న్యూఢిల్లీ: నీతి తప్పిన సైనికులు ఉంటే సైన్యంలో క్రమశిక్షణ దెబ్బతింటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పై అధికారులు వ్యభిచారానికి పాల్పడితే చర్యలు తీసుకొనే అధికారం సైనిక దళాలకు ఉందని తేల్చిచెప్పింది. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.
వ్యభిచారం నేరం కాదంటూ చెబుతూ ఐపీసీ సెక్షన్ 497ను కొట్టివేస్తూ 2018లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ తప్పుడు పనిచేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా ఈ తీర్పు అడ్డుకోలేదని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment