దేశంలో టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్ ఫోన్ల వాడకం కూడా పెరుగుతోంది. మరీ యువత ఫోన్లు లేకుండా ఒక వారం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల కొన్ని కంపెనీల స్మార్ట ఫోన్లు చార్జింగ్ పెడుతున్న సమయంలోనూ, లేదా జేబులు ఉండగానో పేలుతున్నాయి.
ఈ తరహా వరుస ప్రమాదాలు మొబైల్ వినియోగదారులని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఇటువంటి ఘటనలు పలు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటుండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరో స్మార్ట్ ఫోన్ పేలడంతో కస్టమర్ల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పాములపాడులో బుధవారం ఓ వ్యక్తి తన స్మార్ట్‌ఫోన్‌ని ఇంట్లో చార్జింగ్‌కు ఉంచిన సమయంలో పేలిపోయింది. వివరాల ప్రకారం.. షేక్‌ముర్తుజా ఈ ఏడాది జూలై 13న నందికొట్కూరులో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. ఇంట్లో చార్జింగ్ పెట్టి బయటకు రాగా.. శబ్దంతో పేలిందని ఆయన తెలిపారు.
ఫోన్ వద్ద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని షేక్‌ముర్తుజా కోరారు.
మనం వాడే అన్నీ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్‌లో
మనం ఉపయోగిస్తున్న ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలా అన్నింటిలోనూ లిథియం ఆయాన్ బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తేలికైన బ్యాటరీ సామర్ధ్యం. అత్యధిక నిలువ సామర్ధ్యం. ఫాస్ట్ ఛార్జింగ్. ఇవి ఈ రకం బ్యాటరీలో ఉన్న ప్లస్ పాయింట్స్.
లిడ్ యాసిడ్‌లతో పోల‍్చితే.. లిథియం ఆయాన్ బ్యాటరీల సామర్ధ్యం సుమారు 6రెట్లు ఎక్కువ. అలాగే ఏ బ్యాటరీలు ఎంత ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కుతాయో అంతే ప్రమాదకరమైనవని నిపుణులు చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్లో ఉండే బ్యాటరీలను సురక్షితమైన విధానంలో వినియోగించినప్పుడే బాగా పని చేస్తాయి. లేదంటే.. ప్రమాదాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు.
చదవండి: గుడ్ న్యూస్: ఐఫోన్ 14 వచ్చేస్తోంది, అదికూడా ఊహించని ధరలో
Comments
Please login to add a commentAdd a comment