2025లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే? | Best Mobiles Under 30000 in India 2025 | Sakshi
Sakshi News home page

2025లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?

Published Wed, Jan 8 2025 4:49 PM | Last Updated on Wed, Jan 8 2025 6:15 PM

Best Mobiles Under 30000 in India 2025

భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్‌ఫోన్లు.. వివిధ ధరల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ. 30,000 కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఏవి? వాటి వివరాలు ఏంటనేది వివరంగా తెలుసుకుందాం.

మోటరోలా ఎడ్జ్ 50 నియో
మోటరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo) ధర రూ. 20,000 నుంచి రూ. 23,000 మధ్య ఉంది. ఇది 256 జీబీ స్టోరేజితో ఒకే వేరియంట్‌ రూపంలో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, లెదర్ బ్యాక్ ప్యానెల్ వంటివన్నీ ఇందులో ఉంటాయి. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ ఐపీ68 రేటింగ్ పొందింది. కెమెరా సెటప్ కూడా అద్భుతంగా ఉంది.

వన్‌ప్లస్‌ నార్డ్ 4
వన్‌ప్లస్‌ నార్డ్ 4 (OnePlus Nord 4) ధర రూ. 29,999. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3, 120హెచ్‌జెడ్‌ అమోలెడ్ డిస్‌ప్లే, 256 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ వంటి వాటితో పాటు 5500 యాంపియర్ బ్యాటరీతో 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తాయి.

వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ4
వన్‌ప్లస్‌ (OnePlus) కంపెనీకి చెందిన నార్డ్ సీఈ4 కూడా రూ. 30,000 కంటే తక్కువ ధర వద్ద లభించే ఓ బెస్ట్ స్మార్ట్‌ఫోన్. ఇది ఇప్పుడు రూ. 23,000 వద్ద అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి.. 256 జీబీ వరకు స్టోరేజ్ కెపాసిటీ పొందుతుంది.

ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీ
ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీ మొబైల్ బేస్ వేరియంట్ ధర మార్కెట్లో రూ. 28,000 (8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్). ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ కలిగి, 5000 యాంపియర్ బ్యాటరీ పొందుతుంది. ఇది 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన ఈ ఫోన్ లెదర్ ఫినిషింగ్ పొందుతుంది. కాబట్టి ఇది ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. కాబట్టి ఇది ఇతర వేరియంట్ల కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది.

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్
నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ మొబైల్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27,000 వద్ద అందుబాటులో ఉంది. ఇందులో మీడియాటెక్ డైమన్సిటీ 7350 ప్రో చిప్‌సెట్, డ్యూయెల్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. మంచి డిజైన్ కలిగిన ఈ ఫోన్ ట్రాన్స్‌పరెంట్‌ బ్యాక్, గ్లిఫ్ లైటింగ్ ఇంటర్‌ఫేస్ కూడా పొందుతుంది.

పైన చెప్పిన ఇది మొబైల్స్ మాత్రమే కాకుండా 30వేల రూపాయల కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్‌ఫోన్ల జాబితాలో గూగుల్ పిక్సెల్ 7ఏ, రెడ్‌మీ నోట్ 14 ప్రో 5జీ, ఇన్‌ఫినిక్స్‌ జీరో 40 5జీ, ఐకూ జెడ్9ఎస్ ప్రో 5జీ, హానర్ 200 వంటివి ఉన్నాయి.

ఇదీ చదవండి: అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!

మొబైల్ ధరలు మీరు ఎంచుకునే వేరియంట్, కలర్ ఆప్షన్, స్టోరేజ్ ఆప్షన్ వంటి వాటిమీద మాత్రమే కాకుండా.. కొనుగోలు చేసే ప్లాట్‌ఫామ్‌ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ధరలలో కొంత వ్యత్యాసం గమనించవచ్చు. అంతే కాకుండా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద మీకు మరింత తగ్గింపులను కూడా పొందే అవకాశం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement