వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపేశాడో కసాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడలో ఈ దారుణం జరిగింది. భార్యా భర్తలైన అసిరి పోలి, కుమారిలకు రోజూ ఇదే విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యను హతమార్చిన భర్త .. అక్కడ్నించి పారిపోయాడు.
అయితే, తన కోరిక తీర్చలేదన్న కోపంతో నిందితుడి అన్నే కావాలని తన సొంత తమ్ముడికి, అతడి భార్యపై లేనిపోనివి చెప్పి, హత్యకు ప్రేరేపించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. తల్లి మృతదేహం వద్ద ఆమె ఇద్దరు చిన్నారులు ఏడవడం అందరినీ కలచివేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
అనుమానంతో భార్యను పొడిచి చంపిన భర్త
Published Wed, Apr 16 2014 10:20 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement