Adultery
-
ఇవేం‘రక్త’ సంబంధాలు..ఆస్తి కోసం అయిన వారినే తుదముట్టిస్తున్న వైనం
ఆస్తి కోసం ఒకనాడు అన్నను, ఇప్పుడు తమ్ముడిని హత్య చేశాడో వ్యక్తి. కన్న తండ్రినే చంపేందుకు ప్రయత్నించాడో యువకుడు. వివాహేతర సంబంధం కోసం ఓ భార్య.. భర్తపై హత్యా యత్నం చేస్తే.. ఆవేశంలో అన్నీ మరిచి కన్న తల్లినే చంపిందో కూతురు. బంధాలు, అనుబంధా లన్నీ మాటలకే.. మనిషిలోని మానవత్వం మాయమైపోతోంది. కన్నవారి మీద, తోబుట్టువుల పట్ల కూడా కనీస ప్రేమ కరువైంది. క్షణికావేశమో.. పగ, ప్రతీకారమో.. కుటుంబ సభ్యులను చంపేందుకు వెనుకాడటం లేదు మనిషి. అందుకు ఈ ఘటనలు ఓ ఉదాహరణ మాత్రమే! భర్తపై డీజిల్ పోసి.. నిప్పంటించి.. ♦ ఓ భార్య ఘాతుకం ♦ దాదిగూడ రాంనగర్ కాలనీలో ఘటన జిన్నారం(పటాన్చెరు): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తపై డీజిల్ పోసి హత్య చేసేందుకు ఓ భార్య యత్నించింది. ఈ ఘటన జిన్నారం మండలం ఊట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రాంనగర్ కాలనీలో ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఊట్ల గ్రామ పంచాయితీ పరిధిలోని దాదిగూడ గ్రామానికి చెందిన సంకు నర్సింహులు(32)కి దుండిగల్‌కు చెందిన యాదమ్మతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు దాదిగూడ సమీపంలోని రాంనగర్ కాలనీ లో ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. భార్యాభర్తలు కూలి పని చేసుకుంటూ బతుకుతున్నారు. యాదమ్మ కొంత కాలంగా వివాహేతర సంబం«ధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త తర చూ కుటుంబ సభ్యులకు చెప్పి బాధపడేవాడు. ఇదే విషయమై 27వ తేదీ రాత్రి భార్యాభర్తల మధ్య గొ డవ జరిగింది. భర్త తనకు అడ్డంకిగా మారాడని భావించిన యాదమ్మ అత డిని చంపాలని నిర్ణయించుకుంది. గొడవ జరిగాక ఇంటి పక్కనే ఉన్న ఆటో నుంచి డీజిల్ తీసి పెట్టుకుంది. భర్త నర్సింహులు గాఢ నిద్రలోకి వెళ్లాక, రాత్రి 12 గంటల తర్వాత అతడిపై డీజిల్ పోసి నిప్పంటించింది. నర్సింహులు అరుపులతో చుట్టు పక్కల వారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయ త్నించారు. అప్పటికే 60 శాతం గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నర్సింహులు పరిస్థితి విషమంగా ఉంది. నర్సింహు లు తమ్ముడు పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విజయరావు తెలిపారు. యాదమ్మ పోలీసుల అదుపులో ఉంది. తల్లిని రోకలితో బాది.. ♦ ఓ కుమార్తె దుర్మార్గం నందిపేట్(ఆర్మూర్): తల్లీకూతుళ్ల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ హత్యకు దారితీసింది. కూతురు ఆవేశంలో తల్లిని రోకలితో బాది చంపిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలో వెలుగు చూసింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మెడకు చెందిన నాగం నర్సు(52) భర్త చనిపోవడంతో ఉమ్మెడలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కూతుర్లు హరిత, అరుణ. పెద్ద కూతురు హరిత.. తల్లి ఉండే ఇంట్లోని పక్కగదిలోనే వేరుగా నివసిస్తోంది. కాగా తల్లీకూతుళ్ల మధ్య కొన్నేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. మృతురాలి రెండో కూతురు అరుణ ఇంట్లో ఈ నెల 26న తొట్లె ఫంక్షన్ జరిగింది. తల్లి నర్సు, పెద్ద కూతురు హరిత వెళ్లారు. అక్కడ నర్సు.. రెండో కూతురు అరుణ బంధువులతో గొడవపడి వారిని దూషించింది. ఇంటికి తిరిగొచ్చాక శుక్రవారం రాత్రి పెద్ద కూతురు హరితకు, మృతురాలికి మధ్య ఈ విషయంలో గొడవ జరిగింది. హరిత ఆవేశంలో తల్లి తల, ముఖంపై రోకలితో ఇష్టం వచ్చినట్లు కొట్టి వెళ్లిపోయింది. శనివారం రాత్రి తన చెల్లిలికి, బంధువులకు ఫోన్‌చేసి జరిగిన విషయాన్ని తెలిపింది. వారు వచ్చి చూడగా నర్సు చనిపోయి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతురాలి మేనల్లుడు గణపురం రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఆస్తి కోసం తండ్రిపై తనయుడి దాడి ♦ కత్తితో ఇష్టారీతిన పొడిచిన వైనం తొర్రూరు: వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకు.. ఆస్తి కోసం హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్సై లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అమీనాపురం గ్రామ శివారు టీక్యా తండాకు చెందిన మాలోతు రాములు అనే 70 ఏళ్ల వృద్ధుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేసి, తనకున్న మూడెకరాల భూమిని కుమారులిద్దరికి సమానంగా పంచాడు. భూ పంపకాల్లో అన్నకు ఎక్కువ భూమి పంచాడని, కుమార్తెలకు డబ్బులు పంపుతున్నాడని తండ్రితో చిన్న కుమారుడు స్వామి కొంత కాలంగా గొడవపడుతున్నాడు. పలుమార్లు పెద్దమనుషుల్లో పంచాయితీ పెట్టి నచ్చజెప్పినా అతని తీరులో మార్పు రాలేదు. రాములు ఈ నెల 26న దంతాలపల్లి పడమటిగూడెం శివారు చారి తండాలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి ఇంటికివ వెళ్లేందుకు ఆదివారం తొర్రూరు బస్టాండుకు వచ్చాడు. బస్సు కోసం ఎదురుచూస్తున్న తండ్రిని చాటుగా ఫాలో అవుతున్న స్వామి.. హెల్మెట్ ధరించి వెంట తెచ్చుకున్న కత్తితో తండ్రిపై దాడి చేశాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తల, పొట్ట, చేతులపై పదునైన కత్తి గాట్లు పడ్డాయి. బస్టాండ్‌లోని ప్రయాణికులు అడ్డుకోవడంతో అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్ర రక్త స్రావంతో అల్లాడుతున్న వృద్ధుడి గురించి పోలీసులకు అక్కడున్న ప్రయాణికులు సమాచారం అందించారు. పోలీసులు 108లో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. క్షతగాత్రుడి పెద్ద కుమారుడు శంకర్‌నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నాడు అన్నను.. నేడు తమ్ముడిని.. ♦ ఆస్తి కోసం హత్య చేసిన సోదరుడు మద్నూర్(జుక్కల్): ఆస్తి తగాదాలు నిండు ప్రా ణాన్ని బలితీసుకున్నాయి. రక్త సంబంధాన్ని మరిచి తోబుట్టువును దారుణంగా హత్య చేశాడో అన్న. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోనాలలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సోనాలకు చెందిన గంగాధర్, గినాన్బాయికి ముగ్గురు కొడుకులు సంజయ్ పాటిల్, రాజు పా టిల్, విజయ్ పాటిల్(32). వీరికి 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆస్తి విషయంలో గొడవలతో.. గంగాధర్ పెద్ద కొడుకు సంజయ్ పాటిల్‌ను తమ్ముడు రాజు పాటిల్ 2011లోనే హత్య చేసి, శిక్ష అనుభవించాడు. జైలు నుంచి బయటకు వచ్చిన రాజు అప్పటి నుంచి పెద్దపల్లి, హైదరాబాద్‌లలో ఇంగ్లిష్ టీచర్‌గా ప్రైవేటు స్కూళ్లలో పనిచేసేవాడు. కరోనా సమయంలో సొంతూరుకు తిరిగి వచ్చాడు. అయితే గంగాధర్ పేరున ఉన్న 18 ఎకరాల భూమిలోంచి ఐదు ఎకరాల భూమిని అప్పట్లో హత్యకు గురైన సంజయ్ భార్య పేరున చేశారు. 13 ఎకరాల్లోంచి మూడెకరాల భూమిని తమ్ముడు విజయ్ పాటిల్ అమ్మేశాడు. మిగిలిన పదెకరాల భూమిని తాకట్టు పెట్టడంతో రాజుపాటిల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆస్తి పంపకాలు జరగక ముందే ఇష్టారాజ్యంగా ఎట్లా అమ్మారని? భూమి తాకట్టు పెట్టి అప్పు చేయడం ఏమిటని? ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఒడిశా రాష్ట్రానికి వెళ్లి అక్కడే ఏదైనా ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా చేరాలని రాజు పాటిల్ అతడి భార్య సీతిక్ష నిర్ణయించుకున్నారు. అయితే ఆదివారం వేకువజామున నాలుగు గంటల ప్రాంతంలో రాజుపాటిల్ లేచి అదే ఇంట్లో వేరే గదిలో నిద్రిస్తున్న విజయ్పాటిల్ను విచక్షణ రహితంగా పొడిచాడు. మెడ, కాళ్లు, కడుపులో పలుమార్లు పొడవడంతో కడుపులోని పేగులు బయటకు వచ్చి విజయ్ వెంటనే మృతిచెందాడు. అక్కడి నుంచి నేరుగా మద్నూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన రాజు పాటిల్ జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్‌రెడ్డి, బిచ్కుంద సీఐ కృష్ణ, మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడు విజయ్ పాటిల్‌కు ఏడాది క్రితమే పెళ్లి జరిగిందని, భార్యాభర్తల మధ్య గొడవలతో భార్య ఇటీవలే పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పారు. -
‘వ్యభిచారానికి పాల్పడితే సైనికాధికారులపై చర్యలు’
న్యూఢిల్లీ: నీతి తప్పిన సైనికులు ఉంటే సైన్యంలో క్రమశిక్షణ దెబ్బతింటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పై అధికారులు వ్యభిచారానికి పాల్పడితే చర్యలు తీసుకొనే అధికారం సైనిక దళాలకు ఉందని తేల్చిచెప్పింది. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. వ్యభిచారం నేరం కాదంటూ చెబుతూ ఐపీసీ సెక్షన్ 497ను కొట్టివేస్తూ 2018లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ తప్పుడు పనిచేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా ఈ తీర్పు అడ్డుకోలేదని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం వెల్లడించింది. -
ఆడ శిశువుల్ని సాకి.. వ్యభిచార రొంపిలోకి దింపి
యాదగిరిగుట్ట: బాలికలను అక్రమ రవాణా చేస్తూ వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన కంసాని అనసూయ చాలా ఏళ్ల క్రితం ఇద్దరు ఆడ శిశువులను కొనుగోలు చేసి యుక్త వయస్సు వచ్చే వరకు పెంచి పోషించింది. సులువుగా డబ్బు సంపాదించుకునేందుకు ఇద్దరు బాలికలతో వ్యభిచారం చేయించాలని నిర్ణయించుకుంది. అందుకోసం తన బంధువైన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో ఉన్న కంసాని శ్రీనివాస్ వద్దకు బాలికలను పంపించింది. శ్రీనివాస్ అక్కడ ఆ బాలికలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తుండేవాడు. అదే క్రమంలో యాదగిరిపల్లికి కూడా పంపిస్తుండేవాడు. వ్యభిచారం చేయించేందుకు అనసూయ వారిని కొడుతూ ఉండేది. అనసూయ, శ్రీనివాస్‌కు మరికొంతమంది సహకరించేవారు. తప్పించుకుపోయి.. పోలీసుల కంటపడి.. అనసూయ చిత్రహింసలకు తట్టుకోలేక ఇద్దరిలో ఓ బాలిక ఇటీవల ఇంటి నుంచి పారిపోయింది. జనగామ జిల్లా బస్టాండ్‌లో తిరుగుతూ పోలీసుల కంట పడింది. వారి విచారణలో యాదగిరిపల్లికి చెందిన అనసూయ, తంగళపల్లికి చెందిన శ్రీనివాస్ వ్యభిచారం చేయిస్తున్న విషయం వెలుగు చూసింది. దీంతో అక్కడి పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంరక్షణ అధికారి సైదులుతో పాటు ఇక్కడి పోలీసులకు సమాచారం అందజేశారు. మెరుపుదాడి చేసి.. ఈ నెల 3న సైదులు ఫిర్యాదు మేరకు యాదగిరిగుట్ట పోలీసులు, షీటీమ్స్, చైల్డ్ ప్రొటెక్షన్ సభ్యులు కలిసి యాదగిరిపల్లిలోని కంసాని అనసూయ ఇంటిపై దాడి చేశారు. అనసూయను అదుపులోకి తీసుకుని విచారించగా సెక్స్ రాకెట్ డొంక కదిలింది. ఆమె ఇచ్చిన సమాచారంతో తంగళపల్లికి చెందిన కంసాని శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చంద భాస్కర్, చంద కార్తీక్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని టీచర్ కాలనీకి చెందిన కంసాని లక్ష్మిలను పోలీసులు అరెస్టు చేశారు. యాదగిరిపల్లికి చెందిన కంసాని ప్రవీణ్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన కంసాని స్వప్న, కంసాని అశోక్, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చందా సరోజనమ్మ పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ఇద్దరు బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. దాడుల్లో పాల్గొన్న డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, టౌన్ సీఐ సైదయ్య, యాదగిరిగుట్ట పోలీసు బృందానికి సీపీ మహేష్ భగవత్ అభినందనలు తెలిపారు. -
ఉపాధి ఎరగా.. వ్యభిచార కూపంలోకి..
సాక్షి, విశాఖపట్నం : నగరానికి చెందిన ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు.. కృష్ణా జిల్లాకు చెందిన మరో యువతిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. ఉపాధి కల్పిస్తామని నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నరకంగా మార్చారు. చివరకు ఆమె గాజువాక పోలీసులను ఆశ్రయించడంతో ఐదుగురు నిందిఉతులను అరెస్టు చేశారు. గాజువాక పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ దరి ధనియాలపేటకు చెందిన ఓ యువతి(19) చదువును మధ్యలో ఆపేసి ఒక కిరాణా దుకాణంలో పని చేసేది. ఈ ఏడాది జనవరి 1న తల్లితో గొడవ పడి ఆమె కలువపూడిలోని తన తాతగారి ఇంటికి వెళ్లడం కోసం బయల్దేరింది. కలువపూడికి బదులు వేరే రైలు ఎక్కేయడంతో తిరుపతికి చేరుకుంది. అక్కడ రైల్వే స్టేషన్లో విశాఖకు చెందిన బి.ఉమామహేశ్వరి పరిచయమైంది. విశాఖలో పని ఇప్పిస్తానని ఆమె చెప్పడంతో ఆ యువతి ఇక్కడికి వచ్చేసింది. మధురవాడలోని వాంబే కాలనీలో తన ఇంటికి తీసుకొచ్చిన యువతిని ఉమామహేశ్వరి తన బంధువుతో వ్యభిచారానికి దింపింది. అతను తన నలుగురు స్నేహితులతో కలిసి యువతిపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బాధితురాలు ఉమామహేశ్వరి మరదలు గౌరీలక్ష్మికి తెలిపింది. దీంతో తన చెల్లెలు కుమారి వద్ద పని ఉందని చెప్పి పంపించింది. ఆమె కూడా ఈ యువతితో బలవంతంగా వ్యభిచారం చేయించింది. ఈ నేపథ్యంలో వాసిరెడ్డి సతీష్ అనే వ్యక్తి కుమారి వద్దకు వెళ్లాడు. తాను పోలీసునని యువతికి చెప్పాడు. దీంతో ఈ నరకం నుంచి తనను బయట పడేయమని అతడిని బాధితురాలు వేడుకొంది. దీంతో గాజువాక శ్రీనగర్ దరి అఫీషియల్ కాలనీకి చెందిన గంట నాగమణి, బి.గోవింద్‌ల ఇంటికి తీసుకెళ్లి రెండు రోజులు ఉంచాడు. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్రీహరిపురంలో ఒక ఇల్లు తీసి అందులో ఉంచి అనైతిక సంబంధాన్ని కొనసాగిస్తూ వ్యభిచారం చేయించాడు. తనను పెళ్లి చేసుకోమని ఆమె ఒత్తిడి చేయడంతో ఆమెకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లిపోయాడు. చివరకు అతడు నర్సీపట్నంలోని అమ్మిపేటలో ఉంటున్నట్టు తెలుసుకొని గంట నాగమణి, గోవింద్‌లతో కలిసి గత నెల 30న అక్కడికి వెళ్లింది. చదవండి: ప్రియురాలితో కలిసి ఉండడం చూశాడని.. అక్కడకు చేరుకున్న తరువాత వారు ఈ యువతిని కొట్టి ఆమెను వదిలి వెళ్లిపోయారు. ఆ రోజు రాత్రికి నర్సీపట్నంలోని ఒక ఇంట్లో తలదాచుకున్న యువతి మరుసటి రోజు ఉదయం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను కాకినాడలో ఉన్నానని చెప్పి వారి వద్దకు వెళ్లిపోయింది. వారి సహకారంతో గాజువాక పోలీసుల వద్దకు వచ్చి ఆదివారం ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఉమామహేశ్వరి, కుమారి, నాగమణితోపాటు సతీష్‌ను, అతడికి సహకరించిన గోవింద్‌ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
స్మార్ట్‌గా వ్యభిచారం.. కాలేజీ యువతులు కూడా!
సాక్షి, పలమనేరు : నియోజకవర్గంలో హైటెక్ వ్యభిచారం జోరందుకుంది. స్మార్ట్ ఫోన్ల ద్వారానే మొత్తం వ్యవహారం సాగుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది వ్యభిచార నిర్వాహకులు సంఘంలో మంచివారిలా చెలామణి అవుతూ రహస్యంగా హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. వీరి మాయమాటలను నమ్మి పలువురు కళాశాలకు వచ్చే విద్యార్థులు సైతం ఈ ఊబిలో పడినట్టు భోగట్టా. తొలుత సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో సంబంధాలను ఏర్పరుచుకుని ఆపై ఈజీ మనీ కోసం ఈ ఊబిలోకి వారిని దించుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కడైనా ఇలాంటి వ్యవహారాలు వెలుగుచూస్తే తప్ప అసలు విషయం ఎవరికీ తెలియకుండా సాగుతోంది. తాజాగా నియోజకవర్గంలోని వీకోట పట్టణంలోని ఓ లాడ్జిలో వ్యభిచార ముఠా గుట్టును అక్కడి పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అక్కడి ఓ టీడీపీ నాయకుని బంధువు ఉన్నట్టు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో మూలాలు పలమనేరు, కేజీఎఫ్, బెంగళూరులో ఉన్నట్టు తెలిసింది. తొలుత సోషల్ మీడియా ద్వారా..... ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్ అవసరంగా మారింది. వయసుతో తేడా లేకుండా ఫేస్బుక్, టిక్‌టాక్, హలో, వాట్సాప్ వాడుతున్నారు. ఇందులోని మహిళలు, అమ్మాయిలతో కొందరు వ్యభిచార నిర్వాహకులు ఫ్రెండ్ షిప్ చేసుకుని చాటింగ్‌లు మొదలు పెడుతున్నారు. వీరితో పరిచయం పెరిగి కాల్స్, లైవ్ కాల్స్‌కు చేరుతోంది. వారి వ్యక్తిగత వివరాలే కాకుండా ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని వారికి ఉపాధి ఉద్యోగాల పేరిట తొలుత బుట్టలో వేసుకోవడం జరుగుతోంది. ఇంకొందరు స్థానికంగా ఉద్యోగాలు ఉన్నాయంటూ సంప్రదించాలని వల వేయడం సాగుతోంది. స్థానికంగా ఉన్న అమ్మాయిలు, మహిళలను ఇళ్లకు పిలిపించుకోవడం.. వారికి అండగా ఉంటామంటూ నమ్మకాన్ని కల్పిస్తున్నారు. మెల్లమెల్లగా వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. ఒక్కసారి ఇందులోకి దిగినవారు మళ్లీ బయటకు రావడం కష్టమే. ఆపై డేటింగ్ యాప్‌లలోకి... వ్యభిచార కూపంలోకి దించిన యువతులను డేటింగ్ యాప్‌లోకి అడ్మిట్ చేయిస్తారు. డేటింగ్ యాప్స్‌లో ముఖ్యమైన ఇన్‌స్ట్ర్రాగం, ఊ ది డేటింగ్ యాప్( రెడీ టూ మీట్ న్యూగర్ల్స్ ఫ్రం యువర్ ఏరియా), జస్ట్ ఫ్రెండ్స్, క్వాక్ క్వాక్, వీ మేట్, జిల్, స్నాప్‌చాట్, విగో, టిండర్, క్రస్‌లాంటి వాటిలోకి వెళితే వందలు కాదు వేలాదిమంది స్నేహితులుగా మారుతారు. ఇందులో నియర్ బై అనే ఆప్షన్ ద్వారా ఈ ప్రాంతంలోకి వారిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా లైవ్ కాల్స్ నుంచి డైరెక్ట్‌గా మీటింగులు జరుగుతుంటాయి. కళాశాల విద్యార్థినులు, ఒంటరి మహిళలు సైతం.. వ్యభిచార ఊబిలో పడిన వారిలో కళాశాల విద్యార్థినులు, బాలికలు, ఒంటరి మహిళలు ఉన్నారు. ఆర్థిక అవసరాలు, విలాసాల కోసం జీవితాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదో లాభసాటి వ్యాపారం కావడంతో నిర్వాహకులు పెరుగుతూనే ఉన్నారు. పలమనేరులోని గంటావూరు, వీకోట, కర్ణాటకలోని కేజీఎఫ్, బెంగళూరుకు చెందిన పలువురు వ్యభిచార నిర్వాహకులు రింగుగా ఏర్పడి విటులను స్మార్ట్ ఫోన్ల ద్వారా బుక్ చేస్తున్నట్టు సమాచారం. విటులు సైతం నిర్వాహకుల ఖాతాలకు గూగూల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే చాలు అన్నీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని లాడ్జిలు, అద్దె ఇళ్లు వ్యభిచారానికి అడ్డాలు నియోజకవర్గంలోని కొన్ని లాడ్జిలు, పట్టణాల్లోని అవాసప్రాంతాల్లోని ఖరీదైన ఇళ్లు హైటెక్ వ్యభిచారానికి అడ్డాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇళ్లకు బంధువులు వచ్చినట్టుగా వస్తుంటారని, ఇక లాడ్జిల్లో ప్రత్యేక గదులే ఉన్నాయని సమాచారం. విటుల వద్దకు అమ్మాయిలను చేర్చేందుకు పట్టణంలోని కొందరు అద్దెకు కార్లను సైతం సిద్ధం చేస్తుంటారట. ఈ వ్యవహారంలో సూత్రధారులు చాలామందే ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా వ్యభిచార నిర్వాహకుల ధనాశకు ఎందరో మహిళలు, యువతులు, విద్యార్థినుల జీవితాలు నాశనమవుతున్నా యి. ఇప్పటికైనా సంబంధిత ప్రాంతాల్లోని పోలీసులు దీనిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. -
నూనె+వనస్పతి=నెయ్యి!
సాక్షి, సిటీబ్యూరో: నార్త్‌జోన్ పరిధి లోని చిలకలగూడ కేంద్రంగా సాగుతున్న కల్తీ నెయ్యి దందా గుట్టును మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని 400 లీటర్ల కల్లీ నెయ్యి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు గురువారం వెల్లడించారు. చిలకలగూడకు చెందిన పీఎన్ఎం నవీన్ నెయ్యి విక్రయం, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం చేసేవాడు. «ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న అతను ఏడాదిగా తన ఇంట్లోనే కల్తీ నెయ్యి తయారు చేస్తున్నాడు. మార్కెట్లో లభించే సాధారణ నూనెలో వనస్పతి కలిపి నెయ్యిగా మారుస్తున్నాడు. దీనిని డబ్బాలు, ప్యాకెట్లలో పార్శిల్ చేసి 100 శాతం స్వచ్ఛమైనదంటూ ప్రచారం చేస్తూ...కిరాణాదుకాణాలు, జనరల్ స్టోర్స్‌కు సరఫరా చేస్తున్నాడు. ఇతడి వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై టి.శ్రీధర్ తన బృందంతో రంగంలోకి దిగారు. నవీన్ ఇంటిపై దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. 24 డబ్బాల్లో పార్శిల్ చేసి 360 కేజీల, ప్యాకెట్ల రూపంలో ఉన్న 40 కేజీల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ప్యాకింగ్ మిషన్, సీలింగ్ యంత్రం, ప్లాస్టిక్ కవర్లు ఇతర మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. -
స్కూల్ నాటి ప్రేమ.. ప్రియుడి భార్య హత్య
న్యూఢిల్లీ : ప్రియుడిని దక్కించుకునేందుకు అతడి భార్యను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిన మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యలో నిందితురాలికి సహకరించిన మృతురాలి భర్తను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నైరుతి ఢిల్లీలోని కిషన్‌భాగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాహుల్ కుమార్ మిశ్రా(32) అనే ఇంజనీర్ భార్య పూజా రాయ్‌తో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 16 తన భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లిందంటూ సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే కూతురి ఆకస్మిక మృతి పట్ల అనుమానం వ్యక్తం చేసిన పూజ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆయనతో పాటు మిగతా కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టగా.. అటాప్సీ రిపోర్టు ప్రకారం పూజది హత్యేనని తేలింది. దీంతో రాహుల్ కుమార్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, ఇంటికి తరచుగా వచ్చే వాళ్లపై పోలీసులు నిఘా వేశారు. ఈ క్రమంలో రాహుల్ మాజీ ప్రేయసి పద్మా తివారి.. పూజను హతమార్చినట్లు గుర్తించారు. దీంతో బుధవారం పద్మతో పాటుగా రాహుల్‌ను కూడా అరెస్టు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే.. విచారణలో భాగంగా తమ సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంగానే పూజను అంతమొందించామని నిందితులిద్దరు అంగీకరించారు. ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ పద్మ, రాహుల్ జార్ఖండ్‌లోని సింద్రి ధన్బాద్లో ఎల్కేజీ నుంచి పన్నెండో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ ఎంతో స్నేహంగా మెలిగేవారు. అయితే ఉన్నత విద్యనభ్యసించే క్రమంలో వేర్వేరు కాలేజీల్లో చేరడంతో వారి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో 2015లో స్కూల్ ఫ్రెండ్స్ క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ ద్వారా పాత ప్రేమికులిద్దరు మళ్లీ దగ్గరయ్యారు. అయితే వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అడ్డుచెప్పాయి. అనంతరం 2017లో సింద్రీకే చెందిన పూజాతో రాహుల్‌కు పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో తానొక అమ్మాయిని ప్రేమిస్తున్నాని.. కాబట్టి తనతో పెళ్లి ఇష్టం లేదని చెప్పాల్సిందిగా రాహుల్.. పూజను కోరాడు. కానీ ఆమె ఇందుకు తిరస్కరించడంతో ఏప్రిల్ 23న వారి పెళ్లి జరిగింది. అనంతరం రాహుల్ ఉద్యోగ రీత్యా ఇద్దరు ఢిల్లీకి వచ్చారు. పెళ్లి తర్వాత కూడా రాహుల్-పద్మల మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ క్రమంలో హత్య జరిగిన రోజు రాహుల్ ఇంటికి వచ్చిన పద్మ.. అతడి స్నేహితురాలినంటూ పూజను పరిచయం చేసుకుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం మాటల్లో పెట్టి.. పూజను కిందపడేసి ఆమె తలను నేలకేసి కొట్టి గొంతు నులిమింది. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పూజ పేరిట ఉత్తరం రాసింది. ఇక పూజ హత్య కుట్రలో భాగంగా రాహుల్ పనిమనిషికి ముందే సమాచారం ఇవ్వడంతో అతడు కూడా పద్మకు సహకరించాడు. దీంతో నిందితులను అరెస్టు చేశాం’అని పేర్కొన్నారు. -
ఇకపై అలా చేస్తే రాళ్లతో కొట్టి చంపేయడమే..!
బందర్ సెరి బేగవాన్(బ్రూనై) : ఆసియా దేశం బ్రూనై వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారిని, స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలని తీర్మానించింది. షరియా చట్టాల ప్రకారం అనైతిక చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఇటువంటి శిక్షలు వచ్చే వారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. అదే విధంగా దొంగతనానికి పాల్పడిన వారి చేతులు, పాదాలు నరికివేసే శిక్ష వచ్చే బుధవారం నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా మొదటిసారి దొంగతనానికి పాల్పడితే కుడిచేతిని, రెండోసారి కూడా అదే తప్పు పునరావృతం చేస్తే ఎడమ పాదాన్ని నరికివేస్తారు. అయితే ముస్లిం మెజారిటీ దేశమైన బ్రూనైలో కేవలం ఆ వర్గానికి మాత్రమే ఈ కఠిన శిక్షలు వేస్తారు. కాగా ప్రభుత్వ నిర్ణయం హక్కులను ఉల్లంఘించేలా ఉందని మానవ హక్కుల సంస్థలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విఙ్ఞప్తి చేసింది. ఇక ఈ విషయం గురించి హ్యూమన్ రైట్స్ వాచ్ సభ్యులు ఫిల్ రాబర్ట్సన్ మాట్లాడుతూ..‘ఇలాంటి చర్యల వల్ల అంతర్జాతీయ సమాజం నుంచి బ్రూనేను బహిష్కరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆగ్నేయ ఆసియా దేశంలో ఇటువంటి శిక్షలు అమలు చేసే తొలి దేశంగా గుర్తింపు పొందడం ద్వారా వివాదాస్పద దేశంగా బ్రూనై ముద్రపడుతుంది. తద్వారా విదేశీ పెట్టుబడులు, పర్యాటకుల సంఖ్య తగ్గి భారీగా ఆదాయం నష్టపోవాల్సి ఉంటుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తమ విధానం గురించి బ్రూనై మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ 2013 నుంచి అనైతిక చర్యలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు అమలు చేసే విషయమై.....లోతుగా చర్చించాం. ప్రస్తుతం వీటిని అమల్లోకి తేవాలని భావిస్తున్నాం. ఈ విషయం గురించి మా మంత్రి సుల్తాన్ హసనాల్ బోల్కా ఏప్రిల్ 3న అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది’అని తెలిపారు. -
మాయమ్మ చేసిన క్రిస్మస్ కేకు
పలాసకు ఆరు మైళ్ళ దూరంలో డెబ్బై గడపలున్న మా ఊళ్లో ప్రభువును నమ్ముకున్న కుటుంబం మాదొక్కటే. దసరాకీ, గౌరీపూజకీ వడపప్పు, అరిసెలు, మెత్తటి గారెలు ఇరుగూ పొరుగు పంపిస్తే తినడమేగానీ క్రిస్మస్కు, ఈస్టర్కూ ఒక కేకుముక్కో, గులాప్పువ్వో వండి పక్కింటికీ ఎదురింటికీ పంపడానికి మాయమ్మకు సేతులొచ్చేవి కాదు. ఆ సమచ్చరం క్రిస్మసుకు ముందు పలాసా చర్చీ నుండి పాదరుగారు, సిస్టర్గార్లు ఒక రాత్రి పూట జీపులోవొచ్చి ఊరంతా నిద్రలెగిసినట్లు క్రిస్మస్ పాటలు పాడి మా ఇంటికొస్తే తెల్లటి బట్టల్లోన ఉన్న పాదరు గారిని సూడ్డానికి పక్కింటి రామారావు, ఆళ్ళావిడా ఒచ్చారు. వాళ్లు పాదరు గారితో ‘ఈ మొగుడూ పెళ్లాం మీ పండగ రోజు పిల్లడ్ని పట్టుకొని చర్చీకొచ్చీడమూ, పొద్దల్లా అక్కడే ఉండిపోయి పొద్దోయికి మీరిచ్చిన పాలుగుండ, పంచదార పట్టుకొని పార్రాడమే గాని ఒక కేకో , పండో, కాయో ఎవులకీ ఇచ్చింది లేదు’ అని చెప్పగానే మాయమ్మ , నాయిన మొఖాలు సున్నం రాసినట్లయిపోయినాయి. పాదరుగారు మాయమ్మతోటి ‘సరోజినమ్మా .. పండుగంటే సంతోషం పంచుకోవటం కదా. ఇరుగూ పొరుగుకు పండగపూట ఒక తీపో, కారమో చేసి పంపాలి. ఈ సంవత్సరం కేక్ చేసి అందరికీ పంచు’ అన్నారు. ‘దానికి తరవాని పులుసు సెయ్యడమే రాదు ఇంకా కేకు ఎక్కడ సేస్తాది’ అన్న మా నాయిన మాటలకు నవ్వీసి ‘కేక్ చెయ్యక్కర్లేదు. బజార్లో దొరుకుతుంది. కొనేసి ఊరంతా పంచండి ‘ అని సెప్పీసి పాదరుగారు ఎల్లిపోయారు. దాంతో ఈసారి క్రిస్మసుకు అరిసెలు వండీసి, మిగిలిపోయిన అరిసిల పిండిలో ఇంకొంచం నీళ్లు కలిపి పొంగడాలు సేసి, దానితోటి ఒక కేకు ముక్క కూడా ఊరంతా పంచీసి ఉన్న సెడ్డపేరును సెరిపీసుకోవాలని మాయమ్మ నాయిన అనుకున్నారు. క్రిస్మస్సుకు ఊరందరికీ పంచడానికి ఎంత కేకు కావాలని మాయమ్మ మా నాయిన ఆలోచన సేస్తే సుమారు నాలుక్కేజీలు కావాలని లెక్క తేలింది.నాలుక్కేజీల కేకు రేటెంత అని అడిగితే పలాసల కోవాకొట్టు గురుమూర్తి వందరూపాయలు సెప్పినాడు. మా నాయిన బుర్ర మీద గుడ్డేసుకుని ఇంటికొచ్చి విసయం సెప్పి, వందరూపాయల అప్పు ఇచ్చెటోడు ఇప్పుడుకిప్పుడు ఎక్కడ దొరుకుతాడని మాయమ్మనడిగాడు. మాయమ్మ అప్పుడికే తను దాసుకున్న సొమ్ముతోటి మా నాయినకొక పంచి, నాకు ఎర్ర నిక్కరు, పసుపు జుబ్బా , దానికి ఒక సీర కొనీసింది.మిగిలిన డబ్బులుకి పప్పలు సెయ్యడానికి నూని కొనీసి, ఆరబెట్టిన బియ్యము మిల్లాడించేసి రడీగా ఉన్నాది. కేక్ కొనడానికి ముప్పై రూపాయలు పట్టుకెల్లిన మా నాయిన పప్పులుడకలేదు. తెల్లారితే క్రిస్మస్సు. ఇరవై నాలుగు తేదీ రాత్రి చర్చికి ఎల్లడానికి ముందే పప్పల వంట పూర్తి చేసీసింది మా యమ్మ. ఆ రాత్రి యేసయ్య పాటలతో, కొవ్వొత్తుల కాంతులతో చర్చంతా ప్రభువు పుట్టిన గడియల్ని పండుగ సేసుకున్నాం. ఊరికి బయలుదేరుతుంటే పాదరుగారు ‘కేక్ పంచుతున్నారా లేదా’ అని మా నాయినను అడిగితే మొగమాటంగా తలూపీసి ఊరికి పారొచ్చినాము. మాయమ్మ దారంతా సణుక్కోనొచ్చింది.ఇంటికొచ్చినప్పడుకి వేకువజామైపోయింది. నేను రాగానే పడుకుండి పోయినాను. పొద్దున్న నేను లెగిసినప్పుడికి మాయమ్మ , మా నాయిన ఇద్దరూ ఇంటిలోన లేరు. కానీ ఎదురుగా నల్లటి రంగులోన కొంచం మిగిలున్న కేకు కనిపించింది. అది పెద్ద అట్ట మీద ఉంది. చాలా కేకు ఎవరో తినీసినట్లు అర్థమవుతున్నది. అంత పెద్ద కేకు ఎక్కడిది, ఎవరు తెచ్చారు అని నేను ఆలోసిస్తుంటే మాయమ్మ మొకమంతా పళ్ళు చేసుకొని లోపలికొచ్చింది. ‘ఊర్ల ఒక్కిల్లు ఒగ్గకుండా పంచీసినాను. పక్కింటి రామారావు నాలుగు ముక్కలు ఒక్కడే తినీసాడు బెగ్గురోడు’ అని ‘ఇది మొత్తం నీకే నాయినా.. తినీ’ అని అన్నాది.‘డబ్బుల్లేవని నాయిన అన్నాడు కదా.. మరిప్పుడెలగ కొన్నాడమ్మా’ పెద్ద ముక్కను తెంపి నోట్లో కుక్కుకోబోతూ అడిగాను. ‘మీరు పక్షులను చూడుడు. అవి విత్తవు, కోయవు’ అని పాదరు బైబిల్లోన మాటలు సెప్తారు కదా .. ఇదీ అలగే . మన పరిస్థితి జీపు డ్రైవరు జీవరత్నము తెలిసిన నలుగురికీ సెప్పితే, చర్చిలోనే కలిగినోళ్లందరూ నాలుగు డబ్బులేసుకొని కొవాకొట్టులోన డబ్బులు కట్టి జీవరత్నము తోటే తెల్లవారినప్పుడుకి పంపించినారు. మీ నాయన అరిసిలు, కేకు ముక్క పట్టుకొని జీవరత్నంఇంటికే బయల్దేరినాడు. ఈ ఊర్ల యేసును నమ్ముకున్న ఒక్క కుటుంబము మనది. ఉన్న రెండు పండుగలూ జరుపుకోలేని జరుగుబాటు మనది. ఈ సమ్మచ్చరం మనము సక్కగా క్రిస్మస్సుసేసుకున్నట్లు సేసిన ఆల్లందరూ సల్లగుండాలని ప్రార్ధన సెయ్యు నాయినా’ అని సెప్పింది మా యమ్మ. నేను గోడకున్న ప్రభువు ఫొటో ఉన్న కాలెండర్ దుక్కు సూసి, సిలువ గుర్తు ఏసుకుని .. కళ్ళు మూసుకుని ఆమెన్ అనుకున్నాను. - కె.వి. కరుణకుమార్ -
ఆయన వారిని అమ్మా అని పిలిచాడు
క్రీస్తును ప్రపంచానికి పరిచయం చేసింది స్త్రీలే. క్రీస్తు బోధలనీ, క్రీస్తు దైవత్వాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళిందీ స్త్రీలే. క్రైస్తవంలో స్త్రీలకు గుర్తించదగ్గ స్వేచ్చ ఉంది. కారణం క్రీస్తు బ్రతికున్న రోజుల్లో స్త్రీల మధ్యన ఎక్కువగా పరిచర్య చేయడం. పురుషాధిక్యత ఉన్న యూదా జాతిలో కన్యక అయిన మరియ అనే స్త్రీ, క్రీస్తును కనడానికి ముందుకొచ్చింది. క్రీస్తుకు తల్లిగా మారేందుకు తనని తాను తగ్గించుకుని గాబ్రియేల్ అనే దూత చెప్పినట్టు విన్నది. దేవునికి లోబడతానని తన విధేయతతో ప్రపంచానికి క్రీస్తును పరిచయం చేసింది. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన స్త్రీగా ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. యోసేపుకు ప్రధానం చేయబడ్డ ఆమెను, ఒకానొక సమయంలో అవమాన భారం వల్ల యోసేపే వదిలేయాలనుకున్నాడు. అయినా లేఖనాలలో రాయబడ్డట్టు జరిగేందుకు తన సమ్మతిని తెలియజేయడమే కాదు ఆమె అన్ని పరిస్థితులలో దృఢనిశ్చయంతో ఉంది. పురుషాధిక్యత గల యూదా సమాజంలో పురుషులతో స్త్రీలు బహిరంగంగా మాట్లాడడం నిషేధం. క్రీస్తు మగ్ధలేన అనే ప్రాంతానికి చెందిన స్త్రీని దోపిడీగాళ్ల చేతులలో నుండి విడిపిస్తాడు. అప్పటినుంచి మగ్ధలేన మరియ క్రీస్తుతో పాటే ఉంది. క్రీస్తు పరిచర్యలో తనవంతు పాత్రను పోషించింది. క్రీస్తు పరిచర్య చేస్తూ వెళ్ళిన ప్రాంతాల్లో స్త్రీలను సమావేశపరుస్తూ, క్రీస్తును గురించి అనేకులకి చెబుతూ క్రీస్తు కోసం సాక్షిగా నిలబడింది. ఆమె క్రీస్తును ఎంతగా ఆరాధించిందంటే.. క్రీస్తు సిలువ వేయబడిన మూడోరోజున ఆయన దేహానికి సుగంధద్రవ్యాలు పూయడానికి తనతోపాటు మరికొందరు స్త్రీలను తీసుకుని పొద్దు పొడవకముందే సమాధి దగ్గరకు చేరుకుంది. సమాధిలో క్రీస్తు కనపడలేదని భయపడింది. దేవదూత ద్వారా ఆయన పునరుత్థానాన్ని గురించి తెలుసుకుని, క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడన్న వార్తా ఆమే మొదటగా చేరవేసింది. క్రీస్తును తమ కుటుంబంలో ఒకరిగా చేర్చుకుని, ఆయన బేతనీ అనే ప్రాంతానికి వచ్చినప్పుడల్లా తమ గృహంలో ఆతిథ్యం ఇచ్చారు ఇద్దరు అక్కాచెల్లెళ్ళు. వాళ్లు మార్త, మరియలు. క్రీస్తు బేతనియకి వచ్చినప్పుడల్లా వాళ్ళింట్లో బస చేసే వాడు. వారి సహోదరుడు లాజరుతో క్రీస్తుకు మంచి స్నేహం. క్రీస్తు చెప్పే మాటలు వినడానికి వాళ్లు ఎంతో ఆసక్తి చూపేవాళ్లు. ఒకానొక సమయంలో లాజరు అకారణంగా చనిపోయాడు. క్రీస్తు మూడు రోజులయ్యాక ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు వారు ఆయనకీ విషయాన్ని తెలియజేస్తారు. లాజరును తిరిగి బతికిస్తాడు క్రీస్తు. ఇక అప్పటినుంచి ఇద్దరు అక్కా చెల్లెళ్లు క్రీస్తును ఘనపరిచి ఆయన ప్రేమ తత్వాన్ని ప్రచారంచేసారు. సమరయులు యూదులకన్నా జాతి పరంగా చిన్న వాళ్లు. క్రీస్తు పరిచర్య చేస్తున్న రోజుల్లో సమరయ గ్రామాల వైపు వెళ్తూ వాళ్లకు కావలసిన సహాయాన్ని, సహకారాన్ని అందించేవాడు. ఒకానొక సమయంలో ఒక సమరయ స్త్రీ బావి దగ్గర నీళ్లు చేదుకుంటున్న సమయంలో క్రీస్తు అటుగా వెళ్లాడు. తాగడానికి నీళ్లిమ్మని అడిగాడు. ఆమె యూదుడైన క్రీస్తు తనని నీళ్లడగటం చూసి తన గతాన్ని చూసి క్రీస్తు తనని అసహ్యించుకుంటాడని భయపడింది. కాని క్రీస్తు ఆమెకి బుద్ధి వాక్యాన్ని బోధించాడు. తాను క్రీస్తు అనే విషయాన్ని ఆమెకి తెలిసేలా చేసాడు. ఆమె పరుగెత్తుకుంటూ ఊళ్లోకి వెళ్ళింది. క్రీస్తు గురించి ఊరంతా తెలిసేలా ఆయన కోసం గొప్ప సాక్షిగా మారింది. పన్నెండు ఏళ్ళుగా రక్తస్రావం ఆగక బాధపడుతున్న ఓ స్త్రీ ఒక నిర్ణయం తీసుకుంది. యేసు ప్రభువు తనకి స్వస్థతనివ్వాలంటే ఆయన ముందు ఉండాలి. ఆయనతో మాట్లాడాలి. కలవాలి. కాని అంతమంది జనంలో ఆమె ఆయన దగ్గర ఆయన దగ్గరగా వెళ్ళలేదు కాబట్టి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను అని అనుకుంది. అలాగే చేసింది. వెంటనే రోగం బాగైంది. ఓ రోజు వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని జనాలు రాళ్లు పట్టుకుని తరుముతూ వచ్చారు. ఆమె మీద రాళ్లు విసురుతున్నారు. ఇక ఆమెని చంపటమే తరువాయి. క్రీస్తు ఆమె దగ్గరకి వెళ్లి పడిపోయిన ఆమెని లేపాడు. రాళ్లు పట్టుకున్న వాళ్లను వారించాడు.పాపం చేయని వాడు ఆమె మీద మొదట రాయి వేయాలన్నాడు. అందరి పాపాలను నేల మీద రాయటం మొదలు పెట్టాడు. అంతే! అందరు ఎవరి పాపాలను వారు చూసుకుని భయపడి రాయి వదిలేసి పారిపోయారు. యేసు క్రీస్తు ఆ స్త్రీ దగ్గరకెళ్ళి ‘‘అమ్మా నీ మీద రాళ్ళేయడానికి వచ్చిన వాళ్లు ఎవరు లేరు. ఇక వెళ్ళు. ఇంకెప్పుడు పాపం చేయొద్దని ఆమెని విముక్తురాలిని చేసాడు. క్రీస్తు స్త్రీలందరినీ అమ్మా అనే పిలిచాడు. ఒకానొక సమయంలో మరియ అనే ఒక స్త్రీ, క్రీస్తు పరిసయ్యుల ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు అత్తరు బుడ్డి తెచ్చి అతని తల మీద పోసింది. శేరున్నర అత్తరు ఆమె జీవిత కాలం సంపాదించిన డబ్బుతో కొనినదైయుంటుంది. ఆమె తన కన్నీటితో క్రీస్తు పాదాలను కడిగి తన జుట్టుతో ఆయన పాదాలు తుడిచి అత్తరు పూసింది. ఆమె చేసిన పని ఎంత గొప్పదో క్రీస్తు చెప్తూ ఆమె ప్రేమ ఎంత గొప్పదో అందుకే అంత గొప్పగా ఆయన్ని సన్మానించుకుందని చెప్తాడు. అది క్రీస్తు వల్ల తన జీవితంలో జరిగిన గొప్ప మేలు వల్ల కావచ్చు లేదా క్రీస్తు మీద తనకున్న వల్లమాలిన ప్రేమ కావచ్చు. యేసు క్రీస్తు పుట్టినప్పుడు అన్నా అనే ప్రవక్తి క్రీస్తును దేవాలయంలో చూసింది. ఆయన పుట్టుక గురించిన ప్రవచనం తనకి ముందే తెలుసునని, క్రీస్తుని చూడడానికే అంత ముదుసలిదైన తాను బతికే ఉందని చెప్తుంది. క్రీస్తును తన చేతుల్లోకి ఎత్తుకుని శుభవచనాలు పలుకుతూ పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తుంది. ఎంతోమంది స్త్రీలకు క్రీస్తు చాలా ఆత్మీయుడిగా ఉన్నాడు. ఆయనకు స్త్రీ పురుష భేదం ఉన్నట్టు ఎక్కడా కనపడదు. ఆయన తనలోని మాతృత్వాన్ని ప్రేమగా చూపించడంవల్లే చాలామంది స్త్రీలు పరిచర్య చేయడానికి ఇష్టపడి ఉంటారు. వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీలనైనా, ఎలాంటి స్త్రీలు తన దగ్గరకి వచ్చినా ఆయన వాళ్లని ‘అమ్మా’ అని సంబోధించేవాడు. క్రీస్తు తత్వమే ఆయనని చాలామంది ఆత్మీయుడిగా చేసింది. ఆ స్త్రీలందరూ ఆయనని ఘనపరిచి అనేకులకి ఆయన్ని పరిచయం చేస్తూ ఆయన ప్రేమకి సాక్షులుగా నిలుచున్నారు. - మెర్సీ మార్గరెట్ -
ఓ మల్లెపువ్వు రక్త చరిత్ర
‘దారోగర్ దప్తార్’. 1880లలో కలకత్తాలో జరిగిన వరుస హత్యలు ఈ పేరుతో ఏళ్ల క్రితం పుస్తకంగా వచ్చాయి. ఇప్పుడు అదే పుస్తకం రెండు వాల్యూములుగా పునర్ముద్రణ అయింది. కొన్ని నేరాలను పరిశోధించిన ప్రియానాథ్ ముఖోపాధ్యాయ్ పుస్తకంలోని కథలను ఉత్కఠతో చదివించేలా రచించారు. మొదటి వాల్యూమ్‌లోని 78 వ కథలో పేరుమోసిన నేరస్తురాలు త్రైలోక్య నేర చరిత్రను చదివితే ఆమె జీవితం ఈ పుస్తకంలో ఉండాల్సిన కథ కాదు అనిపిస్తుంది. కానీ నేరం నేరమే. బెంగాల్‌లోని చిన్న గ్రామంలో త్రైలోక్య కథ ప్రారంభమవుతుంది. త్రైలోక్య బ్రాహ్మల అమ్మాయి. పెళ్లి అయ్యేనాటికి చిన్న పిల్ల. పెళ్లికొడుకు పెద్ద వయసువాడు. త్రైలోక్య రజస్వల అయ్యేవరకు పుట్టింట్లోనే ఉంది. భర్త మరణించే లోపు ఒక్కసారి మాత్రమే అతడిని చూసింది. ఆ తరవాత త్రైలోక్యను ఒక వైష్ణవ మహిళ చేరదీసింది. అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. కలకత్తా వేశ్యా గృహాలకు అమ్మాయిలను సరఫరా చేసే ఆ మహిళ.. త్రైలోక్యను ఒక యువకుడికి అప్పచెప్పింది. అతడు త్రైలోక్యను మోసం చేసి, కలకత్తా సోనాగచ్చిలో ఉండే రెడ్ లైట్ ఏరియాలోని వేశ్యాగృహానికి అమ్మేశాడు. ఇది 1880లో జరిగింది. ఒక సాధారణ పల్లెటూరి పిల్లలా మొదలైన ఆమె జీవితం, ఇక్కడ నుంచే కలకత్తా నేర ప్రపంచంలోకి అడుగు పెట్టేలా చేసింది. వ్యభిచారం నుంచి మోసగత్తెగా.. యవ్వనంతో అందంగా ఉన్న త్రైలోక్యకు డబ్బు కోసం వెతక్కోవలసిన అవసరం కలగలేదు. చేతికి వస్తున్న ఆదాయంతో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడింది. అందం ఎంతోకాలం నిలబడదుగా, క్రమేపీ ఆదాయం కూడా తగ్గసాగడంతో, భవిష్యత్తు గురించి భయం మొదలైంది. ఈ సమయంలోనే కాళి బాబు అనే ఒక వివాహితుడిని ప్రేమించింది. అతడి భార్య మరణించగానే, హరి అనే పేరు గల వారి కొడుకుని దత్తత తీసుకుంది. కాళిబాబు నిత్యం అక్కడే ఉండటం వల్ల, త్రైలోక్య దగ్గరకు వచ్చే విటుల సంఖ్య తగ్గిపోయింది. దానికి తోడు హరి చదువు ఖర్చు కూడా పెరగటంతో, త్రైలోక్య పరిస్థితి దీనంగా మారిపోయింది. వ్యభిచార వృత్తి నుంచి నేర ప్రవృత్తిలోకి మారవలసి వచ్చింది. కలకత్తాకు చెందిన ఇద్దరు సంపన్నులు త్రైలోక్య ఇంట్లో ఉంటూ, అక్కడకు వచ్చే విటులకు అమ్మాయిలను సరఫరా చేయడంతో పాటు, వారు మత్తులో ఉన్నప్పుడు వారిని లూటీ చేసి, వీధిలోకి తోసేయడం త్రైలోక్య లక్ష్యం. రోడ్డు మీద పడిపోయిన వ్యక్తిని చూసి వాడు తాగి పడిపోయాడనుకునే పోలీసులు ఆ రాత్రికి వారిని లాకప్‌లో ఉంచుతారు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేదాకా వారికి ప్రతిఘటించే శక్తి ఉండదు. ఫిర్యాదు చేయడం వలన అక్కర్లేని ప్రచారం జరుగుతుంది కాబట్టి, వారు మౌనంగా వెళ్లిపోతారు. ఇదీ త్రైలోక్య కుటిల ఆలోచన. ఆనోటా ఈనోటా త్రైలోక్య విషయం నలుగురికీ తెలిసిపోవడంతో మరో కొత్త నేరానికి దారి వెతుక్కుంది. వరుల కోసం వల బెంగాల్‌లోని శోత్రియ బ్రాహ్మణ కుటుంబాలలో వరకట్నం కాకుండా, కన్యాశుల్కం ఆచారంగా ఉండేది. అందువల్ల ఆడపిల్లల తండ్రులు ఎవరు ఎక్కువ కన్యాశుల్కం ఇస్తే వారితోనే సంబంధం కలుపుకునేవారు. ఇది అదనుగా చేసుకుంది త్రైలోక్య. అబ్బాయికి పెళ్లి చేయడం కష్టంగా ఉన్న వారి గురించి సన్నిహితుల ద్వారా కాళిబాబు తెలుసుకున్నాక కలకత్తా నగరంలోని రెడ్ లైట్ ఏరియాకి దూరంగా త్రైలోక్యం, కాళిబాబు ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అబద్ధపు చుట్టాలను తెచ్చుకున్నారు. ఒక సుముహూర్తాన అబ్బాయి కుటుంబానికి కబురు చేశారు. అందంగా ఉండే ఒక వ్యభిచారిని పెళ్లికూతురుగా పరిచయం చేశారు. అమ్మాయిని చూడగానే అబ్బాయి తన అంగీకారం తెలిపాడు. అడిగినంత కన్యాశుల్కం, పెళ్లి ఖర్చులు ఇచ్చారు. నెల తిరిగేలోపు వివాహం అయిపోయింది. అమ్మాయి అత్తవారింటికి వెళ్లింది. ఒంటి నిండా నగలతో దర్జాగా ఉంది. తన కన్నతల్లి పరిచారిక వేషంలో వచ్చింది. మరొక వ్యక్తి మేనమామలా నటించాడు. వివాహం జరిగిన నెల రోజులకు, పెళ్లికూతురు తన తల్లిదండ్రులను చూసి వస్తానని అత్తగారి అనుమతి తీసుకుని భర్తతో కలిసి బయలుదేరింది. ఒంటి నిండా నగలతో, పరిచారికలుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులతో కలిసి మొత్తం నలుగురు కలకత్తా ౖరైలు ఎక్కారు. అర్ధరాత్రి నిద్రలో ఉండగా, భర్తను వదిలి ముగ్గురూ త్రైలోక్య దగ్గరకు పారిపోయారు. నగలన్నీ అమ్మేశారు. వారు ముగ్గురికీ త్రైలోక్య కొద్ది మొత్తం మాత్రమే ఇచ్చింది. మిగిలినదంతా తాను తీసేసుకుంది. ఇదే మోసాన్ని పదేపదే చేసి డబ్బు సంపాదించింది త్రైలోక్య. కొంతకాలం తరవాతఅమ్మాయిలను కిడ్నాప్ చేసి, అమ్మేయడం మొదలుపెట్టింది త్రైలోక్య. మాయమైన అమ్మాయిలు కనిపించకపోవడంతో, ఆ వార్త సంచలనమైంది. విషయం గ్రహించిన పోలీసులు, త్రైలోక్య, కాళిబాబులకు.. ఇటువంటి పనులు మానుకోమని హెచ్చరించారు. అక్కడ నుంచి మరో దారిలోకి వెళ్లింది త్రైలోక్య. హత్యలు మొదలు ఉత్తరప్రదేశ్‌లో ఒక రాజుగారికి మధ్యవర్తినని చెప్పుకునేవాడు కాళిబాబు. బారాబజార్ నుంచి నగలను తక్కువ ధరకు తీసుకువస్తానని చెప్పి, షాపు వారికి కబురు చేసి, వారి దుకాణంలో పనిచేసే వ్యక్తి ద్వారా నగలను తెప్పించి, నగలు తీసుకు వచ్చిన వ్యక్తిని చంపేసి, నగలన్నీ తీసుకుని, ఆ వ్యక్తిని వారు అద్దెకు ఉన్న ఇంటి గదిలో పాతేసేవారు. కాళిబాబు ఆ నగలను స్వయంగా రాజావారి దగ్గరకు తీసుకువెళ్లి, డబ్బులు తీసుకుని, తన జేబులో వేసుకునేవాడని అంటారు. ఈ కేసును పరిశీలించమని నేర పరిశోధకుడైన ముఖోపాధ్యాయకు అప్పచెప్పారు అధికారులు. అద్దెకు ఉన్న ఇంటిని గుర్తించి, శవాన్ని బయటకు తీశాడు ముఖోపాధ్యాయ. కాళిబాబును ఉరి తీశారు. కోర్టులో త్రైలోక్య నేరం నిరూపణ కాలేదు. ఆమె స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయింది. నిస్పృహలో ఉన్న త్రైలోక్య తన ఇంటిని, నగలను బలవంతంగా అమ్మవలసి వచ్చింది. సోనాగచ్చిలో గతంలో తనతో ఉన్న వారిని కలిసింది. వారంతా ఈసడించుకున్నారు. కాని, ఆమెలాగే, చాలామంది వయసు మీద పడటంతో భవిష్యత్తు గురించి భయపడసాగారు. వారందరి అభద్రతతో సైతం చెలగాటమాడింది త్రైలోక్య. ఒక మహానుభావుడు వారందరి కష్టాలను గట్టెక్కిస్తాడని వారిని నమ్మించింది. వారంతా ఒంటి నిండా నగలతో వస్తే, వారిని రెట్టింపుగా ఆశీర్వదిస్తాడని నమ్మపలికింది. మూడేళ్ల కాలంలో త్రైలోక్య అలా ఐదుగురు మహిళలను చేరదీసింది. వారిని కలకత్తాలో తన ఇంటి దగ్గరలో ఉన్న మాణిక్‌తాలా చెరువు దగ్గరకు ఒక్కొక్కరిగా తీసుకువెళ్లి, వారిని అందులో స్నానం చేయమంది. వారంతా వారి ఒంటి మీద నగలను తీసి, ఒడ్డున పెట్టారు. స్నానం చేస్తుండగా, తలను నీటిలో ముంచి వారు మునిగిపోయేవరకు అలానే పట్టుకునేది. ఇలా చేస్తుండగా ఒకసారి దూరం నుంచి ఎవరో గమనించారు. త్రైలోక్యను పోలీసు స్టేషనుకి ఈడ్చుకెళ్లారు. త్రైలోక్య తప్పించుకోవాలని చూసింది. ఆమెను ముఖోపాధ్యాయకు అప్పగించారు. అప్పటికే త్రైలోక్య మీద అనుమానాలున్న ముఖోపాధ్యాయ ఆమెను విచారణకు పంపారు. ఈసారీ అదృష్టం ఆమె వైపే ఉంది. ఆమె మరోసారి స్వేచ్ఛగా ప్రపంచంలోకి వచ్చింది. అప్పటికే అనుమానాలు అప్పటికే త్రైలోక్య గురించి దుష్ప్రచారం జరుగుతోంది. త్రైలోక్య ఈసారి చిత్పూర్లోని పంచు ధోబానీ లేన్‌లో ఇల్లు అద్దెకు తీసుకుంది. గతంలో చేసిన నేరాల తాలూకు ధనం ఖర్చు చేస్తోంది. ఇప్పుడు మరో కొత్త నేరం చేయడం కోసం ఎదురు చూస్తోంది. అదే ఇంట్లో నివసిస్తున్న రాజకుమారి అనే మరొక వ్యభిచారి దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కోవాలనుకుంది. రెండుమూడు సార్లు గట్టిగానే ప్రయత్నించింది. విఫలం కావడంతో, కోపంతో ఊగిపోయి, ఆమెను చంపి మరీ నగలు తెచ్చుకుంది. ఈ హత్య జరిగిన కొంత కాలానికి ముఖోపాధ్యాయకు ఈ కేసును అప్పగించారు. త్రైలోక్య ఆ ఇంట్లో ఉంటోందని తెలిసిన మరుక్షణం, ఆమే ఈ హత్య చేసిందని అర్థం చేసుకున్నాడు. పుస్తకంలోని శేష్ లీలా (ద లాస్ట్ యాక్ట్)లో ముఖోపాధ్యాయ త్రైలోక్యను తాను ఏ విధంగా పట్టుకున్నాడో వివరించాడు. పెంపుడు కొడుకు హరిని హత్యానేరంలో ఇరికించినట్లు నటించాడు ముఖోపాధ్యాయ. సంకెళ్లతో ఉన్న హరిని చూసిన త్రైలోక్య మనసు కరిగింది. తాను దాచి ఉంచుకున్న బంగారమంతా పోలీసుల స్వాధీనం చేసింది. ఆ తరవాత తనను మోసం చేశారని తెలియగానే, మళ్లీ తన గత జీవితానికి వెళ్లిపోవాలనుకుంది. ఈలోగా కేసు హైకోర్టుకి వెళ్లింది. బెంగాల్ గవర్నర్ అయిన సర్ అగస్టస్ రివర్స్ థాంప్సన్‌కి క్షమాభిక్ష అప్పీలు చేసింది. ఆమె అదృష్టం శరవేగంతో దూరానికి పరుగులు తీసింది. ఆమెకు ఉరిశిక్ష వేశారు. ఆ రోజు ముఖోపాధ్యాయ ఆమెను జైలు గదిలో చూశాడు. ఒకపక్కన భయంకరమైన హత్యలు చేసింది, మరోపక్క, ఒక మహిళ మరణానికి కారణం అయ్యింది. త్రైలోక్యతో చేసిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఆమె తాను చేసిన నేరాలన్నీ ఒకటొక్కటిగా స్వయంగా బయటపెట్టింది. ముఖోపాధ్యాయతో ఆమె పలికిన చివరి మాటలు, ‘హరి బాధ్యతను మీకు అప్పచెబుతున్నాను. అతడిని జాగ్రత్తగా చూడండి. లేదంటే అతడు కష్టాలపాలవుతాడు’ అని. 1884లో త్రైలోక్యను ఉరి తీశారు. – జయంతి -
ఆడపిల్లలా.. బ్రాయిలర్ కోళ్లా?
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో అభం శుభం తెలియని చిన్నారులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టిన వ్యవహారంపై ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బ్రాయిలర్ కోళ్లకు ఇచ్చినట్లు ఆడపిల్లలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చినా ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని మండిపడింది. యాదాద్రిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. మీకు తెలియలేదంటే అసలేం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిర్వాహకులు, అధికారులు కుమ్మక్కయి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. అటు, ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారికి దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బీ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ల ధర్మాసనం సోమవారం విస్మయం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన కేసుల విచారణలో జాప్యం జరగకుండా అవసరమైతే ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఆదేశాలు ఇస్తామని తెలిపింది. ‘యాదాద్రి’ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడంపై వైఖరి తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నరకకూపం నుంచి బయటపడిన బాధితులను రక్షించేందుకు ఏమేం చర్యలు తీసుకున్నారో చెప్పాలని, ఇటువంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఏం చేయాలనుకుంటున్నారో కూడా వివరించాలని ఆదేశాలు జారీచేసింది. పూర్తి వివరాలన్నింటినీ తమ ముందుంచాలంటూ విచారణను మంగళవారానికి (అక్టోబర్ 23) వాయిదా వేసింది. అలాంటి వారికి బెయిలిస్తారా? యాదాద్రి వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారికి కింది కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి హేయమైన కేసుల్లో దిగువ కోర్టు బెయిల్ ఇస్తుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ‘సదరు కోర్టు బెయిల్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారా? ఒకవేళ ఆయన వ్యతిరేకించినా.. జడ్జీ బెయిల్ ఇచ్చారా? ఇంత క్రూరంగా వ్యవహరించిన వారికి బెయిల్ ఎలా ఇస్తారు?’ అని ధర్మాసనం మండిపడింది. ఈ కేసు వివరాలన్నింటినీ తన ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపడమే తీవ్రమైన నేరమైతే.. వారు యుక్త వయస్కులుగా కనిపించేందుకు హార్మోన్ల ఇంజక్షన్లు ఇవ్వడం అమానవీయం. మాంసం ఎక్కువగా వచ్చేందుకు బ్రాయిలర్ కోళ్లకు హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తారు. ఇక్కడ హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వడానికి వాళ్లు.. ఆడపిల్లలా? లేక బ్రాయిలర్ కోళ్లా?’ అని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. చిన్నారులను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపడం ఓ మార్కెట్‌గా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులకోసం ఏం చేస్తున్నారు? యాదాద్రిలో చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపిన దారుణ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాలతో చలించిపోయిన ప్రధాన న్యాయమూర్తి ఈ ఘటనను సుమోటోగా పరిగణించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. యాదాద్రి ఘటనపై ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులు, జరిపిన అరెస్టులు వివరాలను కోర్టు ముందుంచారు. కొందరిపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. బాధితులను రక్షించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని, ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఏం చర్యలు తీసుకోబోతున్నారని ప్రశ్నించింది. ఘటన జరిగిన తీరును చూస్తుంటే.. నిర్వాహకులు, అధికారులు కుమ్మక్కయ్యారనే అనుమానం వస్తోందని పేర్కొంది. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వ వైఖరేంటో తెలియచేయాలని ఆదేశించిన ధర్మాసనం.. ఈ సిట్‌లో మహిళాధికారులకు తగిన ప్రాధాన్యత ఉండాలని తేల్చిచెప్పింది. వర్ణనాతీత వేదనకు పరిహారం సరిపోతుందా? అమాయకులైన చిన్నారులకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చిన వైద్యుడికి కూడా బెయిల్ రావడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది. ఈ వైద్యుడిపై నేరపూరిత కుట్ర (ఐపీసీ సెక్షన్ 120(బీ)కింద) కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను నిలదీసింది. ఈ సమయంలో అదనపు ఏజీ జె. రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ బాధితులకు పరిహారం చెల్లించామని చెబుతుండగా.. ధర్మాసనం జోక్యం చేసుకుని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘తమపై అరాచకంగా వ్యవహరించిన నరకకూపంలో మగ్గిన చిన్నారులు పడ్డ వర్ణనాతీత వేదనకు పరిహారం ఇస్తే సరిపోతుందా?’ అంటూ మండిపడింది. పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో ఇటువంటి హేయమైన ఘటనలు జరుగుతున్నా.. తెలియలేదంటే ఏం చేస్తున్నారని ఇంటెలిజెన్స్‌ను, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై అదనపు ఏజీ సమాధానమిస్తూ.. అసలు వ్యభిచారం జరుగుతున్నట్లు చుట్టుపక్కల వారికీ తెలియదని చెప్పారు. దీనిపైనా ధర్మాసనం మండిపడింది. దారుణమైన అరాచకాన్ని నిరోధించలేకపోవడానికి ఇలాంటి వాదనలు ఎంత మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. పత్రికల్లో వచ్చిన కథనాలపై అదనపు ఏజీ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ‘మేం పత్రికా కథనాలపై పూర్తిగా ఆధారపడలేదు. జిల్లా జడ్జీ నుంచి కూడా నివేదిక కూడా తెప్పించుకున్నాం’ అని వెల్లడించింది. అవసరమైతే ఈ కేసులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు సైతం ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. మంగళవారం నాటి విచారణకు యాదాద్రి డీసీపీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. -
వివాహేతర సంబంధాలు: 497పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : వివాహేతర సంబంధం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించే ఐపీసీలోని 497వ సెక్షను రాజ్యాంగ విరుద్ధమని, మహిళల గౌరవానికి భంగకరమని గురువారం నాటి తీర్పులో సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో వివిధ దేశాలు ఈ విషయంలో ఎలాంటి దృక్కోణాన్ని కలిగి ఉన్నాయన్నది ఆసక్తిదాయం. ముందుగా మన దేశంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న చట్టాన్ని పరిశీలిస్తే,వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తోంది.ఇలాంటి కేసుల్లో పురుషుడికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.ప్రభుత్వ ఉద్యోగులకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.మహిళకు మాత్రం ఎలాంటి శిక్ష ఉండదు.మహిళలను పురుషుల ఆస్తిగా భావించే వారి పట్ల వివక్ష చూపే ఈ 497 సెక్షన్‌ను రద్దు చేయాలని మహిళల జాతీయ కమిషన్ సిఫారసు చేసింది. బాధితురాలిదే బాధ్యత పొరుగున ఉన్న పాకిస్తాన్లో వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ మేరకు 1979లో హుదూద్ ఆర్డినెన్సు జారీ చేసింది.అయితే,ఈ కేసులో పట్టుబడ్డ మహిళ తాను అత్యాచారానికి గురయ్యాయని స్వయంగా నిరూపించుకోవలసి ఉంటుంది.దానికి నలుగురు ప్రముఖుల సాక్ష్యం కూడా తప్పనిసరి.అలా చేయలేకపోతే ఆ మహిళను శిక్షిస్తారు. సౌదీ అరేబియా, బ్రూనే వంటి ఇతర ఇస్లాం దేశాల్లో కూడా ఇలాంటి చట్టమే అమల్లో ఉంది.ఆ దేశాల్లో వివాహేతర సంబంధం నేరానికి శిక్ష రాళ్లతో కొట్టి చంపడం. మొన్నమొన్నటి వరకు 20వ శతాబ్దం మధ్య వరకు ప్రపంచంలో చాలా దేశాలు వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగానే పరిగణించాయి.కొన్ని దేశాలు ఈ నేరానికి మరణ శిక్షను విధించాయి.అయితే తర్వాత కాలంలో వివిధ దేశాలు వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట్టాలను రద్దు చేశాయి.ఐరోపా దేశాల్లో ఇది నేరం కాదు.చాలా కమ్యూనిస్టు దేశాలు కూడా వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించడం లేదు.ఐరోపా దేశాల్లో వివాహేతర సంబంధానికి పాల్పడిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించేవారు.యురోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యక్తిగత వ్యవహారం పరస్పర సమ్మతితో జరిపే శృంగారం వారి వ్యక్తిగత వ్యవహారమని, దాన్ని నేరంగా పరిగణించరాని ఆస్ట్రేలియా చట్టం చెబుతోంది.వివాహేతర సంబంధం విడాకులకు ప్రాతిపదికగా పేర్కొనే నిబంధనను కూడా రద్దు చేసింది. అమెరికాలో ఇంకా... అమెరికాలో 20వ శతాబ్దం మధ్య వరకు చాలా రాష్ట్రాలు వివాహేతర సంబంధాన్ని నేరంగానే పరిగణిస్తూ వచ్చాయి. కాలక్రమంలో కొన్ని రాష్ట్రాలు ఆ చట్టాలను రద్దు చేశాయి. వెస్ట్ వర్జీనియా 2010లో అడల్ట్రీ సంబంధిత చట్టాలను రద్దు చేసింది. కొలరాడో 2013లో, మశాచుసెట్స్2018లో ఈ చట్టాలను తొలగించాయి.2018 నాటికి దాదాపు 20 రాష్ట్రాల్లో వివాహేతర సంబంధం శిక్షార్హమైన నేరంగానే ఉంది.అయితే,దీనికి సంబంధించి విచారణలు, శిక్ష పడటాలు అరుదుగా జరుగుతున్నాయి. సెక్షన్ 497 ఏం చెబుతోంది భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 497వ సెక్షన్ వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంటోంది.‘మరొకరి భార్య అని తెలిసి, ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం నెరపడం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధానికి సంబంధించిన నేరంగా పరిగణించబడుతుంది. ఆ నేరానికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష కాని, జరిమానా కాని లేదా రెండూ కాని విధించవచ్చు.ఇటువంటి కేసుల్లో భార్యను భాగస్వామన్న పేరుతో శిక్షించడానికి వీలులేదు’అని సెక్షన్ 497 స్పష్టం చేస్తోంది. అయితే, ఈ చట్టం ప్రకారం అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తనుకాని, భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళనుకాని ప్రాసిక్యూట్ చేసే హక్కు భార్యకు లేదు.మన దేశంలో 1956 నాటి హిందూ వివాహ చట్టంలోని 13(1) సెక్షను కింద వివాహేతర సంబంధాన్ని విడాకులకు ప్రాతిపదికగా పరిగణించవచ్చు. -
‘సెక్షన్ 497’పై తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: వ్యభిచార చట్టం చెల్లుబాటును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు ముగించి, తీర్పును రిజర్వులో ఉంచింది. చివరి రోజైన బుధవారం కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ వాదనలు వినిపించారు. సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వివాదాస్పద ఐపీసీ సెక్షన్ 497 చట్టబద్ధతపై విచారణచేపట్టడం తెల్సిందే. భర్త అనుమతి ఉన్న పక్షంలో వివాహేతర సంబంధం నేరం కాదని పేర్కొంటున్న ఈ చట్టంతో సమాజానికి ఏం ప్రయోజనమని కోర్టు బుధవారం కేంద్రాన్ని ప్రశ్నించింది. వివాహ వ్యవస్థకు ఉన్న పవిత్రతను దృష్టిలో ఉంచుకునే వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్నామని ఆనంద్ బదులిచ్చారు. వ్యభిచారాన్ని నేరం కాదని చెబుతున్న విదేశీ చట్టాలను పరిగణనలోకి తీసుకోవద్దని, దేశంలోని సామాజిక స్థితిగతుల ఆధారంగానే ఈ చట్టం చెల్లుబాటును నిర్ధారించాలన్నారు. ‘భర్త అనుమతి ఉంటే అది వ్యభిచారం కాదని చట్టం చెబుతోంది. అలాంటప్పుడు సెక్షన్ 497తో సమాజానికి కలిగే ప్రయోజనం ఏంటి? చట్టంలో కొన్ని వైరుధ్యాలున్నాయి. వివాహ వ్యవస్థ పవిత్రతను పరిరక్షించే బాధ్యత మహిళలదేనా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. -
వివాహేతర సంబంధాలు: 497పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాలను (ఆడల్టరీ) నేరంగా పరిగణించే ఇండియన్ పీనల్ కోడ్‌లోని 497వ సెక్షన్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన సమానత్వపు హక్కును ఈ సెక్షన్ ఉల్లంఘిస్తున్నట్టు ప్రాథమికంగా కనిపిస్తోందని రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాహేతర సంబంధాల విషయంలో వివాహితలను మినహాయించి.. పెళ్లయిన పురుషుడిని మాత్రమే శిక్షించే సెక్షన్ 497ను రద్దు చేయాలంటూ జోసెఫ్ షైనీ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఈ ధర్మాసనంలో ఆర్ఎఫ్ నారీమన్, ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్, ఇందూ మల్హోత్రా తదితర న్యాయమూర్తులు ఉన్నారు. వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు సెక్షన్ 497ను కొనసాగించాల్సిన అవసరముందన్న కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఇదే వాదనను పాటించినట్టయితే ఇప్పుడున్న నేరం కన్నా తీవ్రమైన నేరంగా దీనిని పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్ చంద్రచూడ్ వాదనల సందర్భంగా పేర్కొన్నారు. వివాహేతర లైంగిక సంబంధాలు ఉంటే.. ఆ పరిణామాలతో సంబంధం లేకుండానే.. పెళ్లి రద్దుకు దారితీసేవిధంగా ఈ చట్టం ఉందని ఆయన అన్నారు. సెక్షన్ 497 ప్రకారం.. పెళ్లయిన స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేక ఈ రెండూ గానీ ఉంటాయి. స్త్రీకు ఇవేమీ ఉండవు. ఆమె అసలు నేరస్తురాలే కాబోదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం మతానికి, జాతికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా స్త్రీ, పురుషులంతా చట్టం ముందు సమానమే అయినప్పుడు 497 సెక్షన్ కూడా ఆ ఆర్టికల్‌కు లోబడే ఉండాలని, కాబట్టి ఈ సెక్షన్‌ను చెల్లబోదని పిటిషనర్ వాదిస్తున్నారు. -
కారు చీకట్లో కంటి దీపాలు!
23.. గత 24 గంటల్లో తెలంగాణలో కిడ్నాప్ అయిన చిన్నారుల సంఖ్య ఇదీ! వారిలో పోలీసులు 9 మందిని కాపాడారు.ఇంకా 14 మంది జాడ తెలియరాలేదు. 2,283.. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారుల సంఖ్య ఇది. వారిలో పోలీసులు 1,371 మందిని కిడ్నాప్ ముఠాల నుంచి కాపాడారు. ఇంకా 912 మంది చిన్నారులు ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు! 6,088.. పోలీసు లెక్కల ప్రకారం ఏపీ, తెలంగాణల్లో 2010–16 మధ్య కనిపించ కుండా పోయిన మహిళల సంఖ్య ఇది. వీరంతా ఎటు పోతున్నారు? ఏమై పోతున్నట్టు? సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల నుంచి 11 మంది బాలికలను పోలీసులు కాపాడిన నేపథ్యంలో ఈ ప్రశ్నలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా మాయమవుతున్న చిన్నారులు, మహిళలపై ‘సాక్షి’ దృష్టి సారించగా విస్మయకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహిళల అక్రమ రవాణాకు తెలంగాణ, ఏపీలో అనేక గ్యాంగ్‌లు పని చేస్తున్నాయి. చిన్నపిల్లలు, యుక్తవయసులో ఉన్న పేద ఆడపిల్లలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను గుర్తించడమే ఈ ముఠాల పని. ఇందుకు వారు పెద్ద నెట్‌వర్క్‌నే నడుపుతున్నారు. ఈజీగా వలలో పడే మహిళల వివరాలు ఇస్తే రూ.25 వేల నగదును అందజేస్తూ కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. ఓ పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడలో ఇలాంటి గ్యాంగ్‌లు వందకు పైగానే ఉన్నాయి. వీరి కింద దాదాపు ఐదు వేల మంది ఏజెంట్లు పని చేస్తుంటారు. మాయమాటలు.. కిడ్నాప్‌లు.. ఈజీ మనీకి అలవాటుపడ్డ ముఠాలు చిన్నారులు, యుక్తవయసు ఆడపిల్లలు, మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని, చదువు చెప్పిస్తామని మాయమాటలతో నమ్మించి నట్టేట ముంచుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను టార్గెట్ చేసుకుని.. విదేశాల్లో పనిమనుషులుగా మంచి వేతనాలు ఇప్పిస్తామంటూ మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. మోసపోయిన నెల, ఆరు నెలల తర్వాత బాధితుల తరఫు బంధువులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో చైతన్యం తెచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదని ‘ఆపరేషన్ ముస్కాన్’లో పని చేసిన ఓ పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామంలో పది కుటుంబాలకు చెందిన మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, నెలకు రూ.25 వేలు ఇంటికి పంపిస్తానని తల్లిదండ్రులు, భర్తలకు ఆశ చూపి తీసుకెళ్లాడు ఓ మోసగాడు. వరుసగా నాలుగు మాసాల పాటు డబ్బులు పంపాడు. తర్వాత మరో ఐదుగురు ఇంటర్ చదివే అమ్మాయిలను తీసుకెళ్లాడు. ఇది జరిగి రెండున్నర సంవత్సరాలవుతోంది. ఇప్పుడు వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియదు’’ అని ఆ పోలీసు అధికారి పేర్కొన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం తెలిసి అతని సమీప బంధువు పదో తరగతి పాసైన అతని కూతురుకు నెలకు రూ.30 వేల ఉద్యోగం ఇప్పిస్తానని ముంబై తీసుకెళ్లాడు. ఏడాది దాటినా కూతురు ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని కూతురిని తీసుకువెళ్లిన బంధువు జాడ కూడా తెలియలేదు. దాదాపు రెండేళ్ల పాటు పుణెలోని వ్యభిచార గృహాల్లో చిత్రహింసలు భరించిన ఆ బాలికను పోలీసులు కాపాడారు. ఆ అమ్మాయి బయటకు వచ్చి అసలు విషయం చెప్పేదాకా ఆమె ఎంత నరకం అనుభవించందో తెలియదు. ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకువెళ్లిన వ్యక్తి ఆమెను రూ.లక్షకు ఓ వ్యభిచార గృహానికి అమ్మేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వెతలెన్నో కనిపిస్తున్నాయి. కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నారు ఆరు నుంచి పదేళ్ల వయసున్న అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న ముఠాలు వారిని ముంబై, పుణె, ఢిల్లీలోని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నాయి. చిన్న పిల్లలు తప్పిపోతున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తుండటంతో తెలంగాణ పోలీసు శాఖ ‘ముస్కాన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆపరేషన్ స్మైల్ పేరుతో పోలీసులు గడచిన మూడున్నర సంవత్సరాల్లో 25,834 మందిని కాపాడారు. వీరిలో 12,483 మంది పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పగించగా 13,351 మందిని సేŠట్ట్ హోమ్‌కు తరలించారు. -
స్పా పేరుతో వ్యభిచారం.
సాక్షి, కర్ణాటక: మైసూర్ నగరంలోని బోగాది రోడ్డులో ఉన్న ఓ భవనం మొదటి అంతస్తులో సెలూన్, స్పా సెంటర్ పేరుతో నిర్వహిస్తున్న వేశ్యావాటికపై పోలీసులు గురువారం దాడి చేశారు. నిర్వాహకులైన దంపతులను అదుపులోకి తీసుకొని అక్కడ వ్యభిచార కూపంలో మగ్గుతున్న యువతికి విముక్తి కల్పించారు. రాజేశ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి లైక్ ట్రెండ్ ఫ్యామిలీ సెలూన్, స్పా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండ్య జిల్లా పాండవపుర తాలూకాలోని ఆయురహళ్లి గ్రామానికి చెందిన ఓ యువతిని సినిమాల్లో చేర్పిస్తామని చెప్పి వేశ్యాకూపంలోకి దింపారు. ఇటీవల బాధిత యువతి నగరంలో ఉన్న ఒడనాడ మహిళా స్వచ్ఛంద సంస్థకు లేఖ రాసి తన గోడు వెల్లబోసుకుంది. దీంతో ఆ సంస్థ నిర్వాహకులు సరస్వతీ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం పోలీసులు ఆ స్పా కేంద్రంపై దాడి చేసి యువతిని రక్షించి స్వచ్ఛంద సంస్థ సభ్యులకు అప్పగించారు. రాజేష్ తనపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలను వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తూ వ్యభిచారం చేయిస్తున్నారని బాధితురాలు పోలీసుల వద్ద వాపోయింది. స్పా కేంద్రానికి ఇద్దరు కన్నడ నటులు కూడా వచ్చారని, వారికి తానే బాడీ మసాజ్ చేసినట్లు బాధిత యువతి పేర్కొంది. దీంతో ఈ కేంద్రానికి ఎవరెవరు వచ్చారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అనంత స్వేచ్ఛ ఆటా.. పాట!
♦ జోరుగా పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్, వ్యభిచారం ♦ బళ్లారి, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి రాకపోకలు ♦ స్టార్ హోటళ్లు, లాడ్జీలు, క్లబ్‌లు, పర్యాటక, అటవీ ప్రాంతాలే అడ్డాలు ♦ బంకినీకో అడ్డాతో నిర్వహణ ♦ వాట్సాప్‌లో అడ్రస్‌లు.. ఫొటోలు, పేకాటరాయుళ్ల వివరాలు పీఏబీఆర్ డ్యాం.. తాడిపత్రి.. పెన్నహోబిళం.. మాసినేని గ్రాండ్! ప్లేస్ ఏదైనా ఆడే ఆట మాత్రం ఒక్కటే! కర్నూలు, వైఎస్సార్ కడప, బళ్లారి జిల్లాల నుంచి అనంతపురానికి పేకాట ఆడేందుకు రోజూ వందల సంఖ్యలో వస్తున్నారంటే ‘అనంత’ స్వేచ్ఛ ఇట్టే అర్థమవుతోంది. పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్, వ్యభిచారం దెబ్బకు వేలాది కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. కొన్నేళ్లుగా వేళ్లూనుకున్న ఈ అసాంఘిక కార్యకలాపాల విషయంలో పోలీసు బాస్ నిఘా సారించినా.. కళ్లుగప్పి సాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: మాసినేనిగ్రాండ్ ఓ త్రీస్టార్ హోటల్. ఇక్కడ ఒకే రోజు ఏకంగా ఆరు గదుల్లో 48 మంది పేకాట రాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. అంతమంది ఆరు గదుల్లో ఉంటే ఎందుకు వచ్చారు? ఏం చేస్తున్నారు? అనే విషయాన్ని యాజమాన్యం కూడా గాలికొదిలేయడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. పేకాట దెబ్బకు రెండు నెలల క్రితం తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి కుటుంబం ఛిద్రమైంది. ఆ ఉదంతం తర్వాత పేకాటపై ఎస్పీ అశోక్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. తాడిపత్రితో పాటు పేకాట అడ్డాలపై ప్రత్యేక బృందంతో తనిఖీలు చేయించారు. ఈ క్రమంలో వీరంతా స్టార్‌హోటళ్లు, లాడ్జీలకు మకాం మార్చారు. అక్కడ పోలీసుల తనిఖీలు ఉండవనే భావనతో వీటిని ఎంచుకున్నారు. తాడిపత్రి, పీఏబీఆర్, వై.రాంపురం ప్రాంతాల్లో సాగుతున్న పేకాటకు ఇతర జిల్లాలు, కర్ణాటక వాసులు కూడా వచ్చి వెళ్తున్నారు. ఒక్కో బంకినీ వద్ద రూ.10లక్షల నుంచి రూ.20లక్షలు ఆట జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీఏబీఆర్ ప్రాంతంలోనే రోజూ 5–10 బంకినీలు ఉంటాయి. తాడిపత్రి, రాంపురంలో కలిపి మరో 10 వరకూ ఉంటున్నాయి. ఇక్కడ ఒక్కోచోట రూ.10లక్షల వరకు.. హోటళ్లలో రూ. రూ.2లక్షల నుంచి రూ.5లక్షల ఆట జరుగుతోంది. రాయదుర్గంలోని క్లబ్లో పేకాట ఆడి ఓ రాజకీయ నాయకుడి బంధువు రూ.70లక్షలు, మరొకరు రూ.30లక్షలు పొగొట్టుకోవడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులకు తెలిసిన తంతే.. పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్ చిట్టా స్థానిక పోలీసులకు తెలియనిది కాదు. అయితే వారితో ఉన్న సత్ససంబంధాల నేపథ్యంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నగరంలోని వన్‌టౌన్ పరిధిలో సుదీర్ఘకాలం ఎస్ఐలు, కానిస్టేబుళ్లు తిష్టవేసి ఉండటంతో వీటి నియంత్రణను గాలికొదిలేసినట్లు తెలుస్తోంది. వన్‌టౌన్ ఏరియాలో ఇప్పటికీ మట్కా విచ్చలవిడిగా సాగుతోంది. గతంలో మట్కాకింగ్ అరెస్టు తర్వాత కొద్దికాలం నిలిపేశారనిపించినా.. ఆ తర్వాత ‘మూడు బ్రాకెట్లు.. ఆరు క్లోజ్’లుగా వర్ధిల్లుతోంది. ‘అనంత’తో పాటు తాడిపత్రి, కదిరి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురంలో భారీగా నడుస్తోంది. గతంలో రతన్ మట్కా వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కాలు ఆరురోజులు నిర్వహిస్తున్నారు. ఈ మాట్కా నెంబర్లు గుజరాత్, ముంబయి నుంచి వస్తాయి. ఇవి కాకుండా ‘అనంత’లోని కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా మట్కా నడుపుతున్నారు. ఇది ఆదివారం కూడా నడుస్తోంది. కళ్యాణ్, సత్తా మట్కాలు సాయంత్రం 5గంటల వరకూ డబ్బు తీసుకుంటారు. రాత్రి 9.15 గంటలకు ఓపెన్, రాత్రి 11.15 గంటలకు క్లోజ్(బ్రాకెట్) నెంబర్ ప్రకటిస్తారు. మట్కా రాసే జాబితాలో కాలేజీ విద్యార్థులు కూడా చేరుతున్నారు. అయినా పోలీసులు నివారణ దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ‘క్రికెట్ బెట్టింగ్’కు అడ్డాగా ‘అనంత’ ప్రొద్దుటూరులో బెట్టింగ్ ఏ స్థాయిలో నడుస్తోందో, ఇప్పుడు ‘అనంత’లోనూ అదేస్థాయిలో సాగుతోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్ షాపు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకున్నారు. క్రికెట్ ఆడే దేశం ఏదైనా టీవీలో ‘లైవ్’ కన్పిస్తే చాలు బెట్టింగ్ తెరపైకి వస్తోంది. వీరిలో అధికశాతం మంది కేఫ్‌లలో కూర్చుని లెక్కలేసుకుంటున్నారు. బెట్టింగ్ ఆడేవారిలో వ్యాపారులతో పాటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అధికంగా ఉంటున్నారు. మ్యాచ్ గెలుపోటములపై బుకీలు నిర్వహించే బెట్టింగ్‌లతో పాటు ‘లైవ్’ ఉన్న సమయంలో లాడ్జీల్లో గదులు అద్దెకు తీసుకుని గ్రూపులుగా వెళ్లి బాల్ టు బాల్ బెట్టింగ్ ఆడుతున్నారు. యథేచ్ఛగా వ్యభిచారం ‘అనంత’తో పాటు తాడిపత్రి, కదిరి, హిందూపురం, గుంతకల్లులోనూ వ్యభిచారం యథేచ్ఛగా సాగుతోంది. అనంతపురంలోని ఓ ప్రముఖ హోటల్లో 8 నెలల కిందట ఇద్దరు ఆర్డీఓ స్థాయి అధికారులు, ఓ కమిషనర్ స్థాయి అధికారి ఒకే రోజు వేర్వేరు గదుల్లో పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. అరెస్టు చూపిస్తే ఉద్యోగాలు, పరువు పోతాయని భారీగా ముట్టజెప్పి తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ‘అనంత’లోని శ్రీకంఠం సర్కిల్లో వీటికి అడ్డాగా ఉన్న లాడ్జీలను మూయించారు. ప్రస్తుతం బస్టాండ్ సమీపంలోని లాడ్జీలకు మకాం మారింది. దీంతో పాటు ప్రముఖ హోటళ్లలో హైటెక్ వ్యభిచారం నడుస్తోంది. ఆన్లైన్ డేటింగ్సైట్లో బుక్‌చేసుకున్న యువతలు ఇలాంటి హోటళ్లలో దిగుతున్నారు. అలాగే హౌసింగ్‌బోర్డు, శారదానగర్, కళ్యాణదుర్గం రోడ్డులో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. తాడిపత్రిలో పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరు నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. వీరిని ఆసరాగా చేసుకుని బుగ్గ సమీపంలో ఎక్కువగా వ్యభిచారం సాగిస్తున్నట్లు సమాచారం. ఎస్పీకి తప్పుడు నివేదికలు: ఎస్పీగా అశోక్‌కుమార్ బాధ్యతలు తీసుకునే సమయంలో జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్‌తో చితికిపోయిన ఈ జిల్లాలో ఇప్పుడు పేకాట, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలు మాత్రమే సాగుతున్నాయి. వీటిని నివారిస్తే చాలా కుటుంబాల్లో ప్రశాంతత నింపినట్లే! తద్వారా క్రైం రేటును పరోక్షంగా తగ్గించినట్లు అవుతుంది. ఇది గ్రహించిన ఎస్పీ బాధ్యతలు తీసుకోగానే వీటిపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ తర్వాత మట్కారాయుళ్ల ఊరొదిలి వెళ్లారు. పేకాట నిలిచిపోయింది, బెట్టింగ్ జరగడం లేదని కొంతమంది మిడిల్ బాస్‌లు ఎస్పీకి తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తాజా పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. -
అనంత స్వేచ్ఛ ఆటా.. పాట!
జోరుగా పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్, వ్యభిచారం ►బళ్లారి, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి రాకపోకలు ►స్టార్ హోటళ్లు, లాడ్జీలు, క్లబ్‌లు, పర్యాటక, అటవీ ప్రాంతాలే అడ్డాలు ►బంకినీకో అడ్డాతో నిర్వహణ ►వాట్సాప్‌లో అడ్రస్‌లు.. ఫొటోలు, పేకాటరాయుళ్ల వివరాలు పీఏబీఆర్ డ్యాం.. తాడిపత్రి.. పెన్నహోబిళం.. మాసినేని గ్రాండ్! ప్లేస్ ఏదైనా ఆడే ఆట మాత్రం ఒక్కటే! కర్నూలు, వైఎస్సార్ కడప, బళ్లారి జిల్లాల నుంచి అనంతపురానికి పేకాట ఆడేందుకు రోజూ వందల సంఖ్యలో వస్తున్నారంటే ‘అనంత’ స్వేచ్ఛ ఇట్టే అర్థమవుతోంది. పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్, వ్యభిచారం దెబ్బకు వేలాది కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. కొన్నేళ్లుగా వేళ్లూనుకున్న ఈ అసాంఘిక కార్యకలాపాల విషయంలో పోలీసు బాస్ నిఘా సారించినా.. కళ్లుగప్పి సాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: మాసినేనిగ్రాండ్ ఓ త్రీస్టార్ హోటల్. ఇక్కడ ఒకే రోజు ఏకంగా ఆరు గదుల్లో 48 మంది పేకాట రాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. అంతమంది ఆరు గదుల్లో ఉంటే ఎందుకు వచ్చారు? ఏం చేస్తున్నారు? అనే విషయాన్ని యాజమాన్యం కూడా గాలికొదిలేయడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. పేకాట దెబ్బకు రెండు నెలల క్రితం తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి కుటుంబం ఛిద్రమైంది. ఆ ఉదంతం తర్వాత పేకాటపై ఎస్పీ అశోక్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. తాడిపత్రితో పాటు పేకాట అడ్డాలపై ప్రత్యేక బృందంతో తనిఖీలు చేయించారు. ఈ క్రమంలో వీరంతా స్టార్‌హోటళ్లు, లాడ్జీలకు మకాం మార్చారు. అక్కడ పోలీసుల తనిఖీలు ఉండవనే భావనతో వీటిని ఎంచుకున్నారు. తాడిపత్రి, పీఏబీఆర్, వై.రాంపురం ప్రాంతాల్లో సాగుతున్న పేకాటకు ఇతర జిల్లాలు, కర్ణాటక వాసులు కూడా వచ్చి వెళ్తున్నారు. ఒక్కో బంకినీ వద్ద రూ.10లక్షల నుంచి రూ.20లక్షలు ఆట జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీఏబీఆర్ ప్రాంతంలోనే రోజూ 5–10 బంకినీలు ఉంటాయి. తాడిపత్రి, రాంపురంలో కలిపి మరో 10 వరకూ ఉంటున్నాయి. ఇక్కడ ఒక్కోచోట రూ.10లక్షల వరకు.. హోటళ్లలో రూ. రూ.2లక్షల నుంచి రూ.5లక్షల ఆట జరుగుతోంది. రాయదుర్గంలోని క్లబ్లో పేకాట ఆడి ఓ రాజకీయ నాయకుడి బంధువు రూ.70లక్షలు, మరొకరు రూ.30లక్షలు పొగొట్టుకోవడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులకు తెలిసిన తంతే.. పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్ చిట్టా స్థానిక పోలీసులకు తెలియనిది కాదు. అయితే వారితో ఉన్న సత్ససంబంధాల నేపథ్యంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నగరంలోని వన్‌టౌన్ పరిధిలో సుదీర్ఘకాలం ఎస్ఐలు, కానిస్టేబుళ్లు తిష్టవేసి ఉండటంతో వీటి నియంత్రణను గాలికొదిలేసినట్లు తెలుస్తోంది. వన్‌టౌన్ ఏరియాలో ఇప్పటికీ మట్కా విచ్చలవిడిగా సాగుతోంది. గతంలో మట్కాకింగ్ అరెస్టు తర్వాత కొద్దికాలం నిలిపేశారనిపించినా.. ఆ తర్వాత ‘మూడు బ్రాకెట్లు.. ఆరు క్లోజ్’లుగా వర్ధిల్లుతోంది. ‘అనంత’తో పాటు తాడిపత్రి, కదిరి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురంలో భారీగా నడుస్తోంది. గతంలో రతన్ మట్కా వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కాలు ఆరురోజులు నిర్వహిస్తున్నారు. ఈ మాట్కా నెంబర్లు గుజరాత్, ముంబయి నుంచి వస్తాయి. ఇవి కాకుండా ‘అనంత’లోని కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా మట్కా నడుపుతున్నారు. ఇది ఆదివారం కూడా నడుస్తోంది. కళ్యాణ్, సత్తా మట్కాలు సాయంత్రం 5గంటల వరకూ డబ్బు తీసుకుంటారు. రాత్రి 9.15 గంటలకు ఓపెన్, రాత్రి 11.15 గంటలకు క్లోజ్(బ్రాకెట్) నెంబర్ ప్రకటిస్తారు. మట్కా రాసే జాబితాలో కాలేజీ విద్యార్థులు కూడా చేరుతున్నారు. అయినా పోలీసులు నివారణ దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ‘క్రికెట్ బెట్టింగ్’కు అడ్డాగా ‘అనంత’ ప్రొద్దుటూరులో బెట్టింగ్ ఏ స్థాయిలో నడుస్తోందో, ఇప్పుడు ‘అనంత’లోనూ అదేస్థాయిలో సాగుతోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్ షాపు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకున్నారు. క్రికెట్ ఆడే దేశం ఏదైనా టీవీలో ‘లైవ్’ కన్పిస్తే చాలు బెట్టింగ్ తెరపైకి వస్తోంది. వీరిలో అధికశాతం మంది కేఫ్‌లలో కూర్చుని లెక్కలేసుకుంటున్నారు. బెట్టింగ్ ఆడేవారిలో వ్యాపారులతో పాటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అధికంగా ఉంటున్నారు. మ్యాచ్ గెలుపోటములపై బుకీలు నిర్వహించే బెట్టింగ్‌లతో పాటు ‘లైవ్’ ఉన్న సమయంలో లాడ్జీల్లో గదులు అద్దెకు తీసుకుని గ్రూపులుగా వెళ్లి బాల్ టు బాల్ బెట్టింగ్ ఆడుతున్నారు. యథేచ్ఛగా వ్యభిచారం ‘అనంత’తో పాటు తాడిపత్రి, కదిరి, హిందూపురం, గుంతకల్లులోనూ వ్యభిచారం యథేచ్ఛగా సాగుతోంది. అనంతపురంలోని ఓ ప్రముఖ హోటల్లో 8 నెలల కిందట ఇద్దరు ఆర్డీఓ స్థాయి అధికారులు, ఓ కమిషనర్ స్థాయి అధికారి ఒకే రోజు వేర్వేరు గదుల్లో పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. అరెస్టు చూపిస్తే ఉద్యోగాలు, పరువు పోతాయని భారీగా ముట్టజెప్పి తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ‘అనంత’లోని శ్రీకంఠం సర్కిల్లో వీటికి అడ్డాగా ఉన్న లాడ్జీలను మూయించారు. ప్రస్తుతం బస్టాండ్ సమీపంలోని లాడ్జీలకు మకాం మారింది. దీంతో పాటు ప్రముఖ హోటళ్లలో హైటెక్ వ్యభిచారం నడుస్తోంది. ఆన్లైన్ డేటింగ్సైట్లో బుక్‌చేసుకున్న యువతలు ఇలాంటి హోటళ్లలో దిగుతున్నారు. అలాగే హౌసింగ్‌బోర్డు, శారదానగర్, కళ్యాణదుర్గం రోడ్డులో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. తాడిపత్రిలో పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరు నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. వీరిని ఆసరాగా చేసుకుని బుగ్గ సమీపంలో ఎక్కువగా వ్యభిచారం సాగిస్తున్నట్లు సమాచారం. ఎస్పీకి తప్పుడు నివేదికలు ఎస్పీగా అశోక్‌కుమార్ బాధ్యతలు తీసుకునే సమయంలో జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్‌తో చితికిపోయిన ఈ జిల్లాలో ఇప్పుడు పేకాట, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలు మాత్రమే సాగుతున్నాయి. వీటిని నివారిస్తే చాలా కుటుంబాల్లో ప్రశాంతత నింపినట్లే! తద్వారా క్రైం రేటును పరోక్షంగా తగ్గించినట్లు అవుతుంది. ఇది గ్రహించిన ఎస్పీ బాధ్యతలు తీసుకోగానే వీటిపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ తర్వాత మట్కారాయుళ్ల ఊరొదిలి వెళ్లారు. పేకాట నిలిచిపోయింది, బెట్టింగ్ జరగడం లేదని కొంతమంది మిడిల్ బాస్‌లు ఎస్పీకి తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తాజా పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. -
మసాజ్ ముసుగులో వ్యభిచారం
-
ఫ్యామిలీ రెస్టారెంట్ ముసుగులో వ్యభిచారం
మండ్య(కర్ణాటక) : ఫ్యామిలీ రెస్టారెంట్ ముసుగులో హైటెక్ వేశ్యావాటిక నిర్వహిస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేసి 22 మందిని అరెస్టు చేశారు. మండ్య జిల్లా శ్రీరంగపట్టణం తాలూకా నగువనహళ్లి గేట్ వద్ద మైసూరు, బెంగళూరు జాతీయ రహదారిలో మార్గా ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది. దీని కింద సొరంగం తరహాలో గుహ ఏర్పాటు చేసి కోల్‌కతా, ముంబై, బంగ్లాదేశ్‌కు చెందిన యువతులతో ఇక్కడ వేశ్యావాటిక నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ జి.రాధిక నేతృత్వంలో పోలీసులు ఆదివారం ఆ హోటల్‌పై దాడి చేసి 22 మంది విటులను అరెస్టు చేశారు. వ్యభిచార కూపంలో చిక్కుకుపోయిన యువతులకు విముక్తి కల్పించారు. వీరి నుంచి ఐదు బైక్‌లు, కారు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. -
మసాజ్ ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో మాదాపూర్ , గచ్చిబౌలి , రాయదుర్గం పోలీస్ స్టేషన్ల పరిధిలో 12 మసాజ్ సెంటర్లు , స్పాల పై సైబరాబాద్ స్పెషల్ టీమ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 30 మంది యువతులను , 25 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖుల పుత్ర రత్నాలు ఉన్నట్టు సమాచారం. వీళ్లని అదుపులోకి తీసుకున్న మాదాపూర్ పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. థాయిలాండ్ దేశానికి చెందిన 20మంది మహిళలు, మేఘాలయ ,త్రివేండ్రం, సిక్కింకు చెందిన మహిళలు ఉన్నారు. టూరిస్ట్ వీసాపై విదేశీ మహిళలతో క్రాస్ మసాజ్‌తో పాటు సెక్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. -
కార్పొరేటర్ ఇంట్లో వ్యభిచారం
కృష్ణా: విజయవాడలోని ముత్యాలంపాడులో ఓ టీడీపీ కార్పొరేటర్ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం తెలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో దాడులు జరిపి పలువురు విటులు, యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ టీడీపీ కార్పొరేటర్ ఓ మంత్రి అనుచరుడు కావడంతో పోలీసులు సమాచారం బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. -
కామకేళి..!
∙ బస్సుల్లో బూతు పనులు ∙ పద్మాక్షికాలనీలో గలీజ్ యవ్వారం ∙ వ్యభిచార కూపంగా బస్సుల అడ్డా ∙ లాడ్జీలుగా మారిన టూరిస్టు వాహనాలు ∙ వీధి దీపాలు కరువు ∙ జాడ లేని పోలీసుల పెట్రోలింగ్ జిల్లా కేంద్రం.. హన్మకొండ బస్టాండ్‌కు కూత వేటు దూరం.. వీధి దీపాలు లేవు.. పోలీసుల పెట్రోలింగ్ లేదు. అంతేకాదు.. ఏ ఒక్క అధికారి పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. ఇంకేముంది.. వారు ఆడిందే ఆట.. పాడిందే పాట. పగలు, చీకటి అనే తేడా లేదు.. అక్కడ నిలిపి ఉన్న టూరిస్టు వాహనాలను లాడ్జీలుగా మార్చుకుంటున్నారు. బస్సుల్లోనే కాదు.. వాటి పరిసరాలను సైతం అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్‌గా మలుచుకున్నారు. ఇక్కడ కొంత కాలంగా న్యూసెన్స్ పరాకాష్టకు చేరుకోగా.. స్థానికులు బెంబేలెత్తుతున్నారు. వ్యభిచార కూపంగా మారిన పద్మాక్షికాలనీలోని బస్సుల అడ్డాపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. వరంగల్: నగరంలోని పద్మాక్షి కాలనీలో అసాంఘీక కార్యకలాపాలు పరాకాష్టకు చేరుకున్నాయి. టూరిస్టు బస్సులకు పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు వ్యభిచార కూపాలుగా మారుస్తున్నారు. నిత్యం ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యాకలాపాల కారణంగా స్థానికులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పగటి వేళల్లోనూ ఈ రోడ్డులో నడిచేందుకు మహిళలు అవస్థలు పడుతున్నారు. పోలీసుల గస్తీ కరువైపోవడంతో స్థానికులను కలవరపాటుకు గురిచేస్తోంది. రాత్రి పది దాటితే.. ఐదారేళ్లుగా ప్రైవేట్ టూరిస్టు బస్సులను పద్మా క్షి గుట్ట దగ్గరున్న వాటర్‌ట్యాంకు సమీపంలో ని లుపుతున్నారు. ప్రతీరోజు ఇక్కడ ఇరవైకి పైగా ప్రైవేట్ బస్సులు రాత్రి, పగలు నిలిపి ఉంచుతున్నారు. ఆఫ్ సీజన్ అయితే ఒక్కోసారి 50కి పై గా బస్సులు ఆగి ఉంటాయి. బస్సు వెంట బ స్సు, బస్సు పక్కన బస్సులను నిలిపి ఉంచుతా రు. దీంతో రెండు బస్సుల మధ్య ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రాత్రిపగలు తేడా లేకుండా బస్సుల మధ్య రొమాన్సులు చేస్తున్నారు. ఈ తతంగం రోజూవారీ కార్యక్రమంగా కొనసాగుతున్నా అడ్డుకునే వారే కరువయ్యారు. ఫలితంగా ఇటీవల కాలంలో పద్మాక్షిగుట్టకు వచ్చే కొందరు యువతీయువకులు ఈ అడ్డాపై ఆకర్షితులవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తలెత్తుకోలేక.. కొందరు వ్యభిచారులు టూరిస్టు బస్సుల అడ్డాను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హన్మకొండ బస్‌స్టేషన్, హన్మకొండ చౌరస్తా వంటి జనసంచారం కలిగిన ప్రాంతాల్లో విటులను ఆకర్షించిన తర్వాత బస్సుల అడ్డాకు చేరుకుంటున్నారు. కొందరు డ్రైవర్లు, క్లీనర్లు బస్సులను వ్యభిచార కేంద్రాలుగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. పద్మాక్షి గుట్టకు వచ్చే యువకులను తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికులు అంటున్నారు. బస్సుల్లో వ్యభిచారం చేస్తున్న అంశాన్ని బీట్ కానిస్టేబుళ్లకు, పెట్రోలింగ్ సిబ్బందికి పలుమార్లు కాలనీవాసులు పట్టించారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. బస్సులే బార్లు.. రాత్రి, పగలు తేడా లేకుండా కొంతమంది డ్రైవర్లు, క్లీనర్లు మద్యం తాగుతూ బస్సులను బార్లుగా మార్చేశారు. మద్యం మత్తులో మహిళలను వేధించడం పరిపాటిగా మారింది. తాగి మహిళలపై నోరుపారేసుకున్న వారిని పలుమార్లు స్థానికులు చితకబాదిన సంఘటనలు ఉన్నాయి. -
వ్యభిచార గృహాలపై దాడి
సీతమ్మధార(విశాఖ ఉత్తర): నగరంలో పలు చోట్ల గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్న వ్యభిచార గృహాలపై సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. వివరాలిలా ఉన్నా యి. ద్వారకా జోన్ పరిధిలోని శంకరమఠం ప్రాంతం రామకృష్ణాపురంలోని ఓ ఇంట్లో జి.శివశంకర్‌రెడ్డి అనే వ్యక్తి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. నిర్వాహకుడితో పాటు ఓ విటుడు, ఒక యువతిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు, నగదు రూ.1500 లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ద్వారకా పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. ఏసీపీ ఐ.చిట్టిబాబు నేతృత్వంలో ఎస్ఐలు సతీష్, మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్ఎడీ జంక్షన్ : మర్రిపాలెం దరి లక్ష్మీనగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వహకులు, విటులపై టాస్క్ఫోర్సు పోలీసులు సోమవారం దాడి చేశారు. నిందితుల్ని ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రొంగల సత్యవతి అనే మహిళ ఆమె ఇంట్లో కొంతమంది యువతలతో కొన్నాళ్లగా వ్యభిచారం నిర్వహిస్తోందన్నది ఆరోపణ. ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న టాస్క్‌పోర్సు విభాగ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఇద్దరు విటులతో పాటు మరో ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.