సాక్షి, మంథని(కరీంనగర్): మండలంలోని ఉప్పట్ల గ్రామంలో కాసిపేట రేణుకను చంపిన కేసులో ఆమె భర్త కాసిపేట బానయ్యను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సతీశ్ తెలిపారు. ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో సమావేశం నిర్వహించి నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించారు. బానయ్యకు ఇద్దరు భార్యలని, గ్రామానికి చెందిన రేణుకను 16ఏళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడని సీఐ తెలిపారు.
వీరిమధ్య చాలా ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయని, దీంతో రేణుక జూలైలో ఇంటి నుంచి వెళ్లిపోగా స్థానిక పోలీస్‌స్టేషన్ మిస్సింగ్ కేసు నమోదైందన్నారు. ఈక్రమంలో రేణుకను వెతికి తీసుకురాగా భర్తతో ఉంటానని వెళ్లిపోయిందన్నారు. కొంతకాలం తర్వాత భార్యపై మళ్లీ అనుమానం పెంచుకోవడంతో ఇళ్లు వదిలి హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అక్కడ ఓ హోటల్‌లో పనిచేస్తున్న విషయం తెలుసుకుని తన భర్త బానయ్య వారం క్రితం వెళ్లి తీసుకుచ్చాడు.
శనివారం గ్రామంలోని పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. రేణుక తన భర్తతో కాపురం చేయనంటూ వెళ్లిపోతుండగా భార్యను వెంబడించి తలపై పెద్దరాయితో నాలుగుసార్లు కొట్టడంతో రేణుక అక్కడికక్కడే మృతిచెందినట్లు సీఐ తెలిపారు. హత్యకు ఉపయోగించిన రాయితో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. ఎస్సై చంద్రశేఖర్ వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment