స్మార్ట్‌గా వ్యభిచారం.. కాలేజీ యువతులు కూడా! | Prostitution Is Happening In Palamaneru Constituency | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌గా కాలేజీ యువతులు, ఒంటరి మహిళలతో వ్యభిచారం!

Published Wed, Mar 18 2020 8:57 AM | Last Updated on Wed, Mar 18 2020 8:59 AM

Prostitution Is Happening In Palamaneru Constituency - Sakshi

సాక్షి, పలమనేరు : నియోజకవర్గంలో హైటెక్‌ వ్యభిచారం జోరందుకుంది. స్మార్ట్‌ ఫోన్ల ద్వారానే మొత్తం వ్యవహారం సాగుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది వ్యభిచార నిర్వాహకులు సంఘంలో మంచివారిలా చెలామణి అవుతూ రహస్యంగా హైటెక్‌ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. వీరి మాయమాటలను నమ్మి పలువురు కళాశాలకు వచ్చే విద్యార్థులు సైతం ఈ ఊబిలో పడినట్టు భోగట్టా. తొలుత సోషల్‌ మీడియా ద్వారా అమ్మాయిలతో సంబంధాలను ఏర్పరుచుకుని ఆపై ఈజీ మనీ కోసం ఈ ఊబిలోకి వారిని దించుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కడైనా ఇలాంటి వ్యవహారాలు వెలుగుచూస్తే తప్ప అసలు విషయం ఎవరికీ తెలియకుండా సాగుతోంది. తాజాగా నియోజకవర్గంలోని వీకోట పట్టణంలోని ఓ లాడ్జిలో వ్యభిచార ముఠా గుట్టును అక్కడి పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అక్కడి  ఓ టీడీపీ నాయకుని బంధువు ఉన్నట్టు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో మూలాలు పలమనేరు, కేజీఎఫ్, బెంగళూరులో ఉన్నట్టు తెలిసింది. 

తొలుత సోషల్‌ మీడియా ద్వారా..... 
ఇప్పుడు అందరికీ స్మార్ట్‌ ఫోన్‌ అవసరంగా మారింది. వయసుతో తేడా లేకుండా ఫేస్‌బుక్, టిక్‌టాక్, హలో, వాట్సాప్‌ వాడుతున్నారు. ఇందులోని మహిళలు, అమ్మాయిలతో కొందరు వ్యభిచార నిర్వాహకులు ఫ్రెండ్‌ షిప్‌ చేసుకుని చాటింగ్‌లు మొదలు పెడుతున్నారు. వీరితో పరిచయం పెరిగి కాల్స్, లైవ్‌ కాల్స్‌కు చేరుతోంది. వారి వ్యక్తిగత వివరాలే కాకుండా ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని వారికి ఉపాధి ఉద్యోగాల పేరిట తొలుత బుట్టలో వేసుకోవడం జరుగుతోంది. ఇంకొందరు స్థానికంగా ఉద్యోగాలు ఉన్నాయంటూ సంప్రదించాలని వల వేయడం సాగుతోంది. స్థానికంగా ఉన్న అమ్మాయిలు, మహిళలను ఇళ్లకు పిలిపించుకోవడం.. వారికి అండగా ఉంటామంటూ నమ్మకాన్ని కల్పిస్తున్నారు. మెల్లమెల్లగా వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. ఒక్కసారి ఇందులోకి దిగినవారు మళ్లీ బయటకు రావడం కష్టమే. 

ఆపై డేటింగ్‌ యాప్‌లలోకి...  
వ్యభిచార కూపంలోకి దించిన యువతులను డేటింగ్‌ యాప్‌లోకి అడ్మిట్‌ చేయిస్తారు. డేటింగ్‌ యాప్స్‌లో ముఖ్యమైన ఇన్‌స్ట్ర్రాగం, ఊ ది డేటింగ్‌ యాప్‌( రెడీ టూ మీట్‌ న్యూగర్ల్స్‌ ఫ్రం యువర్‌ ఏరియా), జస్ట్‌ ఫ్రెండ్స్, క్వాక్‌ క్వాక్, వీ మేట్, జిల్, స్నాప్‌చాట్, విగో, టిండర్, క్రస్‌లాంటి వాటిలోకి వెళితే వందలు కాదు వేలాదిమంది స్నేహితులుగా మారుతారు. ఇందులో నియర్‌ బై అనే ఆప్షన్‌ ద్వారా ఈ ప్రాంతంలోకి వారిని సెలెక్ట్‌ చేసుకోవడం ద్వారా లైవ్‌ కాల్స్‌ నుంచి డైరెక్ట్‌గా మీటింగులు జరుగుతుంటాయి. 

కళాశాల విద్యార్థినులు, ఒంటరి మహిళలు సైతం..
వ్యభిచార ఊబిలో పడిన వారిలో కళాశాల విద్యార్థినులు, బాలికలు, ఒంటరి మహిళలు ఉన్నారు. ఆర్థిక అవసరాలు, విలాసాల కోసం జీవితాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదో లాభసాటి వ్యాపారం కావడంతో నిర్వాహకులు పెరుగుతూనే ఉన్నారు. పలమనేరులోని గంటావూరు, వీకోట, కర్ణాటకలోని కేజీఎఫ్, బెంగళూరుకు చెందిన పలువురు వ్యభిచార నిర్వాహకులు రింగుగా ఏర్పడి విటులను స్మార్ట్‌ ఫోన్ల ద్వారా బుక్‌ చేస్తున్నట్టు సమాచారం. విటులు సైతం నిర్వాహకుల ఖాతాలకు గూగూల్‌ పే, ఫోన్‌ పే ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే చాలు అన్నీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.  

కొన్ని లాడ్జిలు, అద్దె ఇళ్లు వ్యభిచారానికి అడ్డాలు  
నియోజకవర్గంలోని కొన్ని లాడ్జిలు, పట్టణాల్లోని అవాసప్రాంతాల్లోని ఖరీదైన ఇళ్లు హైటెక్‌ వ్యభిచారానికి అడ్డాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇళ్లకు బంధువులు వచ్చినట్టుగా వస్తుంటారని, ఇక లాడ్జిల్లో ప్రత్యేక గదులే ఉన్నాయని సమాచారం. విటుల వద్దకు అమ్మాయిలను చేర్చేందుకు పట్టణంలోని కొందరు అద్దెకు కార్లను సైతం సిద్ధం చేస్తుంటారట. ఈ వ్యవహారంలో సూత్రధారులు చాలామందే ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా వ్యభిచార నిర్వాహకుల ధనాశకు ఎందరో మహిళలు, యువతులు, విద్యార్థినుల జీవితాలు నాశనమవుతున్నా యి. ఇప్పటికైనా సంబంధిత ప్రాంతాల్లోని పోలీసులు దీనిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement