లక్ష్మి మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. సోమవారం ఉదయం మల్లేష్ బంధువులు, ఇరుగుపొరుగువారు గమనించి విషయాన్ని రాయిచూర్‌లోని లక్ష్మి తల్లిదండ్రులకు తెలియజేశారు. రేవులపల్లి ఎస్ఐ అమ్జద్అలీ సంఘటనపై ఆరాతీశారు. సంఘటనకు కారణమైన భర్త మల్లేష్, అత్త మల్లమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి అన్న నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రామచంద్రాపురంలో దారుణం:భార్యను చంపిన భర్త
-
రామచంద్రాపురంలో దారుణం:భార్యను చంపిన భర్త
రామచంద్రాపురం:తూర్పు గోదావరిజిల్లా రామచంద్రాపురంలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపేశాడో భర్త. కంప్యూటర్ శిక్షణ కోసం వెళ్లిన భార్యను ఆ సెంటర్ కు వెళ్లి మరీ పొట్టనపెట్టుకున్నాడు. కె.గంగవరానికి చెందిన వెంకటమాణిక్యాలరావుకు, అదే మండలం పామర్రుకు చెందిన సునీతకు 2009లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఇరువురి మధ్య గతంలో గొడవలు రావడంతో రెండేళ్ల క్రితం విడిపోయారు. గత రెండేళ్లుగా సునీత తల్లివద్దే ఉంటుంది. గొడవల నేపధ్యంలో గంగవరం పోలీస్ స్టేషన్ లోమాణిక్యాలరావుపై వరకట్న వేధింపులకింద కేసు నమోదైంది. ఏమైందోగానీ ఇవాళ ద్రాక్షారామలో కత్తికొనుగోలు చేసి, నేరుగా భార్య కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్న సెంటర్ వద్దకు వెళ్లి ఆమె మెడపై కత్తితో నరికాడు. తీవ్రగాయాలతో రక్తస్రావమై సునీత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం మాణిక్యాలరావు సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఈ అకృత్యానికి పాల్పడినట్టు నిందితుడు పోలీసులకు చెప్పాడు. -
భార్యను దారుణంగా హత్య చేసిన భర్త
తూ.గో:కాకినాడలో గురువారం దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భార్యతో జీవితాంతం కలిసి బ్రతకాల్సిన భర్త.. కత్తితో నరికి చంపడంతో వెంకటేశ్వరకాలనీలో కలకలం సృష్టించింది. మరియమ్మ అనే మహిళను భర్త రామకృష్ణ కత్తితో అతి దారుణంగా నరికి హత్య చేయడమే కాకుండా..శరీర భాగాలను రోడ్డుపై పడేసి భయాందోళనలు రేకిత్తించాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కుటుంబంలో చోటుచేసుకున్న విభేదాలే ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. -
కట్నం కోసం..కొట్టి చంపేశారు!
పుట్టింటినుంచి తాము తెమ్మన్న రెండు లక్షల రూపాయలు తేనందుకు గాను ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళను ఆమె భర్త, మరిది కలిసి కొట్టి చంపేశారు. ఫత్మా అనే ఆ బాధితురాలికి అజ్మత్ అలీతో 12 ఏళ్ల క్రితం పెళ్లయింది, వారికి ఇద్దరు పిల్లలుకూడా ఉన్నారు. భోపా పట్టణంలోని ఆమె అత్తవారింట్లో శుక్రవారం రాత్రి ఆమెను కొట్టి చంపేశారు. అజ్మత్, అతడి తమ్ముడు హస్మత్ ఇద్దరి మీద పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. వాళ్లిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పుట్టింటి నుంచి డబ్బు తేవాల్సిందిగా గత కొన్నాళ్ల నుంచి ఆమెపై వాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. దానికోసం తరచు ఆమెను కొడుతున్నట్లు బాధితురాలి సోదరుడు హసన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. -
అనుమానంతో భార్యను పొడిచి చంపిన భర్త
వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపేశాడో కసాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడలో ఈ దారుణం జరిగింది. భార్యా భర్తలైన అసిరి పోలి, కుమారిలకు రోజూ ఇదే విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యను హతమార్చిన భర్త .. అక్కడ్నించి పారిపోయాడు. అయితే, తన కోరిక తీర్చలేదన్న కోపంతో నిందితుడి అన్నే కావాలని తన సొంత తమ్ముడికి, అతడి భార్యపై లేనిపోనివి చెప్పి, హత్యకు ప్రేరేపించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. తల్లి మృతదేహం వద్ద ఆమె ఇద్దరు చిన్నారులు ఏడవడం అందరినీ కలచివేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనుమానంతో భార్యను పొడిచి చంపిన భర్త
-
భార్యను చంపి తాను అత్మహత్య చేసుకున్న భర్త
-
భార్యను చంపి.. శవాన్ని ఇంట్లోనే వదిలేసి..
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్‌బోర్టు కాలనీలో ఓ భర్త భార్యను చంపి, శవాన్ని ఇంట్లోనే వదిలేసి వెళ్లాడు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కర్నె చంద్రయ్య, నాగమ్మ(45) దంపతులు 25 ఏళ్ల క్రితం మిర్యాలగూడకు వచ్చారు. హౌసింగ్‌బోర్టు కాలనీలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం చేస్తున్నారు. చంద్రయ్య తాగుడుకు బానిస కావడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి తాగిన మైకంలో చంద్రయ్య భార్య తలపై రోకలితో కొట్టి చంపాడు. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఇంటికి తాళం వేశాడు. అప్పటి నుంచి ఇంటికి వెళ్లకుండా మద్యం తాగుతూ కాలనీలోనూ తిరుగుతూ బయటే పడుకుంటున్నాడు. దుర్వాసన వస్తుండడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, నాగమ్మ మృతదేహం కనిపించింది. కాలనీలోనే తిరుగుతున్న చంద్రయ్యను పట్టుకొని విచారించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఆత్మహత్యగా నమ్మించబోయి..
దుండిగల్, న్యూస్‌లైన్ : భార్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించిన భర్త నిజాలు వెలుగులోకి రావడంతో కటకటాలపాలయ్యా డు. సోమవారం దుండిగల్ సీఐ బాల కృష్ణ కేసు వివరాలు వెల్లడించారు. పశ్చి మ గోదావరి జిల్లా పాలకోడేరు మం డలం మోగల్లు గ్రామానికి చెందిన పెనుమత్స సుబ్రహ్మణ్య కుమార్రాజు(28)కు అత్తిలి మండలం ఈడూరుకు చెందిన పావని(22)తో 2013 ఫిబ్రవరి 13న వివాహమైంది. నాలుగు నెలల క్రితం సుబ్రహ్మణ్య రాజు భార్య పావని, తన తల్లిదండ్రులతో కలిసి నగరానికి వచ్చి బాచుపల్లి రామచంద్రారెడ్డినగర్లోని వైష్ణవి సాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్ పెంట్‌హౌస్‌లో అద్దెకుంటున్నాడు. ఖాజీ పల్లిలోని ప్రసాద్ స్టోన్ క్రషర్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి సూర్యనారాయణరాజు అక్కడే మెస్‌లో పనిచేస్తున్నాడు. కాగా పెళ్లైనప్పటి నుంచి పావని భర్తతో దాంపత్య జీవితానికి దూరంగా ఉంటోంది. గతేడాది డిసె ంబర్ 24న మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన సుబ్రహ్మణ్య రాజు భార్య ను బలవంతం చేయగా ఆమె ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురై కొట్టాడు. పావని తలకు బలమైన గాయమై స్పృహ కోల్పోయింది. చనిపోయిందని భావించిన అతను చీరతో ఫ్యాన్‌కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అనంతరం దోపిడీ దొంగల పనిగా ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేసి బయట నుంచి తలుపు గడియపెట్టి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్టుగా భార్య మృతదేహం వద్ద విలపించాడు. అనంతరం మృతదేహాన్ని ఈడూరుకు తరలించగా అక్కడికి వెళ్లిన సుబ్రహ్మణ్య రాజుపై మృతురాలి బంధువులు దాడిచేసి నిలదీయడంతో తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. అత్తిలి పోలీసులు దుండిగల్ పోలీసులకు సమాచారం అందించగా వారు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. -
ప్రేమపుస్తకం..నెత్తుటి సంతకం
వారిద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కడదాకా కలిసే సాగాలని బాస చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి మూడుముళ్లు.. ఏడడుగుల బంధంతో ఏకమయ్యారు. కొంతకాలం సజావుగా సాగిన వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. భర్తలో అనుమానపు చిచ్చు రగిలి చివరకు భార్య ప్రాణాలను బలిగొన్నది. ఇద్దరు పసివాళ్లను అనాథలను చేసింది. తాను దగ్గర లేకపోవడంతోపాటు చెప్పుడు మాటలు నెత్తికెక్కి భార్యను దారుణంగా కొట్టిచంపాడు ఆ కిరాతకుడు. సారంగాపూర్, న్యూస్‌లైన్: సారంగాపూర్ మండలం అర్పపల్లి గ్రామానికి చెందిన ఎండబెట్ల విజయ్(28), గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామానికి చెందిన బ్లెస్సీ(26) జగిత్యాలలో పక్కపక్కనే ఉన్న దుకాణాల్లో టైల రింగ్ నేర్చుకునేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. రెండు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కొంతకాలం పాటు దంపతులిద్దరు ఎంతో అన్యోన్యంగా మెలిగారు. పెళ్లయిన తర్వాత రెండేళ్లకు విజయ్ ఉపాధి నిమిత్తం ఏడాదిన్నర పాటు ఇరాక్ వెళ్లాడు. ఇంటి దగ్గర ఉన్న తల్లి, భార్యతో తరచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. ఈ క్రమంలో తల్లితోపాటు మరికొందరు బ్లెస్సీపై లేనిపోని విషయాలు అతనికి ఫోన్లో చెప్పేవారు. మనస్తాపానికి గురైన విజయ్ మానసిక స్థితిలో మార్పు రావడంతో కంపెనీ అతడిని ఇంటికి పంపింది. కొంతకాలం పాటు ఇంటివద్దే ఉన్న విజయ్ తిరిగి ఇరాక్ వెళ్లి మళ్లీ అదే కంపెనీలో చేరాడు. అప్పటికీ అతడి మానసకస్థితిలో మార్పు రాకపోవడంతో కంపెనీ తిరిగి ఇంటికి పంపించింది. అప్పటినుంచి బ్లెస్సీని విజయ్ ఏదో రకంగా హింసిస్తుండేవాడు. ప్రతిరోజు తీవ్రంగా కొట్టేవాడు. గాయాలైన ఆమెకు స్థానిక ఆర్ఎంపీల వద్ద మందులు ఇప్పించేవాడు. వారం రోజుల క్రితం విజయ్ కొట్టిన దెబ్బలకు బ్లెస్సీ శరీరమంతా గాయాలు కావడంతో సమీప బంధువులు జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయించారు. నాలుగు రోజుల క్రితం ఆసుపత్రి నుంచి వచ్చిన ఆమెను ఇంట్లో నిర్భందించినంత పనిచేసి కర్రలతో చితకబాదుతున్నాడు. బ్లెస్సీతో దిగిన ఫొటోలను, ఆమెకు సంబంధించిన సర్టిఫికెట్లను ఇంటిముందు కుప్పగా పోసి దహనం చేసినట్లు చుట్టుపక్కలవారు తెలిపారు. బ్లెస్సీని కొడుతున్న సమయంలో ఎవరైనా అడ్డొస్తే వారితో సంబంధం అంటగట్టి విచిత్రంగా ప్రవర్తించేవాడు. మహిళలు అడ్డుగా వస్తే వారిని దుర్భాషలాడి అవమానపరిచేవాడు. దీంతో బ్లెస్సీని విజయ్ కొడుతుంటే అడ్డుకునేందుకు స్థానికులు జంకేవారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బ్లెస్సీతో విజయ్ గొడవపడి చితకబాదాడు. తర్వాత కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఆమె స్పృహతప్పి కుప్పకూలిపోయింది. బ్లెస్సీ చనిపోయేంత వరకు కొట్టి, ప్రాణంపోయిందని నిర్ధారించుకున్న తరువాత జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చాడు. కర్ర చేతిలో పట్టుకొని శవం పక్కన కూర్చుండిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విజయ్ను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, బ్లెస్సీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించామని ఎస్సై వినయ్ తెలిపారు. విజయ్ మూడు రోజులుగా సైకోగా ప్రవర్తిస్తూ బ్లెస్సీని తీవ్రంగా హింసించి చంపినట్టు గ్రామస్తులు వివరించారు. పాపం.. పసివాళ్లు.. విజయ్-బ్లెస్సీలకు ఇద్దరు కుమార్తెలు అభీషా(5), వర్షిణి(3) ఉన్నారు. తమ కళ్లముందే తల్లిని తండ్రి చావగొడుతుంటే చూస్తుండడం తప్ప ఏమీ చేయలేని పసితనం వారిది. ఇద్దరూ సంఘటన జరిగిన తరువాత నుంచి తల్లి మృతదేహం చుట్టు తిరుగుతూ.. అమ్మకు ఏమైందంటూ అడుగడం అక్కడున్న వారిని కంటతడిపెట్టించింది. అభం శుభం తెలియని చిన్నారులు తండ్రిని చూస్తే మాత్రం హడలిపోయారు. ప్రతిరోజు నాన్న తీరును చూసిన భయంతో వణికిపోతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లడం.. తండ్రిని పోలీసులు పట్టుకెళ్లడంతో చిన్నారులు దిక్కులేనివారయ్యారు. విజయ్ తండ్రి గతంలో గ్రామంలో హత్యకు గురికాగా, తల్లి ఉంది. కుమారుడికి లేనిపోని విషయాలు చెప్పి కోడలు మృతికి ఆమె కూడా కారకురాలైంది. భర్త, అత్త కొట్టిచంపారు.. బ్లెస్సీని భర్త విజయ్, అత్త అమృతమ్మ అదనపు కట్నం కోసం కొట్టి చంపారని మృతురాలి తండ్రి బొల్లం నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాహ సమయంలో రూ.90వేలు కట్నంగా ఇచ్చామని, ఆ తరువాత మరో రూ.30వేలు ముట్టజెప్పామని తెలిపారు. ఇంకా రూ.30వేలు కావాలంటూ బ్లెస్సీని వేధింపులకు గురిచేసి చంపారంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. -
భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు
వరంగల్ లీగల్, న్యూస్‌లైన్ : మద్యానికి బానిసైన భర్త పీడను వదిలించుకోవడానికి అతడిని కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన భార్యకు జీవితఖైదు శిక్ష విధిస్తూ రెండో అదనపు జిల్లా జడ్జి యార రేణుక మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కడకంచి ఎల్లయ్య పందులను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. ఒక కుమారుడు జన్మించిన తర్వాత మొదటి భార్య చనిపోయింది. 29 ఏళ్ల క్రితం లక్ష్మిని రెండో భార్యగా పెళ్లిచేసుకోగా వారికి ఒక కొడుకు, కూతురు జన్మించారు. ఎల్లయ్య మద్యానికి బానిస కావడంతో ఆమె తరచూ గొడవపడేది. ఈ క్రమంలో 2012 జూన్ 1న సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి వెనుక కుర్చోని ఉన్న ఎల్లయ్య బూతులు తిడుతుండడంతో నీవు చనిపోతే పీడ విరగడవుతుందంటూ జగ్గులో ఉన్న కిరోసిన్ ఎల్లయ్య తలపై పోసి అగ్గిపుల్లతో అంటించింది. తల నుంచి కాళ్ల వరకు శరీరమంతా మంటలు లేవగా ఎల్ల య్య అరుపులతో చుట్టుపక్కలవారు వచ్చి మంటలార్పారు. జనగామ ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. చికిత్స సమయంలో చెప్పిన వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి మరణవాంగ్ములం పరిశీలించిన జడ్జి రేణుక ముద్దాయిపై నేరం రుజువుకావడంతో కడకంచి లక్ష్మికి యావజ్జీవ కారాగార శిక్ష, *100 జరిమాన విధిస్తూ తీర్పు ఇచ్చారు. కేసు విచారణను సీఐ నరేందర్ చేయగా, సాక్షులను హెడ్‌కానిస్టేబుల్ సంపత్‌కుమార్ కోర్టులో ప్రవేశపెట్టారు. లైజన్ అఫీసర్ రఘుపతిరెడ్డి పర్యవేక్షించగా ప్రాసిక్యూషన్ తర ఫున పీపీ విజయాదేవి వాదించారు. మహిళా పీపీ వాదనలు.. మహిళా జడ్జి తీర్పు.. ప్రపంచ పురుష దినోత్సవం రోజున నేరస్తురాలైన స్త్రీని శిక్షిస్తూ మహిళా న్యాయమూర్తి తీర్పు వెల్లడించడం, నేరం నిరూపిస్తూ ప్రాసిక్యూషన్ తరఫున వాదించిన పీపీ మహిళే కావడం యాదృచ్ఛికంగా జరిగింది. కోర్టులో ఈ అంశం చర్చనీయాంశమైంది.